కర్నూలు జిల్లా : వైఎస్సార్‌సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో పచ్చ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. ఆమె శుక్రవారం పత్తికొండలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు హైకోర్టులో ఊరట అంటూ సొంత మీడియాలో తప్పుడు వార్తలు రాయించిందన్నారు. డోన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు తప్పుడు వార్తలతో కోర్టులను కించపరిచే విధంగా కేఈ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు.
తప్పుడు వార్తల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కంగాటి శ్రీదేవి తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై కేఈ కృష్ణమూర్తి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వార్తా పత్రికలు బాధ్యతగా వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు.
పచ్చపార్టీ తప్పుడు ప్రచారం: కంగాటి శ్రీదేవి
Published Fri, Feb 23 2018 6:57 PM | Last Updated on Fri, Feb 23 2018 7:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment