muder case
-
ఇంటి స్థలం కోసమే హత్య..
బషీరాబాద్,వికారాబాద్: మండలంలోని నవల్గాలో మంగళవారం జరిగిన మాల శ్యామప్ప హత్య కేసును బషీరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యలో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ శంకర్‌తో కలిసి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నవల్గా గ్రామానికి చెందిన హతుడు మాల శ్యామప్పకు ఇంటి స్థలం విషయంలో వదిన మాల సుగుణమ్మతో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మరిదిని అంతమొందిస్తే అతని ఆస్తి తనకు దక్కుతుందని సుగుణమ్మ భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాల శివకుమార్, కొత్త విజయ్‌కాంత్, విశ్వనాథ్‌తో రూ.50 వేలకు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. మాల శ్యామప్పకు శివకుమార్ వరుసకు తమ్ముడు.. కొత్త విజయ్‌కాంత్, విశ్వనాథ్ స్నేహితులు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శివకుమార్, కొత్త విజయ్‌కాంత్, విశ్వనాథ్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం మద్యం తాగుదామని శ్యామప్పను బైక్‌పై ఎక్కించుకొని నవల్గా గేటు సమీపంలోని రాథోడ్ మోహన్ పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు.. ఆ తర్వాత శ్యామప్ప తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కన పడేశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ శంకర్, సిబ్బంది 24 గంటల్లో ఛేదించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5వేల నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తాండూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మొదటి ముద్దాయి సుగుణమ్మను చర్లపల్లి జైలుకు, మిగతా ముగ్గురిని పరిగి సబ్‌జైల్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ నారాయణ, క్రైమ్ కానిస్టేబుళ్లు దస్తప్ప, నర్సింలు, ముని, ప్రతాప్ సింగ్‌కు డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.Vikarabad: ఆస్తి కోసం మరిదిని చంపించిన వదిన.. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హత్నూర(సంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తనే హత్య చేసింది భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ(42) మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గ్రామంలోనే ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కార్యాలయంలో సీఈవోగా పని చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సొంత మల్లుపల్లి గ్రామంలోనే ఉండేది. నాలుగు రోజుల కిందట భర్త వద్దకు రెడ్డి ఖానాపూర్ గ్రామానికి వచ్చింది . లక్ష్మీకి బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి రాకేశ్‌తో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రియుడు రాకేశ్, బిక్నూర్ గ్రామానికి చెందిన సాగర్ రమేశ్, డప్పు శ్రీకాంత్, కడారి శ్రీకాంత్‌తో కలిసి భర్త నారాయణను రెడ్డి ఖానాపూర్ గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయం వద్ద హత్య చేసి మృతదేహాన్ని పల్పనూరు గ్రామ శివారులో పడి వేశారు. మరుసటి రోజు (శనివారం) ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం గ్రామ ఉదయం శివారులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నదిముద్దీన్ పరిశీలించారు. అనుమానితురాలుగా ఉన్న భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. లక్ష్మీ, రాకేశ్‌తోపాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. లక్ష్మీ సైతం బీజేపీ బీసీ మహిళా మండలాధ్యక్షురాలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.హత్య కేసులో నిందితుల రిమాండ్హత్నూర(సంగారెడ్డి): భర్తను హత్య చేయించిన భార్యతోపాటు ఇందుకు సహకరించిన నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు జిన్నారం సీఐ ఎండీ నయీముద్దీన్ తెలిపారు. హత్నూర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మీనర్సవ్వ, ప్రియుడు కడారి రాకేష్, చెట్లపల్లి సాగర్, కడారి శ్రీకాంత్, డప్పు శ్రీకాంత్ కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం తన ప్రియుడైన రాకేశ్‌కు రూ.40 వేలు సుపారీ ఇచ్చింది. లక్ష్మీ నర్సవ్వ ఖానాపూర్‌లో ఉండే భర్త దగ్గరకు మూడు రోజుల కిందట వచ్చింది. అతడు ఆఫీసులో ఉండగానే తాగడానికి కల్లు తెమ్మని చెప్పింది. అతడు వచ్చే లోపు పథకం ప్రకారం నలుగురు నిందితులు వచ్చి ఆఫీసులోని ఓ గదిలో దాక్కున్నారు. నారాయణ కల్లు తీసుకొని రాగానే వారి వెంట తెచ్చుకున్న కత్తి, కట్టే ఇనుప రాడుతో ఒక్కసారిగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ హత్యపై ఎస్సై సుభాష్ తనదైన శైలిలో విచారణ చేయగా భార్య లక్ష్మీతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి కట్టే ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
సిద్ధిఖీ కేసులో నిందితులెవరినీ వదలం: సీఎం షిండే
ముంబై: ఎన్‌న్సీపీ (అజిత్ పవార్) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. అయితే.. బాబా సిద్ధిఖీ హత్యకేసు నిందితులు ఎవరైనా వదలిపెట్టమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఆయన మహారాష్ట్రలో లా అండ్ ఆర్డ్‌ర్ అదుపుతప్పిందే విమర్శలపై తాజాగా స్పందించారు. ‘‘బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ మూలాలను ఛేదిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాబా సిద్ధిఖీ హత్య దురదృష్టకరం. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఈ ఘటనలో పలువురు నిందితులు ఇప్పటికే అరెస్టు చేశాం. ప్రభుత్వం, హోంశాఖ కేసు మూలాలు చేధిస్తోంది.. అందులో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని.. అక్టోబర్ 12న ముంబైలోని నిర్మల్ నగర్ ప్రాంతంలో ఆయన కుమారుడి కార్యాలయం సమీపంలో ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్లో జీషన్ ఫొటో’ -
సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్‌తో కాల్పలు జరిపారు’
ముంబై: ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపింది. ఇక.. హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు చెందిన నిందులు వాడిన తుపాకీల గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.సిద్ధిఖీ హత్య చేయడానికి నిందితులు మొత్తం మూడు పిస్టల్స్ ఉపయోగించారని తెలిపారు. వాటిలో ఒకటి ఆస్ట్రేలియాలో తయారు చేయబడిన గ్లాక్ పిస్టల్, మరొకటి టర్కిష్ పిస్టల్ కాగా మూడో పిస్టల్ దేశీయంగా తయారు చేసిందని వెల్లడించారు. ఇక.. ఈ మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. నిందితులు అక్టోబరు 12న నిర్మల్‌నగర్‌లో బాబా సిద్ధిఖీని తన కుమారడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం బయట కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.Maharashtra | Three pistols were used in NCP leader Baba Siddiqui's murder, one of them was an Australian-made Glock pistol, a Turkish pistol and a country-made pistol. Police have recovered all three weapons: Mumbai PoliceHe was murdered after being shot outside Zeeshan…— ANI (@ANI) October 16, 2024గ్లాక్ సిస్టల్స్ యూరప్, అమెరికాలో అధికంగా ఉత్పత్తి అవుతాయని పోలీసులు తెలిపారు. వాటి డిజైన్, క్వాలిటీ, అధిక మ్యాగజైన్ సామర్థ్యం, ప్రమాదవశాత్తు జరిగినే ఫైరింగ్‌ను నిరోధించే అధునాతన ‘సేఫ్ యాక్షన్ సిస్టమ్’ ఉంటుందని పేర్కొన్నారు. గ్లాక్ తుపాకీని కలిగి ఉన్నట్లు అమెరికా ఉపాధ్యక్షురాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్లోక్ పిస్టల్స్‌ను ఆస్ట్రియాలో అధికంగా తయారు చేస్తారు. అక్కడి పౌరులు, ప్రజా ప్రతినిధులు, సైనిక సిబ్బంది కోసం ఇటువంటి సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌లను తయారు చేస్తోంది.ఇక.. నిందితులు సిద్ధిఖీపై కాల్పులు జరపటం కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రాక్టిసు చేసినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.చదవండి: Baba Siddiqui Case: ‘యూట్యూబ్ చూసి నిందితుల గన్ షూటింగ్ ప్రాక్టిస్’ -
కోల్‌కతా డాక్టర్ ఉదంతం: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.జూనియర్ డాక్టర్ ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ -
దోషులకు ఉరిశిక్ష విధించాలి: సీఎం మమత
కోల్‌కతా: కుల్తాలీ బాలిక హత్యాచారం కేసును పోక్సో చట్టం కింద నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో దోషులకు మూడు నెలల్లో ఉరిశిక్ష విధించాలని పోలీసులను కోరారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా కుల్తాలీలోని ఓ కాలువలో పదేళ్ల బాలిక శవమై కనిపించిన విషయం తెలిసిందే. ‘నేరానికి రంగు, కులం, మతం లేదు. పోక్సో చట్టం కింద కుల్తాలీ కేసు నమోదు చేసి మూడు నెలల్లోగా దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరుతున్నా. ఏదైనా నేరం నేరమే. దానికి మతం లేదా కులం లేదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యాచారం కేసుల్లో దర్యాప్తు జరగుతున్న సమయంలో మీడియా విచారణ చేయటం ఆపివేయాలి’ అని అన్నారు.మరోవైపు.. బాలిక హత్యాచారంపై ఆదివారం దక్షిణ 24 పరగణాలలో నిరసనలు చెలరేగాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నిరసనలకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, అగ్నిమిత్ర పాల్ నిరసనల్లో పాల్గొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నామని పోలిసులు తెలిపారు. సౌత్ 24 పరగణాల పోలీసు సూపరింటెండెంట్ పలాష్ చంద్ర ధాలీ మీడియాతో మాట్లాడారు. ‘‘బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా సాయంత్రం తప్పిపోయింది. రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం(నిన్న) విచారణ ప్రారంభించాం. విచారణ తర్వాత ఈ రోజు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. బాలికను తానే హత్య చేశానని నిందితుడు చెప్పాడు. ప్రభుత్వం ఇటువంటి కేసులపై చాలా సీరియస్‌గా ఉంది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని తెలిపారు. అయితే... ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక అత్త ఆరోపణలు చేశారు. బాధితురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అవయవాలు విరిగిపోయాయని అన్నారామె. నిందితులకు శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.చదవండి: వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్లో మరో దారుణం -
సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఇదొక ప్రతీకార హత్యే అని వెల్లడించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్‌సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్, పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిన్నటిదాకా(గురువారం) అసలు తనకు హత్యతో సంబంధం లేదని వాదిస్తూ వచ్చాడు బిష్ణోయ్. ఈ క్రమంలో తాజాగా.. విక్కీ మిద్దుఖేరా తన అన్న అని, అతని హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు సిద్ధూని తన ముఠా మట్టుబెట్టి ఉంటుందని బిష్ణోయ్ పోలీసులతో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ హత్యలో తన ప్రమేయం లేదని, తీహార్ జైల్లో ఉన్న తాను కనీసం తన ఫోన్‌ను కూడా ఉపయోగించడం లేదని బిష్ణోయ్ వెల్లడించాడు. అంతేకాదు సిద్ధూ హత్యను జైలులోని టీవీ ద్వారానే తెలుసుకున్నా అని బిష్ణోయ్ తెలిపాడు. ఇదిలా ఉంటే పంజాబీ పాపులర్ సింగర్ సిద్ధూ.. మే 29న మాన్సా జిల్లాలో ఘోరంగా హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే పోలీసుల అనుమానం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మీదకు మళ్లింది. ఆ మరుసటి రోజే.. జైల్లో తనకు భద్రత కల్పించాలంటూ పటియాలా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు లారెన్స్ బిష్ణోయ్. సింగర్ సిద్దూ హత్యలో కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రమేయం ఉందని తేలింది. బ్రార్.. బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు కూడా. బిష్ణోయ్ సోదరుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో సిద్దూ మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ ఘటన తర్వాత షగన్‌ప్రీత్.. విదేశాలకు పారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో సిద్ధూనే షగన్‌ప్రీత్‌కు సహకరించి ఉంటాడని బిష్ణోయ్ అనుచరులు నమ్మారు. అందుకే నాలుగు రోజులు రెక్కీ వేసి మరీ సింగర్ సిద్ధూని కిరాతకంగా కాల్చి చంపారు. సిద్ధూ కుటుంబానికి సీఎం పరామర్శ సింగర్ సిద్ధూ మూసే వాలా కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ పరామర్శించారు. శుక్రవారం మన్సా జిల్లా మూసే గ్రామానికి వెళ్లి.. సిద్ధూ కుటుంబాన్ని ఓదర్చారు. దారిపోడవునా.. నిరసనకారులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎలాగోలా సిద్ధూ ఇంటికి చేరారు సీఎం భగవంత్. ఈ సందర్భంగా.. తమకు న్యాయం చేయాలని సిద్ధూ కుటుంబం సీఎంని కోరింది. చదవండి: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా? -
Wrestler Sushil Kumar: ఆ రాత్రి ఏం జరిగింది?
‘రెండు వర్గాల మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు మధ్యవర్తిగా మాత్రమే నేను అక్కడకు వెళ్లాను’... పోలీసుల విచారణ సందర్భంగా సుశీల్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఇది. అయితే అతను చెబుతున్న మాటల్లో నిజమెంత...? విచారణ సమయంలో పలుమార్లు మాట మార్చిన సుశీల్‌లో ఆ తడబాటు ఎందుకు...? ఇప్పుడు పోలీసులు ఇవన్నీ తేల్చే పనిలో పడ్డారు. సుశీల్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తమ పనిలో మరింత వేగం పెంచగా... స్వయంకృతంతో జైల్లో స్టార్ ఒలింపియన్ రెజ్లర్ కుమిలిపోతుండటం క్రీడా విషాదం. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు చురుగ్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌తో కలిసి మంగళవారం పోలీసులు ఘటన జరిగిన ఛత్రశాల్ స్టేడియం వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ‘సీన్ రీకన్స్ట్రక్షన్’ ద్వారా మే 4 రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘ఘటన జరిగిన రోజు అతను ఎక్కడ ఉన్నాడు. ఏం చేశాడని ప్రశ్నించాం. అనంతరం సుశీల్ దాక్కునేందుకు సహకరించిన సన్నిహితులు, మిత్రుల వివరాలు కూడా అడిగాం. మేం అన్ని కోణాల్లో విచారించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఛత్రశాల్ స్టేడియంతో పాటు వివాదానికి కారణమైన మోడల్ హౌస్‌లోని ఫ్లాట్‌కు, షాలిమార్ బాగ్‌లో సుశీల్ నివాసం ఉంటున్న చోటుకు కూడా అతడిని పోలీసులు తీసుకెళ్లి పలు వివరాలు సేకరించారు. ‘ఆ రోజు రాత్రి సుశీల్‌తో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటున్నాం. అతను సాగర్‌ను కొడుతున్నట్లుగా వచ్చిన వీడియోపై మరింత స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం’ అని అధికారులు చెప్పారు. పొంతన లేని జవాబులు మంగళవారం కూడా నాలుగు గంటలపాటు సుశీల్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘విచారణ సందర్భంగా ఒకసారి సాగర్, సోనూలను తాను అక్కడకు లాక్కు రాలేదని, తగవు తీర్చేందుకు మాత్రమే వెళ్లానని అతను మాతో చెప్పాడు. మరోసారి దీని గురించే చెబుతూ తాను సాగర్‌ను కాస్త బెదిరించి భయపెట్టాలని మాత్రమే భావించానని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతని జవాబుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సహజంగానే ఆందోళన గా ఉన్న సుశీల్ పదే పదే మాట మార్చాడు. గొడవ జరిగాక కూడా తాను ఛత్రశాల్ స్టేడియం లోనే ఉన్నానని, మరుసటి రోజు సాగర్ చనిపోయాడని తెలిశాకే పారిపోయానని మాతో చెప్పాడు’ అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు వెల్లడించారు. అంతటి పహిల్వాన్ కూడా జైలు గోడల మధ్య కన్నీళ్లు కార్చినట్లు ఆయన చెప్పారు. ‘లాకప్‌లో పెట్టగానే సుశీల్ ఏడ్చేశాడు. రాత్రంతా మెలకువతోనే ఉండి పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న అతను ఏమీ తినేందుకు ఇష్టపడలేదు’ అని కూడా ఆయన వివరించారు. ‘పద్మశ్రీ’ వెనక్కి తీసుకుంటారా... హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌కు 2011 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి తీసుకునే విషయంలో చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఏ అవార్డీపై రాలేదు కాబట్టి దీని విషయంలో ప్రభు త్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావి స్తోంది. అవార్డు నిబంధనల్లో ఇలా వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి స్పష్టమైన సూచనలు లేకపోయినా... అవార్డు గ్రహీతలు నైతికపరంగా ఉన్నతంగా ఉండాలనే కోణంలో భారత రాష్ట్రపతి కి మాత్రం అవార్డును రద్దు చేసే అధికారం ఉంది. నార్నర్త్ రైల్వేస్ సస్పెన్షన్ వేటు ఊహించినట్లుగానే నార్తర్న్ రైల్వే సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా అతను పని చేస్తున్నాడు. ‘సుశీల్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడంతోపాటు 48 గంటలకు మించి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుశీల్‌ను సస్పెండ్ చేస్తున్నాం’ అని నార్తర్న్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది. కాంట్రాక్ట్ ఖతమ్! మరోవైపు సుశీల్‌ను భారత రెజ్లింగ్ సమాఖ్య కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. తాజా ఘటనకంటే మ్యాట్‌పై అతని ప్రదర్శన కారణంగానే సుశీల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడు. 2019లో ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ (ఏడాదికి రూ. 30 లక్షలు) దక్కిన అనంతరం సుశీల్ ఆ తర్వాత ఆటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో విఫలమైన సుశీల్... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత అతను ఏ టోర్నమెంట్లోనూ పాల్గొనలేదు. గ్యాంగ్స్టర్లతో సంబంధాలపై కూడా.. మరోవైపు సుశీల్‌కు, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాకు మధ్య ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సుశీల్‌తో కలిసి దాడికి పాల్పడిన వారంతా బవానా మనుషులే అని భావిస్తున్న పోలీసులు ఈ కేసులో మరో ఏడుగురిని అనుమానితులుగా గుర్తించారు. ఘటనా స్థలం వద్ద దొరికిన ఒక స్కార్పియో ఎస్యూవీ వాహనం బవానా సన్నిహితుడిదేనని తేలింది. అన్నింటికిమించి కొన్నాళ్ల క్రితం వచ్చిన ఒక బెదిరింపు కేసులో కూడా సుశీల్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడితో సంబంధాలు బాగున్న సమయంలో ఇది జరిగింది. ఒక కేబుల్ ఆపరేటర్‌ను రూ. కోటి కోసం బెదిరించడం వెనక సుశీల్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ శివార్లలోని టోల్ గేట్లపై కూడా తమ పట్టు ఉంచుకునేందుకు జఠేడితో కలిసి సుశీల్ ప్రయత్నించినట్లు చెబుతున్నారు. -
భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం
వేదిక రెజ్లింగ్ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్ మెడల్స్‌ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్ కుమార్‌ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్ స్టేడియంలో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్స్టర్లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ... ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్‌ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్‌ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్‌పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్‌లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు. గుణపాఠం చెప్పాలని... సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్‌పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్‌కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ... తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్లో కోరేందుకు కూడా సుశీల్ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది. సస్పెండ్ చేయనున్న రైల్వేస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో సుశీల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్‌కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్ చేస్తామని, సుశీల్ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్‌పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది. -
నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే : పద్మజ
తిరుపతి: ‘పద్మజ, పురుషోత్తంనాయుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి సుమారు నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చాం. వైద్యపరీక్షలు చేశాం. మేం అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పారు. విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల లక్షణాలు వీరిలో ఉన్నాయి. మరింత కౌనెల్సింగ్ అవసరం’. అని రుయా మానసిక వైద్యనిపుణులు తేల్చారు. మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజను భారీ బందోబస్తు నడుమ శుక్రవారం రుయాకు తీసుకొచ్చా రు. వీరిని పరీక్షించిన వైద్యులు అధునాత పరీక్షలు, మరింత కౌన్సెలింగ్ కోసం విశాఖ మానసిక వైద్యశాలకు రెఫర్ చేశారు. ఇదిలావుండగా ఆర్థిక స్థితిగతులను చూసి కొందరు వీరిపై కన్నేసి ఉండొచ్చన్న అనుమానాలతో హైకోర్టు అడ్వ కేట్ రజినీ నిందితులను విచారించేందుకు సిద్ధమయ్యారు. విశాఖకు రెఫర్ చేశాం రుయాలో ప్రత్యేక బృందంతో నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించాం. సుమారు ఐదు గంటల పాటు విడివిడిగా వారి మానసిక స్థితిని అంచనా వేశాం. వైద్యపరీక్షల్లో వారు పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించాం. వీరికి మరిన్ని వైద్యపరీక్షలు అవసరం. అందుకోసం విశాఖకు రెఫర్ చేశాం. –డాక్టర్ భారతి, రుయా సూపరింటెండెంట్ అదో లోకానికి వెళ్లిపోయారు! నాపేరు దిలీప్. మాది చిత్తూరు అరగొండ దగ్గర విలేజ్. మేం ముగ్గురు అన్నదమ్ములం. పురు షోత్తం నాయుడు నాకు స్వయాన అన్న. వదిన పద్మజకు దైవభక్తి ఎక్కువ. పెద్దమ్మాయి మా వదినలా పూజలు చేసేది. వదిన, పెద్దపాప అలేఖ్య విపరీత ఆధ్యాత్మిక భావనతో మానసికంగా అదో లోకానికి వెళ్లిపోయారు. –దిలీప్, (పురుషోత్తం నాయుడి సోదరుడు) ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు రుయా మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారన్నారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల్లో ఉండే లక్షణాలు వీరిలో ఉన్నాయన్నారు. పద్మజ తండ్రి, మేనత్తలు సైతం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. రుయాలో కస్టోడియల్ కేర్ లేకపోవడంతో వీరిని విశాఖకు రెఫర్ చేసినట్లు వివరించారు. వైద్యులను తికమక పెట్టిన పద్మజ తాను మూడోకన్ను తెరిస్తే భస్మమవుతారని వైద్య పరీక్షలకు వచ్చిన పద్మజ రుయా డాక్టర్లను తొలుత బెదిరించారు. వైద్యులు ఒకింత అయోమయానికి లోనైట్లు తెలిసింది. వైద్య పరీక్షల కోసం తిరుపతి రుయా మానసిక చికిత్స విభాగానికి తీసుకువచ్చిన పోలీసులు -
కర్రలతో కొట్టి.. బండరాయితో మోది..
సాక్షి, కోదాడ రూరల్/ఖమ్మం : అర్ధరాత్రి ముగ్గురు దుండగులు దురాఘతానికి తెగబడ్డారు. ఓ గ్రానైట్ క్వారీ వ్యాపారిని కర్రలతో కొట్టి.. బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులో చోటుచేసుకుంది. ఓ మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన వెనిశెట్టి రంగనాథ్ (43) గ్రానైట్ క్వారీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరి కుటుంబం 35 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చి ఖమ్మం జిల్లా కేంద్రంలోని వీడీవోస్ కాలనీలో స్థిరపడింది. కాగా రంగనాథ్ బొలేరో వాహనంలో సమీప బంధువైన ఓ మహిళతో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో శాంతినగర్ నుంచి అనంతగిరికి వెళ్లే మార్గంలోని ఓ బండ సమీపంలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ముగ్గురు దుండగులు వచ్చి రంగనాథ్‌తో గొడవ పడుతూ కర్రలతో దాడి చేశారు. దీంతో భయాందోళన చెందిన మహిళ అక్కడనుంచి పరుగులు తీసింది. దుండుగుల నుంచి తప్పించుకునేందుకు రంగనాథ్ పొలాల గుండా పరిగెత్తినట్లు ఘటన స్థలి పరిశీలిస్తే అవగతమవుతోంది. బండరాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో మహిళ.. ఆదివారం రాత్రి రంగనాథ్‌తో వచ్చిన మహిళ సోమవారం ఉదయం అదే దారిలో వచ్చి వెతుకుతూ జనం గుమిగూడిన ప్రదేశానికి చేరుకుంది. రంగనాథ్ మృతదేహాన్ని చూసి బోరుమంటూ రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఆమె చెప్పిన వివరాలతో బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం రాబట్టేందుకు సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులెవరో ఎవరో తనకు తెలియదని ఆమె చెప్తున్నట్లు సమాచారం. రంగనాథ్ కాల్‌లిస్ట్‌లో నంబర్ల ఆధారంగా కూడా విచారణ చేస్తున్నారు. హత్యకు కారణ ం వివాహేతర సంబంధమా..? వ్యాపార లావాదేవీలా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రంగనాథ్‌తో ఉన్న మహిళ ఆదివారం రాత్రే కోదాడ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ ప్రాంతం తమ పరిధి కాదని, అనంతగిరి ఠాణాలో ఫిర్యాదు చేయాలని పట్టణ పోలీసులు చెప్పడంతో వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రైతులు గమనించి.. బండరాయిపై ధాన్యం ఆరబోసిన రైతులు సోమవారం ఉదయం అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ సైదులు, చిలుకూరు ఎస్ఐ నాగభూషణరావు, సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతుడు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ క్వారీ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌గా గుర్తించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లను, హత్యకు ఉపయోగించిన కర్రలు, తలపై మోదిన రాయిని స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకల వాసన చూసిన అనంతరం జాగిలం శాంతినగర్ నుంచి మొగలాయికోట దారి వరకు వెళ్లి ఆగిపోయింది. మృతుడి కుమారుడు బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బొమ్మల షాపులో మహిళపై దారుణం
ముంబై : షాపులో బొమ్మలు కొందామని వచ్చిన మహిళను దారుణంగా చంపడమే గాక అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని నలాసోపారాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. 32 ఏళ్ల మహిళ తన భర్త, పిల్లలతో కలిసి నలాసోపారాలో నివసిస్తుంది. ఆమె భర్త పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా జూన్ 26న పిల్లలకు బొమ్మలు కొందామని వెళ్లిన సదరు మహిళ తిరిగిరాలేదు. దీంతో ఆమె భర్త తులింగ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వివరాలు సేకరించి మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.( పరారీలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!) అయితే జూన్ 28న నలాపోపారాలోని చందన్‌నకా రోడ్ వెంబడి పార్క్ చేసి ఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తన భార్య కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన మహిళ భర్తను వెంటబెట్టుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించి చూడగా ఆ మృతదేహం తన భార్యదేనని పేర్కొన్నాడు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా సదరు మహిళ హత్యకు గురవ్వడమే గాక అత్యాచారం చేయబడిందని రిపోర్టులో తేలింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పాల్గర్ సీడీఐ సహాయంతో విచారణ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఆ వాహనం అక్కడే పార్క్ చేసి ఉంటుందని అక్కడి స్థానికులు విచారణలో పేర్కొన్నారు. పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజీ సహాయంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.(రోజు కూలీపై ఆస్పత్రి యాజమాన్యం దాడి) జూన్ 26 న ఆ వ్యాన్ పార్క్ చేసిన ప్రదేశంలో పక్కనే ఉన్న ఒక టాల్‌స్టాయ్ షాపుకు మహిళ వెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఆచూకి లభించకపోవడంతో పోలీసుల అనుమానం బలపడి షాపు యజమానిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో షాపు యజమాని ఆ మహిళను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు.' జూన్ 26న సదరు మహిళ తన షాపుకు వచ్చింది. బొమ్మలు కొనే విషయంలో వాగ్వాదం తలెత్తడంతో క్షణికావేశంతో ఆమె జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయి మెడమీద చేతులు పెట్టి చంపేశాను. అనంతరం ఆమెను శారీరకంగా అనుభవించాను. ఒక రాత్రంతా మహిళ శవంతోనే గడిపి తర్వాత ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి పక్కనే పార్క్ చేసి ఉన్న వాహనంలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను.' అంటూ పేర్కొన్నాడు. కాగా నిందితునిపై లైంగిక దాడి కేసుతో పాటు మర్డర్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
నమ్మితే.. నయవంచనే!
సాక్షి వరంగల్ : ప్రేమకు పునాది నమ్మకం.. ఆ నమ్మకమే యువతుల పట్ల మరణ శాసనంగా మారుతోంది. ప్రేమ. ప్రేమా అంటూ తియ్యటి మాటలు చెప్పి యువతలను ఆకర్షించడం.. ఆ పైన సెల్ నంబర్ దొరికితే చాలు అమ్మాయి తనదేనని గర్వంగా స్నేహితులకు చెబుతున్న ఘటనలు కోకోల్లలుగా జరుగుతున్నాయి. ఇందులోలో కొన్ని ఘటనలు విషాదంగా ముగుస్తుండడం కుటుంబీకులకు తీరని ఆవేదనను మిగులుస్తున్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు సంఘటనల్లో చివరకు అమ్మాయిలు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా యువతులపై జరుగుతున్న దాడుల వల్ల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవువుతున్నారు. ప్రేమ పేరుతో వంచించే నయ వంచకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కళాశాలలకు వెల్లిన తమ పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ప్రతి రోజు పరీక్షే అవుతోంది. ప్రమాదం ఎవరి రూపంలో వచ్చి ఏం చేస్తుందో తెలియక ప్రతీ క్షణం టెన్షన్‌తో బ్రతకాల్సిన పరిస్థితులు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. సంఘటనల జరిగాక పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా నిందితులు, మిగతా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. పేద కుటుంబం.. ప్రేమ మోసం నగరంలో నాలుగు నెలల్లో జరిగిన రెండు సంఘటనల్లో రెండు పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మయిలు తనువు చాలించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆగస్టు 10 జరిగిన సంఘటనలో సమ్మయ్యనగర్కు చెందిన పదో తరగతి విద్యార్థిని వెన్నెలపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో ఆమె ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు కొయ్యడ తిరుపతితో పాటు మరో మైనర్ బాలుడు జైలు పాలయ్యారు. ఇంతలోనే మరో అమ్మాయి ప్రేమకు బలైంది. దీన్దయాళ్నగర్కు చెందిన గాదం మానస పేద కుటుంబానికి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రులు గాదెం స్వరూప, మల్లయ్య గీసుగొండ మండలం కొమ్మాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. ముగ్గురు పిల్లల్లో ఒకరి వివాహం చేయగా, మరో ఇద్దరిని కూరగాయలు అమ్మి చదివిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా షాపులో పనిచేస్తున్న క్రమంలో పులి సాయిగౌడ్ పరిచయం పెంచుకుని ఆ తర్వాత సెల్ నంబర్ తీసుకుని, ముందుగా చాలా మర్యాదగా మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమ మొదలుపెట్టాడు. అనంతరం తన కోసం బయటకు రాకుంటే చస్తానని బెదిరించి చివరకు బయటకు వచ్చిన తరువాత బలవంతంగా అత్యాచారం జరిపి హత్య చేయడం ఆ కుటుంబాన్ని ఎంతో కుంగుబాటుకు గురిచేసింది. ఈ రెండు సంఘటనల్లో అమ్మాయిలు కేవలం సెల్ఫోన్లలో నిందితులు ప్రేమగా మాట్లాడిన మాటలకు పొంగిపోయి... ఇంట్లో వారికి చెప్పకుండా నిందితుల వెంట వెళ్లి ప్రాణాలను కోల్పోయారు. మానస హత్యలో నిందితుడు సాయిగౌడ్ సుమారు ఆరు గంటల పాటు మృత దేహంతో ప్రయాణం చేసి , చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఏం జరుగుతుందో... ఇంట్లో ఈడు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడే ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కళాశాలలకు వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర రూ.వేల విలువైన సెల్ఫోన్లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో, ఎవరితో ఎంత సేపు మాట్లాడుతున్నారో పట్టించుకునే తీరిక చాలా మంది తల్లిదండ్రులకు ఉండడం లేదు. కమిషనరేట్ పరిధిలో ప్రతీ వారం షీ టీమ్స్ అధికారులు ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్ ఇస్తుండగా.. ఇందులో 80 శాతం మంది కళాశాల విద్యార్థులే ఉంటున్నారు. అయితే, కౌన్సెలింగ్ తర్వాత కూడా చాలామందిలో మార్పు రాకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది. మృతదేహం వద్ద నివాళుర్పించిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఎంజీఎం : అత్యాచారం, హత్యకు గురైన మానస మృతహం వద్ద ప్రభుత్వ చీఫ్ వినయ్‌భాస్కర్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని సందర్శించి కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఘటనకు పాల్పడిన నిందింతుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని స్వగ్రామమైన కొమ్మాలకు తరలించగా రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
వ్యక్తి దారుణహత్య..!
అనుమానం పెనుభూతమైంది.. తన భార్యతో స్నేహితుడు సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. అదునుకోసం వేచి చూసి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతనితో సన్నిహితంగా మెలుగుతూనే హత్యకు పథకం రచించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. వైద్యుడితో చూపించుకోవాలని వెంట రమ్మని కోరాడు.. పథకం ప్రకారం స్నేహితుడికి పూటుగా మద్యం తాపించి ఆపై ఘాతుకానికి ఒడిగట్టాడు. మోటకొండూర్ మండలంలో మంగళవారం వెలుగుచూసిన హత్యోదంతం వివరాలు.. మోటకొండూర్ (ఆలేరు) : జగద్గిరిగుట్టకు చెందిన నెహ్రూ(45) పాబ్రికేషన్ వర్క్ చేస్తుంటాడు. సమీపంలో నివసించే వేముల పరుశరాములుతో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా స త్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే నెహ్రూ తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని ఇటీవల పరశరాములు అనుమానం పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. హత్యకు పథకం రచించిన పరుశరాములు స్నేహితుడైన నెహ్రూతో సఖ్యతగానే మెలుగుతున్నాడు. తనకు ఏమీ తెలియనట్టుగా అతడిని నమ్మిం చా డు. ఈ నేపథ్యంలోనే తనకు ఆరోగ్యం బాగాలేద ని పసిరికలు (కామెర్లు) అయ్యాయని చెట్ల మందులు తీసుకోవాలని, వైద్యుడి వద్దకు తీసుకెళ్లాల ని స్నేహితుడిని కోరాడు. దీనిలో భాగంగా నెహ్రూ సోమవారం సాయంత్రం స్నేహితుడు పరశరాములతో కలిసి జనగామ వైపు బయలుదేరాడు. రాయగిరిలో మద్యం సేవించి.. షిఫ్ట్ డైజైర్ కారులు బయలుదేరిన స్నేహితులు భువనగిరి మండలం రాయగిరిలో మద్యం సేవించారు. అనంతరం పరుశరాములు స్వగ్రామం అ యిన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోని చందేపల్లి గ్రామసమీపంలో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారితోకి కొంతదూరం వెళ్లి రాత్రి 9గంటల సమయంలో మళ్లీ మద్యం సేవించారు. ఈ క్రమంలో పాత కక్షలను మనసులో ఉంచుకున్న పరుశరాములు నెహ్రూకు మద్యం అతిగా తాగించి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం అప్పటికే కారులో ఉన్న కర్రను తీసుకొచ్చి నెహ్రూ తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కిడ్నాప్ కేసు నమోదు నెహ్రూ, పరశరాములు ఇద్దరు కలిసి వెళ్లి రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో నెహ్రూ భార్య సోమవారం రాత్రే జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దుచేసింది. తన భర్తను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బావమరిదికి ఫోన్ చేసి.. హత్య అనంతరం పరశరాములు జరిగిన విషయాన్ని తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పరశరాములు మోటకొండూర్ మండల కేంద్రానికి వచ్చి మద్యం సేవించాడు. తెల్లవారుజామున మోటకొండూర్ పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం ఎస్ఐ వెంకన్న, శ్రీరాములు, ప్రభాకర్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు జగద్గీరిగుట్ట పీఎస్‌లో నమోదు అవ్వటంతో ఎసీపీ గోవర్ధన్, ఎస్ఐ శ్రీనివాస్ , క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
వ్యక్తి దారుణ హత్య
అశ్వాపురం: అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ వాగులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో పోలీసుల ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. మృతదేహం పూర్తిగా పాడై కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో మృతి చెందిన వ్యక్తిని ఐదు రోజుల కిందట హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల కథనంప ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇద్దరు గొర్లు, మేకల వ్యాపారులు ఐదు రోజుల కిందట అశ్వాపురం మండలం అమ్మగారిపల్లికి వచ్చారు. నాలుగు రోజుల కిందట రాత్రి ఇద్దరు కలిసి అతిగా మద్యం సేవించారు. అనంతరం ఇద్దరిలో ఒకరు హత్యకు గురయ్యారు. వారు కూర్చొని మద్యం సేవించిన ప్రాంతంలో పగిలి ఉన్న బీరు సీసా, ఒక మొద్దుపై రక్తపు మరకలు ఉన్నాయి. ఒక కర్రతో కొట్టినట్టు కర్రకు కూడా రక్తం మరకలు ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్లి వాగులో పడేసినట్లు ఉండటంతో పోలీసులు హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిలో మరో వ్యక్తి వెంటనే తమ ఊరు జగ్గయ్యపేట వెళ్లాడు. ఆ ఊర్లో మృతుడి బంధువులు, స్థానికులు ఇద్దరు కలిసి వెళ్లి ఒక్కడివే వచ్చావు? అతను ఏడి అని నిలదీశారు. దీంతో ఆ వ్యక్తి జగ్గయ్యపేట పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. జగ్గయ్యపేట పోలీసులు అశ్వాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అశ్వాపురం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. అశ్వాపురం సీఐ బొల్లం రమేశ్ సిబ్బందితో ఆ వ్యక్తిని తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని, ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి పూర్తి వివరా>లు సేకరించారు. అమ్మగారిపల్లి వీఆర్ఓ కృష్ణవేణి పంచనామా నిర్వహించారు. మృతదేహానికి ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో మృతుడిని హత్య చేసినట్టుగా భావిస్తున్నామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అశ్వాపురం సీఐ బొల్లం రమేశ్ విలేకరులకు తెలిపారు. -
భగ్గుమన్న పాతకక్షలు..!
నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బంధువుల శుభకార్యానికి వెళ్లొస్తున్న ఓ యువకుడిని ప్రత్యర్థులు దారికాచి కత్తులతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. దీంతో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా అన్నారం బ్రిడ్జి పంచాయతీ శివారులో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. పెన్‌పహాడ్(సూర్యాపేట): మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి వెంకటేశ్వర్లు (27) సీపీఎం గ్రామ కార్యదర్శిగా కొనసాగుతూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు ఆదివారం తమ బంధువుల వ్యవసాయ భూమిలో జరుగుతున్న ఉప్పలమ్మ పండుగకు హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రత్యర్థులు అన్నారం బ్రిడ్జి శివారులో దారికాచి వేటేశారు. కత్తిపీటతో వెంకటేశ్వర్లు తల, పొట్టభాగంలో దాడి చేయడంతో అక్కడికక్కడే నెలకొరిగాడు. దుండగులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నారాయణగూడెం గ్రామ శివారులో వదిలేసి వెళ్లారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అన్నారం బ్రిడ్జి శివారులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ రంజిత్‌రెడ్డి, లవకుమార్, మల్లేశంలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మిన్నంటిన రోదనలు నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి భిక్షానికి వెంకటేశ్వర్లు ఒక్కడే కుమారుడు. ఇతనికి అక్కా, చెల్లి కూడా ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు దారుణహత్యకు గురయ్యాడనే వియాన్ని తెలుసుకున్న తల్లిదండ్రి కుప్పకూలిపోయారు. కుమారుడి మృతదేహంపై పడి గుండలవిసేలా రోదించారు. ప్రత్యర్థులే ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యర్థుల పనేనా..? మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి రమేశ్ కుటుంబ తగాదాల నేపథ్యంలో గత ఏడాది మార్చి 30వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఆ కేసులో వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడు. కాగా, వెంకటేశ్వర్లు మూడు మాసాల క్రితమే బెయిల్‌పై విడుదలై గ్రామానికి వచ్చాడు. అయితే వెంకటేశ్వర్లును ప్రత్యర్థులే మాటేసి ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
కిరాతకంగా నరికి చంపారు
కొందుర్గు: వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం కొందుర్గు మండలం తంగెళ్లలపల్లిలో వెలుగుచూసింది. పొలం వద్దకు వెళ్తున్న వ్యక్తిని దారికాసి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన మాధవాచారి(60) మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరాడు. గంటలు గడిచినా తిరిగి మాధవాచారి తిరిగిరాకపోవడంతో పొలం వద్దే పడుకొని ఉంటాడని భావించిన భార్య కిష్టమ్మ, కుమారుడు యాదగిరి నిద్రకు ఉపక్రమించారు. కాగా, ఆవు పాలు కోసం బుధవారం ఉదయం యాదగిరి పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోని ఓ చెట్టు వద్ద తండ్రి మాధవాచారి పడి ఉండటాన్ని యాదగిరి గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూడగా.. తలపై గొడ్డలి గాట్లు, ముఖం, తల భాగం రక్తం మరకలతో మృతిచెంది ఉన్నాడు. గమనించిన యాదగిరి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఆధారాల సేకరణ హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న కొందుర్గు ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు చౌదరిగూడ ఎస్ఐ లింగం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి సమాచారం ఇవ్వడంతో ఏసీపీ సురేందర్, సీఐ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలం వద్ద పెన్ను, చార్జింగ్ లైట్ మాత్రమే లభించాయని, హత్య చేసిన నిందితుల వివరాలు తెలియరాలేదని పోలీçసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కన్నీరు మున్నీరైన కుటుంబం మృతుడు మాధవాచారి, రాములు, సత్యం అన్నదమ్ములు. వీరిలో రాములుకు మతిస్థిమితం సరి గ్గా లేకపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. మరో సోదరుడు సత్యం, అతడి భార్య ఇద్దరు అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. మాధవాచారి, కిష్టమ్మ దంపతులకు ఆ నంద్‌చారి, యాదగిరిచారి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యపిల్లలతో ఆనంద్ షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తంగెళ్లపల్లిలో మాధవాచారి, చిన్నకుమారుడు, భార్య కిష్టమ్మ తంగెళ్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మాధవాచారి హ త్య విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
కొడుకుని చంపి.. తానూ బలవన్మరణం
బాల్కొండ: కొడుకు గొంతు నులిమి చంపి, తండ్రి చెట్టుకు ఉరేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారుజామున ముప్కాల్ మండల కేంద్రం లో జరిగింది. ముప్కాల్ ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపిన వి వరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి బతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం సుజారాం(32) కుటుంబ సభ్యులతో కలిసి ముప్కాల్ మండల కేంద్రానికి వచ్చాడు. ఆయన హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాల కారణంగా పదిరోజుల క్రితం సుజారాం భార్య నానుభాయి రెండేళ్ల కూతురుని తీసుకుని రాజస్థాన్‌కు వెళ్లిపోయింది. సుజారాం కుమారుడు విక్రమ్‌తో కలిసి హోటల్లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఎప్పటిలాగే కుమారుడు విక్రమ్(6)ను తీసుకుని హోటల్‌కు వచ్చాడు. హోటల్ వెనుక భాగాన కొడుకుని తీసుకుని వెళ్లి గొంతు నులిమి చంపాడు. తరువాత అక్కడే ఉన్న వేప చెట్టుకు చీరతో ఉరేసుకుని సుజారాం ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్లో ఇతరులు పని చేస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్ వెనక వైపు నుంచి ఎంతకి రాకపోవడంతో అనుమానంతో వెళ్లి చూడగా అప్పటికే విగత జీవులుగా పడి ఉన్నారు. భార్య లేక పోవడం, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురై కుమారుడిని చంపి సుజారాం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ.. ముప్కాల్‌లో ఘటన స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ అం దె రాములు పరిశీలించారు. హోటల్లో పని చేస్తు న్న ఇతరులను విచారించాడు. మృత దేహాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపడుతామన్నారు. ఆర్మూర్ సీఐ రాఘవేందర్, ముప్కాల్ ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. కొడుకును వదిలి వెళ్లలేక.. సుజారాం కుమారుడు విక్రమ్ మూత్ర కోశ వ్యా దితో బాధపడుతున్నాడు. గతంలో జిల్లా కేంద్రం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మానసికంగా కుంగిపోయిన సు జారాం వ్యాధితో బాధ పడుతున్న కుమారుడిని ఒంటరిగా వదిలి వెళ్ల లేక ముందుగా కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రియుడి కోసం.. బాబును, భర్తను చంపేసింది
వేలూరు : ప్రేమించి వివాహం చేసుకున్నారు. రెండేళ్లు వారి కాపురం సాఫీగా సాగిపోయింది. ఏడాది క్రితం కుమారుడు జన్మించడంతో సంబరపడ్డారు. అయితే వివాహేతర సంబంధం వారి మధ్య చిచ్చుపెట్టింది. రెండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాలు.. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలోని తాజ్‌పుర మందవేలి గ్రామానికి చెందిన సుబ్రమణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రిషియన్. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దీపిక (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ప్రనీష్(1) ఉన్నాడు. ఈ నెల 13వ తేదీ నుంచి తన భర్త, కుమారుడు కనిపించడం లేదని దీపిక ఆర్కాడు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సెల్ నంబర్ చెబితే వెంటనే కనిపెడతామని పోలీసులు ఆమెకు తెలిపారు. అయితే తన భర్త సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయాడని చెప్పింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో తడబడడంతో అనుమానించిన పోలీసులు ఆమెను విచారణ చేశారు. ఆ సమయంలో దీపిక తన భర్త రాజా, కుమారుడు ప్రనీష్‌లను హత్య చేసి ఇంటి సమీపంలోని భూమిలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకుంది. అవాక్కైన పోలీసులు గురువారం రాత్రి మృతదేహాలు పూడ్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 11 గంటల సమయం కావడంతో దీపికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం ఉదయం మృతదేహాలను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం తహసీల్దార్ వత్సల, డీఎస్పీ కలైసెల్వన్, వేలి ముద్ర నిపుణులను రప్పించి మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో రాజా బంధువులు దీపికపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు దీపికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం పాతి పెట్టిన మృతదేహాలను బయటకు తీశారు. వారిని చూసి రాజా బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాలను అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో దీపిక భర్త రాజా తలపై రాతితో కొట్టి హత్య చేసి అనంతరం కుమారుడిని హత్య చేసినట్లు తెలిసింది. దీపికకు భర్త రాజా స్నేహితుడు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
రెండు నెలలు.. 18 హత్యలు
తాండూరులో ఇటీవల జరిగిన ఓ ప్రతీకార హత్య కలకలం సృష్టించింది. గతేడాది తన తల్లిదండ్రులను ఆస్తితగాదాల నేపథ్యంలో బాబాయి హత్య చేశాడనే కక్షతో మృతుల కుమారుడు అతడిని దారుణంగా చంపేశాడు. తన తల్లిదండ్రులను చంపిన మాదిరిగానే.. అదే స్థలంలో చంపడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈనెల 7న కొత్తూరు మండలం సిద్ధాపూర్లో తండ్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కుమారుడు చంపేశాడు. బంధాలు ఎటు వెళ్తున్నాయి.. జనం పుట్టుకతో వచ్చిన బంధాలు, అనుబంధాలను విస్మరించి.. చిన్నచిన్న తగాదాలు, కక్షలు, ఇతర కారణాలతో తన వాళ్లను కడతేర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మైలార్‌దేవ్‌పల్లిలో అత్తాకోడలి దారుణ హత్య ఉమ్మడి జిల్లాతోపాటు నగరంలో కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు వారిని అతిదారుణంగా చంపేశారు. రెండు నెలల పరిధిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 హత్య జరగడంతో పోలీసులతో పాటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడే పోలీసులు ఇరువర్గాలను ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్ చేస్తే కొంత మార్పు వస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. షాద్‌నగర్ టౌన్: క్షణికావేశం, కక్షలు, చిన్నచిన్న సమస్యలు పెద్దవి కావడంతో హత్యలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొందరు సొంతవారినే కడతేర్చుతున్నారు. అదేవిధంగా వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. నేరాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగానే ఉంటున్నాయి. చిన్నచిన్న తగాదాలపై సకాలంలో స్పందించకపోవడంతో హత్యలు జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. మార్చి 4న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎల్ఐజీ కాలనీలో ఇళ్లలో పని చేస్తూ పొట్టపోసుకుంటున్న స్వరూపను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. అదేనెల 6న చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మతిస్థిమితం కోల్పోయిన మంగలి యాదమ్మ తన భర్త వెంకటయ్యపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. అనంతరం ‘మీ నాన్నను చం పేశాన’ని ఆమె తన కుమారుడి వద్దకు వెళ్లి చెప్పడంతో కలకలం రేగింది. మార్చి 14న నవాబుపేట మండలం చిట్టిగిద్దకు చెందని యువకుడు షేక్ సోహెల్ ఇంట్లోనుంచి వెళ్లి తిరిగి రాలేదు. లింగంపల్లిగుట్ట మీద దారుణ హత్యకు గురై విగతజీవిగా కనిపించాడు. దుండగులు వైరుతో సోహెల్ గొంతుకు బిగించి హతమార్చారు. 15వ తేదీ రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నరెడ్లగూడ గ్రామానికి చెందిన ముక్కు రాంమోహన్‌ను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. బండరాళ్లతో మోది ఓ ఓ ఫాంహౌస్‌లో పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. మార్చి 18న శంకర్పల్లి పరిధిలోని మోకిలి శివారులో ఉన్న ఓ వెంచర్లో గుడ్డు కుమార్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన రఘువీర్, విక్రం, అర్జున్ ఇనుపరాడ్లుతో కొట్టి అంతమొందించారు. మార్చి 19న శంషాబాద్ మండలం చౌదరిగూడ శివారులోని ఓ వెంచర్లో నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని మహిళను దండగులు చంపేసి మృతదేహాన్ని కాల్చివేశారు. 23న తాండూరు పట్టణంలో జరిగిన ప్రతీకార హత్య సంచలనం రేపింది. సీతారాంపేటకు చెందిన అబ్దుల్ సత్తార్, షరీఫ్ అన్నదమ్ములు. వీరి మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో షరీఫ్ తన అన్న అబ్దుల్సత్తార్తో పాటు వదిన ఫహీమున్సిసాబేగంను గతేడాది బండరాయితో మోది హత్య చేశాడు. తన తల్లిదండ్రులను చంపేయడంతో అబ్దుల్ సత్తార్ కుమారుడు అబ్దుల్లా బాబాయిపై కక్ష పెంచుకున్నాడు. మార్చి 23న తన స్నేహితులతో కలిసి అబ్దుల్లా బాబాయిపై కర్ర, బండారాయితో దాడి చేసి చంపేశాడు. అయితే, తన తల్లిదండ్రులను చంపేసిన మాదిరిగానే, అదే స్థలంలో అం తమొందించడం కలకలం రేపింది. తాండూరు మండలం రాంపూర్ తండాకు చెందిన రుక్కిబాయి, డప్పు దశరథ్ దంపతులు. రుక్కిబాయిపై అనుమానం పెంచుకుంటున్న దశరథ్ మార్చి 25న ఇంట్లో నిద్రిస్తుండగా రోకలి, పారతో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. మార్చి 26న ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మహల్‌ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములు వివాహిత అయిన జంగం మంగమ్మ ఒంటిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. వివాహేతర సం బంధం నేపథ్యంలో వారిమధ్య గొడవలు ఉన్నాయి. చికిత్స పొందుతూ మంగమ్మ ప్రాణం విడిచింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైనుద్దీన్ మార్చి 24న హత్యకు గురయ్యాడు. మైనుద్దీన్ తండ్రి రుక్మొద్దీన్ సోదరులు సద్దాం, జహంగీర్ ఆయనను చంపేశారు. ఆస్తి కోసం ఈ దారుణానికి పాల్పడ్డారు. మార్చి 27న రాజేంద్రనగర్ ఎంఎంపహడీ ప్రాంతంలో నదీమ్ గ్యాంగ్ వార్‌కు బలయ్యాడు. తన స్నేహితుడికి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గంమధ్యలో జరిగిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది యువకుడి హత్యకు దారి తీసింది. పెద్దేముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన బాల్‌రాజ్, ఎర్రమరియమ్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా మరియమ్మ ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానించిన బాల్‌రాజ్ ఆమెను హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో మార్చి 31న పొలంలో ఉరివేసి హతమార్చాడు. మార్చి 31న చేవేళ్ల మండలం ఊరెళ్ల గ్రామానికి వెళ్లే దారిలో సాగర్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న ఓ వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 2న వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్ పెద్ద తండాకు చెందిన ఆంగోత్ జంకిబాయిని దాయాది అయిన హరియానాయక్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తన బోరు నీళ్లు ఎందుకు పారించుకున్నావని ఆమె అడగడంతో దారుణానికి పాల్పడ్డాడు. యాచారం మండలం తక్కళ్లపల్లికి చెందిన కంబాలపల్లి బాలయ్య, ఆయన కుమారుడు జంగయ్య, అతడి భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రీకొడుకు మధ్య విబేధాలు రావడంతో క్షణికావేశానికి గురైన కొడుకు జంగయ్యపై రోకలితో దాడి చేయడంతో ప్రాణం విడిచాడు. ఏప్రిల్ 13న వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్‌లో రచ్చబండ సాక్షిగా నరేష్ అనే యువరైతు దారుణ హత్యకు గురయ్యాడు. నరేష్‌కు సంబంధించిన మేక జొన్న పంటలోకి వెళ్లి మేసింది. పొలం యజమాని అశోక్ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే ఈ విషయాన్ని నరేష్ ఇంట్లో వచ్చి చెప్పగా రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టారు. రావులపల్లి అశోక్, నర్సింలు, నందు, శ్రీనివాస్, శేఖర్ మారుణాయుదాలతో వచ్చి దాడి చేశారు. చికిత్స పొందుతూ నరేష్ మృతిచెందాడు. ఏప్రిల్ 19న రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగ్ మూసీ కల్వర్టు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ దారుణహత్యకు గురైంది. దుండగులు ఆమెను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి చంపేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఏప్రిల్ 22న యాచారం మండలం చింతుల్ల గ్రామంలో నాగరవితేజ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇతడు మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. అయితే పౌల్ట్రీలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యతో నాగరవితేజకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి పథకం ప్రకారం చింతల్ల– అయ్యవారిగూడెం మధ్యలో ఇనుపరాళ్లతో కొట్టి హతమార్చారు. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని కొడుకు తం డ్రిపై దాడి చేసి హత్య చేసిన ఘటన ఈనెల 7న కొత్తూరు మండలం సిద్దాపూర్లో వెలుగు చూసింది. సామరస్యంగా పరిష్కరించుకోవాలి తాండూరు టౌన్: చిన్నచిన్న విషయాలను పెద్దగా చేసి గొడవలకు దిగి చంపుకోవడం అమానుషం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆస్తి తగాదా అయిన, పొలం తగాదైనా.. మరేదైనా అందరూ కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సగం సమస్య పరిష్కారమవుతుంది. అక్కడ పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అంతే కానీ క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జైలుకు వెళ్తే కుటుంబీకులు రోడ్డునపడతారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ తరఫున పలు అంశాలపై కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. – రామచంద్రుడు, డీఎస్పీ, తాండూరు డబ్బుల కోసమే హత్య తండ్రిని చంపిన తనయుడి అరెస్టు కొత్తూరు: డబ్బుల కోసం తండ్రిని చంపిన తనయుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. స్థానిక ఠాణాలో రూరల్ సీఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని సిద్ధాపూర్‌కు చెందిన గుండెమోని చంద్రయ్య(60)కు కుమారులు అంజయ్య, లక్ష్మయ్య ఉన్నారు. అంజయ్య వేరుగా నివాసం ఉండగా చంద్రయ్య తన భార్య సత్యమ్మ, చిన్న కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే, లక్ష్మయ్య పనీపాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతోపాటు తన ఖర్చుల కోసం తరచూ తండ్రితో గొడవపడుతుండేవాడు. ఈక్రమంలో తండ్రిని చంపేస్తే ఉన్న భూమిని పంచుకొని తన వాటాను విక్రయిస్తే డబ్బులు వస్తాయని లక్ష్మయ్య భావించాడు. ఈనెల 5న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి తలపై కట్టెతో బలంగా కొట్టి పారిపోయాడు. కుటుంబీకులు చంద్రయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి 7న మృతి చెందాడు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు కొత్తూరులోని రాధాగార్డెన్ వద్ద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణ తదితరులు ఉన్నారు. -
పైసాచికత్వం
ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికావేశంలోనో.. పక్కా ప్రణాళికతోనో ఇతరుల ప్రాణాలను తీసేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానో.. ఆస్తులు, డబ్బుల కోసమో హత్యలకు ఒడిగడుతున్నారు. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో హత్యలు పెరిగాయి. పక్షం రోజుల్లోనే ఏడు హత్యలు జరగడం కలవరం సృష్టిస్తోంది. కామారెడ్డి క్రైం: బంధాలు, బంధుత్వాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. స్నేహానికి కూడా విలువలేకుండా పోతోంది. డబ్బే ప్రధానమవుతుండడంతో దానికోసం దారుణాలకూ ఒడిగడుతున్నారు. డబ్బు, ఆస్తులు, వివాహేతర సంబంధాలతో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పక్షం రోజుల్లో ఆరు సంఘటనల్లో ఏడుగురు హత్యకు గురయ్యారు. ఆయా కేసుల్లో నిందితులు అత్యంత కిరాతకంగా ఎదుటివారిని హత్యచేశారు. వరుస ఘటనలు.. ఉమ్మడి జిల్లాలో పదిహేను రోజుల్లో పలు హ త్యలు జరిగాయి. ఆయా ఘటనల్లో ఏడుగురు దారుణ హత్యకు గురయ్యారు. వరుసగా జరుగుతున్న హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 24: అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్‌లోని నాందేవ్వాడలో హత్య జరిగింది. హమాల్వాడీలో తమ్ముడు చౌదరి దత్తు (23)ను అతడి అన్నయ్యే కత్తితో పొడిచి చంపా డు. తల్లి కూలీ డబ్బులు తమ్ముడే తీసుకుంటున్నాడన్న విషయమై జరిగిన గొడవ ఈ దారుణానికి దారితీసింది. ఏప్రిల్ 25: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద మెద క్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తుడుం రాకేష్ (25) అనే యువకుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. బైక్ విషయంలో అతడిని స్నేహితుడే హత్య చేసినట్లు గా తెలిసింది. ఏప్రిల్ 30: ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఓ కళ్యాణ మం డపం వద్ద రెండు నెలలుగా గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాచ్‌మన్ బోదాసు రాములు (46)ను దుండగులు దారుణంగా హత్య చేశారు. విద్యుత్ తీగలతో గొంతకు ఉరివేసి హతమార్చారు. కారణం తెలియలేదు. మే 3: నిజామాబాద్‌లోని కంఠేశ్వర్‌లో మూడో తేదీన వెలుగు చూసిన జంట హత్యల సంఘటన సంచలనం సృష్టించింది. టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగించే శ్రీకాంత్ శెట్టి, అతని సహచరుడు సాయికుమార్‌లను మరో ఇద్దరు స్నేహితులు కలిసి దారుణంగా హత్య చేశారు. వారి వద్దనుంచి డబ్బులు కాజేయాలన్న ఉద్దేశంతోనే రెండు నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మూడో తేదీనే బాన్సువాడ మండలం కొల్లూరులో మరో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నానుగొండ (47) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని స్నేహితుడైన పర్వయ్య నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపాడు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని పోలీసుల విచారణలో తేలింది. మే 4: గుంట భూమి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మద్నూర్ మండలం ఇలేగావ్ గ్రామానికి చెందిన గుండాజీ (53), వరుసకు సోదరుడైన వ్యక్తి మధ్య భూమి విషయంలో జరిగిన గొడవలో అతడు గుండాజీపై ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గతనెల 10న ఈ సంఘటన చోటు చేసుకుంది. గుండాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 4న మరణించాడు. మే 6: బీబీపేటకు చెందిన బోయిని నర్సయ్య(60) అనే రైతు తన పంటపొలం వద్దే దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు తలపై కర్రలతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హత్యకేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆస్తులు, డబ్బుల కోసం... ఆయా హత్య కేసులను పరిశీలిస్తే ఆస్తి, డబ్బు హత్యలకు ప్రధాన కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్‌లోని కంఠేశ్వర్‌లో జరిగిన జంట హత్యల వెనుక కారణం ఇదే. రూ. 2 వేలు, 2 సెల్ఫోన్లను దొంగిలించేందుకు స్నేహితులుగా వచ్చిన ఇద్దరు ఈ దారుణానికి తెగబడ్డారు. నాందేవ్వాడలో తమ్ముడిని అన్న హత్య చేయడానికి కూడా డబ్బే కారణం.. బస్వాపూర్ సమీపంలో జరిగిన తుడుం రాకేష్ హత్య ఉదాంతం వెనుక కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి. మద్నూర్ మండలం ఇలేగావ్లో మృతుడు గుండాజీపై జరిగిన దాడికి ఒక గుంట ఆస్తి మాత్రమే కారణం కావడం గమనార్హం. వివాహేతర సంబంధాలూ.. వివాహేతర సంబంధాలు కూడా హత్యలకు దారితీస్తున్నాయి. కొల్లూర్ గ్రామంలో జరిగిన నానుగొండ హత్య ఈ కారణంతోనే జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతోనే అతడి స్నేహితుడు నానుగొండను గొడ్డలితో నరికి చంపాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండు నెలల క్రితం భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో నివాసం ఉండే బ్యాంకు ఉద్యోగిని అరుణ హత్య కూడా వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగింది. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆమెను ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశాడు. పెరుగుతున్న నేర ప్రవృత్తి... నేరాలను నియంత్రించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాలలో వాటి ఫలితాలు ఆశించినంతగా కనిపించడం లేదు. పోలీసుశాఖ లెక్కల ప్రకారం నేరాల తగ్గుదలలో కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2016లో 30, 2017లో 23, 2018లో 21 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 10 మందికిపైగా హత్యకు గురయ్యారు. కారణాలు ఏవైనా జిల్లాలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. నేరాల నియంత్రణపై పోలీసుశాఖ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
స్నేహితులే.. ప్రాణం తీసిండ్రు!
అయిజ (అలంపూర్): స్నేహితుల మధ్య డబ్బు చిచ్చుపెట్టింది. చివరకు స్నేహితుడి ప్రాణాన్నే తీసేంత స్థాయికి దిగజార్చింది. స్నేహానికే కళంకం తెచ్చే ఈ ఘటన అయిజ మండలంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కేశవరం గ్రామంలో కురువ మల్లేష్(25) ట్రాక్టర్ నడుపుకుంటూ సొంతంగా పొలం పనులు చేసుకునేవాడు. వీరన్న, నరసింహులు, మల్లేష్ స్నేహితులు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. అయితే కుర్వ మల్లేష్ అతడి తండ్రి దస్తగిరి, భార్య సువర్ణకు తెలియకుండా వీరన్నకు గత ఏడాది రూ.70వేలు అప్పు ఇచ్చాడు. అయితే అప్పు తిరిగి చెల్లించాలని మల్లేష్ వీరన్నను కొన్ని రోజులనుంచి అడగడం మొదలు పెట్టాడు. పథకం ప్రకారం హతమార్చారు ఇదిలాఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గురువారం రాత్రి 9గంటలకు ముగ్గురు స్నేహితులు కలిసి బైక్‌పై మల్లేష్ పొలానికి చేరుకున్నారు. అక్కడే మద్యం సేవించారు. మల్లేష్ మద్యం మత్తులో ఉండగా.. వీరన్న, నరసింహులు అతని తలపై బండరాయితో మోదారు. అనంతరం బండిలో ఉన్న పెట్రోల్ తీసి మల్లేష్‌పై చల్లి నిప్పంటించారు. అప్పటికీ చనిపోయాడో లేదోనన్న అనుమానంతో కొంత దూరం లాక్కెళ్లి వేణిసోంపురంలోని మల్లన్న ఆలయం సమీపంలో గోతిలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజు నుంచి ఏమితెలియని వారిలానే మృతుడి తండ్రితో మాట్లాడుతూ.. ఎక్కడికో వెళ్లి ఉంటాడు, రేపో మాపో వస్తాడంటూ చెప్పినట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదుతో.. అనంతరం మల్లేష్ ఫోన్ నంబర్‌కు అతని తండ్రి దస్తగిరి, కుటుంబసభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మూడురోజులైనా కొడుకు ఇంటికి రాకపోడంతో తండ్రికి అనుమానం వచ్చి.. వీరన్న, నరసింహులుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం వీరన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. సంఘటన మొత్తం బయటకు వచ్చింది. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్, శాంతినగర్ సీఐ గురునాయుడు, అయిజ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, ప్రొబిషనరీ ఎస్ఐ మానస, తహసీల్దార్ కిషన్‌సింగ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. వైద్యులతో అదే స్థలంలోనే పోస్టుమార్టం చేయించి కేసునమోదు చేసుకున్నారు. నరసింహులు పరారీలో ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
శ్రావణి హత్య కేసులో విచారణ వేగవంతం
బొమ్మలరామారం (ఆలేరు) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సంచలనంగా మారిన మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి హత్య కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంత కొంత మంది యువత గంజాయి, కొకైన్లాంటి మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. మత్తు ప్రభావంతోనే నేరాలకు పాల్ప డుతున్నారనే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల అదుపులో.. అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రావణి కే సులో సైతం డ్రగ్స్‌కు బానిసైన యువత పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆదివారం మండల కేంద్రంలో ఇద్దరు, హాజీ పూర్ గ్రామంలో ఆరుగురు యువకులను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో మండలంలోని మల్యాల గ్రామ శివారులోని ఓ ఫాలీ హౌస్‌లోని ఆంధ్రా మహిళ అనుమానాస్పద మృతిపైనా పోలీ సులు దృష్టిసారించారు. ఈ కేసులో సైతం డగ్స్‌కు అలవాటు పడిన పలువురు యువకుల ప్రమేయం ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ కోణంలోనే పో లీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు మండల యువతకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతోందని అం తుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మీస్టరీగా మారిన ఈ హత్య కేసుల్లో నేరస్తులు ఎవరోనని మండల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల మరమ్మతులు దర్యాప్తులో కీలకంగా మారిన సీసీ కెమెరా పనితీ రు అధ్వానంగా మారడంతో పోలీసులకు ఈ హత్య కేసు విచారణ జటిలంగా మారింది. గతంలో మండలంలో 13 గ్రామాల్లో 61 కెమెరాలు ‡ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేయడడం లేదు. ఈ నేపథ్యంలో శ్రావణి హత్య కేసును ఛేదించడంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రావణిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలనేæ తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో ఆందోళనలు జరిగాయి. సీపీ మహేష్ భగవత్ సైతం మండలంలో సీసీ కెమెరాలను తక్షణమే మరమ్మతులు చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో మండలంలో గల సీసీ కెమెరాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. -
అన్నను చంపిన తమ్ముడు
అమరచింత (కొత్తకోట): ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన మండలంలోని కొంకన్వానిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొంకన్వానిపల్లి గ్రామానికి చెందిన గొల్ల చంద్రన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పెద్ద రాజు, చిన్నకుమారుడు చిన్న రాజు కలిసి వ్యవసాయ పనులతో పాటు గొర్ల మందను మేపేవారు. ఉమ్మడి కుటుంబంలో 200 పైచిలుకు గొర్రెల మందను పోషిస్తున్న ఇరువురు ఓ కాపరీని జీతానికి నియమించుకున్నారు. నెలసరి వేతనాలను చెల్లిస్తూ గొర్లను కాపాడుతూ వ్యవసాయ పనులను సాఫీగా కొనసాగిస్తూ వచ్చారు. గత రెండు నెలల క్రితం ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందను అన్నదమ్ములు ఇరువురు సమానంగా పంచుకున్నారు. దీంతో గొర్రెల కాపరికి చెల్లించా ల్సిన వేతనాన్ని అన్న ఇవ్వలేదని చిన్న రాజు తరచూ గొడవ పడేవాడు. హత్యకు దారితీసిన రూ.10వేలు ఇదిలాఉండగా, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తికి గొల్ల పెద్దరాజు ద్వారా రూ.10వేలు చెల్లించాల్సి ఉందని తమ్ముడు చిన్నరాజు తరచూ డబ్బుల విషయంలో తగువులాడేవాడు. దీంతో ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందలో ఎన్నో గొర్రెపిల్లలను అమ్ముకున్నావని అన్న చెప్పిన మాటలకు జీర్ణించుకోలేని చిన్నరాజు అన్నపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం నుంచి తిరిగివచ్చిన పెద్దరాజు తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడే ఇంటికి వచ్చిన చిన్నరాజు ఇంట్లోకి వెళ్లి నిద్రమత్తులో ఉన్న గొల్ల పెద్దరాజు తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చిన్నరాజు ‘నా అన్నను చంపేశా..’ అంటూ అరుస్తూ పరారైనట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఆత్మకూర్ సీఐ బండారి శంకర్, అమరచింత ఎస్ఐ రామస్వామి సంఘటన స్థలానికి చేరుకుని మృతుని బంధువులు, కుటుంబసభ్యుల ద్వారా వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గొల్ల పెద్దరాజుకు భార్య మంజులతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
తమ్ముళ్లే కడతేర్చారు!
మద్దూరు (కొడంగల్): ఒకే రక్తం పంచుకుని పుట్టిన తమ్ముల్లే.. చిన్నపాటి తగాదాలతో సొంత అన్నను బండరాయితో మోది హతమార్చారు. ఈ ఘటన మండలంలోని గోకుల్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త అంజయ్య(29) తండ్రి గోవిందు కొంతకాలం క్రితం మృతి చెందడంతో హైదరాబాద్‌లో కూలీ పనిచేసుకుంటూ తన ఇద్దరు తమ్ముళ్లు (కొత్త రాజు, కొత్త రమేష్)తోపాటు తల్లి తిరుమలమ్మ, భర్త వదిలేసిన అక్క అంజమ్మను పోషిస్తున్నాడు. పెద్ద తమ్ముడు కొత్త రాజు కూడా హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తుండేవాడు. గ్రామంలో తల్లి తిరుమలమ్మ, అక్క అంజమ్మ, చిన్న తమ్ముడు రమేష్ ఉండేవారు. మరో చెల్లెలు అనితను గ్రామంలోనే ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే తిమ్మారెడ్డిపల్లిలో బావాజీ జాతర జరుగుతుండడంతో గత నాలుగు రోజుల క్రితం కొత్త అంజయ్య గ్రామానికి వచ్చాడు. అలాగే ఒక తర్వాత తమ్ముడు కొత్త రాజు సైతం గ్రామానికి వచ్చాడు. కొంతకాలం క్రితం నిర్మించిన ఇంటిపై ఉన్న అప్పు విషయమై శనివారం రాత్రి కొత్త అంజయ్య కుటుంబ సభ్యులకు చెబుతూ పనిచేయాలని ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు, తల్లికి చెప్పాడు. ఇదే క్రమంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ఇద్దరు తమ్ముళ్లు రాజు, రామేష్‌లు బండరాయి తీసుకువచ్చి కొత్త అంజయ్య నెత్తిపై వేశారు. దీంతో అంజయ్య తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరో చెల్లెలు బసుల అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అంతుచూసిన అనుమానం
అనుమానం కత్తి దూసింది.. కట్టుకున్న భార్యనే కడతేర్చేందుకు తెగిం చింది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. గోపాలపట్నం సమీ పంలోని కొత్తపాలేనికి చెందిన పైడిరాజు పదేళ్లుగా కాపురం చేస్తున్న తన భార్య శారదపై అనుమానం పెం చుకున్నాడు.. పైగా తాగుడుకు బానిసై తరచూ వేధించేవాడు. వీటిని భరించలేని ఆమె తన ముగ్గురుపిల్లలతో ధర్మానగర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయి.. ఓ షాపింగ్ మాల్ పనిచేస్తూ జీవిస్తోంది. ఒకవైపుఅనుమానం.. మరో వైపు భార్య పుట్టింటికి వెళ్లిపోవడం పైడిరాజులో మరింత కక్ష పెం చాయి. కలిసి ఉందామని మాయమాటలు చెప్పి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రివేళ ఆమె నిద్రిస్తున్న సమయంలో దాడి చేసి పాశవికంగా కత్తితో మెడ ముందు, వెనుక భాగాల్లో పొడవడంతో శారద మరణించింది. ఆ వెంటనే నిందితుడు పోలీస్‌స్టేషన్‌కువెళ్లిలొంగిపోయాడు. ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆనందంగా జీవించాల్సిన పిల్లలను ఒక్కసారిగా అనాథులను చేసేసింది. గోపాలపట్నం ప్రాంతం కొత్తపాలెం పరిధి నాగేంద్రనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఓ భర్త భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య మెడను కర్కశంగా కత్తితో కోసి చంపేశాడు. గోపాలపట్నం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎద్దు పైడిరాజుతో మేనత్త కుమార్తె శారద(25)కు 10 ఏళ్ల క్రితం వివాహమయింది. పైడిరాజు స్థానికంగా తలయారీగా పని చేస్తున్నాడు. వీరి సంసారం సంతోషంగా సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, కుమార్తె. ఆనందంగా సాగుతున్న వీరి దాంపత్యంలో అనుమాన బీజం అశాంతిని రేపింది. తరచూ భార్యభర్తలు గొడవలు పడేవారు. పైడిరాజు తాగి వచ్చి తరచూ భార్యను కొట్టడం.. హింసించడం చేస్తుండేవాడు. ఆ బాధలు పడలేక శారద కొన్ని నెలల క్రితం కంచరపాలెం సమీప ధర్మానగర్‌లో తల్లి వద్దకు వెళ్లిపోయింది. తల్లికి భారం కాకూడదని నగరంలోని ఓ షాపింగ్ మాల్లో ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. రెండు రోజుల క్రితం నేను బాగా చూసుకుంటాను అని నమ్మబలి భర్త పైడిరాజు ఆమెను ఇంటికీ తీసుకుని వచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి నిద్రించే సమయంలో మంచంపై పడుకున్న శారదపై భర్త దాడి చేశాడు. మెడ వెనుకభాగంలో దాడికి యత్నించగా, గమనించి ఆమె తిరిగే సరికి మరో మారు దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమె చేతికి గాయాలయ్యాయి. రాక్షసుడి బలం ముందు ఆమె తాళలేకపోయింది. పైడిరాజు..శారద గొంతు వద్ద కత్తితో కిరాతకంగా కోయడంతో ఆమె మృత్యువాత పడింది. హత్య చేసిన అనంతరం పైడిరాజు గోపాలపట్నం పోలీసులకు లొంగిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి డీసీపీ నయీమ్ హస్మి, ఏసీపీ దేవ ప్రసాద్, సీఐ రమణయ్య, ఎస్ఐ రఘురామ్ వచ్చి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. పైడిరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాగుబోతు మాటలు నమ్మి వెళ్లిపోయింది..తనువు చాలించిందంటూ తల్లి భోరున విలపిస్తోంది. పిల్లల భవిష్యత్తు ఏమిటని వాపోయింది. ఇది చూసిన వారు కంటతడి పెట్టారు. నమ్మకంగా తీసుకొచ్చి.. భర్త మారాడు...చక్కగా చూసుకుంటాడు అని నమ్మకంతో శారద భర్తతో పాటు రెండు రోజుల క్రితం నాగేంద్రనగర్‌కు వచ్చింది. అయితే పైడిరాజు మాత్రం మనసులో ద్వేషాన్ని నింపుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అయాయకంగా నమ్మి వచ్చిన శారద ఒక రోజు మాత్రమే ఇక్కడ గడిపింది. రెండో రోజు అర్ధరాత్రి భర్త రాక్షసుడిగా మారి ఆమెను ప్రాణాలు తీసేశాడు. -
అంతం చూసిన వివాహేతర సంబంధం
బోనకల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని మోటమర్రి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ వేణు మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చిట్టుమోదు విష్ణు భార్యతో అదే గ్రామవాసి మరీదు ఉపేంద్ర(40) గత కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం విష్ణు పోలీస్ స్టేషన్లో తన భార్యను వేధిస్తున్నాడని ఉపేంద్రపై ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను బుద్ధిగా ఉంటానని చెప్పాడు. కానీ..యథావిధిగా అతను ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విష్ణు, ఉపేంద్ర వారి పొలాల వద్దకు వెళ్లారు. విష్ణు పొలంలో ఉండడాన్ని గమనించిన ఉపేంద్ర ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన విష్ణు ఇంటికి రాగా..అప్పటికే తన ఇంట్లో భార్యతో ఉపేంద్ర ఉండడాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కల్లు గీత కత్తితో ఉపేంద్ర మెడ, కణితిపై విష్ణు దాడి చేశాడు. ఈ సంఘటనలో అక్కడిక్కడే అతను మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. హత్య చేసిన తర్వాత ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కు విష్ణు తన భార్యతో కలిసి వెళ్లి లొంగిపోయాడు. సీఐ వేణు మాధవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా
కేసముద్రం: కడుపున పుట్టిన కొడుకే కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకే ఆస్తి కోసం తండ్రిపై దాడిచేసి హతమార్చిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె శివారు ముత్యాలమ్మ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మ తండాకు చెందిన భుక్యా మంగ్యా(53)–చంద్రమ్మ దంపతులకు కుమారుడు వీరన్న, మగ్గురు కుమార్తెలున్నారు. వారు తమకున్న 4ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నా రు. మంగ్యా ఇద్దరు కుమార్తెలతోపాటు, కొడుకు పెళ్లి చేశాడు. యేడాదిన్నర క్రితం చంద్రమ్మ అనారోగ్యంతో గురవడంతో చికిత్స చేయించా రు. ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల అప్పు తీసుకువచ్చారు. అనంతరం చంద్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్య ఖర్చు ల కోసం చేసిన రూ.7లక్షల అప్పును తీర్చడానికి భూమిని అమ్మాలంటూ తండ్రితో వీరన్న తరచు గొడవ పడుతున్నాడు. భూమిని అమ్మవద్దంటూ తండ్రి వాదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మళ్లీ భూమి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆగ్రహనికి గురైన కొడుకు తండ్రిపై దాడిచేయడానికి ప్రయత్నించా డు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్తుండగా నెట్టివేశాడు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిన మంగ్యా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందా డు. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కేకలు పెడుతూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగ్యాను లేపిచూడగా అప్పటికే మృతిచెంది నట్లు వారు గుర్తించారు. తాతయ్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని మనుమండ్లు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్సై సతీష్‌లు ఆదివారం పరీశీలించారు. మృతుడి తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వీరన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
కూతురు ముందే భార్య గొంతు కొసేశాడు
పర్లాకిమిడి: కన్న కూతురు ఎదుటే తన భార్య గొంతు కోసి ఓ ప్రబుద్ధుడు హత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడీ ఘటన గజపతి జిల్లాలోని ఆర్.ఉదయగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బోడోపద వద్ద శనివారం చోటు చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలే హత్యకు దారి తీశాయని స్థానిక సమాచారం. అయితే వారికి ఎనిమిదేళ్ల కూతురు ఉండడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.. మోహనా పోలీస్‌స్టేషన్ పరిధిలోని టంగిలిపొదర్ గ్రామానికి చెందిన సుభాష్ నాయక్ కొన్నాళ్ల క్రితం రున్నీతా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన మూడేళ్లకే వారిద్దరి మధ్య వచ్చిన కలహాల కారణంగా రున్నీతాను సుభాష్ పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుంచి తన కూతురితో రున్నీతా పిండికిలో ఉన్న తన పుట్టింటిలోనే నివాసముంటోంది. అయితే ఇటీవల తన కూతురును రెసిడెన్సియల్ స్కూల్లో జాయినింగ్ చేయాలనుకున్న రున్నీతా వాటికి సంబంధించిన ధ్రువపత్రాల కోసం తన భర్త సుభాష్‌కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో స్పందించిన సుభాష్ నాయక్ ఆ ధ్రువపత్రాలు ఇచ్చేందుకు అంగీకరించాడు. కూతురు జాయినింగ్ నిమిత్తం సుభాష్ నాయక్ దంపతులు తన కూతురితో శనివారం పిండికి నుంచి ఓ మోటారుసైకిల్‌పై ఆర్.ఉదయగిరికి చేరుకున్నాడు. ఆ మార్గమధ్యంలోని బడపద గ్రామం సమీపంలో మోటారుసైకిల్‌ను ఆపి, భార్య రున్నీతా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని రోడ్డు పక్కన ఉన్న ఓ కల్వర్టు కింద దాచిపెట్టి, తిరిగి కూతురుతో పిండికికి బయలుదేరాడు. హత్య విషయాన్ని కూతురు తన తాతకు తెలపగా, ఆమె తాత మోహనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై సంఘటనా స్థలానికి చేరుకున్న మోహనా పోలీసులు అక్కడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఆర్.ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అక్కడి నుంచి రున్నీతా మృతదేహాన్ని పర్లాకిమిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన ఆర్.ఉదయగిరి పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
హత్య చేసి శవంతో సెల్ఫీ దిగి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: గంజాయి మత్తులో యువకుడిని హత్య చేసి శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్‌లో పెట్టిన సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నై పరంగిమలై ఆదంబాక్కం పోలీసు స్టేషన్ వెనుకవైపు రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులు గంజాయి సేవించేందుకు అక్కడికి వెళ్లారు. కొద్ది సేపటికి బయటకు ఇద్దరు వ్యక్తులే వెళ్లడం స్థానికులు గమనించి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి, తనిఖీ చేయగా ఓ చోట మట్టి తవ్వి ఉండడాన్ని గమనించారు. ఆ మట్టిని తొలగించి చూడగా ఒక యువకుని శవం తీవ్ర గాయాలతో, ముఖం చిద్రమైన స్థితిలో ఉంది. శవాన్ని పంచనామా చేసి, విచారణ చేపట్టగా ఆ ముగ్గురు యువకుల్లోని ఒకడు కలైంజర్ నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అని గుర్తించారు. అతడు అజ్ఞాతంలోకి వెళ్లగా.. అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఆనంద్ గంజాయి మత్తులో ఒక యువకుడిని చంపి, అతని శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూపులో పెట్టాడని తెలిపారు. నిందితుడు ఆనంద్, అతడి పక్కనే ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నారాయణరెడ్డి హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
పత్తికొండ టౌన్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండకు వచ్చిన సీఎం చంద్రబాబు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో కేఈ శ్యాంబాబుకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హత్యకేసుతో టీడీపీ నాయకులకు సంబంధం లేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, కేఈ శ్యాంబాబు ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పసుపు–కుంకుమ ఇచ్చినందుకు ఆడపడుచులందరూ తమకే ఓట్లు వేయాలని అడుగుతున్న చంద్రబాబు, జిల్లాలో వందలాదిమంది మహిళల పసుపుకుంకుమలు పోవడానికి కారకులైన కోట్ల, కేఈ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణరెడ్డి హత్యకేసు నిందితులను పక్కనే పెట్టుకుని, నీతిమాటలు వల్లెవేయడం బాబుకే చెల్లిందన్నారు. అధికారం కోసం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
కొడుకు కాదు.. కర్కోటకుడు
మాలూరు: పెంచి పెద్ద చేసిన తండ్రిని పువ్వుల్లో పెట్టి చూసుకోవల్సిన తనయుడు కర్కోటకుడిగా మారాడు. మద్యం మత్తులో తండ్రిని సుత్తితో బాది దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన తాలూకాలోని బంటహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన రామచంద్రప్ప (70) నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. 3వ కుమారుడు మంజునాథ్ బెంగుళూరులోని మారతహళ్లిలలో షేవింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన మంజునాథ్ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి తండ్రితో గొడవపడేవాడు. బుధవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చి తండ్రిపై దాడి చేశాడు. అనంతరం వైర్‌తో గొంతును చుట్టి రొకలి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఉడాయించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విస్తృతంగా గాలింపు చేపట్టి 5 గంటలలోగానే నిందితుడు మంజునాథ్‌ను అరెస్టు చేశారు. -
నిజాలు నిగ్గు తేలుస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య గర్హనీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దారుణహత్య వెనుక ఉన్న వారెవరో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్‌ను నియమించామన్నారు. ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం రాత్రి మీడియాతో బాబు మాట్లాడుతూ వివేకా హత్యకు గురైతే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా చేయకుండా ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని చూస్తేనే అది హత్య అని తెలుస్తుంది కానీ ఆయన గుండెపోటుతో మృతి చెందారని మొదట చెప్పి తరువాత అనుమానాస్పద మృతి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. వివేకా పీఏ ఉదయం 5.30 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి తలపుకొట్టినా ఆయన తీయకపోవడం.. భార్యకు ఫోన్ చేశారనడం.. రాత్రి లేట్‌గా వచ్చి ఉంటారని ఆమె అనడం.. తరువాత పెరటి తలుపు తీసి ఉండటాన్ని చూడటం.. 6.45 గంటలకు అవినాష్ పోలీసులకు ఫోన్ చేయడం ఏమిటని చంద్రబాబు వరుసగా సందేహాలు లేవనెత్తారు. అవినాష్‌కు ఎవరు ఫోన్ చేశారు.. ఆయన ఎవరెవరికి ఫోన్ చేశారో చెప్పాలని చంద్రబాబు అన్నారు. మృతదేహాన్ని బాత్రూం నుంచి బెడ్ రూమ్‌లోకి ఎవరు మార్చారు.. రక్తపు మరకలు ఎవరు చెరిపేశారు.. పోలీసులు వచ్చే లోగా ఘటనా స్థలంలో సీన్ ఆఫ్ అఫెన్స్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వీటన్నింటికీ వైఎస్ కుటుంబ సభ్యులే జవాబు చెప్పాలని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సీబీఐ విచారణ కోసం గవర్నర్‌ను కలిస్తే ఆయన కూడా ఇవే ప్రశ్నలు వారిని అడగాలని చెప్పారు. -
విలక్షణ నాయకుడు వైఎస్ వివేకా
సాక్షి ప్రతినిధి కడప: పులివెందుల సమితి ప్రెసిడెంటు.. ఎమ్మెల్యే.. కడప ఎంపీ.. రాష్ట్ర మంత్రి.. ఏ పదవిలో ఉన్నా, హోదాలతో నిమిత్తం లేకుండా సామాన్యులను గౌరవించడం ఆయన స్వభావం. అత్యంత మృదుస్వభావి. తాను చెప్పాలనుకున్న విషయం సున్నితంగా, సూటిగా వివరించే తత్వం ఆయన స్వంతం. తన సోదరుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా చిరుద్యోగులను సైతం సార్... అంటూ గౌరవంగా సంబోధించే వ్యక్తిత్వం. ప్రాంతం కోసం, ప్రజల ఉన్నతికోసం అంతే పట్టుదలతో మొండిగా పట్టుబట్టే మనస్తత్వం కలిగిన నేత. ఇన్ని సుగుణాలు కలగలిసిన నాయకుడే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి. వైఎస్సార్ జిల్లాలో విలక్షణ నాయకుడు. ప్రాంత ఉన్నతికోసం ఏస్థాయిలో ఆరాటం ప్రదర్శిస్తారో, నమ్ముకున్న వారికోసం అంతే పట్టుదలతో అండగా నిలుస్తారు. ఎలాంటి అండ లేనివారు నిర్భయంగా ఆయన్ను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంటారు. వెంటనే తనదైన శైలిలో స్పందించి ఆపన్నులకు ఆయన అండగా నిలుస్తారు. ఈ సుగుణమే ఆయన్ను దార్శనికుడుగా నిలిపింది. జిల్లాలో ఎక్కడికెళ్లినా రాజకీయాలకు అతీతంగా ఆదరించేవారు అధికం. స్వతహాగా ప్రత్యర్థులను సైతం అభిమానించే స్వభావి. మాట ఇచ్చారంటే ఎంత కష్టమైనా వెనుతిరగని ధీరత్వం కలిగిన నాయకుడు. గురువారం సైతం మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల్లో పలువురు నాయకులతో మంతనాలు జరిపి పొద్దుపోయాక ఇంటికి చేరారు. తెల్లవారేసరికి విగతజీవిగా రక్తపుమడుగులో పడి ఉండడాన్ని కడప జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం ఆయన లక్షణం పులివెందుల సమితి ప్రెసిడెంటుగా 1981లో వైఎస్ వివేకానందరెడ్డి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. రాయలసీమ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. ఆపై తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించడంతో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను వివేకానందరెడ్డి తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 1989లో తొలిసారిగా పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 47,746 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1994లో మరోమారు పులివెందుల ఎమ్మెల్యేగా 71,563 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో, కడప పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ వివేకా పోటీ చేశారు. 26,597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2004లో మరోమారు కడప ఎంపీగా పోటీ చేసిన ఆయన 1,29,744 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిత్యం ప్రజాజీవితంలో ఉన్న ఆయన పదవులు, హోదాతో నిమిత్తం లేకుండా ప్రజాసేవకు అంకితమయ్యారు. ఎంత ఎదిగినా అత్యంత అణకువగా మెలగడం ఆయనకే స్వంతమైంది. తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ పోలీసు కానిస్టేబుల్‌ను సైతం.. సార్ అని సంబోధించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అభివృద్ధి సాధించడంలో ప్రత్యేక చొరవ... జిల్లా అభివృద్ధికోసం వైఎస్ వివేకానందరెడ్డి పరితపించేవారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలనే సంకల్పమున్న నాయకుడు కావడంతో.. నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన అనంతరం ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆయా పథకాలు సాధించేవారు. పులివెందుల గడ్డకు కృష్ణా జలాలు చేరుతున్నాయంటే అందులో ఆయన పాత్ర అత్యంత కీలకం. పైడిపాళెం రిజర్వాయర్ ఏర్పాటుకు తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో చర్చించి జీఎన్ఎస్ఎస్ పథకంలో ఆ ప్రాజెక్టును చేర్పించిన ఘనత ఆయనదే. పైడిపాళెం ప్రాజెక్టు పూర్తయ్యింది కాబట్టే నేడు పులివెందుల గడ్డపైకి కృష్ణా జలాలు చేరాయి. అంతేకాదు రైతులు చెల్లించిన ప్రీమియం మేరకు పంటల బీమా రాకపోతే.. ఎంపీగా ఆయన రైతులకోసం ప్రత్యక్ష ఆందోళన చేసిన ఘటనలెన్నో ఉన్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమంలో భాగంగా పులివెందులలో కొంతమంది బీఎస్ఎన్ఎల్ టవర్‌కు నిప్పుపెట్టారు. ఎంపీగా ఎంతో శ్రమకోర్చి పులివెందులలో బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్మిస్తే నిప్పుపెట్టారనే ఆవేదన ఆయన్ను వెంటాడింది. నిప్పుపెట్టిన వారిపై చర్యలు చేపట్టాలని ధర్నా చేపట్టారు. ప్రాంతం వృద్ధికి పరితపించే గుణమున్న నేపథ్యమే ఇలాంటి చర్యలకు ఉపక్రమించేలా చేసిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
కొడుకు కళ్లెదుటే తల్లి.. దారుణ హత్య
రామగుండం: పట్టణంలోని ముబారక్‌నగర్‌లో ఓ సైకో చేతిలో శుక్రవారం పట్టపగలు ఓ వృద్ధురాలు హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ముబారక్‌నగర్‌కు చెందిన సమ్మెట తిరుపతి క్షౌ రవృత్తిని నిర్వహిస్తుంటాడు. అదే కాలనీలో తన నివాసముండగా.. పక్కపక్కన రెండు గదులున్నాయి. అందులో ఒక గదిలో తిరుపతి కుటుంబసభ్యులతోపాటు మరో గదిలో తిరుపతి తల్లి సమ్మెట బాలమ్మ(65) నివాసముంటోంది. పక్కింట్లో ఉండే నగునూరి నరేష్(25) అనే యువకుడు ఏడాది క్రితం తిరుపతి కుటుంబసభ్యులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. నరేష్‌పై రామగుండం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై రాజ్‌కుమార్‌గౌడ్ సదరు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించి పంపించారు. కుటుంబసభ్యులు నరేష్‌ను మందలించి ప్రవర్తన మార్చుకోవాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటి నుంచి తిరుపతి కుటుంబసభ్యులపై కక్ష పెంచుకొని అదును కోసం చూస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాలమ్మ మంచంలో నిద్రించడం గమనించాడు. వృద్ధురాలి గదిలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలపై మోదాడు. శబ్దం రావడంతో తిరుపతి కుటుంబసభ్యులు అప్రమత్తమై వెళ్లి చూడగా.. వారి ముందే తలపై మరోసారి గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అక్కడకక్కడే మృతిచెందింది. అడ్డుకోబోయిన తిరుపతిపై సైతం దాడి చేసేందుకు యత్నించి పారిపోయాడు. సమ్మెట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బుద్ధె స్వామి, ఎస్సై పసుల దత్తాత్రి తెలిపారు. సందర్శించిన డీసీపీ ఘటన స్థలిని గోదావరిఖని డీసీపీ రక్షిత కె.మూర్తి సందర్శించారు. కుటుంబసభ్యులను వివరాలడిగి తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటామని, సైకోగా మారిన నగునూరి నరేష్‌ను పట్టుకొని చట్టపరమైన శిక్ష పడేందుకు చర్యలు చేపడతామని అన్నారు. -
ఆత్మరక్షణ కోసం భర్తను చంపిన భార్య
మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం కా చారంలో భూమల్ల నడ్పిమల్లయ్య(45)ను ఆయన భార్య భూమల్ల లక్ష్మి అలియాస్ మల్లవ్వ(40) గురువారం రాత్రి గొడ్డలితో నరికి చంపింది. స్థాని కులు, పోలీసుల కథనం ప్రకారం. దేశాయిపేటకు చెందిన భూమల్ల నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మి, కూతురు మౌనిక, కొడుకు ఉన్నారు. కాగా కూతురుకు ఇదే మండలంలోని మోత్కురావుపేటకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. 2016 జూలై 3న ఆషాఢ మాసం సందర్భంగా తన కూతురును అత్తవారింటి నుంచి దేశాయిపేటకు తీసుకొస్తున్నాడు. ఈక్రమంలో మార్గమధ్యలో అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన కూతురును చీరతోనే ఉరివేసి చంపాడు. ఆ సంఘటనలో నడ్పిమల్లయ్య జైలుశిక్ష అనుభవించాడు. బెయిల్‌పై విడుదలై ఇంటికొచ్చిన నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మితో తరచూ గొడవలు జరుగు తుండేవి. దీంతో తనను కూడా ఎక్కడ చంపుతాడోనని భయపడ్డ మల్లవ్వ తల్లిగారి ఊరైన కాచారానికి వచ్చి ఉంటోంది. కూలీ పనులు చేసుకొం టూ కొడుకుతో బతుకుతున్న మల్లవ్వ వద్దకు భర్త తరచూ వస్తూ చంపుతానని బెదిరిస్తూ ఉండేవాడ ని స్థానికుల ద్వారా తెలిసింది. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన నడ్పిమల్లయ్య తన భార్యను చంపేందుకు ప్రయత్నించగా.. రక్షించుకునే క్రమంలో మల్లవ్వ సమీపంలోనే ఉన్న గొ డ్డలితో మెడపై నరికింది. దీంతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
అనుమానంతో అంతం చేశాడు
మధిర: ఆలుమగల మధ్య అనుమానపు బీజం పడకూడదు. ఒక్కసారి పడిందంటే... మొలకెత్తుతుంది, మానువుగా మారుతుంది. అల్లకల్లోలం సృష్టిస్తుంది. అంతం చేస్తుంది. మధిర మండలం జిలుగుమాడ గ్రామంలో ఇదే జరిగింది. కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామస్తుడు కోట రాజుకు, జిలుగుమాడు గ్రామస్తురాలు వెంగళ రోజాతో 2010లో వివాహమైంది. పెళ్లి తరువాత రెండేళ్లపాటు గంపలగూడెంలోనే ఉన్నారు. ఆ తరువాత జిలుగుమాడు వచ్చారు. రోజా తల్లి వెంగళ వెంకటమ్మ ఇంట్లో ఉంటున్నారు. రాజు–రోజా దంపతులకు ఐదేళ్ల కూతురు ప్రవళిక ఉంది. పెళ్లయినప్పటి నుంచి రోజాను రాజు అనుమానిస్తున్నాడు. వారు తరచుగా గొడవ పడుతున్నారు. సుమారు పది రోజుల క్రితం, వెంకటమ్మ ఇంటి సమీపంలోనే మరో అద్దె ఇంటిలోకి ఆ దంపతులు మకాం మార్చారు. భోజనం మాత్రం వెంకటమ్మ ఇంట్లోనే చేస్తున్నారు. గురువారం రాత్రి కూడా భోజనానికి వచ్చారు. అక్కడ, ఎవరితోనో సెల్ ఫోన్లో రోజా మాట్లాడుతుండడాన్ని రాజు గమనించాడు. ఆమెను అనుమానించాడు. కోపంతో బయటకు వెళ్లాడు. వారి కుమార్తె ప్రవళిక మాత్రం అమ్మమ్మ వెంకటమ్మ ఇంట్లోనే నిద్రపోయింది. కొద్దిసేపటి తరువాత, రోజా తమ అద్దె ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఉదయాన్నే ప్రవళిక, తమ ఇంటికి వెళ్లింది. మంచంపై తల్లి పడుకుని ఉంది. తండ్రి కనిపించలేదు. తల్లిని ఎంత లేపినా లేవలేదు. ఏడ్చుకుంటూ అమ్మమ్మ వెంకటమ్మ వద్దకు వెళ్లి చెప్పింది. ఆమె రోజా వద్దకు పరుగున వెళ్లింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. స్పృహలో లేదు. ఇంతలో చుట్టపక్కల వారు వచ్చారు. ఆమెను పరిశీలించారు. ఊపి ఆడడం లేదు, గుండె కొట్టుకోవడం లేదు. ప్రాణం పోయినట్టుగా నిర్థారించారు. వెంకటమ్మ పెద్ద పెట్టున రోదించింది. ‘‘నా బిడ్డను అల్లుడు అనుమానించాడు. ఆమెతో గొడవపడి, గొంతు నులిమి, పదునైన ఆయుధంతో పొడిచి చంపి పరారయ్యాడు’’ అని, మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది. టౌన్ ఎస్ఐ చంద్రమోహన్ దర్యాప్తు చేస్తున్నారు. -
జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసుతో సంబంధం ఉన్న నగేష్, విశాల్ అనే ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జయరాం హత్యకేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులకు ఆరో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు ఆయనతో సంబంధాలున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. జయరాం హత్యకు ముందు 48 గంటలు, తర్వాత 48 గంటలు రాకేష్ రెడ్డితో టచ్‌లో ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితురాలు శ్రిఖా చౌదరీ స్టేట్మెంట్ను పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 60 మందిని పోలీసులు విచారించారు. శనివారం అనుమానం ఉన్న మరి కొద్ది మందిని కూడా విచారిస్తామని పోలీసులు వెల్లడించారు. జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..! నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్ -
జయరామ్ హత్యకేసు: వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు
-
అతడి ఇంట్లో శవాన్ని చూసి పారిపోయారు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఈ హత్యకేసుకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లకు చెందిన ఓ కౌన్సిలర్ భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంజిరెడ్డి, శ్రీను, రాములు అనే వ్యక్తులు రాకేష్‌రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాకేష్ రెడ్డి తనకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంజిరెడ్డి వెల్లడించాడు. రాకేష్ రెడ్డి.. జయరాంను హత్య చేసిన తర్వాత అంజిరెడ్డిని ఇంటికి పిలిపించాడని, రాకేష్ ఇంట్లో జయరాం మృతదేహాన్ని చూసిన అంజిరెడ్డి, అతని మిత్రులు అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసు విచారణలో తేలింది. హత్య జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కారణంగా అంజిరెడ్డి, అతని మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు. జయరాం హత్యకేసు ప్రధాన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టు మరోసారి 8 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పోలీసులు నిందితులను చంచల్ గూడ జైలునుంచి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించనున్నారు. -
ఎర్రగుంట్లలో వ్యక్తి దారుణహత్య
ఎర్రగుంట్ల : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని వేంపల్లి రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. పెసల శ్రీనివాసరెడ్డి(54) అనే వ్యక్తి గొంతుకు గుడ్డచుట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు...కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లి శ్రీనివాసరెడ్డి సొంతూరు. పట్టణంలోని వేంపల్లి రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో శ్రీనివాసరెడ్డి నివసిస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు లేరు. మద్యానికి అలవాడుపడిన శ్రీనివాసరెడ్డితో భార్య సుశీల ఐదేళ్ల క్రితం గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోర్డులో విడాకుల కేసు నడుస్తోంది. కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన సుబ్బమ్మ, శ్రీనివాసరెడ్డి ఇంటిలో పనిమనిషిగా చేస్తుంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఇంటిలో పనిచేయడానికి వచ్చింది. అప్పటికే ఇంటి గేటు తెరిచిఉండడంతో శ్రీనివాసరెడ్డిని పిలిచినా పలకలేదు. అయితే ఇంటిలోకి వెళ్లి చూడగా గొంతుకు టువాల్తో బిగించి ఉంది. అలాగే బీరువా తెరిచి ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. పనిమనిషి విషయాన్ని మద్యం తీసుకువచ్చే బ్రాందీషాపు కిరణ్‌కు ఫోన్ చేసి చెప్పింది. కిరణ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎర్రగుంట్ల సీఐలు వెంకటరమణ, కొండారెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలంలో ఆదారాలు సేకరించారు. పనిమనిషి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడినే మట్టుపెట్టిన మిత్రులు
సాక్షి, సిరిసిల్ల: స్నేహితుల మధ్య దొర్లిన మాటల తప్పిదానికి తమ మిత్రుడినే హత్యచేసిన ఐదుగురిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడకు చెందిన కవిరాజు, నాగరాజు, అజయ్, కృష్ణ, నాగేష్, సాయి స్నేహితులు. వీరిలో సాయి పది రోజుల కిందట తన మిత్రులతో సరదాగా చేసిన వ్యాఖ్యలు వారిలో ఆగ్రహాన్ని కలిగించాయి. వీరిలోని కవిరాజు తన మిత్రుడు సాయిపై పగ పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తనొక్కడే చంపడం వీలు కాదని మిగతా స్నేహితులు నాగరాజు, అజయ్, కృష్ణ అలియాస్ కిట్టు, నాగేష్‌లకు విషయం చెప్పాడు. వారంతా అందుకు ఒప్పుకున్నారు. అందరూ కలసి సంక్రాంతి పండగ రోజునే పూటుగా మద్యం తాగించి సాయిని మట్టుపెట్టాలని పథకం పన్నారు. ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు తమ స్నేహితుడు సాయిని పార్టీకి పిలిచి ఫుల్‌గా మద్యం తాగించారు. మరో ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉందని చెప్పి చింతల్‌ఠాణా – చీర్లవంచ గ్రామాల మధ్యలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకూ సాయిని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి కొట్టగా సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే కిట్టు తన షర్టు విప్పేసి సాయి మెడకు ఉరితాడులా బిగించి సాయి కొట్టుమిట్టాడుతుండగానే తమతో తెచ్చుకున్న బ్లేడుతో ఒకరితర్వాత ఒక్కరు గొంతు దగ్గర కిరాతకంగా కోసేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడినుంచి హైదరాబాద్‌కు పారిపోయారు. వెంట తీసుకెళ్లిన డబ్బులు ఖర్చు అయిపోగా వేములవాడ తిరుగుపయనంలో ఆదివారం ఉదయం టెక్స్టైల్ పార్కు వద్ద తాము పట్టుకున్నామని పోలీసులు వివరించారు. నిందితుల్లో ఒకరైన గౌరవేని నాగరాజుపై ఇప్పటికే పోక్సోతో సహా మూడు కేసులు ఉన్నాయని ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, తదితరులు ఉన్నారు. -
ప్రియుడితో కలసి మామను...
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ కోడలు తన ప్రియుడిని ఉసిగొల్పి తన మామను హత్య చేయించింది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 30న సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు(60)తన ఇంటికి ప్లాస్టింగ్ చేయించడానికి మేస్త్రీ కొరకు వెళ్లి మూడు రోజుల తర్వాత సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామ శివారులో శవమై కనిపించాడు. దీంతో ఈనెల 1న అతడి భార్య దేవమ్మ తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసుల పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయీ. మృతుడి పెద్దకొడుకు భాగయ్య సుమారుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి బొబ్బిలిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండడంతో అప్పుడప్పుడూ పెద్దగొల్ల మల్లేశం మల్లారెడ్డిపేట్ గ్రామానికి వస్తూ వెళ్తుండేవాడు ఈ క్రమంలో భాగయ్య భార్య నవీనతో మల్లేశంకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన మృతుడు రాములు, అతని భార్య దేవమ్మ పెద్దగొల్ల మల్లేశంను, కోడలు నవీనను పలుమార్లు వారించారు. దీంతో నవీన తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మామను చంపాలి, లేదంటే నేనే నీ పేరుమీద చనిపోతా అని మల్లేశంను ఫోనులో బెదిరించగా.. మల్లేశం నవీన మామ రాములును ఎలాగైనా చంపాలని పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా గతేడాది డిసెంబర్ 30న తన మామ మేస్త్రీ కొరకు మల్లారెడ్డిపేటలో తిరుగుతున్నాడని మల్లేశంకు చెప్పగా.. మేస్త్రీ గురించి తమ గ్రామానికి పోదామని తన మోటార్ సైకిల్‌పై బొబ్బిలిగామ గ్రామానికి తీసుకెళ్లాడు. అనంతరం మేస్త్రీ లేకపోవడంతో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి ఇద్దరు కలిసి కల్లు తాగారు. రాములు మత్తులోకి వెళ్లగా తనకు సాయం చేయాలని మొగులయ్య, చాంద్‌పాషా, దశరథ్‌గౌడ్, అంజయ్యలను కోరగా వారు నిరాకరించారు. దీంతో అదేరోజు రాత్రి ఇంటికి వెళ్దామని చెప్పి మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి బొబ్బిలిగామ నుంచి మల్లారెడ్డిపేట్ వెళ్లే రోడ్డుకు ఎడమ వైపు తీసుకెళ్లి ఇనుప కర్రతో రాములు తలపై, ఇతర శరీర భాగాలపై కోట్టి రుమాల్తో గొంతుకు బిగించి చంపివేసినట్లు నిందితుడు తెలిపాడని సీఐ పేర్కొన్నారు. చాంద్ పాషా మాత్రం పరారీలో ఉన్నాడు. సిబ్బందికి అభినందనలు.. ఈ కేసులో మొదటినుంచి కష్టపడి కేసు చేధించడానికి పూర్తిగా సహకరించిన సిబ్బంది ఏఎస్ఐ కిష్టయ్య, సిబ్బంది జగన్, వెంకటేశం, శ్రీనివాస్, రమేష్, వీరేశంలను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
భర్త దుబాయ్‌లో.. భార్య వివాహేతర సంబంధం
టెక్కలి రూరల్: వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్త దుబాయ్‌లో ఉండటంతో ప్రియుడిపై మోజు పడి తన సర్వాస్వాన్ని అర్పించిన వివాహిత పాలిట ఆ ప్రియుడే కాల యముడయ్యాడు. గ్రామం సమీపంలోని కొండల మధ్య పాశవికంగా ఆమెను కాల్చి బూడిద చేశాడు. దీంతో ఆమె ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిపోయారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ పరిధి బలరాంపురం గ్రామానికి చెందిన అన్నెపు కుశుమన్న, లక్ష్మి(34)లకు 15 ఏళ్ల క్రితం వివాహామైంది. వీరికి యోగానందరావు(13) పాప ధనలక్ష్మి(8) ఉన్నారు. తాపీ పని చేసే ఆమె భర్త.. కొద్ది నెలల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లారు. ఇదిలా ఉండగా... అదే గ్రామానికి చెందిన సంపతిరావు భాస్కర్‌రావుతో మృతురాలికి ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్త కూడా స్థానికంగా లేకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే... ఇటీవల నిందితుడి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో ఇరువురి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే భాస్కర్‌రావు.. లక్ష్మిని అంతమొందించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. బండరాళ్ల మధ్యలో.. మరోవైపు... తన సోదరి ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదని కోటబొమ్మాళి మండలం కమలనాథపురానికి చెందిన చింతాడ అప్పన్న 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో అదే గ్రామానికి చెందిన భాస్కర్‌రావు ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం లింగాలవలస పంచాయతీ పరిధిలోని కొండల సమీపంలో ఉన్న బండరాల మధ్య మనిషిని కాల్చిన విధంగా బూడిద కనిపించింది. ఘటనా స్థలం, గ్రామస్తుల నుంచి మరిన్ని వివరాలు సేకరించిన పోలీసులు, నిందితుడిని విచారించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా... నిందితుడు అధికార పార్టీకి చెందిన కార్యకర్త అని.. అందుకే చేసిన హత్యను ఒప్పుకున్నప్పటికీ పోలీసులు సాయంత్రం వరకు ఘటన స్థలానికి రాలేదని, కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఆ దాడి చేసింది మేమే: విజయ్
అభంగాపూర్ వాసి ఆశప్పపై వేటకొడవళ్లతో గురువారం రాత్రి జరిగిన దాడి సంచలనం రేకెత్తించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే గ్రామపంచాయతీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడంతో అటు గ్రామస్తులు.. ఇటు అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన చోటు చేసుకుంది. ఈ మేరకు ఆశప్ప హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అభంగాపూర్ గ్రామంలో మాత్రం శుక్రవారం నిశ్శబ్దం అలుముకుంది. గ్రామం జన సంచారం లేక బోసిపోగా పలువురి ఇళ్లకు తాళాలు పడ్డాయి. ఇక పోలీసులు భారీగా గ్రామంలో మొహరించి ఎలాంటి ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. మహబూబ్‌నగర్ క్రైం: మహబూ బ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అ భంగపూర్ గ్రామంలో భూ‘పంచాయితీ’, పాత ‘పగ’ సాధింపు చర్యలు 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు ఎప్పుడు చూసినా ఆదిపత్య పోరే కనిపిస్తుంది. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులతో తరచూ ఏదోఒక సం ఘటన చోటుచేసుకుంటూనే ఉంటుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రరజలు భయాందోళనతోనే కాలం గడుపుతుంటారు. మొదటినుంచీ అదే పంచాయితీ! గ్రామంలోని చెన్నప్ప, ఆశప్ప కుటుంబీకుల్లో మొదటినుంచీ పంచాయితీలు నడుస్తూనే ఉన్నాయి. భూ తగదాలతోనే 1999 నుంచి ఆదిపత్య పోరు కొనసాగుతున్నాయి. భూముల విషయంలోనే ఆశప్ప అనుచరులు చెన్నప్ప ఇంటిపై అప్పట్లో బాంబుల దాడికి పాల్పడ్డారని స్థానికులు చెబుతారు. అందులో భాగంగానే కోయిల్‌కొండ మండల సమీపంలో బస్సులో వస్తున్న చెన్నప్ప కుటుంబసభ్యులను కొందరిని అప్పట్లో హతమార్చారని ప్రచారం జరిగింది. అలాగే కోర్టుకు వస్తున్న చెన్నప్ప కుటుంబసభ్యులను అప్పక్‌పల్లి, అమ్మిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో హత్యచేశారనే ఆరోపణల నేపథ్యంలో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల్లో ఆశప్ప పాత్ర ఉన్నట్లు అప్పట్లో పోలీసు కేసులు నమోదు చేశారు. కానీ వాటికి సరైన సాక్ష్యాధారాలు లేక కోర్టులో కేసులు వీగిపోయినట్లు తెలిసింది. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆశప్ప మరికల్ దగ్గర జరిగిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆశప్పను బుధవారం రాత్రి చికిత్స కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ జీవన్ ఆధ్వర్యంలో వైద్యం అందించగా రక్తం అధికంగా పోవడంతో పాటు న్యూరోసర్జరీ అత్యవసరం కావడంతో రాత్రి 11గంటలకు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అయితే ప్రస్తుతం ఆశప్ప నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామం నిర్మానుష్యం ఆశప్పపై దాడి జరిగిన సంఘటనతో బుధవారం రాత్రి నుంచి అభంగపూర్ గ్రామం నిర్మాణుషంగా మారింది. ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, 40 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్ విధించారు. గ్రామంలో జనసంచారం లేకుండా పోయింది. కొంత మంది భయభ్రాంతులకు గురై ఇళ్లకు తాళాలు వేసి వారి పక్క గ్రామాల్లోని బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లిపోయారు. దాడిచేసింది మేమే : విజయ్ అభంగపూర్ ఆశప్పపై దాడి చేసిన సంఘటనలో తన హస్తమే ఉందని ఆ గ్రామానికి చెందిన చెన్నప్ప కుటుంబసభ్యుడు విజయ్ ఓ ప్రైవేట్ చానల్ ముందుకు వచ్చి వెల్లడించాడు. 20 ఏళ్ల క్రితం మా ఇంటిపై ఆశప్ప వర్గీయులు భూ వ్యవహరంలో బాంబుల దాడికి పాల్పడ్డారని, 2001లో కోయిలకొండ మండలం వింజమూర్ గ్రామ సమీపంలో బస్సులో మా ఇద్దరి కుటుంబసభ్యులపై దాడి చేసి హత్య చేశారని, 2004 అప్పక్‌పల్లిలో మరో ఇద్దరి కుటుంబసభ్యులను హత్య చేయించాడని చెప్పారు. వాటిని జీర్ణించుకోకనే నేను క్రిమినల్‌గా మారాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి నుంచి ఆశప్పపై కసి పెంచుకొని పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, అలియాస్ సూరి వద్ద అనుచరుడిగా చేరానని తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులు పోటీచేస్తున్నారని, ఎవరూ నిలబడొద్దంటూ గ్రామంలో పలువురిని బెదిరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరికల్ సమీపంలో ఆశప్ప తమకు కనబడటంతో హతమర్చేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. త్వరలోనే నారాయణపేట డీఎస్పీ, మరికల్ సీఐల ముందు లొంగిపోతానని చెప్పడంతో పోలీసులు ఊపిరిపిల్చుకున్నారు. -
భూ వివాదం యువకుడు దారుణ హత్య
చందుర్తి(వేములవాడ): పాతకక్షలు యువకుడి ప్రాణం తీశాయి. పెద్దల మధ్య ఉన్న భూ వివాదంలో తలదూర్చిన పిల్లలు శత్రువులుగా మారారు. తరుచూ గొడవపడుతూ పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడ్ని తన ప్రత్యర్థి మాటువేసి వేటకొడవళ్లతో నరికి చంపాడు. ఆపై మృతదేహాన్ని అక్కడే ఉన్న వ్యవసాయబావిలో పడేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపూర్‌లో మంగళవారం చోటు చేసుకోగా... బుధవారం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మెరుపుల హరీశ్(25) ఇంటర్మీడియెట్ మధ్యలో మానేశాడు. తండ్రికి చేదోడు.. వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. మంగళవారం వ్యవసాయపొలం వద్దకు వెళ్లాడు. పశువులకు నీళ్లందించి బుచ్చయ్య అనే వ్యక్తితో తన స్కూటీపై తిరిగివస్తున్నాడు. గ్రామ చెరువు మత్తడి వద్ద మాటు వేసిఉన్న ఇదే గ్రామానికి చెందిన నేరెల్ల రమేశ్, నేవూరి బాబు స్కూటీకి అడ్డం తిరిగారు. తమవద్ద ఉన్న వేటకొడవళ్లతో హరీశ్ తలపై విచక్షణారహితంగా నరికారు. బుచ్చయ్య భయంతో అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన హరీశ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎవరూ గుర్తించొద్దని మృతదేహంతో పాటు స్కూటీని పక్కనే ఉన్న బావిలో పడేశారు. కొడుకు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విషయం తెలిసిన పోలీసులు, హరీశ్ తల్లిదండ్రులు బావివద్దకు చేరుకున్నారు. అప్పటికే రాత్రి అవడంలో వేకువజామున వరకు మోటార్ల సాయంతో నీటినితోడి బధవారం మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహంతో ఆందోళన.. హరీశ్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యా రు. శవాన్ని మంచంపై ఉంచి నిందితుడు నేరేళ్ల రమేశ్ ఇంటికి తీసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా... దాడిచేసేందుకు కూడా వెనకాడలేదు. పోలీసులు వెనక్కి తగ్గడంతో హరీశ్ మృతదేహాన్ని రమేశ్ ఇంట్లో ఉంచారు. అక్కడే దహనసంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ధాన్యం, రసాయన ఎరువులు, ఇంటిని ధ్వంసం చేశారు. పరిస్థితి విషమించడంతో చందుర్తి సీఐ విజయ్‌కుమార్, రుద్రంగి, కోనరావుపేట , వేములవాడ రూరల్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేశ్, శివకేశువులతో పాటు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని ఇక్కడే దహనం చేస్తామని చెప్పడంతో డీఎస్పీ సముదాయించారు. నిందితులకు కఠిన శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం హరీశ్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రధాననాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకు బందోబస్తు నిర్వహించారు. భూ వివాదమే కారణమా...? హరీశ్ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. హరీశ్, రమేశ్ వ్యవసాయపొలాలు పక్కపక్కనే ఉంటాయి. హద్దుల విషయంలో ఇరువురి తండ్రులకు ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవి పిల్లల వరకువెళ్లాయి. రమేశ్, హరీశ్ తరుచూ గొడవ పడేవారు. దసరానాడు కూడా ఇద్దరూ పరస్పద దాడులకు దిగారు. ఇటీవల సైతం తలెత్తిన గ్రూపు గొడవల నేపథ్యంలో రమేశ్ హరీశ్‌ను మట్టుబెట్టాలని చూశాడు. అదునుచూసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
మామ అడ్డుపడుతున్నాడని.. ప్రియుడితో కలసి...
బాన్సువాడ: వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి తన భర్త తండ్రి(మామ)ను హతమార్చిన కోడలు కథనం ఇది. భర్త అమాయకుడు కావడంతో పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ, మామ అడ్డుకున్నాడు. దీంతో అర్ధరాత్రి ప్రియుడి ని పురమాయించి మామను చంపేందుకు పన్నా గం వేసింది. ఈ ఘటన ఈనెల 22న బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర్కూర్ గంగారాం(60) అనే వృద్ధుడి హత్యకు సంబంధించిన వివరాలను గురువారం డీఎస్పీ యాదగిరి వెల్లడించారు. చిన్నరాంపూర్‌లో నివసించే బీర్కూర్ విఠల్‌కు, కొన్నేళ్ల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. అయితే విఠల్ అమాయకుడు కావడంతో లావణ్య, తన పక్కింట్లో ఉండే దుర్యోధన పృథ్విరాజ్ అలియాస్ రాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. వీరిద్దరి వ్యవహారం తన మామ అయిన గంగారాంకు తెలియడంతో అనేక సార్లు అతను ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అడ్డుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని లావణ్య, తన మామ అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. గంగారాం 10 రోజుల క్రితమే రాంపూర్ రోడ్డుపై కుంట్లమోరీ వంతెన నిర్మాణపు పనుల్లో వాచ్‌మెన్‌గా చేరి అక్కడే రాత్రివేళల్లో డ్యూటీ చేస్తుకుంటున్నాడు. లావణ్య అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో తన సెల్‌ఫోన్ ద్వారా ప్రియుడు రాజు కు మెసెజ్ పంపి, తన మామను హతమార్చాలంటూ పురమాయించింది. దీంతో రాజు కత్తిని తీసుకొని, గ్రామ శివారులో ఉన్న వంతెన వద్దకు చేరుకొని, టిప్పర్‌లో నిద్రిస్తున్న గంగారాంపై దా డి చేశాడు. నిద్రమత్తులో ఉన్న గంగారాం అతడిని పసిగట్టి, ప్రతిఘటించినా ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు. మెడపై కత్తితో దాడి చేయడంతో చివరకు ప్రాణాలు వదిలాడు. హత్య జరిగిన తెల్లా రి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. నిందితుడి వద్ద ఉన్న చైన్‌ను పసి గట్టి, ఆ చైన్ ఆధారంగా, ఫోన్ కాల్స్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. లావణ్యకు ఇద్దరు పిల్లలు ఉండగా, అతడి ప్రియుడైన రాజుకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధం కారణంగా వీరి కుటుంబాలు వీధినపడ్డాయి. బాన్సువాడ ఎస్హెచ్ఓ మహేష్‌గౌడ్, ఎస్ఐలు సాయన్న, సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
కమలాపూర్(హుజూరాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు రావడమే కాకుండా ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్తూ పరువు తీస్తున్నాడన్న కక్షతోనే కమలాపూర్‌కు చెందిన బైరి విజయ్‌కుమార్ అనే యువకుడు దుస్తులు వ్యాపారి బైరి రాజనర్సును బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాజీపేట ఏసీపీ కె.నర్సింగ్‌రావు తెలిపారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కమలాపూర్‌లో సెల్ షాపు నడుకునే విజయ్‌కుమార్ గత కొంత కాలంగా కమలాపూర్‌కే చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం రాజనర్సు వారిద్దరు కలిసి ఉండగా చూసి విషయాన్ని విజయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విషయం కాస్తా బయటకు పొక్కింది. దీంతో విజయ్‌కుమార్ రాజనర్సు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజనర్సు సదరు మహిళను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో రాజనర్సును కొట్టాలని, అవసరమైతే హత మార్చాలని విజయ్‌కుమార్ నిర్ణయించుకున్నాడు. అప్పటికే రాజనర్సు విజయ్‌కుమార్‌కు కొంత మొత్తం డబ్బులు బాకీ ఉండగా ఆ డబ్బులు ఇవ్వాలని ఈ నెల 18న రాత్రి ఫోన్ చేయగా 8 గంటల ప్రాంతంలో రాజనర్సు వచ్చి విజయ్‌కుమార్‌కు రూ.120, ఆ పక్కనే ఉన్న మరో దుకాణాదారుడికి కొన్ని డబ్బులు ఇచ్చి పోతున్న క్రమంలో అతన్ని విజయ్‌కుమార్ పిలిచి తనకు మందు తాగించాలని కోరడంతో రాజనర్సు సరేనన్నాడు. చెరువు కట్టపై నుంచి రాజనర్సును ద్విచక్ర వాహనం ఎక్కించుకుని పెద్ద తూము వద్దకు వెళ్లారు. చెరువు తూములో కూర్చుని మందు సేవిస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ప్రస్తావ వచ్చింది. దీంతో తీవ్ర వాగ్వాదం చేసుకుంటూ చెరువుకట్టపైకి వచ్చారు. కోపంతో ఉన్న విజయ్‌కుమార్ అక్కడే ఉన్న ఓ బండరాయితో కొట్టగా రాజనర్సు తల వెనుక భాగంలో తగిలి కింద పడిపోయాడు. ఆ తర్వాత అదే బండరాయితో నుదుటి పైభాగంలో బలంగా మోది చంపాడు. అనంతరం శవాన్ని చెరువు కట్టపై నుంచి ఈడ్చుకెళ్లి పెద్దతూముపై ఉంచాడు. ఈ హత్యకు సంబంధించి ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరుకనప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి ఒక ఫోన్ కాల్ డాటా ఆధారంగా నిందితుడిని గుర్తించామని వివరించారు. అతడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్యా ఘటనలో నిందితుడిని చాకచక్యంగా గుర్తించి, పట్టుకున్న స్థానిక ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, సహకరించిన ఎస్సైలు సూర్యప్రకాష్, టీవీఆర్ సూరి, పోలీసు సిబ్బందిని సీపీ రవీందర్, ఏసీపీ అభినందించారు. -
పగబట్టి ప్రాణం తీశారు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మిస్టరీ వీడింది.. పాత కక్షలే ప్రాణం తీశాయని వెల్లడయింది..తండ్రి సత్తిరెడ్డి హత్యకు ప్రతీకారంగా కొడుకు మహిపాల్‌రెడ్డి పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామానికి చెందిన సల్లారపు సత్తిరెడ్డి, సల్లారపు రాంరెడ్డి కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో జూన్ 16న ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా..సత్తిరెడ్డిని రాంరెడ్డి కర్రతో దాడిచేసి హత్యచేశాడు. పోలీసులు నిందితుడు రాంరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపగా..బెయిల్ విడుదలయ్యాడు. ఈక్రమంలో రాంరెడ్డిని మట్టుబెట్టేందుకు సత్తిరెడ్డి కొడుకు మహిపాల్‌రెడ్డి, అతడి బావ ముత్తంగి తిరుపతిరెడ్డి, అల్లుడు మధుసూదన్‌రెడ్డితో పక్కా ప్రణాళిక రచించి రాంరెడ్డి కదలికలపై నిఘా పెట్టారు. విషయం పసిగట్టని రాంరెడ్డి ఈనెల 23న బస్వాపూర్ గ్రామంలో తన బంధువుల ఇంట్లో జరిగిన గృహప్రవేశానికి హాజరై..హరీశ్ అనే యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా..ఇదే అదునుగా భావించిన మహిపాల్‌రెడ్డి బస్వాపూర్, నేరెళ్ల గ్రామాల మధ్య నిర్మాణుష్య ప్రదేశంలో తన హ్యూందయ్ కారుతో రాంరెడ్డి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో రాంరెడ్డి, హరీశ్ రోడ్డు పక్కన గుంతలో పడిపోయారు. కారులోంచి దిగిన మధుసూదన్‌రెడ్డి కర్రతో రాంరెడ్డి తలపై కొట్టగా..మహిపాల్ గొడ్డలితో నరికాడు. దీంతో రాంరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. తనను కూడా చంపుతారేమోననే భయంతో హరీశ్ పరుగులు పెట్టి రోడ్డుపక్కన కల్వర్టులో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. రాంరెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్న నిందితులు మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్ పారిపోగా..తిరుపతిరెడ్డి వేములవాడకు వెళ్లిపోయాడు. మూడు స్పెషల్ టీమ్‌లుగా గాలిస్తున్న పోలీసులకు ముగ్గురు నిందితులు కారులో సిరిసిల్ల వైపు వస్తుండగా చాకచక్యంగా జిల్లెల్ల చెక్ పోస్టు వద్ద రూరల్ సీఐ అనిల్‌కుమార్ అరెస్టు చేశారు. పోలీసులు విచారించగా లొంగిపోయేందుకే సిరిసిల్లకు వస్తున్నట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి హ్యూందయ్ కారు, ద్విచక్రవాహనం, హత్యకు వాడిన గొడ్డలి, కర్రలు, నాలుగు సెల్ ఫోన్లు, రక్తపు మరకలు కలిగిన దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించి పూర్తి ఆధారాలతో నిందితులను అరెస్టు చేసిన సీసి అనిల్‌కుమార్, తంగళ్లపల్లి ఎస్సై వెంకటకృష్ణ, ముస్తాబాద్ ఎస్సై రాజశేఖర్, ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రవీణ్‌ను డీఎస్పీ అభినందించారు. -
‘‘లారీ మూతోడా’’ అన్నాడని.. దారుణం
పటాన్చెరు టౌన్ : లారీ మూతోడా అని వెక్కిరించినందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం పటాన్చెరు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేశ్వర్ రావు, సీఐ నరేశ్, క్రైం సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన మాచిరెడ్డి గోపాల్‌రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న ఇంట్లో నుంచి దుర్గమాత శోభయాత్ర చూసి వస్తా అని చెప్పి వెళ్లిన గోపాల్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు రుద్రారం గ్రామ శివారులో తోషిభా కంపెనీకి వెళ్లే దారిలో హత్యచేసిన విషయం తెలిసిందే. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు మాచిరెడ్డి గోపాల్‌రెడ్డిని హత్యచేసిన వ్యక్తి రేజింతల నాగరాజుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా మృతుడు గోపాల్‌రెడ్డి తరుచూ నాగరాజును లారీ మూతోడా అని వెక్కిరించేవాడని, దీంతో పాటు వీరు ఇద్దరు 10 సంవత్సరాల క్రితం వీ.బీ.సీ కంపెనీలో పని చేసే సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. ఇవి మనసులో పెట్టుకున్న నాగరాజు గోపాల్‌రెడ్డిని పథకం ప్రకారం కూల్‌డ్రింక్ తాగిపిస్తాని చెప్పి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. అనంతరం చేతితో బలంగా గాయపరిచి, పక్కనే ఉన్న రాయిని గోపాల్‌రెడ్డి తలపై వేయడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అనంతరం నాగరాజు గోపాల్‌రెడ్డి సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 2012లో నాగరాజు మరో వ్యక్తితో కలిసి ఓ హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారం రేజింతల నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. -
తల్లీకొడుకు కలిసి చంపేశారు
తిరుమలాయపాలెం: ఏడు కుంటల భూమి కోసం కట్టుకున్న భర్తను కుమారుడితో గొడ్డలితో నరికి చంపేసింది. మండలంలోని బీరోలు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... బీరోలుకు చెందిన బుడిగె సీతారాములు(65)కు భార్య సోమలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో సోమలక్ష్మి మృతిచెందింది. అప్పుడే సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ వివాహితులు. సత్యవతి, కొన్నేళ్ల క్రితం తన భర్తను వదిలేసి ఖమ్మంలో ఉంటోంది. రెండేళ్ల నుంచి కుమారుడు శ్రీధర్, కోడలితో కలిసి భర్త సీతారాములు ఇంట్లోనే ఓ గదిలో ఉంటోంది. సీతారాములుకు 15 కుంటల భూమి ఉంది. అందులో వాటా కోసం గొడవలు జరిగాయి. ఏడు కుంటల భూమిని సత్యవతి పేరిట స్టాంప్ పేపర్‌పై సీతారాములు రాసిచ్చాడు. భూమి పట్టా మాత్రం సీతారాములు పేరిటనే ఉంది. తన పేరున పట్టా చేయించాలని ఆమె పట్టుబట్టింది. దీనికి అతడు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అతడి ఆలనాపాలనను వారు పట్టించుకోవడం లేదు. దీంతో, అతడు గ్రామంలోనే భిక్షాటన చేసుకుంటున్నాడు. పగ పెంచుకున్న సత్యవతి, తన కుమారుడు శ్రీధర్‌తో కలిసి శుక్రవారం అర్థరాత్రి సీతారాములును గొడ్డలితో నరికి చంపింది. శనివారం తెల్లవారుజామున ఇది వెలుగు చూసింది. మృతదేహాన్ని ఎస్ఐ సర్వయ్య, ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజి రమేష్, కూసుమంచి సీఐ ఓం మురళి పరిశీలించారు. నిందితులైన సత్యవతిని, శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. కేసును కూసుమంచి సీఐ ఓం మురళి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య తల నరికి.. స్టేషన్‌కు తీసుకెళ్లి..
అనుమానం వెంటాడింది. పెనుభూతమై ప్రాణాలను హరించింది. గల్ఫ్ దేశాలకు వెళ్లి సంపాదించిన సొమ్ముతో భార్య విలాసాలకు పాల్పడుతూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. మంగళవారం సాయంత్రం ప్రియుడుతో కలిసి బైకుపై వస్తున్న భార్య రాణి(35)ని భర్త వెంకటరమణ వెంటాడి తల నరికాడు. నరికిన భార్య తలతో నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన సమయంలో బైకుపై వెళుతున్న ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లాలో ఈ సంఘటన మంగళవారం సాయంత్రం సంచలనం సృష్టించింది. – రాయచోటి/ సంబేపల్లె వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం వడ్డెపల్లె సమీపంలో పుసుపులేటి వెంకటరమణ(40) అదే గ్రామానికి చెందిన రాణి(35)తో 1999లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొద్ది నెలల కిందటే చనిపోయాడు. కుటుంబ పోషణ నిమిత్తం వెంకటరమణ గల్ఫ్ దేశాలకు వెళ్లి 10 లక్షల రూపాయలకు పైగా సంపాదించి భార్య పేరున పంపాడు. పంపిన డబ్బుతో రాయచోటిలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇలా కలిసి ప్రయాణం సాగిన వీరి కుటుంబంలో ప్రియుడి రూపంలో భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీసింది. గల్ఫ్ దేశం నుంచి కొన్ని నెలల కిందట ఇంటికి వచ్చిన వెంకటరమణ తరుచూ భార్యతో గొడవ పడేవాడు. నెల రోజుల కిందట భార్య రాణి, ప్రియుడిపైన సంబేపల్లె పోలీసుస్టేషన్లో వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. పోలీసులు 497 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య రాణి రాయచోటిలో కొనుగోలు చేసిన ఇంటి జాగా ను విక్రయించేందుకు ప్రయత్నించడంతో పాటు వెంకటరమణ వద్ద ఉన్న జాగా పట్టా కాగితాలను ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్య వివాహేతర సంబంధంతో పాటు గల్ఫ్ నుంచి పంపిన డబ్బులను విలాసాల పేరుతో తగలెట్టిందన్న ఆగ్రహంతో వెంకటరమణ భార్యను నరికి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వెంబడించి కొడవలితో నరికి.. కొద్ది రోజులుగా భార్య మరొకరితో కలిసి తిరుగుతోందన్న ఆవేశంతో ఎలాగైనా చంపాలన్న నిర్ణయానికి వెంకటమణ వచ్చాడు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం రాయచోటిలోని ఎస్.ఎన్.కాలనీ చెక్‌పోస్టు వద్ద నుంచి బైకుపై ప్రియుడుతో కలిసి రాణి గ్రామానికి బయలు దేరింది. వారిని వెంబడించుకుంటూ వచ్చిన వెంకటరమణ గ్రామ సమీపంలోని సమాధుల వద్దకు రాగానే కొడవలితో దాడి చేశాడు. వెనుకవైపు కూర్చొన్న రాణిని కొడవలితో మెడపై నరకి వేరుచేశాడు. సంఘటనను చూసిన ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. నరికిన తలతో వెంకటరమణ నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిర్ఘాంతపోయిన గ్రామస్తులు వెంకటరమణ తన భార్య రాణిని కొడవలితో తల నరికివేశాడన్న సంఘటనతో దుద్యాల గ్రామం వడ్డెపల్లె ప్రజలు ఒక్కమారుగా నిర్ఘాంతపోయారు. భార్యపై ఉన్న అనుమానంతో పాటు రాయచోటిలోని స్థల విషయంపై భార్య భర్తల మధ్య కొంత కాలంగా గొడవలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటరమణ ఇంత అఘాయిత్యానికి తెగబడతాడని ఊహించలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు... వెంకటరమణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోనె సంచిలో తెచ్చిన తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై రూరల్ సీఐ నరసింహారాజు, ఎస్ఐ సాయిదాశంలు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే...
వలిగొండ(భువనగిరి) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత మామనే ప్రియుడు, తమ్ముడితో కలిసి కోడలు హత్య చేయించింది. హత్యలో పాలుపంచుకున్న ముగ్గురు నిందితుల ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వలి గొండ మండలం నెమిలెకాల్వలో గత నెల 10న జరిగిన గడ్డం ముత్యాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను చౌటుప్పల్ ఏసీపీ బాపురెడ్డి వెల్లడించారు. గ్రామానికి చెందిన గడ్డం ముత్యాలు కుమారుడు రమేశ్. ఇతని భార్య సంతోష. ఉపాధి హామీ పథకంలో కూలి పనికి వెళ్లేది. ఇదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం శ్రీమన్నారాయణతో సంతోషకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన సంతోష మామ గడ్డం ముత్యాలు కోడలిని మందలించాడు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టాడు. సంతోష ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెను తల్లి గారింటింకి పంపించారు. పోయిన నెలలో గ్రామదేవతల పండగ ఉండడంతో రమేశ్ భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న మామను అంతమొందించాలని పథకం వేసింది. గత నెల 10న ముత్యాలు సైకిల్‌పై సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. ఈ సమాచారాన్ని ప్రియుడు శ్రీమన్నారాయణ, చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సొంత తమ్ముడు నీల వెంకటేశానికి చేరవేసింది. వీరిద్దరు కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి ముత్యాలుపై దాడి చేసి హత్య చేశారు. పొలం వద్దకు వెళ్లి రాత్రి అయిన ముత్యాలు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లగా విగతజీవిగా కనిపించాడు. ఆ రోజున ముత్యాలు రెండో కుమారుడు శేఖర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ ఇద్రిస్‌అలీ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు విచారణ ప్రారంభించి కేసును చేధించారు. హత్యకు కారణమైన సంతోషతోపాటు శ్రీమన్నారాయణ, వెంకటేశంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఇద్రిస్ అలీ ఉన్నారు. -
వివాహేతర సంబంధం..యువకుడి దారుణ హత్య
జోగిపేట(అందోల్): వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన జోగిపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య(23)ను హత్య చేసి జోగిపేటలోని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుక భాగంలోని ముళ్లపొదల్లో పాతిపెట్టిన విషయం శనివారం సంగారెడ్డి, జోగిపేట పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హతుడు ఎల్లయ్య సంగారెడ్డిలోని టెంట్ హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జోగిపేటకు చెందిన పాపయ్య కూడా సంగారెడ్డిలో తన భార్య, పిల్లలతో కలిసి కూలీ పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఎల్లయ్య, పాపయ్యలకు కొంత కాలంగా స్నేహం కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలో పాపయ్య భార్యతో ఎల్లయ్యకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 12వ తేదిన పాపయ్య భార్య స్వగ్రామమైన జోగిపేటకు వచ్చింది. అదే రోజు రాత్రి పాపయ్య తన, భార్య పిల్లల వద్దకు జోగిపేటకు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎల్లయ్య, పాపయ్య భార్యలు తలుపులు పెట్టుకొని ఉన్నారు. భార్య తలుపులు తెరవగానే ఎల్లయ్య కనిపించడంతో ఆగ్రహించిన పాపయ్య గడ్డపారతో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఎల్లయ్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుకభాగంలోని ముళ్లపొదల్లోకి తీసుకువెళ్లి గుంత తవ్వి పాతిపెట్టారు. తన మరిది కనిపించడం లేదని మృతుడి అన్న భార్య సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 12న ఫిర్యాదు చేసింది. దీంతో సంగారెడ్డి స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ విషయంలో పోలీసులు విచారణను చేపట్టారు. పాపయ్యతో స్నేహం విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని విచారించారు. తానే చంపి జోగిపేటలో పాతిపెట్టినట్లు పాపయ్య సంగారెడ్డి పోలీసులకు తెలియజేశాడు. సంగారెడ్డి సీఐ వెంకటేష్ శనివారం జోగిపేటకు నిందితుడు పాపయ్యను తీసుకురాగా పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. స్థానిక సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ వెంకటేష్‌లు మృతదేహాన్ని బయటకు తీయించారు. తహసీల్దారు ప్రవీణ్‌కుమార్, పోలీసు సిబ్బంది సమక్షంలో పంచనామా నిర్వహించారు. తవ్విన చోటనే వైద్య అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పాపయ్యను సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మేనత్తతో వివాహేతర సంబంధం..
కురవి(డోర్నకల్): వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీసింది. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఓ వ్యక్తి సొంత మేనల్లుడినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారా యణపురం శివారు కొత్తతండాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ ముత్తిలింగయ్య, కురవి ఎస్సై నాగభూషణం, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కొత్తతండాకు చెందిన బానోత్ భద్రు, నాగమణి భార్యభర్తలు. భద్రు మేనల్లుడు మాలోత్ లింగన్న(25) నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో లింగన్నను హత్య చేయాలని భద్రు నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి తండాలోని గణేష్ విగ్రహాన్ని యువకులు డీజే సౌండ్‌కు నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిస్తున్నారు. వారిలో మేనల్లుడు లింగన్న కూడా ఉండటాన్ని భద్రు చూశాడు. వెనుక నుంచి వచ్చి గొడ్డలితో అతడి తలపై నరికాడు. దీంతో లింగన్న తల పగిలి కింద పడ్డాడు. వెంటనే భద్రు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న లింగన్న తలకు ఓ వ్యక్తి తన షర్ట్ గట్టిగా కట్టి మరో వ్యక్తి సాయంతో బైక్‌పై కూర్చోబెట్టుకుని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ స్టెచర్‌పై పడుకోబెడుతుండగా లింగన్న మృతిచెందాడు. భద్రు గొడ్డలతో సహా కురవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రు మూడో భార్య నాగమణి.. బానోతు భద్రు సొంత అక్క బిడ్డ సేవిరిని మొదట వివాహం చేసుకోగా విడాకులయ్యాయి. రెండో భార్య సరోజ ముగ్గురు కొడుకులు జన్మించాక మృతిచెందింది. ఆతర్వాత నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. అతడి మేనల్లుడు మాలోత్ లింగన్న వ్యవసాయం చేస్తూనే అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. రెండేళ్లుగా నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో భద్రు, లింగన్న మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా మార్పు లేకపోవడంతో రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా రూ.10వేల జరిమానా విధించారు. ఆ తర్వాత వారం రోజులకే నాగమణి తల్లిగారింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులకు అక్కడా లేదని మేనల్లుడు లింగన్న, నాగమణి మరో చోట సహజీవనం చేస్తున్నారని లింగన్నపై భద్రు పగపెంచుకున్నాడు. దీంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపేశాడు. లింగన్న రెండు సుపారీ హత్యల్లో నిందితుడు మాలోత్ లింగన్న అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేసేవాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్కడ రూ.5లక్షల సుపారీ తీసుకుని ఒకరి హత్య చేశాడు. అలాగే నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని నూతనకల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరొకరి వద్ద రూ.3లక్షలు సుపారీ తీసుకుని హత్య చేశాడు. ఆయా కేసులు పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. ఆయా హత్య కేసుల్లో లింగన్న వెంట నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసుల విచారణ లింగన్నను గొడ్డలితో నరికి చంపిన ఘటనా స్థలికి సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై నాగభూషణం సోమవారం విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడు లింగన్న తండ్రి మాలోత్ సేవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. కాగా హత్య జరిగిన తర్వాత భద్రు ఇంట్లోని వస్తువులను లింగన్న బంధువులు ధ్వంసం చేశారు. -
పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
మైలార్‌దేవ్‌పల్లి (మెదక్): గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐలు సత్తయ్యగౌడ్, రామకృష్ణ, ఎస్ఐ మహ్మద్ నదీం హుస్సేన్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన మహ్మద్ అమ్జద్ (50) తలుపుల వ్యాపారి. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి షాపులో కూర్చున్న అమ్జద్‌ను సుత్తితో బలంగా కొట్టి హత్య చేశారు. హత్య చేసిన వెంటనే వచ్చిన ఆటోలో తిరిగి పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న అమ్జద్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడు అమ్జద్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ప్రథమ పుత్రుడు మోసిన్, చిన్న కుమారుడు ఆసిన్‌లు నిత్యం ఇతరులతో గొడవలు పడుతుంటారు. ఈ తగాదాల కారణంగానే తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఏసీపీ అశోక్‌కుమార్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల ద్వారా త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం.. అనుమానం రాకుండా..
మూసాపేట (దేవరకద్ర): యువకుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని తేలిపోయింది. అనుమానాస్పదంగా బయటపడిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి పక్కాప్లాన్‌తో హత్య జరిగినట్లు తేల్చారు. భూత్పూరు సీఐ పాండురంగారెడ్డి కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా..మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (22), చెన్నకేశవులు అనే యువకులు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే విషయంపై వారి మధ్య కొన్నిరోజులుగా అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే వీరి విషయం గురించి శ్రీకాంత్ అనే యువకుడికి తెలిసింది. శ్రీకాంత్‌కు సదరు మహిళ చిన్నమ్మ కావడంతో మొదట నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. తీరు మార్చుకోక పోవడంతో నాగరాజును ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. చెన్నకేశవులుతో చేతులు కలిపి.. వరుసకు చిన్నమ్మ అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని సహిం చలేని శ్రీకాంత్ ఎలాగైనా బోయ నాగరాజును చంపాలని నిర్ణయించుకుని చెన్నకేశవులు సాయం కోరాడు. అతడు ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి ఈనెల 9వ తేదీన ఆదివారం రాత్రి నాగరాజును మాటల్లో పెట్టి గ్రామ సమీపంలోని వాగులోకి తీసుకెళ్లారు. పక్కా ప్లాన్‌తో రాత్రి 11 గంటల సమయంలో వివాహేతర సంబంధంపై గొడవ పెట్టుకున్నారు. తనపై దాడి జరుగుతుందని పసిగట్టిన నాగరాజు వారినుంచి తప్పించుకునేందుకు కళ్లలో ఇసుక చల్లి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా వెంబడించి వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచి చంపేశారు. అనుమానం రాకుండా.. కసితీరా చంపిన ఇద్దరు ఎవరికీ అనుమానం రాకుండా ముందుగా వాగులో గోతి తీశారు. తల, మొండాన్ని వేరుచేసి ముందుగా తీసిన గోతిలో పూడ్చివేశారు. అనంతరం తలను కాస్త దూరంలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజునుంచి తమకు ఏ మీ తెలియనట్లు వ్యవహరిస్తూ నటించారు. అయి తే సోమవారం రాత్రి వాగులో అనుమానాస్పదంగా మృతదేహం బయట పడింది. విషయం కాస్త పోలీసుల చెవిన పడటంతో వారు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ మొదలెట్టారు. తలను గుర్తించిన జాగిలం మంగళవారం ఉదయం పోలీసులు జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. బయటపడిన మొండెం నుంచి దాదాపు కిలోమీటరు వరకు వెళ్ళిన జాగిలం తల పాతిన ప్రదేశానికి వెళ్లి ఆగింది. ఆ ప్రాంతంలో వెతుకగా తల బయటపడింది. కొన్నిరోజులుగా అదృశ్యమైన నాగరాజుగా స్థానికులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. అడ్డుకున్న గ్రామస్తులు ఈ సంఘటన గురించి బయటపడగా మొదట గ్రామస్తులు ఎక్కడ గొడవలు జరుగుతాయోనని పోలీసులు విచారణ చేస్తుండగా అడ్డుకున్నారు. దాదాపు 6 గంటల పాటు శవాన్ని వెలికితీయకుం డా అడ్డుచెప్పడంతో సీఐ, ఎస్ఐ గ్రామస్తులను ఒప్పించి మధ్యాహ్నం 1.15 గంటలకు యువకుని మృత దేహాన్ని వెలికి తీయించారు. తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, సీఐ పాండురంగారెడ్డి సమక్షంలో పంచనామా చేసి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్లతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల బందోబస్తు.. సోమవారం సాయంత్రం వాగులో మొండెం భ యట పడటంతో రాత్రి నుంచి మంగళవారం వర కు గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ఎస్ఐతోపాటు చుట్టుపక్క మండలాల ఎస్ఐలు, 70 మంది పోలీసులను గ్రామంలో దించారు. వీడిన అదృశ్యం మిస్టరీ వాగులో తేలిన మొండెం నాగరాజుదేనా లేక మరెవరిదైనా అని ఇటు గ్రామస్తులు, అటు పోలీసులు మొదట తర్జన భర్జన పడ్డారు. కొన్ని రోజులుగా అదృశ్యమైన యువకుడు ఎక్కడికెళ్లాడని మరోపక్క ఆందోళన కొనసాగింది. చవరికి వాగులో శవంగా తేలడం పోలీసులు లోతుగా విచారణ చేశారు. మృతుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేవాడని తెలియడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు చెన్నకేశవులు, శ్రీకాంత్‌లను విచారించగా వారు ఒప్పుకుని లొంగిపోయారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఆర్ఐ అహ్మద్, వీఆర్వో మంజుల, నియోజకవర్గంలోని ఎస్ఐలు విచారణలో పాల్గొన్నారు. -
మా కుమార్తెను అల్లుడే చంపాడు..
దంతాలపల్లి (వరంగల్): తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని ఆరోపిస్తూ.. మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేసిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. బయ్యారం మండల శివారు కంకరబోడు తండాకు చెందిన జాటోతు కీర్తి(28)కి దంతాలపల్లి మండల కేంద్రం శివారు రాగితండాకు చెందిన జాటోతు రామోజీ, అమ్ముల చిన్న కుమారుడు బాలుతో సంవత్సరం క్రితం వివాహమైంది. కాగా, బాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కీర్తితో హైదరాబాద్‌లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన వరంగల్ సమీపంలో చింతలపల్లి–ఎలుగూరు రైల్వే స్టేషన్ల మధ్య అప్‌లైన్‌లో పట్టాల పక్కన ఉన్న మోరీలో కీర్తి శవమై కనిపించింది. జీఆర్పీ సిబ్బంది గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సమాచారం తెలుసుకున్న మృతురాలి బంధువులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించారు. జీఆర్పీ సిబ్బంది మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం వారు మంగళవారం రాత్రి దంతాలపల్లి మండల కేంద్రం శివారులోని రాగితండాకు చేరుకుని కీర్తి అత్తింటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని ఆరోపించారు. రెండు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయమై ఎస్సై నందీప్‌ను వివరణ కోరగా జీఆర్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించారన్నారు. బంధువుల నుంచి కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
తనయున్ని చంపిన తండ్రి!
సాక్షి, సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: తలకొరివి పెట్టాల్సిన కొడుకే..తాగుడుకు బానిసై తండ్రి చేతిలో హతమయ్యాడు. మద్యానికి అలవాటు పడి ఉన్మాదంతో ఊగిపోతూ.. ప్రతిరోజు ఇంట్లో వారిని దూషిస్తూ... దాడులు చేస్తుంటే భరించలేని ఆక్రోషంలో ఓ తండ్రి తనయున్ని చంపిన సంఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఎక్కల్దేవి లక్ష్మినర్సు స్క్రీన్ ప్రింటింగ్ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కొడుకులు రాజు, మహేష్(27), కూతురు కవిత ఉన్నారు. రాజు, కవితలకు వివాహాలు చేయగా వారు జీవితంలో స్థిరపడ్డారు. మహేష్ మాత్రం తాగుడుకు బానిసై ప్రతిరోజు ఇంట్లో వారితో గొడవ పడేవారు. పనిలేకుండా తాగడానికి రోజు డబ్బులు కావాలని ఇంట్లో బెదిరిస్తూ.. వస్తువులను పగులగొట్టేవాడు. శనివారం రాత్రి కూడా తాగొచ్చిన మహేష్ ఇంకా డబ్బులు కావాలని స్క్రీన్ ప్రింటింగ్ చేస్తున్న తండ్రిని కోరగా.. లేవన్నందుకు విలువైన గ్లాసులు, ఇతర వస్తువులు పగులగొట్టాడు. ఆవేశం ఆపుకోలేని స్థితిలో లక్ష్మినర్సు మహేష్‌ను నెట్టేసి దగ్గర్లో కనిపించిన రోకలిబండతో మోదాడు. రక్తం మడుగులో పడిఉన్న మహేష్‌ను స్థానికుల సాయంతో రాత్రి సిరిసిల్ల ఏరియాస్పత్రికి తీసుకురాగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అనీల్‌కుమార్ తెలిపారు. కౌన్సిలింగ్ చేసినా.. మార్పు లేదు.. మహేష్ పనిపాట లేకుండా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడు. తాగిన మైకంలో ఇంట్లో, బయట వారితో గొడవ పడేవాడని తెలిసింది. ఇదివరకే రెండుమూడు సార్లు పోలీస్టేషన్లో మహేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చినా..పద్ధతి మారలేదు. శనివారం రాత్రి కూడా తల్లిదండ్రులను దూషిస్తూ..వస్తువులు పగులగొడుతుండగా..ఆక్రోషం పట్టలేక తండ్రి లక్ష్మినర్సు పక్కనే ఉన్న రోకలిబండతో మోదగా మహేష్ చనిపోయాడు. -
సివిల్ ఇంజినీర్ దారుణహత్య
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గుంటూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ తన్నీరు సురేష్‌గోపి (25) అనే యువకుడిని మేనకూరు సేజ్ పరిధిలో కోనేటి రాజుపాళెం సమీపంలో దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన సురేష్‌కుమార్ బీటెక్ (సివిల్) పూర్తి చేశాడు. తమ ప్రాంతానికి చెందిన యార్ల తిరుపతిరావు అనే కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఓ కాంట్రాక్ట్‌కు సంబంధించి జేసీబీలు, టిప్పర్లు నాయుడుపేట మండలం కోనేటిరాజుపాళెంలో ఉన్నాయని, అక్కడ సిబ్బందితో కలిసి పనిచేయాలని కాంట్రాక్టర్ అతడికి చెప్పాడు. గోపి ఈనెల 22వ తేదీన నాయుడుపేటకు చేరుకున్నట్లు ఆరోజు రాత్రి తల్లి ధనలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. 23న గోపికి అతని కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్‌ను కలిసి తన కుమారుడు ఫోన్ పనిచేయడంలేదని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్ కోనేటిరాజుపాళెం వద్ద తేజ అనే సూపర్వైజర్ ఉన్నాడని, అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. దీంతో గోపి కుటుంబసభ్యులు ఈనెల 25వ తేదీన కోనేటిరాజుపాళెం చేరుకుని విచారించగా సురేష్‌గోపి ఇక్కడకు రాలేదని తేజ వారికి చెప్పాడు. దీంతో వారు భయాందోళనకు గురైన అతని మేనమామ సిరిగిరి శ్రీనివాసులు అదేరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు యువకుడు అదృశ్యమైనట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పూడ్చిపెట్టారు గోపి అదృశ్యమైన విషయమై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు సారథ్యంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జి.వేణులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు యువకుడిని అక్కడ పనిచేస్తున్న ఎవరో హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టినట్లుగా తెలుసుకున్నారు. దీంతో డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు సంస్థ సమీప ప్రాంతాల్లో బుధవారం తవ్వకాలు చేపట్టారు. ఓ చోట దుర్వాసన వస్తుండటంతో తవ్వించారు. యువకుడి మృతదేహం బయటపడింది. కాగా గోపి కనిపించకుండా పోయినరోజు నుంచి అక్కడ పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్ డ్రైవర్లు కూడా కనిపించడంలేదని చెబుతున్నారు. దీంతో హత్య వెనుక వారి ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. గోపి మృతిచెందాడన్న విషయం తెలుసుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
వ్యక్తి దారుణ హత్య
సాక్షి, కర్నూలు: కల్లూరు మండలం పందిపాడు గ్రామానికి చెందిన ఆకెపోగు పరమేష్ (25) ఆదివారం దారుణహత్యకు గురయ్యాడు. వివరాలు. పరమేష్ గౌండ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తమ కాలనీకి చెందిన దేవదానంకు రూ.6 వేలు అప్పుగా ఇచ్చాడు. డబ్బులు చెల్లించాలని పరమేష్ సోదరుడు ఆటోడ్రైవర్ ఆకెపోగు శంకర్ దేవదానంతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దేవదానంతో పాటు కుటుంబ సభ్యులు ఏసమ్మ, రవి, నాగమణి తదితరులు ఘర్షణకు దిగడంతో పరమేష్ వారించేందుకు ప్రయత్నించగా గట్టిగా తోయడంతో రాయిపై పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన నాలుగో పట్టణ సీఐ రామయ్యనాయుడు, ఎస్ఐ శేషయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరమేష్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవదానం కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
బంగారం వ్యాపారి దారుణ హత్య
దర్శి (ప్రకాశం): పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి ఒగ్గు వెంకట ఆదినారాయణ (37) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 14వ తేదీన కిడ్నాపైన ఆదినారాయణ మృతదేహాన్ని త్రిపురాంతకం మండలం మేడపి సమీపంలో అన్నగారి చెరువు గట్టు కింద ముళ్ల చెట్లలో ఆదివారం ఉదయం గుర్తించారు. శరీరం పూర్తిగా చీకిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబ సభ్యులను పోలీసులు ఆదివారం ఆ ప్రాంతానికి తీసుకెళ్లి ముళ్లచెట్లలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి ఉన్న వాచ్, బెల్ట్, జేబులో ఉన్న గోల్డ్ షాపునకు చెందిన కొంత వరకు కాలిన చీటీల ఆధారంగా ఆదినారాయణ మృతదేహంగా కుటుంబ సభ్యులు, పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది, మృతదేహం సమాచారం ఎవరిచ్చారన్న విషయాలు పోలీసులు వెల్లడించలేదు. మృతదేహాన్ని చూస్తే నాలుగైదు రోజుల క్రితం చంపి పడేసినట్లుగా అర్థమవుతోంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని త్రిపురాంతకంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హంతకుల కోసం గాలింపు ఈ కేసులో హంతకుల ఆచూకీ పోలీసులకు తెలిసినట్లు సమాచారం. అందులో భాగంగా దర్యాప్తు చేస్తున్న మూడు టీమ్‌ల్లో ఒక టీమ్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు మండల పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన మల్లేశ్వరరావుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అనుమానితుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి అనే మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ప్రధాన సూత్రదారి ఫోన్ నంబర్ కూడా పోలీసులు ట్రేస్ చేసినట్లు తెలుస్తోంది. ఆదినారాయణ ప్రయాణించిన కారును పామూరులో స్వాధీనం చేసుకున్నారు. పామూరులో ఆదినారాయణను హత్య చేసి మేడపి సమీపంలోని అన్నగారి చెరువు వద్దకి తీసుకెళ్లి పడేశారా..? లేక చెరువు వద్దే హత్య చేసి పడేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో నేరస్తులు, సూత్రధారులను పట్టుకుంటేనే పూర్తి వివరాలు తెలుస్తాయి. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఆదినారాయన మృతి చెందిన వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. హత్యకు గురయ్యాడని తెలియడంతో బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మంజీర నదిలో యువకుడి హత్య
వర్ని(బాన్సువాడ): కోటగిరి మండలం కొడిచర్ల శివారులోని మంజీర నది ఇసుకలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మచ్కురి రాజ్‌కుమార్ అలియాస్ రాజు(25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోడిచర్లకు చెందిన రాజు, పోతంగల్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు శుక్రవారం రాత్రి ఇసుక తెచ్చేందుకు ట్రాక్టర్లో మంజీర నదికి వెళ్లారు. అక్కడ ఇసుక నింపుతున్న సమయంలో రాజుతో ముగ్గురికి ఘర్షణ జరిగింది. నలుగురు మద్యం సేవించారని తెలిసింది. ఈ క్రమంలో రాజును చంపి ఇసుకలో పాతిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితులు ట్రాక్టర్‌ను తీసుకుని అక్క డి నుంచి పరారయ్యారు. అయితే తన భర్త రాత్రి వెళ్లి తిరిగి రాలేదని శనివారం హతుడి భార్య అంజన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మంజీరాలో గాలించగా రాజు మృతదేహం లభ్య మైంది. సంఘటన స్థలాన్ని బోధన్ ఏసీపీ రఘు, రుద్రూర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ రాజ్‌భరత్ రెడ్డి పరిశీలించారు. హంతకులను ఘటన స్థలానికి తేవాలని కోడిచర్ల, హంగర్గావాసులు డిమాండ్ చేశారు. ఇసుక నుంచి మృతదేహాన్ని బయటకు తీ యకుండా వారు అడ్డుకున్నారు. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీస్ అధికారుల హామీతో శాం తించారు. అనంతరం శవ పంచానామ చేశారు. రాజుకున్న వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు. నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్టు సమాచారం. హతుడు రాజుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
పాత కక్షలతోనే రంగేశ్వరరెడ్డి హత్య
పులివెందుల (వైఎస్సార్ కడప): ఈనెల 9వ తేదీ రాత్రి స్థానిక భాకరాపురంలో జరిగిన రంగేశ్వరరెడ్డి హత్యకు పాత కక్షలే కారణమని పులివెందుల డీఎస్పీ నాగరాజ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగేశ్వరరెడ్డికి అతని చిన్నాన్న కుమారుడు చంద్రశేఖరరెడ్డికి గతంలో పాతకక్షలు ఉండేవన్నారు. వీరిద్దరు కలిసి గతంలో అనేక పంచాయితీలు, నేరాలు చేసేవారన్నారు. ఆ లావాదేవీలలోనూ, డబ్బు పంపకాల విషయంలోనూ వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారన్నారు. రంగేశ్వరరెడ్డి చంద్రశేఖరరెడ్డిని చంపాలని ప్రయత్నం చేసేవాడన్నారు. దీంతో చంద్రశేఖరరెడ్డి రంగేశ్వరరెడ్డి బతికి ఉంటే ఎప్పుడైనా తన ప్రాణానికి ముప్పు అని కొంతమంది వ్యక్తులతో కలిసి హత్య చేశాడన్నారు. 9వ తేదీ రాత్రి రంగేశ్వరరెడ్డి తన ఇంటి వద్ద ఉన్న పునాదులపై కూర్చొని ఉండగా సమాచారం అందుకున్న చంద్రశేఖరరెడ్డి పులివెందులకు చెందిన హరికృష్ణారెడ్డి, రవిశేఖరరెడ్డి, షేక్ ఇమాం బాషాలతో కలిసి రంగేశ్వరరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి తమ వెంట తెచ్చుకున్న మచ్చుకొత్తి, గొడ్డలి, పిడిబాకు, రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ హత్యలో వీరికి సహకరించిన నవీన్, సురభి మహేష్, బుక్కూరి నవీన్‌కుమార్, షేక్ బాబావల్లి, షేక్ ముబారక్ బాషా, పల్లపు మురళీకృష్ణ, బొక్కూరి నవీన్‌కుమార్, మెయిళ్ల ప్రకాష్‌రెడ్డి, చప్పిడి బాబురెడ్డి, బలిజ రాముడు, చెప్పాలి రెడ్డయ్య, చిలంకూరు వీరాంజనేయులతోపాటు మొత్తం 16మందిపై కేసులు నమోదు చేశా>మన్నారు. వీరిలో కడప రింగ్‌రోడ్డు వద్ద కొంతమందిని, శిల్పారామం వద్ద కొంతమందిని అరెస్టు చేశామన్నారు. హత్యకు నిందితులు ఉపయోగించిన స్కార్పియో వాహనంతోపాటు మారణాయుధాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐ పుల్లయ్య, ఎస్ఐలు రఘునాథ్, శివకుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రౌడీషీటర్ హత్య?
జగిత్యాల క్రైం/రాయికల్: విందులో ఏర్పడ్డ చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. స్నేహితులే ఓ రౌడీషీటర్‌ను హత్య చేసిన ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా సింగరావుపేట శివారులో జరిగింది. అయితే మృతదేహం లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల మండలం చల్గల్కు చెందిన బొల్లారపు యశ్వంత్, గాజర్ల కిశోర్ జగిత్యాలలోని అరవింద్నగర్కు చెందిన రౌడీషీటర్ మాద అనిల్‌కుమార్(21)తో కలిసి సింగరావుపేట శివారులోని ఓ రేకులషెడ్డులో మంగళవారం విందు చేసుకున్నారు. చిన్నపాటి గొడవనే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం యశ్వంత్, కిశోర్ చల్గల్కు వచ్చి.. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని.. అత్యవసరంగా కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లాలని కారు తీసుకెళ్లారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి గుర్తుతెలియని చోట పడేశారు. తర్వాత యశ్వంత్ అతని మిత్రునికి ఫోన్‌చేసి కారును మెట్పల్లిలో వదిలిపెట్టామని, తాము అనిల్‌ను హత్య చేశామని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. కారు యజమాని, అతని మిత్రుడు మెట్‌పల్లికి వెళ్లి కారును అందులో రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ సీఐ రాజేశ్, రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్, రాయికల్ ఎస్సై కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తల్లి ఫిర్యాదుతో రాయికల్ ఠాణాలో కేసు నమోదు చేశారు. అనంతరం జగిత్యాల డీఎస్పీ భద్రయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలంలో రక్తపు మరకలు ఉండడంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు దొరికితేనే మృతదేహం లభ్యం? అనిల్‌కుమార్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు లొంగిపోతే తప్ప మృతదేహం ఎక్కడుందనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది. నిందితుల సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో పోలీసులు పలుకోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
పులివెందుల : పులివెందుల పట్టణంలో సోమవారం రాత్రి సంచలనం సృష్టించిన రంగేశ్వరరెడ్డి హత్య కేసు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు హతుడు రంగేశ్వరరెడ్డి స్వయాన చిన్నాన్న కొడుకు చంద్రశేఖరరెడ్డిగా తెలుస్తోంది. చంద్రశేఖరరెడ్డికి, రంగేశ్వరరెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు, ఇతర లావాదేవీలకు సంబంధించి గొడవలు ఉండేవి. దీనిపై రంగేశ్వరరెడ్డిపై కక్ష పెంచుకుని చంద్రశేఖరరెడ్డి మరికొంతమంది అనుచరులతో కలిసి హత్య చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి చంద్రశేఖరరెడ్డితోపాటు పట్టణంలోని ఇస్లాంపురం ప్రాంతానికి చెందిన ఇమాం బాషా, ఎస్బీఐ కాలనీకి చెందిన హరికృష్ణారెడ్డి, నగరిగుట్టకు చెందిన రవిశంకర్‌రెడ్డి, కదిరి పట్టణానికి చెందిన చెక్క డిపో నవీన్‌లు హత్యలో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ముర్తుజా అనే వ్యక్తి రంగేశ్వరరెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి సమాచారం చేర వేసినట్లు సమాచారం. గత 10రోజులనుంచి వీరు రంగేశ్వరరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ప్రతిరోజు రంగేశ్వరరెడ్డి పక్కన ఇతర వ్యక్తులు ఉండటంతో సాధ్యపడలేదు. అయితే సోమవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రంగేశ్వరరెడ్డి తన ఇంటి పక్కనే ఉన్న పునాదులపై కూర్చొని సెల్ఫోన్లో మాట్లాడుతుండగా రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తి నిందితులకు సమాచారం చేరవేశాడు. దీంతో చంద్రశేఖరరెడ్డితోపాటు మిగిలిన నలుగురు నిందితులు అక్కడికి చేరుకుని వేట కొడవళ్లతో విచక్షణారహితంగా రంగేశ్వరరెడ్డిని నరికి హత్య చేశారు. హత్య జరిగిన విషయం స్థానికుల సమాచారంతో తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులు హత్య చేసి స్కార్పియో వాహనంలో పారిపోతున్నారని గుర్తించిన పోలీసులు వారిని వెంబడించారు. ఎట్టకేలకు లక్కిరెడ్డిపల్లె సమీపంంలోని రామాపురం వద్ద నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పట్టుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగేశ్వరరెడ్డి భార్య వెంకటలక్షుమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ : సోమవారం రాత్రి హత్యకు గురైన రంగేశ్వరరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను, ఇతర బంధువులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
ప్రాణంతీసిన స్థలవివాదం
మల్కాజిగిరి : ఇంటి స్థల వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వారాసిగూడకు చెందిన జగన్మోహన్ పదేళ్ల క్రితం సత్తిరెడ్డి నగర్‌కు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి నర్సయ్య భార్య భారతమ్మ పేరున ఉన్న ఇంటిని కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ఇళ్లు ఖాళీ చేసే విషయమై ఇరువురి మద్య విదాదం నడుస్తోంది. జగన్మోహన్ కోర్టుకు వెళ్లగా అతని అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అతను ఇళ్లు ఖాళీచేయించేందుకు తరచూ మల్కాజిగిరికి వచ్చి పోతున్నాడు. మంగళవారం మల్కాజిగిరి వచ్చిన జగన్మోహన్ హత్యకు గురయ్యాడు. పరారీలో భారతమ్మ కుటుంబ సభ్యులు హత్య జరిగిన సమయంలో భారతమ్మ ఇంటి పోర్షన్‌లోనే అద్దెకు ఉంటున్న మహిళకు భారతమ్మ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో బయటికి వచ్చి చూడగా ఎదురుగా ఖాళీస్థలంలో ఓ వ్యక్తి రక్తం మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ సందీప్, ఇన్స్పెక్టర్ కొమురయ్య సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. నర్సయ్య, భారతమ్మ, ఆమె కుమారులు వెంకటేష్, గోవిదరాజులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేసు పెట్టి.. పరువు తీసిందని..
మదనపల్లె క్రైం : వేర్వేరుగా ఉండడంతోపాటు తప్పుడు కేసులు పెట్టి బంధువుల్లో తలవంపులు తెస్తోందని కట్టుకున్న భార్యను కడతేర్చాలని భర్త పథకం వేశాడు. కిరాయి హంతకులతో హత్య చేయించాడు. గత నెల 30న మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో జరిగిన మహిళా న్యాయవాది నాగజ్యోతి(40) హత్య కేసును మూడు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. సూత్రధారి అయిన భర్త జితేంద్ర(45)ని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో ఉంటున్న ప్రముఖ న్యాయవాది జితేంద్రకు నాగజ్యోతితో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలానికి వీరి మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో రెండేళ్ల క్రితం విడిపోయి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కేసు పెట్టి.. పరువు తీసిందని.. ఎనిమిది నెలల క్రితం నాగజ్యోతి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో భర్త జితేంద్రపై తప్పుడు కేసు పెట్టింది. అంతేకాకుండా ఆమె కూడా న్యాయవాది కావడంతో నిత్యం అదే కోర్టులో భర్తకు ఎదురుపడుతూ దూషించేది. బంధువుల్లో తలవంపులు తీసుకువస్తుండడంతో జితేంద్ర తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఒక కేసులో న్యాయం పొందడానికి తనను ఆశ్రయించిన నిందితుల్లో కొందరిని ప్రలోభ పెట్టాడు. వారితోపాటు మరికొంత మంది సాయంతో భార్యను హత్యచేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఆమె కదలికలను పసిగట్టిన కిరాయి హంతకులు గత నెల 30వ తేదీన మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో కోమటివానిచెరువు కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న నాగజ్యోతిని హత్య చేయించాడు. సీరియస్‌గా తీసుకున్న డీఎస్పీ పట్టపగలు మహిళా న్యాయవాది హత్యకు గురికావడాన్ని సీరియస్‌గా తీసుకున్న డీఎస్పీ చిదానందరెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. భర్త తీరుపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. న్యాయవాది జితేంద్రపై సెక్షన్ 302 రెడ్‌విత్ 34 కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇంకా కొంతమందిపై కేసు విచారణలో ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. మహిళా న్యాయవాది హత్య కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులకు నగదు అవార్డులు, రివార్డులు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారని డీఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో సీఐలు సురేష్‌కుమార్, నిరంజన్‌కుమార్, ఎస్ఐలు క్రిష్ణయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
భర్తను చంపించిన సరస్వతి కేసులో మరో నిజం
సాక్షి, విజయనగరం : పెళ్లైన కొన్ని రోజులకే ఫేస్బుక్ లవర్‌తో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించి, రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్వతీపురం సరస్వతి కేసులో మరో విస్తుపోయే నిజం పోలీసులు వెల్లడించారు. ఆదివారం విజయనగరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తనకు కాబోయే భర్త తన మేనబావ అయిన గౌరీ శంకర్‌ను హత్య చేయించడానికి సరస్వతి బెంగుళూరు ముఠాతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. పెళ్లికి ముందే ఫేస్బుక్ లవర్ శివతో కలిసి బెంగుళూరుకు చెందిన ఓ ముఠాకు 25 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారని వెల్లడించారు. ఆ నగదును శివ ఆన్లైన్ నగదు చెల్లింపు యాప్ ద్వారా పంపినట్టు తెలిపారు. అయితే అడ్వాన్సు తీసుకున్న ముఠా ఫోన్ ఎత్తకపోవడంతో, విజయనగరానికి చెందిన మరో ముఠాతో ఒప్పందం చేసుకుని శివతో కలిసి సరస్వతి ఆమె భర్త గౌరీ శంకర్‌ను హత్య చేయించి, దుండగుల దాడిలో మరణించాడని నాటకమాడిన విషయం తెలిసిందే. -
ఫేస్బుక్ లవర్‌తో కలిసి భర్తను చంపిన సరస్వతి
సాక్షి, విజయనగరం : పార్వతీపురంలో నవ వరుడి హత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పథకం ప్రకారమే భర్తను భార్య హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోని పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ పాలరాజు మీడియాకు తెలిపారు. ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడ్డ నిందితురాలు సరస్వతి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మేనబావను ఫేస్బుక్ ప్రేమికుడితో కలిసి హత్య చేసింది. పెళ్లికి ముందే ఫేస్బుక్లో శివ అనే వ్యక్తితో సరస్వతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తన మేనబావతో ఆమెకు పెళ్లి జరిగిపోయింది. ప్రేమించిన యువకుడి కోసం పెళ్లి చేసుకున్న భర్తను అడ్డుతొలగించుకోవడానికి పథకం పన్నింది. దాని కోసం ప్రియుడితో కలిసి గోపి, రామకృష్ణ అనే ఇద్దరు పాత నేరస్తులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఎనిమిది వేల నగదును, పెళ్లి ఉంగరాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చింది. ప్లాన్ ప్రకారం తోటపల్లి ప్రాజెక్టు వద్దకు రాగానే మూత్రవిసర్జన సాకుతో భర్తను ద్విచక్ర వాహనాన్ని ఆపాల్సిందిగా కోరింది. బండి ఆపిన సరస్వతి భర్త శంకర్రావుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి అతని తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఎవరో దుండగులు తన భర్తను హత్య చేశారని సరస్వతీ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఎస్పీకి అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది. పోలీసుల సమిష్టి కృషి, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కేసును త్వరితగతిన ఓ కొల్కికి వచ్చేలా చేశాయని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసు అరెస్టు చేశారు. ఒక నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. -
స్కూల్ బెల్ట్‌తో మిస్టరీ వీడింది
సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ బెల్ట్ సాయంతో తల్లికొడుకుల హత్య కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తన గురించి చిన్న ఆనవాలు కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితుడిని.. అతి కష్టం మీద పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ మాల్దాకు చెందిన బబ్లూ కుమార్ మోందాల్(29) ఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉండే సావిత్రి ఘోష్ అనే వితంతువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చుట్టుపక్కల వారిని మాత్రం తానే ఆమె భర్తనని బబ్లూ నమ్మించసాగాడు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం బబ్లూకు యాక్సిడెంట్ అయి కాలికి గాయమైంది. అయితే అప్పటి నుంచి సావిత్రి తనను నిర్లక్ష్యం చేస్తూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. గత నెల 25న ఆమెకు మద్యం తాగించి గొంతుకోసి చంపాడు. ఆపై 8 ఏళ్ల ఆమె కొడుకును కూడా అదే రీతిలో చంపి పరారయ్యాడు. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బబ్లూకు సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా పోలీసులకు లభించలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు మిస్టరీ ఛాలెంజింగ్‌గా మారింది. బెల్ట్ ఆధారంగా... సావిత్రి భర్తగా చెప్పుకున్న బబ్లూపైనే పోలీసులకు అనుమానం మొదలైంది. కానీ, అతనికి సంబంధించి ఒక్క చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. చివరకు అతని పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ కూడా ఎవరికి తెలీకపోవటంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. ఇంతలో బాలుడి స్కూల్బెల్ట్ పై స్కూల్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్ వివరాల్లో పిల్లాడి దరఖాస్తు ఫామ్‌లో ఉన్న ఫోటో(తండ్రి స్థానంలో బబ్లూ ఫోటో ఉంది) ఆధారంగా ఆచూకీ కోసం యత్నించారు. చివరకు అతను మాల్దాకు చెందిన వ్యక్తి అన్న సమాచారం దొరకటంతో సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ‘నిందితుడు కనీసం ఫోన్ కూడా వినియోగించేవాడు కాదు. దారినపోయే వారి ఫోన్ అడిగి తన బంధువులకు కాల్స్ చేసేవాడు. దీంతో అసలు అతను ఎక్కడ ఉన్నాడన్నది కనుక్కోవటం కష్టతరంగా మారింది. అయితే ఆ బంధువుల సాయంతోనే చివరకు అతన్ని పట్టుకున్నాం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బుధవారం జార్ఖండ్‌లోని షహిబ్‌గంజ్ ప్రాంతంలో చివరకు బబ్లూను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
అప్పు తీర్చనందుకే హత్య
నిర్మల్‌రూరల్ : గత నెలలో సంచలనం సృష్టించిన తల–మొండెం హత్య కేసు వీడింది. ఏప్రిల్ 9న భైంసా పట్టణంలో గుర్తు తెలియని తల, 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవార్‌పేట్ సమీపంలోని ఓ ఇంట్లో మొండెం లభించడం కలకలంరేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య కేసును చేధించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శశిధర్‌రాజు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌదరి మహ్మద్ ఇస్రార్(30), సయ్యద్ అక్తర్ కొన్ని రోజుల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చి రెడీమేడ్ బట్టల వ్యాపారం చేసేవారు. బుధవార్‌పేట సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు. రూ.25 వేల కోసం హత్య.. ఇస్రార్, అక్తర్ బట్టల వ్యాపారం చేసే క్రమంలో ఇస్రార్ అక్తర్‌కు గతంలో రూ. 25వేలు అప్పు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ డబ్బుల కోసం ఎన్నిసార్లు అడిగినా అక్తర్ ఇవ్వలేదు. అయితే ఏప్రిల్ 8న రాత్రి ఈ డబ్బుల విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తన డబ్బులు చెల్లించమని ఇస్రార్ అక్తర్‌తో వాగ్వాదానికి దిగి దుర్భషలాడాడు. దీంతో కోపానికి గురైన అక్తర్ ఇస్రార్‌పై బండరాయితో కొట్టగా తీవ్ర గాయాలైన ఇస్రార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆందోళన చెందిన అక్తర్ సాక్షాన్ని కప్పిపుచ్చేందుకు, నేరాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇస్రార్ తల, మొండెంను కత్తితో వేరు చేశాడు. తలను ఓ గోనె సంచిలో పెట్టి భైంసాకు బస్సులో వెళ్లి అక్కడ ప్రభుత్వాస్పత్రి ప్రహరీ గోడ వద్ద పడేశాడు. తిరిగి నిర్మల్‌కు వచ్చి తన గదిలో ఉన్న మొండెంను బాత్రూంలోకి తీసుకెళ్లి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. కానీ అది సరిగా కాలలేదు. అనంతరం అక్తర్ ఇస్రార్ సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారీ అయ్యాడు. నిందితుడిని పట్టించిన సెల్‌ఫోన్.. హత్య కేసును నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా వీడిపోయి అనుమానితుడు అక్తర్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. మృతుడు అస్రార్ మొబైల్‌పై కూడా నిఘా పెట్టారు. గురువారం సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అక్తర్ మిర్యాలగూడలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డీఎస్పీ మనోహర్‌రెడ్డి అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడు అక్తర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పట్టణ సీఐ జాన్‌దివాకర్, ఇతర పోలీసు బృందం అక్తర్‌ను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చినట్లు వివరించారు. కేసు చేధనలో ముఖ్య పాత్రపోషించిన డీఎస్పీ మనోహర్‌రెడ్డి, పట్టణ సీఐ జాన్‌దివాకర్, ఎస్సై నర్సారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ భోజగౌడ్, సిబ్బంది మురాద్ అలీ, రీయాజ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. ఇందులో ఏఎస్పీ దక్షిణమూర్తి, డీఎస్పీ మనోహర్‌రెడ్డి, పట్టణ సీఐ జాన్ జాన్‌దివాకర్ పాల్గొన్నారు. -
పచ్చపార్టీ తప్పుడు ప్రచారం: కంగాటి శ్రీదేవి
కర్నూలు జిల్లా : వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో పచ్చ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని పత్తికొండ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. ఆమె శుక్రవారం పత్తికొండలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు హైకోర్టులో ఊరట అంటూ సొంత మీడియాలో తప్పుడు వార్తలు రాయించిందన్నారు. డోన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు తప్పుడు వార్తలతో కోర్టులను కించపరిచే విధంగా కేఈ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. తప్పుడు వార్తల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కంగాటి శ్రీదేవి తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై కేఈ కృష్ణమూర్తి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వార్తా పత్రికలు బాధ్యతగా వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు. -
మిస్టరీ విడిన విష్ణు హత్య కేసు
-
శ్రీనివాస్ హత్య కేసులో నిందితుల గుర్తింపు
సాక్షి, నల్గొండ : నల్గొండలో సంచలనం కలిగించిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ హత్యలో ఏడుగురు పాల్గొన్నట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. వారిలో లొంగిపోయిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హత్య అనంతరం లొంగిపోయిన వారిలో కత్తల చక్రి, దుర్గయ్య, మాతంగి, మోహన్, గోపి ఉన్నారు. మరో ముగ్గురు రాంబాబు, మల్లేష్, శరత్‌లు పరారీలో ఉన్నారు. వారివల్లే భర్తను కోల్పోయా శ్రీనివాస్ భార్య, నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాత్రి ఫోన్ రాగానే శ్రీనివాస్ బయటకు వెళ్లారని, కాసేపటికే హత్య జరిగిందన్న విషయం తెలిసిందన్నారు. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ లైసెన్స్ ఇవ్వమని అడిగినా పోలీసులు స్పందించలేదని అన్నారు. తమ అభ్యర్థనలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే భర్తను పోగొట్టుకున్నానని లక్ష్మి రోదించారు. -
రౌ‘డీఎస్పీ’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ కొప్పెర్ల సత్యనారాయణరాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబును ఏ 1 ముద్దాయిగా గుర్తించారు. ఈ మేరకు విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ దాడి నాగేంద్రకుమార్ శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు పాత్ర ఉన్నట్లు ‘సాక్షి’ ఇప్పటికే పరిశోధనాత్మక కథనంతో వెలుగులోకి తేవటం తెలిసిందే. ఏ–1 ముద్దాయి రవిబాబుతోపాటు ఏ–2 ముద్దాయి అయిన క్షత్రియభేరి పత్రిక ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు పరారీలో ఉన్నట్లు కమిషనర్ చెప్పారు. హత్య కేసులో సంబంధం ఉన్న మరో ఎనిమిదిమంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అసలేం జరిగింది... ఈనెల 6న పెదగంట్యాడలోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన తన భర్త తిరిగి ఇంటికి రాలేదని గేదెల రాజు భార్య కొప్పర్ల కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలి భీమవరం ప్రాంతంలో సగం కాలిన స్థితిలో లభ్యమైన మృతదేహాన్ని కొన్ని ఆనవాళ్లు, మెడలోని గొలుసు ఆధారంగా రాజుదిగా గుర్తించారు. దీంతో హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీపై పద్మలత ఫిర్యాదు రవిబాబు అనకాపల్లి సీఐగా ఉండగా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె, మాజీ ఎంపీపీ కాకర పద్మలతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది. రవిబాబు మధురవాడ ఏసీపీగా పని చేస్తున్న సమయంలో అప్పటి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 22న పద్మలత అనుమానాస్పద రీతిలో హఠాత్తుగా మృతి చెందింది. గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత భావించినా.. ఆమెకు విషం పెట్టి చంపేశారన్న వాదన బలంగా వినిపించింది. ఆమె చనిపోయిన సమయంలో పద్మలత కుటుంబానికి సన్నిహితుడైన గేదెల రాజు అక్కడే ఉండటంపై అనుమానాలు వ్యక్తమైనా కుటుంబ సభ్యులు పట్టించుకోక పోవడంతో విషయం మరుగున పడింది. రౌడీషీటర్‌తో అడ్డు తొలగించాడు.. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పద్మలతను అడ్డుతొలగించునేందుకు దాసరి రవిబాబు నిర్ణయించుకున్నాడు. రౌడీషీటర్ గేదెల రాజుతో కోటి రూపాయలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చాడు. మిగతాది పని పూర్తయిన తరువాత ఇస్తామని చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను గేదెల రాజు తన మొబైల్లో రికార్డు చేశాడు. పద్మలత చనిపోయిన తర్వాత డబ్బు చెల్లించాలని డీఎస్పీపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బివ్వకుంటే తన దగ్గర ఉన్న ఫోన్ రికార్డును బయటపెడతానని బెదిరించేవాడు. దీంతో రౌడీషీటర్‌ను అంతమొం దించేందుకు క్షత్రియభేరి పత్రిక నిర్వాహకుడు శ్రీనివాసరాజును రవిబాబు ఆశ్రయించాడు. పోలీసులకు చిక్కిన కిరాయి ముఠా సభ్యుడు కిరాయి ముఠా గేదెల రాజు మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి గాలి భీమవరం ప్రాంతంలో పెట్రోలు పోసి తగులబెట్టింది. అయితే మంటలను గమనించిన స్థానికులు సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా శవం గేదెల రాజుదిగా గుర్తించారు. మృతుడి యాక్టివాను వినియోగిస్తున్న కిరాయి ముఠా సభ్యుడు రవి ఈ నెల 6వ తేదీ రాత్రి మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. డీజీపీకి నివేదిక పంపాం: విశాఖ కమిషనర్ ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ రవిబాబుపై డీజీపీకి నివేదిక పంపించామని విశాఖ పోలీస్ కమిషనర్ టి.యోగా నంద్ వెల్లడించారు. నిందితులు ఎంతటివారైనా చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. పరారీలో ఉన్న రవిబాబు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా యని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. పత్రిక నిర్వాహకుడితో ప్రణాళిక భూ సెటిల్మెంట్లు, పంచాయితీలు చేసే శ్రీనివాసరాజు, గేదెల రాజుల మధ్య ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ పోలీస్ అధికారి కోరటంతో రౌడీషీటర్ అయిన రాజును అంతమొందించేందుకు పథకం రచించాడు. పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన మరో రౌడీ షీటర్ సువ్వాడ మహేష్‌తో కలసి హత్యకు పక్కా పథకం వేశాడు. రూ.4 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. పథకంలో భాగంగా ఈ నెల 6న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో గాజువాకలోని క్షత్రియభేరి కార్యాలయానికి రావాలని, ఒక వ్యవహారం సెటిల్ చేయాలని గేదెల రాజును పిలిచాడు. ఆ సమయంలో భాగ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఉన్న గేదెల రాజు క్షత్రియభేరి కార్యాలయానికి తన యాక్టివా వాహనం(ఏపీ 31 డీహెచ్ 3761)పై వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన కిరాయి ముఠా సభ్యులు గేదెల రాజుపై రాడ్లు, కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. -
హత్య కేసులో నలుగురి అరెస్టు
ధర్మవరం అర్బన్: బైక్‌తో ఢీకొట్టాడనే అక్కసుతో స్కూటరిస్టును చితకబాది ఆ తరువాత హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. వాటి వివరాలను ఆయన విలేకరులకు బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ధర్మవరంలోని మహాత్మగాంధీ కాలనీకి చెందిన సాకే నరసింహులు, వడ్డే గోగుల రమేశ్, గొల్లవాండ్లపల్లికి చెందిన గొల్ల లక్ష్మినారాయణ, మోటుమర్ల గ్రామానికి చెందిన బోయకనుమ మల్లికార్జున స్నేహితులు. ఈ నెల ఒకటిన రాత్రి మద్యం తాగి లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలో తిరుగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన చిన్న కదిరప్ప టీవీఎస్‌లో వస్తూ నరసింహులు అనే వ్యక్తిని ఢీకొన్నాడు. దీంతో ఆగ్రహించిన నరసింహులు కదిరప్పను తిట్టాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో చివరకు పైన పేర్కొన్న నలుగురూ కలసి కదిరప్పను చితకబాదారు. అంతటితో ఆగక అతని టీవీఎస్‌లోనే బలవంతంగా రైల్వేట్రాక్ వద్దనున్న బీడు భూమిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అనంతరం కదిరప్పను తీసుకొచ్చి లక్ష్మిచెన్నకేశవపురంలోని కరుణాకర్ జనరల్ స్టోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. 2వతేదిన ఆదివారం తెల్లవారుజామున జనరల్ స్టోర్ నిర్వాహకుడు కరుణాకర్ తీవ్రగాయాలతో ఉన్న కదిరప్పను గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ వచ్చేలోపు కదిరప్ప మృతి చెందాడు. 4న నిందితులు వీఆర్ఓ రాజశేఖర్ ఎదుట హాజరై నేరం అంగీకరించారు. వారిని సీఐ ఎదుట హాజరుపరిచారు. ఆ తరువాత అరెస్టు చూపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు ఆదేశించారు.