మామ అడ్డుపడుతున్నాడని.. ప్రియుడితో కలసి... | Daughter In Law Fornication Relationship Uncle Murder Case | Sakshi
Sakshi News home page

మామ అడ్డుపడుతున్నాడని.. .ప్రియుడితో కలసి...

Published Fri, Dec 28 2018 10:35 AM | Last Updated on Fri, Dec 28 2018 10:35 AM

Daughter In Law Fornication Relationship Uncle Murder Case - Sakshi

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ యాదగిరి

బాన్సువాడ: వివాహేతర  సంబంధానికి అడ్డుపడుతున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి తన భర్త తండ్రి(మామ)ను హతమార్చిన కోడలు కథనం ఇది. భర్త అమాయకుడు కావడంతో పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ, మామ అడ్డుకున్నాడు. దీంతో అర్ధరాత్రి ప్రియుడి ని పురమాయించి మామను చంపేందుకు పన్నా గం వేసింది. ఈ ఘటన ఈనెల 22న బాన్సువాడ మండలం చిన్న రాంపూర్‌ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర్కూర్‌ గంగారాం(60) అనే వృద్ధుడి హత్యకు సంబంధించిన వివరాలను గురువారం డీఎస్పీ యాదగిరి వెల్లడించారు. చిన్నరాంపూర్‌లో నివసించే బీర్కూర్‌ విఠల్‌కు, కొన్నేళ్ల క్రితం లావణ్యతో వివాహం జరిగింది.

అయితే విఠల్‌ అమాయకుడు కావడంతో లావణ్య, తన పక్కింట్లో ఉండే దుర్యోధన పృథ్విరాజ్‌ అలియాస్‌ రాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. వీరిద్దరి వ్యవహారం తన మామ అయిన గంగారాంకు తెలియడంతో అనేక సార్లు అతను ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అడ్డుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని లావణ్య, తన మామ అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. గంగారాం 10 రోజుల క్రితమే రాంపూర్‌ రోడ్డుపై కుంట్లమోరీ వంతెన నిర్మాణపు పనుల్లో వాచ్‌మెన్‌గా చేరి అక్కడే రాత్రివేళల్లో డ్యూటీ చేస్తుకుంటున్నాడు. లావణ్య అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో తన సెల్‌ఫోన్‌ ద్వారా ప్రియుడు రాజు కు మెసెజ్‌ పంపి, తన మామను హతమార్చాలంటూ పురమాయించింది.

దీంతో రాజు కత్తిని తీసుకొని, గ్రామ శివారులో ఉన్న వంతెన వద్దకు చేరుకొని, టిప్పర్‌లో నిద్రిస్తున్న గంగారాంపై దా డి చేశాడు. నిద్రమత్తులో ఉన్న గంగారాం అతడిని పసిగట్టి, ప్రతిఘటించినా ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు. మెడపై కత్తితో దాడి చేయడంతో చివరకు ప్రాణాలు వదిలాడు. హత్య జరిగిన తెల్లా రి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. నిందితుడి వద్ద ఉన్న చైన్‌ను పసి గట్టి, ఆ చైన్‌ ఆధారంగా, ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. లావణ్యకు ఇద్దరు పిల్లలు ఉండగా, అతడి ప్రియుడైన రాజుకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధం కారణంగా వీరి కుటుంబాలు వీధినపడ్డాయి. బాన్సువాడ ఎస్‌హెచ్‌ఓ మహేష్‌గౌడ్, ఎస్‌ఐలు సాయన్న, సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement