రోడ్డు ప్రమాదం: ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు | Road Accident: School Bus Hits A Tree In Dichpalli | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు

Published Tue, Jan 28 2020 10:38 AM | Last Updated on Tue, Jan 28 2020 3:52 PM

Road Accident: School Bus Hits A Tree In Dichpalli - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నల్లవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లవెల్లి నుంచి డిచ్‌పల్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చెట్టును ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగంలోని ఇంజన్‌లో మున్నా అనే నాలుగో తరగతి విద్యార్థి రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. కొంత సమయం తర్వాత స్థానికులు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో విద్యార్థి కాళ్లు బయటకు తీశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలవ్వగా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కాగా బస్‌ డ్రైవర్‌ అతివేగం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement