Dichpally
-
బస్సు నుంచి రూ. 80 లక్షలు చోరీ
డిచ్పల్లి: ఓ ప్రైవేటు బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు తన వద్దనున్న రూ.80 లక్షలు చోరీకి గురయ్యాయంటూ హైరానా సృష్టించారు. చివరికి చోరీకి గురైన ఆధారాలు లభ్యంకాకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేక పంపించివేశారు. డిచ్పల్లి పోలీసుల కథనం ప్రకారం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయకూర్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (నెంబరు సీజీ 04 ఎన్‌హెచ్ 5535) లో నాందేడ్ కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం తనవద్ద ఉన్న రూ.80లక్షలు చోరీకి గురైనట్లు మేడ్చల్ వద్ద గుర్తించాడు. వెంటనే బస్సుతో సహా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు డబ్బులు ఎక్కడ పోయా యని ప్రశ్నించారు. ఇందల్వాయి వద్ద పో యి ఉంటాయని చెప్పడంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని పంపించారు. ప్రయాణికులతో పాటు బస్సును ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రయాణికులతో సహా లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేయగా డబ్బులు లభించలేదు. డిచ్పల్లి సర్కిల్ ఇనస్పెక్టర్ సూచన మేరకు బస్సును డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ విచారణ చేపట్టగా సుద్దపల్లి శివారులోని కంచెట్టి దాబా వద్ద టీ తాగామని అక్కడే డబ్బులు ఉన్న బ్యాగు చోరీ అయి ఉండవచ్చని బాధితుడు తెలిపాడు. పోలీసులు వెంటనే హోటల్‌కి చేరుకుని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. కానీ అక్కడ బస్సులోని కొందరు ప్రయాణికులు కిందకు దిగారని, బాధితుడు అసలు బస్సు నుంచి కిందకు దిగలేదని తేలింది. తెలంగాణ– మహారాష్ట్ర బోర్డర్ లోని ఓ హోటల్ వద్ద భోజనం కోసం ఆగామని ఆ సమయంలో ఒకరితో గొడవ జరిగినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. దీంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించిన డిచ్పల్లి పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వెనక్కు పంపించి వేశారు. -
వీసీ నిర్వాకం: అమ్మాయిలతో డ్యాన్సులు.. డబ్బులు వెదజల్లుతూ..
సాక్షి, తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ గుప్తా క్యాంపస్‌లోని విద్యార్థినులతో కలిసి గురువారం రాత్రి చేసిన డ్యాన్సులు వివాదాస్పదంగా మారాయి. ఒక వీసీ.. అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, క్యాబరే తరహాలో డబ్బులు వెదజల్లడమేంటంటూ శనివారం ఉదయం నుంచి టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అయ్యా యి. వీసీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గర్ల్స్ హాస్టల్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై వీసీ రవీందర్ గుప్తా శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో స్పందించారు. గణేశ్ నిమజ్జనం రోజు విద్యార్థినుల కోరిక మేరకే హాస్టల్ వద్దకు వెళ్లానని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, డ్యాన్సులు చేస్తూ డబ్బులు వెదజల్లానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అనవసరమైన, అవాస్తవమైన వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలుంటాయని, గణేశ్ నిమజ్జనంలో వీసీ ఒక భక్తుడిగా మాత్రమే పాల్గొన్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని పేర్కొన్నారు. చదవండి: (మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం) -
భర్త దుబాయ్‌కి.. బంధువుతో వివాహేతర సంబంధం.. మామకు తెలిసి..
సాక్షి, డిచ్పల్లి/ఇందల్వాయి: వివాహేతర సంబంధానికి మామ అడ్డువస్తున్నాడని కక్ష పెంచుకున్న కోడలు తన ప్రియుడి తో పథకం రచించి హత్య చేయించిందని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ త ఆదివారం అర్ధరాత్రి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో జరిగిన కుమ్మరి నడిపి గంగా రాం (61) హత్య కేసు వివరాలను డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఆయన వెల్లడించా రు. నడిపి గంగారాం చిన్న కొడుకు దుబాయ్‌కు వెళ్లగా అతడి భార్య లత సమీప బంధువు మదన్‌పల్లి గ్రామానికి చెందిన దుంపటి శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి అక్రమ సంబంధం తెలుసుకున్న మామ, చిన్న కొడుకు దృష్టికి తీసుకురావడంతోపాటు కోడలిని మందలించి శ్రీనివాస్‌తో తన పొలం కౌలు మాన్పించాడు. దీంతో లత ఆరునెలలుగా సిరికొండ మండలం తూంపల్లిలోని తల్లిగారింటి వద్దనే ఉంటోంది. ఇటీవలే వరి కోతలు పూర్తికావడంతో ఆ పంట మొత్తం తనకే ఇవ్వాలని కోడలు లత, శ్రీనివాస్‌తో కలిసి 23న మామ గంగారాంతో గొడవకు దిగింది. 24న రాత్రి శ్రీనివాస్ మదన్‌పల్లి గ్రామానికి చెందిన బి.సురేష్‌ను వెంట తీసుకుని గన్నారం గ్రామానికి వచ్చాడు. చదవండి: (బంజారాహిల్స్: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని..) వడ్ల కుప్పపై పడుకున్న గంగారాం ఛాతీపైన కూర్చుని శ్రీనివాస్ వెదురు కర్రతో గొంతుపైన అదిమి, పక్క నే ఉన్న రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు సురేష్ సహకరించారు. అలికిడికి పక్కనే మరో వడ్ల కుప్ప వద్ద కాపలాగా ఉన్న వృద్ధుడు జాజుల పెద్దనారాయణ నిద్రలేచి వీరిని అడ్డుకోవాలని చూడగా అతడిపై రాయితో దాడి చేసి హత్యాయత్నం చేశారు. వేరే వాహనాలు రావడంతో అక్కడి నుంచి నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ విచార ణలో శ్రీనివాస్, సురేష్, లత అలియాస్ లావణ్య నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేధించిన సీఐ ప్రతాప్, ఇందల్వాయి ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించారు. వీరికి ప్రశంసా పత్రాలతో పాటు రివార్డులు అందజేస్తామన్నారు. -
గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో గురువారం అమానుష సంఘటన చోటుచేసుకుంది. డిచ్పల్లి మండలం దూస్‌గామ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆరాచకాలు మితిమీరాయి. గ్రామంలోని 70 దళిత కుటుంబాలను వీడీసీ బహిష్కరించింది. డప్పులు కొట్టేందుకు కూలి పెంచమని అడిగిన కారణంగా 70 కుటుంబాలను వీడీసీ సభ్యులు బహిష్కరణ చేశారు. గ్రామంలో దళిత కుటుంబాలకు విధి లైట్లు , మంచి నీటి సరఫరా నిలిపివేశారు. అయితే వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కలెక్టరేట్‌కు తరలివచ్చిన బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. చదవండి: ఫ్లూ మాదిరిగా ఇకపై ఏటా కరోనా ప్రభావం -
పెళ్లి మంటపంపైనే నగలు చోరీ
డిచ్పల్లి : వివాహ వేదికపైనే సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు రెప్పపాటులో దోచుకెళ్లారు. ఆనందంగా పెళ్లి వేడుకలో మునిగిన వరుడు, వధువు, వారి బంధువులు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. సిద్దిపేటకు చెందిన ఫణీంద్రకు, మహారాష్ట్ర ఉమ్రికి చెందిన కావ్యతో డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని బృందావనం గార్డెన్స్‌లో బుధవారం పెళ్లి జరిగింది. పెళ్లి జరగుతున్న సమయంలో 25, 30 ఏళ్ల వయసున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి ముందు వరస కుర్చీల్లో కూర్చున్నారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వధువు ఫొటోలు దిగేందుకు తన బంగారు నగలను తరచూ మార్చుతూ ఉంది. నగలను సమీప బంధువైన ఓ మహిళ వద్ద ఉన్న బ్యాగులో ఉంచారు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకరు స్టేజీ పైకి చేరుకుని నగలు పట్టుకున్న మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ మహిళ మైకంలో ఉన్న సమయంలోనే ఆమె వద్ద ఉన్న నగల బ్యాగును ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని ఇద్దరు దొంగలు క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. కొద్దిసేపటికి మైకం నుంచి కోలుకున్న మహిళ నగల బ్యాగు కన్పించక పోవడంతో ఆందోళనగా విషయాన్ని పెళ్లి వారికి తెలిపింది. దీంతో అప్పటివరకు ఎంతో హుషారుగా సాగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేశ్‌కుమార్ సీసీ టీవీ పుటేజీలతో పాటు పెళ్లి వేడుకల్లో రికార్డు చేసిన వీడియోలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను గుర్తించారు. -
డబ్బు మాయం.. భార్యను కత్తితో పొడిచి
సాక్షి, నిజామాబాద్ : డబ్బులు కన్పించడం లేదని, నువ్వే తీసుకుని దాచిపెట్టావని ఆరోపిస్తూ కట్టుకున్న భార్యపై దాడిచేయడంతో పాటు కూరగాయలు కోసే కత్తితో కడుపులో పొడిచాడో భర్త. అనంతరం గాయంతో ఉన్న భార్యను కూతవేటు దూరంలోనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా సుమారు మూడు గంటల పాటు గదిలోనే పడేసి బయటకు రాకుండా చేశాడు. చివరకు సమాచారం అందుకున్న బాధితురాలి తల్లి అక్కడికి చేరుకుని అల్లుడిని పోలీసులకు పట్టించి కూతురిని పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. శుక్రవారం డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. డిచ్పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన రాథోడ్ దివ్య అలియాస్ కవిత నాలుగేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన రాథోడ్ రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు ఘన్‌పూర్‌లో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. రాజు పెయింటర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల కిత్రం బిచ్కుందలో జరిగిన శుభకార్యానికి ఇద్దరు వెళ్లారు. అక్కడే భార్యాభర్తలు గొడవ పడి గురువారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో తన జేబులో డబ్బులు కన్పించడం లేదని, నువ్వే తీశావని రాజు భార్యతో గొడవ పడ్డాడు. ఆమెను కొట్టడంతో పాటు ఆవేశంతో కత్తితో కడుపుతో పొడిచాడు. దీంతో దివ్య బాధతో విలవిలలాడుతూ కేకలు వేసినా పట్టించుకోలేదు. రక్తం కారుతుండటంతో తానే గాయానికి అడ్డుగా టవల్ కట్టాడు. ఆస్పత్రికి వెళ్లానని రోదించినా వద్దని సుమారు మూడు గంటల పాటు అడ్డుకున్నాడు. అనంతరం రాజు తన తమ్ముడికి జరిగిన సంఘటనను ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అతడు దివ్య తల్లికి ఫోన్ చేసి విషయం తెలుపడంతో ఆమె తన కొడుకు, కోడలిని తీసుకుని ఘన్‌పూర్‌కు చేరుకుంది. అల్లుడు పారిపోకుండా గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని క్షతగాత్రురాలిని డిచ్పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దివ్యను కట్నం తీసుకు రమ్మని కొట్టి కత్తితో కడుపులో పొడిచినట్లు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. -
రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి నాకాతండా వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బీహార్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. మృతులు కేరళలోని కోజికోడ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
కరెంటుషాక్‌తో దంపతుల మృతి
సాక్షి, నిజామాబాద్: డిచ్పల్లి మండలం మిట్టాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫాంహౌస్‌లో ప్రమాదవశాత్తు కరెంటుషాక్‌తో దంపతులు మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన ధరావత్ శంకర్, మరోని బాయిగా గుర్తించారు. -
150 కిలోల టమాటాలకు కిలో మటన్
సాక్షి, ఇందల్వాయి: 150 కిలోల టమాటాలకు కిలో మటన్ ఏమిటీ అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన టమాట రైతు నోముల శ్రీనివాస్ రెడ్డి తన పొలంలో పండిన 150 కిలోల టమాటాలను ఇందల్వాయి మార్కెట్లో ఆదివారం హోల్‌సేల్‌గా విక్రయిస్తే అతనికి వచ్చింది కేవలం రూ.500 మాత్రమే వచ్చాయి. ఆదివారం కావడంతో ఇంటికి మటన్ తీసుకెళ్దామని అక్కడే ఉన్న మటన్ దుకాణానికి వెళ్తే కిలో మటన్ రూ.550 ఉండటంతో మరో రూ.50 వేసి కొనాల్సి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా టమాటాలు కొనేవారు కరువయ్యారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. (టమాట రైతులకు కన్నీళ్లే గిట్టుబాటు!) -
ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు
-
రోడ్డు ప్రమాదం: ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని డిచ్పల్లి మండలం నల్లవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లవెల్లి నుంచి డిచ్పల్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చెట్టును ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగంలోని ఇంజన్లో మున్నా అనే నాలుగో తరగతి విద్యార్థి రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. కొంత సమయం తర్వాత స్థానికులు గ్యాస్ కట్టర్ సాయంతో విద్యార్థి కాళ్లు బయటకు తీశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలవ్వగా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కాగా బస్ డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
సినీ ఫక్కీలో బ్యాగు చోరీ
సాక్షి, డిచ్పల్లి: నిజామాబాద్‌లోని డిచ్పల్లి మండల కేంద్రంలో చోరీ జరిగింది. డిచ్పల్లికి చెందిన శివసాయి అనే వ్యాపారి ఎప్పటిలానే గురువారం తన బంగారు ఆభరణాల దుకాణాన్ని తెరిచేందుకు వెళ్లాడు. ఈ సమయంలో బ్యాగును తన బైక్‌పై పెట్టి దుకాణం తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే అదనుగా భావించిన దొంగలు సినీ ఫక్కీలో మరో బైక్‌పై వచ్చి బ్యాగును ఎత్తుకెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగు తిన్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బాలుడికి ఉరి.. తల్లిపైనే అనుమానాలు!
సాక్షి, డిచ్పల్లి(నిజామాబాద్) : చెల్లెలితో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడు అంతలోనే విగత జీవిగా మారాడు. తల్లి పొంతన లేని మాటలు.. బాలుడి మెడపై తాడుతో ఉరి వేసినట్లు గాయాలు ఉండటంతో తల్లియే ఉరేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో జన్నెపల్లి అశోక్, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నాగరాజు, రాజేశ్, కూతురు ధనలక్ష్మి సంతానం. పెద్ద కుమారుడు నాగరాజు పిట్లంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకోగా.. రెండో కుమారుడు, కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఇంటి ఎదుట చెల్లెలితో కలసి రాజేశ్ ఆడుకున్నాడు. కొద్ది సేపటికే విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు.. మెడపై గాయాలు ఉండటంతో ఉరి వేసి చంపి ఉంటారని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొంతనలేని మాటలు తనతో గొడవ పడే ఇద్దరు మహిళలు రాజేశ్‌కు చాక్లెట్లు ఇచ్చి గొంతు నులిమి హత్య చేశారని తల్లి సునీత పోలీసులకు చెప్పింది. అయితే రాజేశ్‌ను పాము కాటు వేసిందని, తొందరగా రావాలని భార్య సునీత ఫోన్ చేస్తే ఇంటికి వచ్చానని భర్త అశోక్ తెలిపాడు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనిచ్చేది లేదని సునీత పట్టు బట్టడం, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రాజేశ్ మృతిపై మరిన్ని సందేహాలను రేకిత్తిస్తున్నాయి. ఆమె వివాహేతర సంబంధాలకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని ఉరి వేసి చంపి ఉం టుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో పగిలిన గాజులు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. మృతుడి మెడపై ఉన్న గాయాలను నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిజాలను రాబడతామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
కువైట్‌లో నడిపల్లి యువకుడి మృతి
సాక్షి, డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన బోండ్ల నరేశ్ (33) కువైట్‌లో బ్రెయిన్ ఫెయిల్యూర్‌తో మృతి చెందినట్లు సర్పంచ్ కులాచారి సతీశ్‌రావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితమే నరేశ్ గల్ఫ్‌లోని కువైట్‌కు వెళ్లాడు. కంపెనీలో పని చేసినా సరైన వేతనం ఇవ్వక పోవడంతో కంపెనీ వదిలి బయటకు వచ్చాడు. అయినా సరైన పనులు దొరకక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి కార్మికులు సమాచారం అందించారని సర్పంచ్ పేర్కొన్నారు. ఒత్తిడి ఎక్కువై నరేశ్ మృతి చెందినట్లు బుధవారం కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, తెలంగాణ జాగృతి ప్రతినిధులు నరేశ్ మృతదేహాన్ని నడిపల్లికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. మృతుడికి భార్య లత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
డిచ్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నిజామాబాద్ : డిచ్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కారు-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కోటగిరికి చెందిన రైస్‌మిల్ వ్యాపారి రాఘవేంద్ర..భార్య, ఇద్దరు పిల్లలితో కలిసి హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఎండ తీవ్రత వల్ల కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీనీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. -
విద్యార్థుల భవిష్యత్‌కు బాట
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): గురుకుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటోంది. గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి బలోపేతానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది నుంచి టీఆర్ఈఐఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ (మహత్మా జ్యోతిబా పూలే) గురుకులాల్లోని ఐదో తరగతి సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో టీజీ గురుకుల్ సెట్ –2018 ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు తుదిగడువు ఈనెల 16. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థి ప్రతిభ, రిజిర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. అర్హులు వీరే.. - ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2018 సెప్టెంబర్ 1 నాటికి 9 నుంచి 11 సం వత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. - ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2018 సెప్టెంబర్ 1 నాటికి 9 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి - దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లి, తండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. - 2017–18 విద్యా సంవత్సరంలో నిరవధికంగా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తగరతి చదువుతూ ఉండాలి. దరఖాస్తు చేసే విధానం.. - నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్న గురుకుల పాఠశాలల్లో సీట్ల కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు http:/ tgcet. cgg. gov. in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ప్రాథమిక వివరాలు (అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఏ జిల్లాకు చెందిన వారు, ఆధార్‌కార్డు నంబరు) నమోదు చేసి రూ.50లు నెట్ బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా చెల్లించాలి. - తర్వా త ఒక రిఫరెన్స్ ఐడీ నంబరు, దర ఖాస్తు ఫారం కనిపిస్తుంది. ఆ ఫారంలో పూర్తి వివరాలు నింపాలి. - ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు మార్చి 16. - దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి కుల, ఆదా య, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రా లు (ఒరిజినల్) పొంది ఉం డాలి. ప్రవేశ సమయానికి అభ్యర్థి ఒరిజినల్స్ కలిగి ఉండకపోతే ఎంపిక రద్దు చేస్తారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశ విధానం - గురుకులాల్లో ప్రవేశం కల్పించేందుకు పాత ఉమ్మడి జిల్లా ఒక యూ నిట్‌గా విద్యార్థుల ఎంపిక విధానం ఉంటుంది. - విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన నల్లగొండ జిల్లా సర్వేల్లోని రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలలో ప్రవేశం పొందడానికి తెలంగాణలోని 31 జిల్లాల వారు అర్హులు. - ఆయా జిల్లాల్లోని మత్య్సకార కుటుంబాలకు చెందిన విద్యార్థులు కౌడిపల్లి (మెదక్ జిల్లా) పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. - ఏప్రిల్ 8న గురుకుల సెట్ నిర్వహణ - ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లిషు, మెంటల్ ఎబిలిటి, పరిసరాల విజ్ఞానం లో నాలుగో తరగతి స్థాయిలో రెండు గంటల వ్యవధిలో 100 మార్కు లకు అబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. - తెలుగు–20, ఇంగ్లిషు –25, గణితం– 25, మెంటల్ ఎబిలిటి–05, పరిసరాల విజ్ఞానం–25 మార్కులుంటాయి. - ఓఎంఆర్ షీట్లో జవాబు లు గుర్తించాల్సి ఉంటుంది. - పరీక్ష ప్రశ్నా పత్రము తెలుగు, ఇంగ్గిషు, ఉర్దూ మీడియంలో ఉంటుంది. గురుకులాల ప్రత్యేకతలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో ఉన్న 21 ( 7బాలురు, 14 బాలికలు) గురుకులాల్లో సమర్థులు, సుధీర్ఘ అనుభవం ఉన్న ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. విద్యార్థులపై 24 గంటల పర్యవేక్షణ. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు హౌజ్ మాస్టర్/ హౌజ్ పేరెంట్ వ్యవస్థ. ఐఐటీ, ఎంసెట్, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ. ఎంబీబీఎస్, సెంట్రల్ యూనివర్సిటీలు, నల్సార్, టిస్, ఇప్లూ, అజీమ్ ప్రేమ్‌జీ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోసం శిక్షణ పాఠ్యాంశాలలో పాటు సహ పాఠ్యాంశాలు, క్రీడలు, శారీరక, మానసిక ఆరో గ్యం కోసం యోగా లో ప్రత్యేక శిక్షణ ఎర్న్ వైల్ లెర్న్ నానుడిని నిజం చేస్తూ పాఠ్యాంశాలను బోధిస్తూ వేతనం, పారితోషికం, ప్రోత్సాహకం అందిస్తారు. (సూపర్ స్టూడెంట్స్, గ్రీన్ గురుస్). ఉమ్మడి జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి 7 బాలుర గురుకుల పాఠశాలలు, 14 బాలికల గురుకుల పాఠశాలలుండగా, బాలుర గురుకులాల్లో 80 చొప్పున మొత్తం 560, బాలికల గురుకులాల్లో 80 చొప్పున 1120 సీట్లు భర్తీ చేస్తారు. ఒక్కో పాఠశాలల్లో 5వ తరగతి సీట్ల సంఖ్య 80. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి 6 బాలురు గురుకుల పాఠశాలలు, 4 బాలికల గురుకుల పాఠశాలలున్నాయి. క్రమశిక్షణతో కూడిన విద్య విద్యా ర్థులకు తొమ్మిదో తరగతి నుంచే సివిల్ సర్వీసెస్ ఫౌడేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. ఇక్కడి శిక్షణతో అజీమ్ ప్రేమ్‌జీ, టీఐఐఎస్, ఇప్లూ, టాటా సోషల్ సైన్సెస్ యూనివర్సిటీ, ఐఐటీ, జేఈఈ, మాగ్నెట్ కళాశాలల్లో చేరేందుకు చక్కటి అవకాశం ఉంటుంది. – సి.సింధు, రీజనల్ కో ఆర్డినేటర్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మంచి భవిష్యత్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తారు. గురుకులాల్లో ఇస్తున్న శిక్షణతో ఉన్నత విద్యాసంస్థల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. –గోపిచంద్రాథోడ్, ఎంజేపీటీబీసీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కన్వీనర్ -
కన్నీళ్లతో ఇంటర్ పరీక్షకు ..
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డిచ్పల్లి తండాకు చెందిన రాథోడ్ శ్రీనివాస్ (38) మృతదేహం గల్ఫ్‌లోని సౌదీ అరేబియా నుంచి శనివారం ఉదయం ఇంటికి చేరుకుంది. శ్రీనివాస్ కూతురు మమత ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాస్తోంది. శనివారం ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయింది. కుటుంబ సభ్యులు, బంధువులు నచ్చజెప్పగా ఉదయం 9 గంటలకు జరిగిన ఇంటర్ పరీక్షకు హాజరైంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసి వెంటనే ఇంటికి చేరుకుంది. అనంతరం ఇంటికి చేరుకుని తండ్రి అంత్యక్రియలకు హాజరైంది. -
ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ట్యాంకర్ నిజామాబాద్ వైపు వెళ్తుండగా డిచ్‌పల్లిలో నాగరాజు దాబా వద్ద ఆపుకుని డ్రైవర్ నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాదావత్ సందీప్, బాదావత్ రవికుమార్‌లు బైక్‌పై నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. ట్యాంకర్‌ను వీరి బైక్ ఢీకొనడంతో వీరిద్దరూ దుర్మరణం చెందారు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన ప్రతాని రాజు (21), పుట్టి ప్రశాంత్ (21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. -
డ్రైవర్‌కి ఫిట్స్... ప్రయాణీకులకు తప్పిన ప్రమాదం
నిజామాబాద్ : విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. అయితే వెంటనే అప్రమత్తమైన అతడె బస్సును నిలిపివేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఆదివారం చోటు చేసుకుది. జిల్లాలోని కామారెడ్డి డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు నిజామాబాద్ వెళుతుండగా డిచ్పల్లి బస్టాండ్ వద్ద డ్రైవర్ అంజన్గౌడ్కు ఆకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దాంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపివేశాడు. దీంతో బస్సులోని ప్రయాణీకులకు ప్రాణాపాయం తప్పింది. -
అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధం
నిజామాబాద్(డిచ్పల్లి): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ నివాస గృహం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని మెండ్రాజ్‌పల్లి గ్రామంలో పోతునోళ్ల నర్సయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ. 2లక్షల నగదు, 20 తులాల బంగారం కాలి బూడిద అయింది. దాదాపు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యాజమాని వాపోతున్నారు. కాగా, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
స్వైన్‌ఫ్లూతో ఒకరి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి గ్రామానికి చెందిన అన్వర్‌హుస్సేన్ (18) స్వైన్‌ప్లూతో మృతి చెందాడు. అన్వర్ కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన తండ్రి రజామంద్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ నిజాంపేటలోని హోల్‌స్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు. అన్వర్ తండ్రి వద్ద 15 రోజుల పాటు ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత జ్వరం తీవ్రత పెరిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం అతడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు. హైదరాబాద్‌లో 9 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 320 శాంపిల్స్ పరిశీలించగా, అందులో 35 కు పైగా కేసులు పాజిటీవ్‌గా తేలాయి. తాజాగా మంగళవారం మరో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన వృద్ధుడు(62) స్వైన్‌ఫ్లూ లక్షణాలతో న్యూలైఫ్ ఆసుపత్రిలో చేరగా, బంజారాహిల్స్‌కు చెందిన మహిళ (57) ఆదిత్య అసుపత్రిలో, నల్లకుంటకు చెందిన వృద్ధురాలు (80) ఉడ్‌లాండ్ ఆసుపత్రిలో, న్యూ ఆర్బీఐకి చెందిన వ్యక్తి, అంబర్‌పేటకు చెందిన మరో వ్యక్తి (36) అపోలోలో, కింగ్‌కోఠి కి చెందిన యువకుడు (30) గాంధీ ఆసుపత్రిలో, పద్మశాలి కాలనీకి చెందిన మహిళ కేర్ ఆసుపత్రిలో, డబీర్‌పురాకు చెంది యువకుడు (30) జాఫరియాలో, ఎంబీటీ కాలనీకి చెందిన ఏడాది బాలుడు రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
విజయానికి దగ్గర దారులుండవు
తెయూ (డిచ్పల్లి) : యువ న్యాయవాదులు నిబద్ధతతో, నిజాయితీతో కఠోరంగా శ్రమించినప్పుడే వృత్తిలో రాణిస్తారని సీబీఐ విశ్రాంత న్యాయమూర్తి కె.రఘునాథరావు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ లా కళాశాల ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ లా డే వేడుకలను సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరావు లా విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. విజయానికి దగ్గర దారులుండవని, అంకిత భావంతో కూడిన శ్రమయే మార్గమని వివరించారు. దేశంలో అన్ని రకాల క్రిమినల్ కేసులలో పడే శిక్షలు నాలుగు శాతం ఉంటే, ఏసీబీ కేసులలో 40 శాతం ఉందన్నారు. సీబీఐ కేసులలో 70 శాతం పైనే ఉంటుందన్నారు. సమాజంలో నైతిక విలువల పతనమే దేశంలో అవినీతి పెరుగుతుండడానికి ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తం చేశా రు. అవినీతి అంతానికి, అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ నగరాన్ని త్వరలోనే స్మార్ట్ సిటీగా మలచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువ న్యాయవాదులు సమాజ హితానికి తమ వి ద్యను ఉపయోగించాలని సూచించారు. లాక ళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా జాతీ య న్యాయ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. మన రాజ్యాంగం ఆఫ్రికన్, లాటిన్ అ మెరికా దేశాలకు ఆదర్శప్రాయమైందన్నారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లాభాయ్ పటేల్ కృషి అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎల్ శాస్త్రి, మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపా ల్ సత్యనారాయణాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ శోభారాణి, డాక్టర్ ప్రసన్న, స్రవంతి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రాద్ధాంత మెందుకో!
తెయూ(డిచ్పల్లి)/నిజామాబాద్‌అర్బన్ : తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్డీ అడ్మిషన్లలో అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులకు సీట్లు కేటాయించారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలుగు, బిజినెస్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్థులు ఉన్నత విద్యా మండలికి, అప్పటి తెయూ ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్‌కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఇన్చార్జి వీసీ ఓయూ కెమిస్ట్రీ డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. మంగళవారం కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు తెయూను సందర్శించి ఇన్చార్జి రిజిస్ట్రార్ చాంబర్లో పీహెచ్డీ అ డ్మిషన్లపై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల వాదనలు నమోదు చేశారు. అయితే కొందరు విద్యార్థి నాయకులు విచారణ కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అందోళకు దిగడంపై విచారణ కమిటీ సభ్యుడు విస్మయం వ్యక్తం చేశారు. ఏవైనా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ కమిటీ వేసి నిజానిజాలు తెలుసుకోవడం అన్ని వర్సిటీల్లో జరిగే ప్రక్రియేనని వర్సిటీ విద్యార్థులు పేర్కొం టున్నారు. మద్దతు తెలపలేక విచారణలో వాస్తవాలు వెలికి తీసి బాధితులకు న్యాయం చేయాలని మద్దతు తెలుపాల్సిన విద్యార్థి సంఘాల నాయకులే ఏకంగా కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేయడమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విచారణను అడ్డుకోవడం, ధర్నాలు చేయడం సమంజసంగా లేదని విమర్శిస్తున్నారు. అసలు విచారణ అంటే ఎందుకు అందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచారణ కమిటీని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి నాయకులు బుధవారం వర్సిటీ కళాశాల తరగతులు బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు. అయినా విద్యార్థి నా యకుల మాటను కాదనలేక ఇష్టం లేకున్నా వర్సిటీ బంద్‌కు సహకరించాల్సి వచ్చిందని కొందరు విద్యార్థులు వాపోయారు. వారికి ఇబ్బందులనే పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలపై విచారణ జరిగితే విద్యార్థి సంఘాల నాయకులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరిగితే కొందరు అనర్హులు ప్రవేశం కోల్పోతామని భావిస్తున్నారు. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి మొదటి లిస్టులో నలుగురు విద్యార్థి సంఘాల నాయకులు ఎంపిక కాలేదు. వారి ఎ ంపిక కోసం కళాశాల అధికారులు సైతం రిజర్వేషన్ కేటగిరిలో మార్పులు చేశారు. ఓపెన్ కేటగిరిలో 45 మార్కులకుగాను 40 మార్కులు, బీసీలకు 40 మార్కులకుగాను 30 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 35 మార్కులకుగాను 30 మార్కులు తగ్గిస్తు నిబంధనలు చేశారు. దీంతో ఎంపిక కాని విద్యార్థి సంఘం నాయకులు ఎంపికయ్యారు. అర్హత కలిగిన మెరిట్ స్టూడెంట్లకు ఈ మార్పులకు సంబంధించి కనీస సమాచారం అందించలేదు. ఫోన్ చేస్తేనే యూనివర్శిటీకి రావాలని, సీటు వచ్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఓ విద్యార్థి సంఘం నాయకుడికి కేవలం 30 మార్కులే రాగా ప్రవేశానికి అనర్హుడయ్యాడు. కానీ, మార్పులు చేయడంతో సీటు లభిం చింది. హైదరాబాద్‌కు చెందిన మహిళ విద్యార్థి నాయకురాలికి పీహెచ్డీ ప్రవేశానికి అర్హత ఉన్నప్పటి కీ సీటు లభించలేదు. దీంతో ఆమె ఉస్మానియా యూ నివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది యూ నివర్శిటీ అధికారులకు తెలిసి సీటు ఇస్తామంటూ యూనివర్శిటీకి పిలిపించారు. నెల రోజులు గడిచినా సీటు మాత్రం ఇవ్వలేదు. యూనివర్శిటీ అధి కారులను నిలదీస్తే ఇటీవలే ప్రవేశం కల్పించారు. ఫీజులు కూడా చెల్లించలేదు యూనివర్శిటీ నిబంధనల ప్రకారం ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి రూ. 16 వేల రూపాయలు ఫీజును వసూలు చేయాలి. పీహెచ్‌డీకి రూ. 15 వేలు, అడ్మిషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది. కాని ఎం పికైన కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కేవ లం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించారు. వీరి నుంచి ఫీజులు కూడా వసూలు చేయలేకపోయారు. అదే ఎంబీఏ, మాస్ కమ్యూనికేషన్, తెలుగు విభాగా ల్లో ఇతర విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి స్థాయి ఫీజులను వసూలు చేశారు. తెలుగు పీహెచ్డీ ప్రవేశాలపై విద్యార్థుల ఆందోళన వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విచారణలో అనర్హులకు అడ్మిషన్ల విషయం బట్టబయలు అవుతుందని, తమపై వేటు పడే అవకాశం ఉందని భావించిన కొందరు అధికారులు విద్యార్థి సంఘం నాయకులను ఉసిగొలిపి మీ ప్రవేశాలు రద్దు అవుతాయని, విచారణను అడ్డుకోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. దీంతో విచారణ కమిటీని అడ్డుకోవడం, తెలంగాణ యూనివర్శిటీకి బంద్ పిలుపునిచ్చారని తెలుస్తోంది. -
‘పీహెచ్డీ’ వివాదాలపై విచారణ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం పీ హెచ్డీ కోర్సుల ప్రవేశాలలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై ఏకసభ్య కమిటీ మంగళవా రం విచారణ జరిపింది. తెయూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ తనకు అందిన ఫిర్యాదుల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏకసభ్య విచారణ కమిటీగా నియమించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ ధర్మరాజుతో కలిసి నాగేశ్వరరావు విచారణ నిర్వహించారు. ఆయన రాకను తెలుసుకున్న పీహెచ్డీ ప్రవేశాలు పొందిన అభ్యర్థులు రిజిస్ట్రార్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. తమకు మెరిట్ వచ్చినా అడ్మిషన్ ఇవ్వకుం డా అక్రమాలకు పాల్పడ్డారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు అల్లాడి రమేశ్, వి.గాయత్రితోపాటు టీఆర్ఎస్వీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ధాత్రిక స్వప్న విచారణ కమిటీ సభ్యుడికి వినతి పత్రం అందజేశారు. కొందరు విద్యార్థి సంఘాల నాయకులకు పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇవ్వడానికి కటాప్ మార్కులు తగ్గిం చారని, అనర్హులకు అడ్మిషన్లు ఇచ్చి, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న అడ్మిషన్ పొందిన పీహెచ్డీ స్కాలర్స్, బాధితులతో వాగ్వివాదా నికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న డిచ్పల్లి పోలీసులు వెంటనే వర్సిటీకి చేరుకుని అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చే పట్టారు. మూడు నెలల నుంచి తెలుగు హెచ్‌వోడీ, డీన్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్డీ సీట్లను డబ్బులు తీసుకుని అనర్హులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇంటర్వూ కమిటీ, నిపుణుల సం తకంతో కూడిన మెరిట్ జాబితాను ప్రకటించలేదన్నారు. మెరిట్ జాబితాను ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. ఇంట ర్వూ కమిటీ సభ్యులు, నిపుణులు ఎంపిక చేసిన జాబితాను మార్చి తమకు అనుకూలంగా ఉన్న వారికి అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. విచారణ కమిటీని రద్దు చేయాలి తెయూ పీహెచ్డీ అడ్మిషన్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తెలుగు విభాగంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై నియమించిన ఏకసభ్య కమిటీని వెంటనే రద్దు చేయాలని అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ చాంబర్లో బైఠాయించి నిరసన తెలి పారు. కొందరు అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ పరువు తీయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మెరిట్ జాబితాను పరిశీలించి న్యాయం చేస్తాం.. ఎంపిక కమిటీ, సబ్టెక్టు నిపుణులు ఇంటర్వ్యూలు నిర్వహించి విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తామని విచార ణ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ నా గేశ్వరరావు విలేకరులకు తెలిపారు. సబ్జెక్టు నిపుణుడిగా ప్రొఫెసర్ చెన్నప్ప వ్యవహరించారని, తనకు బాధితులు అందజేసిన జాబితాపై ఆయన సం తకం లేదన్నారు. వర్సిటీ అధికారుల వద్ద అసలైన మెరిట్ జాబితా తీసుకుని రెండింటినీ పరిశీలించి అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయా లేదో తేలుస్తానన్నారు. అడ్మిషన్లలో అర్హులకు అన్యాయం జరిగినట్లు తేలితే న్యా యం జరిగేలా చూస్తానని, అనర్హులకు అడ్మిషన్లు ఇచ్చినట్లు తేలితే చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు.