నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇందల్‌వాయి గ్రామానికి చెందిన అన్వర్‌హుస్సేన్ (18) స్వైన్‌ప్లూతో మృతి చెందాడు. అన్వర్ కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన తండ్రి రజామంద్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ నిజాంపేటలోని హోల్‌స్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు.
అన్వర్ తండ్రి వద్ద 15 రోజుల పాటు ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత జ్వరం తీవ్రత పెరిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం అతడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు.
హైదరాబాద్‌లో 9 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 320 శాంపిల్స్ పరిశీలించగా, అందులో 35 కు పైగా కేసులు పాజిటీవ్‌గా తేలాయి. తాజాగా మంగళవారం మరో తొమ్మిది కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన వృద్ధుడు(62) స్వైన్‌ఫ్లూ లక్షణాలతో న్యూలైఫ్ ఆసుపత్రిలో చేరగా, బంజారాహిల్స్‌కు చెందిన మహిళ (57) ఆదిత్య అసుపత్రిలో, నల్లకుంటకు చెందిన వృద్ధురాలు (80) ఉడ్‌లాండ్ ఆసుపత్రిలో, న్యూ ఆర్‌బీఐకి చెందిన వ్యక్తి, అంబర్‌పేటకు చెందిన మరో వ్యక్తి (36) అపోలోలో, కింగ్‌కోఠి కి చెందిన యువకుడు (30) గాంధీ ఆసుపత్రిలో, పద్మశాలి కాలనీకి చెందిన మహిళ కేర్ ఆసుపత్రిలో, డబీర్‌పురాకు చెంది యువకుడు (30) జాఫరియాలో, ఎంబీటీ కాలనీకి చెందిన ఏడాది బాలుడు రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్వైన్‌ఫ్లూతో ఒకరి మృతి
Published Wed, Jan 14 2015 4:17 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement