కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్‌ ఫ్లూ కూడా నిర్ధారణ! | Ashok Gehlot Tests COVID-19 Positive | Sakshi
Sakshi News home page

Rajasthan: కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్‌ ఫ్లూ కూడా నిర్ధారణ!

Published Sat, Feb 3 2024 10:18 AM | Last Updated on Sat, Feb 3 2024 10:26 AM

Ashok Gehlot Covid Positive - Sakshi

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్‌ రిపోర్టులో వెల్లడయ్యింది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ‘ఎక్స్‌’లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ ‘గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్‌ టెస్టులు చేయించాను. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వచ్చే ఏడు రోజుల పాటు నేను ఎవరినీ కలవలేను. మారుతున్న ఈ సీజన్‌లో అందరూ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వాతావరణం మారుతోంది. ఇటువంటి వాతావరణంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని’ దానిలో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement