సాక్షి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వైద్య నివేదికలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అంత తీవ్రమైన రోగాలు ఉంటే.. ఏ వైద్యపరీక్షలు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? అనేది నమ్మబుద్ధి కావడంలేదు. ఈ దశలో నిజంగానే ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? జైలుకు పోకుండా ఉండడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక రాజకీయ నేత మాత్రమే కాదు.. ఒక వైద్యుడు కూడా. చంద్రబాబు వైద్య నివేదిక విషయంలో ఒక వైద్యుడిగా ఆయన తన అనుమానాల్ని బయటపెట్టారు.
చంద్రబాబు నాయుడు(73).. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్(ఛాతీలో బరువు.. నొప్పి), గిడ్డినెస్(తల తిప్పడం), నిద్రలేమి, ఇతరతత్రా ఇబ్బందికర పరిస్థితులతో పాటు తన శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధుల సమస్యలతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ రెండు ప్రధానమైన అంశాలను ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒకటి.. కరోనరీ ఆర్టరీ వ్యాధి(హృదయ సంబంధ వ్యాధులలో సర్వసాధారణమైంది), రెండోది..హైపర్ ట్రోపిక్ కార్డియోమియోపతి(హృదయ కండర పెరుగుదల వ్యాధి).
హైపర్ ట్రోపిక్ కార్డియోమయోపతి(గుండె కండర పెరుగుదల వ్యాధి)తో పాటు ఎల్వీ (Left Ventricular గుండెలో ఎడమ జఠరిక) గడ్డ కట్టింది. అలాగే.. డయాబెటిస్ ఉంది. చర్మ సంబంధిత వ్యాధి ఉంది. వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి. వ్యాయామాలు, శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్ నిత్యం కూడా టూర్ షెడ్యూల్లో ఉండాలి.. వైద్య నివేదికలో రిఫర్ చేశారు.
మరోవైపు కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉందని, విటిలిగో(బొల్లి)కి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఎరిట్రియా ప్రోన్ అంటే.. గుండె కొట్టుకోవడంలో హఠాత్తుగా వైవిధ్యమైన పరిస్థితులు చంద్రబాబులో ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇటువంటి ఆరోగ్య పరిస్థితిల్లో ఉన్న వారికి సర్జరీ కోసం మత్తుమందు(ఆనస్తీషియా) ఇవ్వటం ప్రాణాంతకం. పైగా ఏ వైద్యుడు కూడా అంత సాహసానికి దిగడు. ఒకవేళ అలా మత్తు మందు ఇవ్వాలి అంటే గనుక.. ముందస్తు పరీక్షలన్నీ చేసుకున్నాకే నిర్ధారించుకుంటారు. కానీ..
చంద్రబాబు విషయంలో రెండో తేదీన అడ్మిట్ అయితే.. ఆ మరుసటి రోజే సర్జరీ చేసి డిశ్చార్జి కూడా చేశారు. ఏ వైద్యుడైనా సరే చంద్రబాబు హెల్త్ రిపోర్టులు చూపించాక.. సర్జరీ చేయడానికి కచ్చితంగా ఆలోచిస్తారు అనేది డాక్టర్ సీదిరి అప్పలరాజు చెబుతున్న మాట.
చంద్రబాబు గుండె సైజు పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా బాబుకు కంటి ఆపరేషన్ చేయరు. బెయిల్ పొడగించుకోవడానికే ఈ మెడికల్ రిపోర్టు స్టోరీ అల్లుతున్నారు. అయినా బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు… pic.twitter.com/3AtDBI2rQl
— YSR Congress Party (@YSRCParty) November 17, 2023
ఇక్కడ.. చంద్రబాబు కేసులో కంటి చూపు తగ్గిపోయింది అనే విషయానికి ఎవరూ అభ్యంతరం చేయరు. అయితే సీపీ కాల్షియం స్కోర్ 2019 రిపోర్టు ప్రకారం 916 ఉంది. ఇప్పుడు ఏకంగా 1,611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వైద్యులు అన్నారు. కాల్షియం ఇంతలా పెరిగితే.. ఏ కార్డియాలజిస్ట్ అయనా సరే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కచ్చితంగా చేస్తారు. పైగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్థరీస్ ఎలాగ ఉన్నాయో తెలుస్తవి. అలా తెలిసినప్పుడు ఆయనకి కచ్చితమైన చికిత్స అందిచడానికి అవకాశం ఉంటుంది. మరి.. ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ముందస్తు పరీక్షలు చేయకుండా.. కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఏ వైద్యుడు ముందుకు వెళ్లడు కదా. కాబట్టి.. బెయిల్ పొడిగింపు కోసం ఇది వడ్డివారుస్తున్న కథ కూడా అనుకోవచ్చు అని మంత్రి సీదిరి అభిప్రాయపడుతున్నారు.
సీదిరి మాట్లలోనే.. ‘‘చంద్రబాబుకు గుండె కండర పెరుగుదల వ్యాధి ఉందన్న విషయం మెడికల్ స్టూడెంట్స్‌గా ఉన్న టైంలోనే నాకు తెలుసు. గతంలో ఆయన ఓసారి ఉపవాస కార్యక్రమం చేపట్టినప్పుడు.. నిమ్స్ వైద్యులు ఆయన్నీ పరీక్షించారు. అప్పుడు నిమ్స్‌లో పని చేస్తున్న మా సీనియర్లు ఆ విషయం నాకు చెప్పారు. చంద్రబాబుకు ఇంతగా తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు.. కచ్చితంగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయాలి. ఇటువంటి జబ్బుల గురించి టెక్నికల్‌గా మాట్లాడితే.. మాయక్టిమి అంటారు. ఈ స్థితిలో.. గుండె ఎనలార్జ్ అయిన భాగాన్ని శుభ్రంగా తొలగిస్తారు. తద్వారా గుండె కొట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఇంకా చంద్రబాబుకు ఉన్న కరోనరీ ఆర్టరీ వ్యాధికి బైపాస్ తప్పనిసరి. ఇంకా ఏవేవో ఉన్నాయని రాసిచ్చారు. అయోగ్టిక్ స్టినోసిస్ ఉందన్నారు. డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు. నిజంగా అవన్నీ ఉంటే.. అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి. కచ్చితమైన పరీక్షలు.. కచ్చితమైన ట్రీట్‌మెంట్ ఏమీ అందించకుండానే ఆపరేషన్ చేస్తారా?.. ఒక ప్రెస్టేజ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారేమో. కనీసం ఉన్న సమస్యలకు మందులు వాడడమో.. ఆ మందుల గురించి ప్రిస్క్రిప్షన్లు ఏవీ లేవు.
చదవండి: బోగస్ ఇన్వాయిస్‌లతో ‘స్కిల్’ నిధులు స్వాహా
Comments
Please login to add a commentAdd a comment