![two youth dies in Road accident - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/22/accident.jpg.webp?itok=F65w5fJo)
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ట్యాంకర్ నిజామాబాద్ వైపు వెళ్తుండగా డిచ్‌పల్లిలో నాగరాజు దాబా వద్ద ఆపుకుని డ్రైవర్ నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాదావత్ సందీప్, బాదావత్ రవికుమార్‌లు బైక్‌పై నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. ట్యాంకర్‌ను వీరి బైక్ ఢీకొనడంతో వీరిద్దరూ దుర్మరణం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment