డిచ్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం | Family Of Four killed In Car Crash Near Dichpally | Sakshi
Sakshi News home page

కారు-లారీ ఢీ, నలుగురు దుర్మరణం

Published Mon, Apr 30 2018 6:10 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Family Of Four killed In Car Crash Near Dichpally - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కారు-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కోటగిరికి చెందిన రైస్‌మిల్‌ వ్యాపారి రాఘవేంద్ర..భార్య, ఇద్దరు పిల్లలితో కలిసి హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఎండ తీవ్రత వల్ల కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీనీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు.





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement