raghavendra
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నవాళ్లు కనుమరుగైపోతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్గా తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. మూవీ సూపర్ హిట్ అయినా అదృష్టం కలిసిరాలేదు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత అగర్వాల్. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు కానీ అల్లరి నరేశ్ తొలి మూవీ 'అల్లరి' మూవీలో హీరోయిన్ అంటే గుర్తుపడతారేమో! ఒకవేళ ఇది కాదంటే ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలో ఓ హీరోయిన్ అంటే గుర్తురావొచ్చు. ఈ రెండు మూవీస్‌తో బాగానే గుర్తింపు తెచ్చుకుందీ ముంబై చిన్నది. కానీ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మూవీస్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసిరాలేదు. దీంతో 2010లో రిలీజైన 'షాపిత్' అనే హిందీ మూవీ తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. 2020లో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఓ కూతురు కూడా పుట్టింది. ఆ చిన్నారి ఫొటోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.అప్పట్లో 'అల్లరి' సినిమాలో అప్పు అనే పాత్రలో ఆకట్టుకున్న శ్వేత.. స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు. తర్వాత ప్రభాస్ 'రాఘవేంద్ర' మూవీలో చేసింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. 'గమ్యం' మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది కానీ ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యామిలీ ఉమన్‌గా సెటిలైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) View this post on Instagram A post shared by Shweta Agarwal Jha (@shwetaagarwaljha) View this post on Instagram A post shared by Debinna Bonnerjee (@debinabon) -
ఈ హీరోయిన్ గుర్తుందా? ప్రభాస్, నాగార్జునతో మాత్రమే!
ఈ హీరోయిన్ పుట్టింది లండన్‌లో.. కానీ హీరోయిన్ కావాలనుకుంది. అలా ప్రయత్నం చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్‌గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్‌కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె స్టోరీ ఏంటి? (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగేకొద్ది గ్లామర్ తగ్గుతుంది. అదేంటో ఈమెకు మాత్రం అది రివర్స్‌లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే 40 ఏళ్లు వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యంగ్ హీరోయిన్లు పోటీ ఇచ్చేలా తయారైంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదు. అన్షు అంబానీ. ఇప్పటికీ గుర్తురాలేదా? 'మన్మథుడు' ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ ఈమెనే. ఇక ఈమె పేరు అన్షు అంబానీ. భారతీయ మూలాలున్న ఈ బ్యూటీ లండన్‌లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోయిన్ అవుదామనుకుంది. దీంతో ప్రయత్నాలు చేసింది. అలా ప్రభాస్ కెరీర్ మొదట్లో చేసిన 'రాఘవేంద్ర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇది షూటింగ్ పూర్తి చేసుకునేలోపు, నాగార్జున 'మన్మథుడు'లో ఈమె ఓ హీరోయిన్గా చేసింది. (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) ఇలా తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసింది. 'మిస్సమ్మ' చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 'జై' అనే మూవీ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కానీ ఈమె వాటిని అంగీకరించలేదు. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. సినిమాలు చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంది గానీ కేవలం ఒకటి రెండు అని ముందే ఫిక్స్ అయిందట. అలా తన డ్రీమ్ నెరవేరగానే ఇంటికెళ్లిపోయింది. ఇక లండన్‌కి వెళ్లిపోయిన అన్షు.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది. ఫ్రీ టైంలో జిమ్ వర్కౌట్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకప్పటి క్యూట్‌గా ఉండే ఈమె ఇప్పుడు 40ల్లోనూ హాట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? లేదా ఇదంతా చదివిన తర్వాత గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) -
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్‌ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి. ‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు. చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు. అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్‌కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు. ‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్. అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్‌ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్‌కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర. అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్‌లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు. కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు. హెల్మెట్‌ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది. -
పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం సూపర్-12లో బంగ్లాదేశ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఉత్కంఠగా సాగిన పోరులో ఐదు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ సందర్భంగా ఒక వ్యక్తి తన చర్యలతో అందరిని మాట్లాడుకునేలా చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో సదరు వ్యక్తి పదే పదే మైదానంలోకి వస్తున్నాడు పోతున్నాడు. ఇలా ఎందుకు చేశాడనేది మొదట ఎవరికి అర్థం కాలేదు. కానీ అతను ఎందుకు వచ్చాడన్న దానిపై క్లారిటీ వచ్చాకా మాత్రం అందరు ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంతకీ ఆ వ్యక్తి చేస్తున్న పనేంటో తెలుసా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మైదానం ఔట్‌ఫీల్డ్ కాస్త చిత్తడిగా మారింది. ఆటగాళ్ల షూస్‌కు బురద అంటుతుండడంతో ఫీల్డింగ్ చేసే సమయంలో జారి పడితే ఇబ్బంది అని భావించిన సదరు వ్యక్తి ప్రతీసారి మైదానంలోకి వచ్చి వారి షూస్ క్లీన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. అలా టీమిండియా ఆటగాళ్ల షూస్ క్లీన్ చేసి అందరి మనుసుల దోచేసిన ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర(రఘు). టీమిండియాకు సైడ్ఆర్మ్ బాల్ త్రోయర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. క్రికెట్‌పై ఉన్న ప్రేమతో ఆటగాడిగా మారాలన్న రఘు కోరిక నెరవేరలేదు. అందుకే గత ఆరేళ్లుగా టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో సైడ్ ఆర్మ్ త్రోయర్‌గా పనిచేస్తూ ఆటగాళ్లకు చాలా దగ్గరయ్యాడు. చదవండి: వర్షం రాకపోయుంటే.. టీమిండియా గెలిచేదా! IND Vs BAN: బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం.. సెమీస్ బెర్త్ ఖాయం..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డీఆర్డీఎల్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌కు కొండలరావు అవార్డు
సాక్షి, హైదరాబాద్: క్షిపణులు, వైమానిక వ్యవస్థల అభివృద్ధిలో కీలకమైన పరిశోధనలు చేసినందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి ప్రతిష్టాత్మక డాక్టర్.ఎన్. కొండలరావు స్మారక అవార్డు లభించింది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డును శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన డాక్టర్ జోషీ.. పూణే యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ సైన్సెస్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లోనే పీహెచ్డీ సంపాదించారు. దేశంలోనే దిగ్గజ శాస్త్రవేత్తలు ఆర్.చిదంబరం, అనిల్ కాకోద్కర్, డాక్టర్ జి.సతీష్ రెడ్డి వంటి వారు కూడా ఎన్.కొండలరావు స్మారక అవార్డు అందుకున్నారు. -
కామారెడ్డి లో ఏ ఆర్ ఎస్సై రాఘవేంద్ర కరోనా తో మృతి
-
డిచ్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నిజామాబాద్ : డిచ్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కారు-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కోటగిరికి చెందిన రైస్‌మిల్ వ్యాపారి రాఘవేంద్ర..భార్య, ఇద్దరు పిల్లలితో కలిసి హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఎండ తీవ్రత వల్ల కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీనీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. -
15 అడుగుల గుంతలో పడ్డ బైక్: యువకుడి మృతి
హైదరాబాద్: నగరంలోని చింతల్‌కుంట చెక్‌పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి అండర్‌పాస్ కోసం తీసిన గుంతలో పడటంతో బైక్‌పై ఉన్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు.. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగిపేట గాంధీనగర్‌కు చెందిన కె. రాఘవేంద్ర(23), ఇ. అశోక్, ఎల్ సాయికిరణ్ ముగ్గురు స్నేహితులు. ఆదివారం అర్ధరాత్రి దాటాక వీరు ముగ్గురు కలిసి సీబీజడ్ బైక్‌పై సాగర్ రింగ్ రోడ్డు వైపు నుంచి చింతలకుంట వస్తున్నారు. చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు మధ్యలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అండర్‌పాస్ కోసం భారీ గుంత తవ్వారు. ఇది గుర్తించని వాహనదారులు గుంతకు రక్షణగా ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి 15 అడుగుల లోతు ఉన్న గుంతలో పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాఘవేంద్ర తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఎల్బీనగర్లోని శ్రీకర్ ఆస్పత్రిలో చేర్చి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. బైక్ ఓవర్ స్పీడ్‌లో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
మనసే మంత్రాలయం
– ఆకట్టుకున్న సంస్థాన పూజలు – అలరించిన దాసవాణి, వీణ కచేరీలు – నేడు రాఘవేంద్రుల జన్మదినం వేడుక మంత్రాలయం : వేదం వీణ గానమైంది.. మనసే మంత్రాలయాన్ని స్మరించింది. సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి వైభవోత్సవాలతో తుంగభద్రమ్మ భక్తిగానం ఆలపించింది. శనివారంతో శ్రీగురు వైభవోత్సవాలు ఐదో రోజుకు చేరాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జాము నుంచే శ్రీమఠంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్ప, పంచామృతాభిషేకాలు, తులసీమాల ధారణ, కాషాయ పట్టువస్త్ర, పుష్పామాలంకరణ చేశారు. పూజా మందిరంలో మూలరాముల పూజ, బృందావన ప్రతిమకు బంగారు పల్లకీ సేవ, రాయరు పాద నిర్వహించారు. గురుసార్వభౌమ దాససాహిత్య మండపంలో కర్ణాటక సంగీత కళాకారుల దాసవాణి, వీణ కచేరీలు ఎంతగానో భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంబారీ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై కనుల పండువగా ఊరేగించారు. యోగీంద్ర మండపంలో బెంగళూరుకు చెందిన రూప, గీత సంగీత విభావరిలో ఆలపించిన భక్తిగేయాలు భక్తులను విశేషంగా అలరించాయి. బెంగళూరు ఆరాధన స్కూలు విద్యార్థులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. పీఠాధిపతి.. కళాకారులకు శేషవస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక బహూకరించి ఫల, పూల, మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. ఉత్సవంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, డీఎం ఆనందరావు పాల్గొన్నారు. నేడు రాఘవేంద్రుల జన్మదిన వేడుక విశ్వ గురువు రాఘవేంద్రస్వామి జన్మదినం వేడుక ఆదివారం జరగనుంది. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామున రాఘవేంద్రుల మూలబృందావనంకు విశేష పంచామృతాభిషేకం చేస్తారు. రాయరు చిత్రపటాలను ర«థాలపై ఊరేగిస్తారు. డోలోత్సవ మండపంలో రాయరు జీవిత చరితను భక్తులకు ప్రవచిస్తారు. వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులతోపాటు, వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. -
గురుభక్తి.. భక్తకోటికి ముక్తి
- నేటి నుంచి శ్రీమఠంలో రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు - 6 రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ - పీఠాధిపతి నేతృత్వంలో ఏర్పాట్లు మంత్రాలయం : సద్గురు శ్రీరాఘవేంద్రుల జన్మదినం, పట్టాభిషేకాన్ని పురష్కరించుకుని నిర్వహిస్తున్న గురువైభవోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో మార్చి 5వతేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. మంగళవారం 396వ పట్టాభిషేక మహోత్సవం చేపడతారు. ఉత్సవంలో భాగంగా రాఘవేంద్రుల స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకిస్తారు. 1-4 తేదీల వరకు దినసరి రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 5వ తేదీన రాఘవేంద్రుల 422వ జయంత్యుత్సవం నిర్వహిస్తారు. రాఘవేంద్రుల చరిత్ర మూలరూపం : శంఖు కర్ణ గోత్రం : గౌతమి తండ్రి : తిమ్మన భట్ తల్లి : గోపికాంబ జననం : క్రీ.శ.1595 మన్మథనామ సంవత్సరం పాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం జన్మ నక్షత్రం : మృగశిర జన్మభూమి : భువనగిరి, కర్ణాటక పూర్వ నామం : వెంకటనాథుడు వివాహం : క్రీ.శ.1614, ఆనందనామ సంవత్సరం, పాల్గుణ శుద్ధ భార్య : సరస్వతీబాయి ఆశ్రమంలో పేరు : శ్రీరాఘవేంద్ర తీర్థులు రచన గ్రంథాలు : శ్రీమన్యాయసుధ పరిమళ, 48 గ్రంథాలు బిరుదులు : వెంకటనాథాచార్య, పరిమళాచార్య, మహాభాష్య బృందావన ప్రవేశం : క్రీ.శ. 1671 వీరూధినామ సంవత్సరం, శ్రావణ బహుళ విదియ, శుక్రవారం అనుగ్రహ ప్రశస్థి అవార్డులు .. గురు వైభవోత్సవాలను పురష్కరించుకుని ప్రముఖులకు రాఘవేంద్రుల అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈఏడాది ఎల్బర్గాకు చెందిన పండితుడు వెంకోబ ఆచార్, రాయచూరు నవోదయ మెడికల్ కాలేజీ చైర్మన్ ఎస్.ఆర్.రెడ్డి, బెంగళూరు ఎంఆర్జీ గ్రూప్స్ చైర్మన్ ప్రకాష్‌శెట్టి, బెంగళూరు కిద్వాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లింగేగోడ్వార్, హైదరాబాద్ విజయకుమార్, కన్నడ టీవీ9 డైరెక్టర్ మహేంద్రమిశ్రా, బీటీవీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎం కుమార్, టౌన్ ప్లానింగ్ రిటైర్డు డైరెక్టర్ రాజన్ అరవింద్, బెంగళూరు అనసూయమ్మకు బహుమతులు అందజేస్తారు. అనుగ్రహ ప్రాప్తి : సుబుధేంద్రతీర్థులు, పీఠాధిపతి శ్రీరాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాం. తుంగభద్ర నదిలో నీరు లేకపోవడంతో స్నానాలకు ప్రత్యేక షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశాం. మఠం ప్రాకారాలను పుష్పశోభిత, విద్యుద్దీపాలంకరణలు గావిస్తాం. రోజూ సాయంత్రం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. -
రాఘవేంద్రుల సేవలో ఉమ్మడి హైకోర్టు జడ్జి
మంత్రాలయం రూరల్: ఉమ్మడి హైకోర్టు జడ్జి రామసుబ్రమణ్యం ఆదివారం శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ఆయన శనివారమే ఆయన మంత్రాలయం చేరుకున్నారు. తెల్లవారుజామున గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులతో కలిసి వేదపాఠశాల భవనం, గోశాల, పరిమళ పాఠశాల, సుశీలేంద్రవసతిగృహం, తుంగభద్ర నది తీరాన్ని పరిశీలించారు. ఈయనతో పాటు మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ.నరసింహమూర్తి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ శ్రీనివాసనాయక్ తదితరులు ఉన్నారు. -
'మహాత్మా'తో మంచి పేరు
– శ్రీరాఘవుడి సన్నిధిలో సినీ నటుడు శ్రీకాంత్ – అమ్మ అనే పదానికి నిర్వచనం జయలలిత – వచ్చే నెలలో రారా చిత్రం విడుదల మంత్రాలయం : మహాత్మా సినిమాతో తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం బుధవారం ఆయన స్నేహితులతో కలిసి మంత్రాలయం వచ్చారు. స్నేహితుడు మనోహర్ (మహాత్మా సినిమా నిర్మాత, కర్ణాటక ఎమ్మెల్సీ) పుట్టినరోజును పురస్కరించుకుని మఠం యాగమండపంలో ఆయుష్షు, నవగ్రహ హోమం నిర్వహించారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు ఇచ్చారు. తర్వాత శ్రీరాఘవేంద్రస్వామి మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శేషవస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి ఫల, పూల మంత్రాక్షింతలతో ఆశీర్వచనాలు గావించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ మహాత్మా సినిమా నటనతో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చిందన్నారు. ఆపరేషన్ దుర్యోధన, ఖడ్గం, శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయన్నారు. వచ్చే నెలలో తాను నటించిన రారా చిత్రం విడుదలవుతుందన్నారు. ఇప్పటి వరకు 122 చిత్రాల్లో నటించినట్లు వివరించారు. కర్ణాటకలోని గంగావతిలో జన్మించానని, చిన్నప్పటి నుంచి శ్రీమఠం వస్తున్నట్లు తెలిపారు. ‘అమ్మ’లేనిలోటు తీరనిది అమ్మగా పేరుగాంచిన జయలలిత లేని లోటు దేశానికి తీరనిదని శ్రీకాంత్ అన్నారు. మరెవరినీ ఆమె స్థానంలో ఊహించలేమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసార దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అనంతరం కొత్త హీరో ఈషాంత్ మాట్లాడుతూ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రోక్ అనే చిత్రంలో నటించానన్నారు. తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో విడుదల అవుతుందన్నారు. వారికి మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు. -
సింహ వాహనంపై విశ్వమోహనుడు
– ఘనంగా పూర్వారాధన వేడుకలు – అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం – సింహవాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయలు మంత్రాలయం: విశ్వమోహనుడు సింహవాహనంపై అలరారుతూ ఊరేగుతుండగా శ్రీమఠం ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. భక్తజనం భువనమోహనుడి వైభవం తిలకించి మైమరిచారు. శ్రీరాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో రాఘవేంద్రులకు సుప్రభాతసేవ, పంచామతాభిషేకం, పుష్పాలంకరణలు గావించారు. మూలరాముల పూజ, రాయరు పాద పూజలో పీఠాధిపతి తరించిన తురణం భక్తులను ఆకట్టుకుంది. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఊంజలలో సింహవాహనంపై తూగారు. అనంతరం పండితులు వేదాలు వల్లిస్తుండగా.. మంగళవాయిద్యాలు సుస్వరనాదం వాయించగా.. భక్తులు ఉత్సవమూర్తి నామ స్మరణ అందుకున్నారు. శ్రీమఠం మాడవీధుల్లో సింహవాహనం ఊరేగిన దశ్యం మహా అద్భుతం. అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం : ఆనవాయితీలో భాగంగా వేడుకలను పురష్కరించుకుని ప్రముఖులకు రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రధానం చేశారు. యోగీంద్ర మంపడంలో పీఠాధిపతి చేతుల మీదుగా సామాజిక సేవకుడు సూర్యనారాయణరెడ్డి, సంస్కత విద్యాపీఠం ఉప కులపతి డాక్టర్ వీఆర్ పంచముఖి, అద్వైత వేదాంత, మీమాంశ సబ్జెక్టు ప్రొఫెసర్ డాక్టర్ మణిద్రవిడకు రూ.లక్ష నగదుతోపాటు రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ప్రశంశపత్రాలు అందజేశారు. గ్రహీతల సేవలు, ప్రతిభను కొనియాడారు. సాంస్కతిక ప్రదర్శనలో భాగంగా బెంగళూరుకు చెందిన ముద్దుమోహన్ సంగీత విభావరి, ముంబాయి రాధాకష్ణ నత్య శాల కళాకారులు నాట్య భంగిమలు భక్తులను అలరించాయి. వేడుకలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేడు మధ్యారాధన : ఆరాధనలో భాగంగా శనివారం మధ్యారాధన నిర్వహిస్తారు. రాఘవేంద్రుల మూల బందావనానికి మహా పంచామతాభిషేకం, గజవాహన, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు ప్రత్యేకం. భక్తులు రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు తిలకిస్తారు. -
శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ
– బంగారు పల్లకీలో మృత్తిక ఊరేగింపు – రాఘవేంద్రుల బందావనంతో విశేష పూజలు మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఏటా గురు పూర్ణిమను పురస్కరించుకుని మృత్తిక(మట్టి) సేకరించడం ఆనవాయితీ. మంగళవారం శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ గావించారు. వేకువ జామున సుప్రభాత సేవతో మఠంలో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం మఠం వెనుక భాగంలోని తులసీవనం చేరుకున్నారు. అక్కడ పండితుల వేదమంత్రోచ్ఛారణలు పఠిస్తుండ, మంగళవాయిద్యాల సుస్వరాల మధ్య వనంలో విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వహస్తాలతో మృత్తికను సంగ్రహణం చేశారు. మృత్తికను పవిత్రంగా స్వర్ణపల్లకీలో ఉంచగా ఊరేగింపుగా శ్రీమఠానికి తీసుకువచ్చారు. శ్రీమఠం మాడవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపు కానిచ్చారు. మృత్తికను రాఘవేంద్రస్వామి మూల బృందదావనం ముందుంచి విశేష పూజలు చేపట్టారు. అనంతరం మృత్తికను బందావనంపై ఉంచారు. సేకరించిన మృత్తికను రాఘవేంద్రుల మత్తిక బందావనాల స్థాపనకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ఆచారం. రోగ పీడిత భక్తులకు సైతం మత్తికను అందజేస్తారు. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
మంచి పాలన కోసం ‘టీఎలక్షన్ వాచ్’
‘మంచి మున్సిపల్ కార్పొరేషన్ కావాలంటే మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాలి. అంటే ఆ అభ్యర్థికి నేరచరిత్ర ఉండకూడదు.కాంట్రాక్టర్ కాకూడదు. చదువుకున్నవాడై ఉండాలి. నలుగురికీ సేవ చేయాలన్న తపన ఉండాలి. ఇటువంటి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిటీ వాసులు కూడా ఓటింగ్‌కు పోటెత్తాలి. గతంలో నమోదైన 35 శాతం పోలింగ్‌ను 70 శాతం వరకు పెంచాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి..’అని పిలుపునిస్తోంది 20 పౌరసేవా సంస్థలు, 30 మంది సామాజిక కార్యక్రమాలతో ఏర్పాటైన తెలంగాణ ఎలక్షన్ వాచ్. ఈ కార్యక్రమ ఉద్దేశాలను లక్డీకాపూల్‌లోని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ కన్వీనర్ పద్మనాభ రెడ్డి, ఆర్డబ్ల్యూఏ ప్రతినిధి డాక్టర్ రావ్ చెలికాని, అప్పా డెరైక్టర్ శ్రీనివాస్, లెట్స్ వోట్ నిర్వాహకుడు రాఘవేంద్ర మీడియాకు తెలిపారు. తమ సంస్థ ఏ రాజకీయ పార్టీకి, వ్యక్తికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. నేర చరితులు పాలకులుగా ఎంపిక కాకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు లేఖలు రాసి నేరగాళ్ల జాబితాను తీసుకుంటున్నామని తెలిపారు. నామినేషన్ సమయాల్లో అభ్యర్థులు సమర్పించే ఆఫిడవిట్లతో వారికి ఏమైనా నేరచరిత్ర ఉందో తెలుసుకుంటామన్నారు. ఒక వేళ నేరచరితులు ఎన్నికల్లో పాల్గొంటే.. ఓటింగ్ కి నాలుగు రోజుల ముందు నుంచి అభ్యర్థుల నేర చరిత్రను జనానికి చెబుతామన్నారు. నో యువర్ క్యాండిడేట్ పేరుతో ఉమ్మడి చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాగా.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు జరిగే అక్రమాలపై ప్రజలకు సమాచారం ఇచ్చేలా నిఘావేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా.. కార్పోరేటర్ కావాలంటే రాజకీయ పార్టీలన్నీ మంచివారికే టికెట్ ఇవ్వాలనీ.. స్థానికులకే టికెట్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశామని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ లేఖకు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. -
నాన్న క్లాసుల్లో భలే సరదా
తండ్రి చిత్రసీమలో హేమాహేమీలను తయారు చేసిన స్టార్ మేకర్..నటనకు బాల శిక్షలాంటి ఇంటి వాతావరణం..యాక్టర్ కావాలనే కోరిక. ఇవుంటే చాలు సినీ ఫీల్డ్‌లో ప్రవేశించాలంటే..కానీ ఆ యువకుడు స్వతంత్రంగా తానేమిటో నిరూపించదలుచుకున్నాడు. నాన్నచాటు బిడ్డగా కాకుండా వెండితెరపై వెలుగులీనాలనుకున్నాడు. అందుకే అవకాశం కోసం ఎదురు చూశాడు కాస్త లేటైన లేటెస్టుగా ప్రేక్షకులను మెప్పించే కామేడీ రోల్స్‌ను ఎంచుకుని భేష్ అనిపించుకుంటున్నాడు..ఇంతకీ అతనెవరో కాదండి స్టార్ మేకర్ సత్యానంద్ తనయుడు రాఘవేంద్ర. తన సినీ జర్నీ గురించి అతని మాటల్లోనే... నేను టింపనీ స్కూల్లో చదివాను. నారాయణ కాలేజీలో ఇంటర్ చే శాను. అవంతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశాను. నాన్న స్టార్ మేకర్. అమ్మ స్కూల్ టీచర్. అమ్మ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. నీకు ఏ ఇంట్రస్ట్ ఉన్నా సరే అవన్నీ చదువు తర్వాతే అన్నారు. అందుకే బీటెక్ పూర్తి చేసి సినిమాల వైపు వచ్చాను. టాలెంట్ ఉంటేనే... నేను ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు ‘బబ్లూ విత్ లవ్’ అనే ఒక ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఒక పక్క ఎగ్జామ్స్, షూటింగ్, క్లాసెస్...ఇలా అన్నీ క్లాష్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అటో ఇటో తెలియక క న్ఫ్యూజ్ అయ్యాను. అమ్మతో చెబితే ఇప్పుడు ఇవేమీ పెట్టుకోకు అని చెప్పారు. అందుకే ఇంజినీరింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేశాను. తర్వాత సంవత్సరం పాటు సినిమాల్లో ట్రై చేశాను. మా నాన్న ‘ఇతను మా అబ్బాయి.. ఇతనికి ఛాన్స్ ఇవ్వండి’ అని ఎప్పుడూ చెప్పరు. నీ అంతట నువ్వు వెళ్లు. ఆడిషన్ ఇవ్వు.. నచ్చితే తీసుకుంటారు. లేదంటే లేదు అని చెప్పేవారు. సినిమా ఫీల్డ్‌లోనే... బీటెక్ అయిపోయిన సంవత్సరం వరకు సినిమాల్లోనే ట్రై చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి కానీ పెద్ద క్యారెక్టర్స్‌కు రిజక్ట్ చేసేవారు. ఈలోగా నాకు ఒక జాబ్ వచ్చింది. సరే ఏదో ఒకటి చేయాలి కదా అని జాబ్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యాను. మరొక వారం రోజుల్లో జాబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న సమయంలో ఎమ్ఎస్ నారాయణ గారి అమ్మాయి శశికిరణ్ నుంచి ఫోన్ వచ్చింది. నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. దానికి నువ్వైతే కరెక్ట్‌గా సూట్ అవుతావు అని చెప్పింది. అమ్మను అడిగితే జాబ్ మళ్లీ వస్తుంది,ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయి అని చెప్పింది. అలా ‘సాహెబా సుబ్రమణ్యం’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘పడ్డానండీ ప్రేమలో మరి’లో హీరో ఫ్రెండ్ రోల్ చేశాను. సినిమాటోగ్రఫీ ఇంట్రస్ట్... నాన్న చెప్పే క్లాసులు చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాను. ఫ్రేమింగ్ మీద సైన్స్ క్లాస్ ఉండేది. ఎప్పుడైతే అవి విన్నానో నాకు సినిమాటోగ్రఫీ మీద ఇంట్రస్ట్ వచ్చింది. కెమెరా యాంగిల్స్ ఇలా పెట్టాలి, కలర్ కాంబినేషన్స్ ఎలా చూసుకోవాలి, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకున్నాను. 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ ఇలా మొత్తం సైన్స్ ఉంటుంది. అది నచ్చి సినిమాటోగ్రఫీ వైపు వచ్చాను. తర్వాత యాక్టింగ్‌లోకి వచ్చాను. నాన్న చెప్పే క్లాసులు అన్నీ సరదా సరదాగా ఉంటాయి.. బాగా ఎంజాయ్ చేసేవాడిని. స్టార్స్‌ను చూస్తూ పెరిగాను... నా చిన్నప్పటి నుంచి నాన్న ట్రైనింగ్ ఇచ్చే యాక్టర్స్‌ను చూస్తూ పెరిగాను. ప్రభాస్‌కు ట్రైనింగ్ ఇస్తున్న దగ్గర నుంచీ నేను అక్కడే ఉండేవాడిని. అప్పుడు నేను 6వ క్లాస్ చదువుతున్నాను. వాళ్లకి ఏది చెప్పారో నేను కూడా వాళ్లతో కలిసి అది చేసేసే వాడిని. ఒక్కోసారి వాళ్లని చూస్తే సర్ప్రైజింగ్గా ఉంటుంది. ప్రభాస్ అప్పట్లో సన్నగా పొడుగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు బాహుబలి... -
చెరుకు రైతుకు తీపి కబురు
పెద్దేముల్: మెదక్ జిల్లా సంగారెడ్డిలోని గణేష్ చెరుకు ఫ్యాక్టరీ గురువారం నుంచి ప్రారంభం కానుందని పెద్దేము ల్, బంట్వారం ఏరియా మేనేజర్ రాఘవేందర్ పేర్కొన్నారు. పెద్దేముల్ మం డల కేంద్రంలో మంగళవారం చెరుకు రైతులతో ఆయన మట్లాడారు. రైతులకు సకాలంలో లారీల కొరత లేకుం డా చూస్తానన్నారు. పెద్దేముల్, బం ట్వారం మండలాల్లో ఈ యేడాది 64 వేల టన్నుల చెరుకు కొనేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. బంట్వా రం మండలంలో 1,026, పెద్దేముల్లో 2,107 టన్నుల చెరుకు ఇప్పటివరకు రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. ఈ యేటా టన్నుకు రూ.2600 చెల్లిస్తామన్నారు. రోడ్డు మరమ్మతు చేయాలి.. రైతులు చెరుకు పంటను అమ్ముకునే ందుకు సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోంది. పెద్దేముల్-సంగారెడ్డి రోడ్డు అధ్వానంగా మారడంతో రవాణాకు ఇబ్బం దిగా ఉంది. పండించిన చెరుకు అమ్ముకునేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దళారులను ఆశ్రయిం చాల్సి వస్తోందన్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంగారెడ్డి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి.. సంగారెడ్డి గణేష్ ప్యాక్టరీ యజమాన్యం రైతులకు అందజేస్తున్న ఎరువులను మండల కేంద్రంలో అందుబాటులో ఉంచాలని పెద్దేముల్ గ్రామ రైతులు కొరుతున్నారు. ప్రతియేటా ఎరువులు అందచేస్తున్న సమయానికి అందచేయ టం లేదని, మండల కేంద్రంలో ఎరువులు అందజేయాలని కోరుతున్నారు. -
నీళ్లకోసం ఘర్షణ
కత్తులతో దాడులు నలుగురికి తీవ్ర గాయాలు మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: మంచినీళ్ల కోసం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చిన్నపాటి ఘర్షణ చినికిచినికి పెద్దది కావడంతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆది వారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. రాత్రి పూట కరెంటు సరఫరా ఉండడంతో వేంపల్లెలో అర్ధరాత్రి మంచినీటి సరఫరా చేస్తున్నా రు. గ్రామానికి వేసిన పైపులైన్లలో ప్రధాన పైపులైను చెరువుకట్ట మీద నుంచి వెళుతోంది. ఆ పైపు పగిలిపోవడంతో గ్రామానికి సరిగ్గా నీళ్లు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామానికి చెందిన శ్రీనివాసులు(38), ఇతని కుమారుడు రాజశేఖర్(21) గమనించి నీరు వృథాకాకుండా పైపును తాడుతో గట్టిగా కట్టేశారు. తెల్లవారే సరికి తిరిగి ఆ తాడు ను స్థానికంగా ఉంటున్న రమేష్ అతని కుమారుడు రాఘవేంద్ర తెంపేస్తున్నారు. ఇలా రెండు రోజులు చేశారు. ఎన్నిసార్లు పైపును కట్టినా తెంపేస్తుండడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆదివారం రాత్రి తిరిగి శ్రీనివాసులు, రాజశేఖర్, శ్రీనివాసులు అన్న నారాయణ (40), కుమారుడు చెన్నకేశవ(21) నలుగురు కలిసి నీటి సరఫరా జరిగే సమయంలో చెరువుకట్టమీదకు వెళ్లి నీటిపైపును తాడుతో బిగి స్తున్నారు. అక్కడికి వచ్చిన రమేష్, అతని కుమారుడు రాఘవేంద్ర, వీరి బంధువు నరేష్ అడ్డు తగిలారు. పైపును కట్టడానికి మీరెవరు.. సర్పంచ్‌ను పిలవండి అంటూ పరుష పదజాలంతో దూషించారు. ‘‘నీళ్లు వృథాగా పోతుంటే సర్పంచే రానక్కరలేదు.. ఎవరైనా సరిచేయవచ్చు’’ అంటూ వారు పైపును కడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ పెద్దది కావడంతో పరస్పర దాడులకు పూనుకున్నారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రమేష్, రాఘవేంద్ర, నరేష్ పక్కనే ఉన్న కత్తులు, బాకులతో దాడులు చేశారు. బాధితుల అరుపులు కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, శ్రీనివాసులు, నారాయణ, చెన్నకేశవను 108 వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి గ్రామంలో జరిగిన సంఘటనపై విచారించారు. హత్యాయత్నానికి పాల్పడినట్టు విచారణ లో తేలడంతో నలుగురు నిందితులపై 326, 307, 324, 323 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి మృతి
-
బన్ని-చెర్రి నవ్విస్తారు
ఓ పెనుమార్పు ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’. ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా హీరో, హీరోయిన్లుగా... మల్టీ డైమన్షన్ సమర్పణలో హరూన్ గని ఆర్ట్స్‌పై హరూన్ గని నిర్మించారు. రాజేష్ పులి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. హరూన్ గని మాట్లాడుతూ -‘‘మారుతి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన రాజేష్ పులి ఈ చిత్రాన్ని చెప్పిన బడ్జెట్లో తీశారు. ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన దర్శకుడాయన. ఇప్పటివరకు భారతీయ తెరపై ఇలాంటి సినిమా రాలేదు. వినోద ప్రధానంగా తీసిన చిత్రం ఇది. శ్రీవసంత్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని, అందర్నీ నవ్వించాలనే లక్ష్యంతో చేసిన సినిమా ఇది అనిదర్శకుడు తెలిపారు. యండమూరి వీరేంద్రనాధ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్, మాటలు: తిరుమలశెట్టి కిరణ్.