బంగారు పల్లకీలో మృత్తికను ఊరేగింపుగా తెస్తున్న దశ్యం
శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ
Published Tue, Jul 19 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
– బంగారు పల్లకీలో మృత్తిక ఊరేగింపు
– రాఘవేంద్రుల బందావనంతో విశేష పూజలు
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఏటా గురు పూర్ణిమను పురస్కరించుకుని మృత్తిక(మట్టి) సేకరించడం ఆనవాయితీ. మంగళవారం శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ గావించారు. వేకువ జామున సుప్రభాత సేవతో మఠంలో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం మఠం వెనుక భాగంలోని తులసీవనం చేరుకున్నారు. అక్కడ పండితుల వేదమంత్రోచ్ఛారణలు పఠిస్తుండ, మంగళవాయిద్యాల సుస్వరాల మధ్య వనంలో విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వహస్తాలతో మృత్తికను సంగ్రహణం చేశారు. మృత్తికను పవిత్రంగా స్వర్ణపల్లకీలో ఉంచగా ఊరేగింపుగా శ్రీమఠానికి తీసుకువచ్చారు. శ్రీమఠం మాడవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపు కానిచ్చారు. మృత్తికను రాఘవేంద్రస్వామి మూల బృందదావనం ముందుంచి విశేష పూజలు చేపట్టారు. అనంతరం మృత్తికను బందావనంపై ఉంచారు. సేకరించిన మృత్తికను రాఘవేంద్రుల మత్తిక బందావనాల స్థాపనకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ఆచారం. రోగ పీడిత భక్తులకు సైతం మత్తికను అందజేస్తారు. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.
Advertisement