treditional
-
Samyuktha Menon: శారీలో అలా.. హారంతో ఇలా.. బింబిసార హీరోయిన్ లుక్స్ చూశారా?
-
ట్రెడిషనల్ లుక్‌లో ‘రాధిక’ తిరుగే లేదిక (ఫొటోలు)
-
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్‌లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
-
ట్రెడిషనల్ వేర్లో కిల్లింగ్ లుక్స్... ఎవరీ బ్యూటీ (ఫోటోలు)
-
‘రామనంది’ సంప్రదాయం ఏమిటి? అయోధ్యలో పూజారులెవరు?
అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ‘రామనంది’ సంప్రదాయంలో అయోధ్య రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగనుంది. ఇంతకీ ‘రామనంది’ శాఖను ఎవరు స్థాపించారు? ఈ సంప్రదాయంలోని నియమాలు ఏమిటి? రామనంది శాఖను జగత్గురు శ్రీ రామానందాచార్య స్థాపించారు. ఈ శాఖ బైరాగిల నాలుగు పురాతన శాఖలలో ఒకటి. దీనిని బైరాగి శాఖ, రామవత్ శాఖ, శ్రీ శాఖ అని కూడా పిలుస్తారు. కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. ఈ శాఖకు చెందిన వారు ప్రధానంగా శ్రీరాముని పూజిస్తారు. ఈ శాఖలోని వారు జపించే మంత్రం ‘ఓం శ్రీరామాయ నమః’ ఈ శాఖను అనుసరించేవారు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు. రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. అంటే చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదేవిధమైన తీరులో భగవంతుని పూజిస్తారు. వీరు పూజా విధానంలో బాలరాముడిని ప్రతిరోజూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావించి.. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయించడం, గోరుముద్దలను తినిపించడం లాంటివి తమ పూజా విధానంలో భాగంగా ఆచరిస్తుంటారు. రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. నూతన రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ సమస్త పూజలు చేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు రాకండి! -
రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో వినాయక చవితి. దీన్నె గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) అని కూడా అంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకొంటారు. పండుగలో భాగంగా వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చి ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన పిండి వంటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మహారాష్ట్రలో అయితే ప్రధానంగా లడ్డూ, మోదక్, చక్లిలు, పురాన్ పోలీ వంటి వాటితో సహా ఇంకా మరెన్నో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!) చాలా మంది ఇంటిపట్టున ఉండి పండుగ జరుపుకొని సంప్రదాయక పిండి వంటకాలను ఇంట్లోనే ఆస్వాదిస్తారు. కానీ కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఈ ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించలేరు. అటువంటి వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ఆమోదిత ఫుడ్ అగ్రిగేటర్ ‘జూప్’ (Zoop) వినాయక చవితి ప్రత్యేక సంప్రదాయ వంటకాలను అందిస్తుంది. 160కి పైగా రైల్వే స్టేషన్లలో.. దీంతో పండుగ వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నోరూరించే పండుగ పిండి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలు కావాల్సిన ప్రయాణికులు జూప్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ చాట్‌బాట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మహారాష్ట్రలోని 160కి పైగా రైల్వే స్టేషన్లలో వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు. -
కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తారక్ భార్య, ఫొటోలు వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియాకు, తెరకు దూరంగా ఉండే ఆమె అందం, అభియానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఎన్టీఆర్ భార్యగా ప్రణతికి నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడూ నీరాజనాలు పడుతుంటారు. ఇక భార్య గురించి పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఆమెపై ప్రేమను చాటుకుంటుంటాడు తారక్. పెద్దగా కెమెరా ముందుకు రాని ప్రణతికి సంబంధించిన ట్రెడిషనల్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే.. ఈ ఫొటోల్లో ప్రణతి పట్టు చీరలో డైమండ్ నగలతో కుందనపు బొమ్మలో మెరిపోతోంది. ఆమె ట్రెడిషనల్ లుక్స్‌కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఫొటోలను ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ట్విటర్లో ప్రణతి ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఓ పెళ్లి కార్యక్రమంలో భాగంగా ప్రణతి అచ్చమైన తెలుగుంటి ఆడపడుచులా సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబైన ప్రణతి లేటెస్ట్ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి. చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు -
నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...
ఆయన దేశాన్ని పాలించే మహారాజు. ఆయన భార్య మహారాణి. లెక్క ప్రకారం వారికి దేనికీ కొదవే ఉండదు. వాళ్లు వేసుకునే పాదరక్షల నుంచి హెయిర్ క్లిప్‌ల వరకు అన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. మహారాణిగారు ఏ కార్యక్రమానికైనా వచ్చారంటే ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. దీనికి తగ్గట్టుగానే వారు రెడీ అవుతుంటారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త ఫ్యాషన్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు స్పెయిన్ మహారాణి లెట్జియా ఓరి్టజ్ రోకసోలానో. కార్యక్రమానికో డ్రెస్ కొనకుండా, తన దగ్గర ఉన్న పాత డ్రెస్సులను సరికొత్తగా తీర్చిదిద్ది వివిధ కార్యక్రమాలకు వాటినే వాడుతూ ఫ్యాషన్ ఐకాన్లకే సవాళ్లు విసురుతున్నారు. ఎప్పుడూ స్టైలి‹Ùగా కనిపించే లెట్జియా రెండు రోజులక్రితం రాయల్ ప్యాలెస్‌లో చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాకు ఆహా్వనం పలికే క్రమంలో నలభై ఏళ్లనాటి డ్రెస్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించారు. ఈ గౌనుకు పెద్ద చరిత్రే ఉంది. లెట్జియా అత్తగారు క్వీన్ సోఫియా నలభై ఏళ్ల క్రితం ధరించిన ఈ గౌనును ఇప్పటి మహారాణి ధరించడం విశేషం. పొట్టి చేతులు, పింక్ పేస్టల్ కలర్లో ఫ్రాక్. పువ్వులతో మోకాళ్ల కింద వరకు స్కర్ట్‌ను ధరించారు. మహారాజు జువాన్ కార్లోస్–1తో కలిసి, క్వీన్ సోఫియా 1981లో రోమ్ను సందర్శించారు. ఆ సమయంలో సోఫియా ఈ డ్రెస్‌ను ధరించారు. ఆనాటి డ్రెస్‌ను వార్డ్రోబ్ లో నుంచి తీసి దానిని వెండి, రత్నాలతో మరింత అందంగా డెకొరేట్ చేసి, సిల్వర్ బెల్ట్‌తో ధరించి చూపరులను ఆకట్టుకుంది లెట్జియా. అంతేగాక ఈ వారం లో జరిగిన రెటీనా ఈసీవో అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న లెట్జియా ఒక నలుపు రంగు గౌనును వేసుకున్నారు. ఈ గౌనును సేంద్రియ వెదురుతో తయారు చేయడం విశేషం. ఇద్దరమ్మాయిలకు తల్లి అయిన లెట్జియా, ఒకపక్క తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో తరచూ పొల్గొంటూ ఉంటారు. ఆమె ధరించే డ్రెస్‌లు ఎంతో సింపుల్‌గా స్టైలిష్‌గా ఉండడమేగాక, దాదాపు రీసైక్లింగ్ చేసినవి కావడంతో అంతా లెట్జియా డ్రెస్‌లను ఆసక్తిగా గమనిస్తుంటారు. -
సంప్రదాయబద్ధంగా ఓనమ్
చింతలపూడి : స్థానిక భాష్యం స్కూల్లో బుధవారం ఓనమ్ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు కేరళ యువతుల వస్త్ర ధారణలతో ఆకట్టుకున్నారు. భాష్యం జోనల్ ఇన్చార్జి జి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఎల్.కష్ణ, లిటిల్ చాంప్స్ ఇన్చార్జి కె.సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాళ్లపూడి : తాళ్లపూడిలోని మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో ఓనమ్ పడుగను కేరళీయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ వీవీ అనీష్, కేరళకు చెందిన టీచర్లు, ఉపాధ్యాయులు ఈ ఓనమ్ వేడుకల్లో పాల్గొన్నారు. రకరకాల పూలతో రంగవల్లికలు తీర్చిదిద్ది మద్యలో కొబ్బరి పూలను ఉంచారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏటా ఓనమ్ పండుగ జరుపుకుంటున్నట్టు చెప్పారు. -
సమనకేర్.. సంప్రదాయ వేడుక
– గిరిజనుల పండగ – అంటువ్యాధులు ప్రబలకుండా కుల దైవానికి వేడుకోలు – జిల్లాలోని 61 తండాల్లో వేడుక – ఈ నెల చివరి వరకు పూజలు కర్నూలు సీక్యాంప్: సమనకేర్..ఇదో గిరిజన పండగ. ఊరూవాడ, పిల్లాజల్లా అందరూ బాగుండాలని ప్రతీ సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుక. జిల్లాలోని 61 తండాల్లో ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన పూజలు ఆగస్టు నెల ఆఖరు వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సమనకేర్ ప్రత్యేక, విశిష్టతలపై ప్రత్యేక కథనం సమన అంటే ఊరి బయట అని అర్థం. ఊరి చివరికి వెళ్లి అమ్మవారికి యాటను బలి ఇచ్చి అక్కడ అన్ని కుటుంబాలు వెళ్లి సామూహిక విందును ఆరగిస్తారు. ఊరి చివరకు వెళ్లి తిని వచ్చిన అనంతరం గ్రామంలో దోమలను, ఈగలను అమ్మవారు గ్రామం బయటకు పంపేస్తారని వారి విశ్వాసం. తర్వాత దోమలు, ఈగల ద్వారా రోగాలు ప్రబలబోవని వారి నమ్మకం. ప్రతీ ఏడాది ఈ పండుగ నిర్వహిస్తారు. పూర్వాకాలంలో దోమలు, ఈగలతో కలరా, మలేరియా లాంటి అంటురోగాలు ప్రబలి జనం మత్యవాత పడేవారు. దీంతో గిరిజనులు తమ కుల దైవం దండిమారెమ్మ, గిరిజనుల గురువు సేవాలాల్ మహరాజ్‌కు పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి రోగాలు దరిచేరలేదని..అందుకే ఏటా ఈ పండగను జరుపుకుంటామని గిరిజన పెద్దలు చెబుతున్నారు. పూజలు ఇలా చేస్తారు... గిరిజనుల కుల దైవం దండి మారెమ్మ తల్లికి యాటను బలి ఇచ్చి నైవేద్యం సమర్పిస్తారు. వారి గురువు సేవాలాల్ మహరాజ్‌కు బెల్లంతో తయారు చేసిన అన్నం నైవేద్యంగా పెడతారు. అనంతరం దేవతలకు తమ గ్రామంలో, తమ కులంలో, రాష్ట్రంలో ఉన్న సమస్యలు చెప్పి బాధా తప్ప హదయాలతో వాటిని తీర్చాలని కోరుతారు. అనంతరం సామూహిక భోజనం చేస్తారు. ప్రభుత్వం గుర్తించాలి: రాంనాయక్ లంబాడీ కులం పెద్ద తెలంగాణ ప్రభుత్వం ఈ పండగను అధికారికంగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పండగను గుర్తించలేదు. గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి అన్ని పండుగలతో పాటు సమానంగా మాకు సమనకేర్ కానుకలు ఇవ్వాలి. అంటురోగాలు ప్రబలకుండా ప్రార్థిస్తాం: హాషాబాయ్ పూసల కార్తెలో అంటురోగాలు ప్రబలకుండా సమనకేర్ పూజ చేస్తాం. దేశవ్యాప్తంగా గిరిజనులు ఈ పండుగను నిర్వహిస్తారు. గ్రామంలో ఈ సీజన్లో దోమల ద్వారా వచ్చే అంటురోగాలు ప్రబలకుండా అమ్మవారిని మొక్కుతాం. -
శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ
– బంగారు పల్లకీలో మృత్తిక ఊరేగింపు – రాఘవేంద్రుల బందావనంతో విశేష పూజలు మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఏటా గురు పూర్ణిమను పురస్కరించుకుని మృత్తిక(మట్టి) సేకరించడం ఆనవాయితీ. మంగళవారం శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ గావించారు. వేకువ జామున సుప్రభాత సేవతో మఠంలో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం మఠం వెనుక భాగంలోని తులసీవనం చేరుకున్నారు. అక్కడ పండితుల వేదమంత్రోచ్ఛారణలు పఠిస్తుండ, మంగళవాయిద్యాల సుస్వరాల మధ్య వనంలో విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వహస్తాలతో మృత్తికను సంగ్రహణం చేశారు. మృత్తికను పవిత్రంగా స్వర్ణపల్లకీలో ఉంచగా ఊరేగింపుగా శ్రీమఠానికి తీసుకువచ్చారు. శ్రీమఠం మాడవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపు కానిచ్చారు. మృత్తికను రాఘవేంద్రస్వామి మూల బృందదావనం ముందుంచి విశేష పూజలు చేపట్టారు. అనంతరం మృత్తికను బందావనంపై ఉంచారు. సేకరించిన మృత్తికను రాఘవేంద్రుల మత్తిక బందావనాల స్థాపనకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ఆచారం. రోగ పీడిత భక్తులకు సైతం మత్తికను అందజేస్తారు. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.