సంప్రదాయబద్ధంగా ఓనమ్
సంప్రదాయబద్ధంగా ఓనమ్
Published Wed, Sep 14 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
చింతలపూడి : స్థానిక భాష్యం స్కూల్‌లో బుధవారం ఓనమ్ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు కేరళ యువతుల వస్త్ర ధారణలతో ఆకట్టుకున్నారు. భాష్యం జోనల్ ఇన్‌చార్జి జి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఎల్.కష్ణ, లిటిల్ చాంప్స్ ఇన్‌చార్జి కె.సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాళ్లపూడి : తాళ్లపూడిలోని మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో ఓనమ్ పడుగను కేరళీయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ వీవీ అనీష్, కేరళకు చెందిన టీచర్లు, ఉపాధ్యాయులు ఈ ఓనమ్ వేడుకల్లో పాల్గొన్నారు. రకరకాల పూలతో రంగవల్లికలు తీర్చిదిద్ది మద్యలో కొబ్బరి పూలను ఉంచారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏటా ఓనమ్ పండుగ జరుపుకుంటున్నట్టు చెప్పారు.
Advertisement