onam
-
విశాఖపట్నంలో వైభవంగా ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘బుట్టబొమ్మ’ అనిఖా సురేంద్రన్ ఓనం లుక్‌లో ఎంత క్యూట్‌గా ఉందో! (ఫొటోలు)
-
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్‌లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్‌లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్‌కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్‌కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ మామూలుగా లేరు!
మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఓనం వచ్చేసింది. కేరళలో అందరూ వేడుకగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరీ మలయాళ బ్యూటీస్ ఊరుకుంటారా? పద్ధతైన చీరల్లో మెరిసిపోయారు. అందమే అసూయపడేలా ధగధగాలాడిపోయారు. అనుపమ, అమలాపాల్, కల్యాణి ప్రియదర్శన్, మాళవిక మోహనన్, హనీరోజ్, మమిత బైజు.. ఇలా అందరూ తమ అందంతో మాయ చేసేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు లుక్కేసేయండి.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by @studio.omal View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by NAMITHA PRAMOD (@nami_tha_) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Sanjana Singh (@actresssanjana) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anjali Nair (@ianjali.nair) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Femina⚡️George (@feminageorge_) -
కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్
తెలుగులో అప్పట్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. మధ్యలో రెండో పెళ్లి చేసుకుంది. 2023లో పెళ్లి జరగ్గా.. ఈ జూన్‌లో కొడుకు పుట్టాడు. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. అలానే క్యూట్ ఫొటోలకు పోజులిచ్చింది.(ఇదీ చదవండి: ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్)తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది.ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. అలానే భర్తని ముద్దాడింది. ఈ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫ్యామిలీని చూస్తుంటేనే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Onam Special Trains: ఓనమ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఓనమ్ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కాచిగూడ–కొల్లాం (07044/07045) రైలు ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు బయల్దేరి మర్నాడు.. రాత్రి 11.20 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 16వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాగా, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నిరాశే ఎదురవుతోంది. సంక్రాంతికి నాలుగు నెలల ముందే ప్రధాన రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ రిజర్వేషన్లు శుక్రవారం ఉదయం 8 గంటలకు అందుబాటులోకి రాగా.. గోదావరి, విశాఖ, కోణార్క్, ఫలక్‌నుమా తదితర రైళ్లకు 8.05 గంటలకల్లా పూర్తిస్థాయిలో బెర్తులు నిండిపోయాయి. కేవలం ఐదు నిమిషాలలోనే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.ఇదీ చదవండి: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు -
ఓనం అంటే సంబరం, సరదా, సాధ్య!
దక్షిణ రాష్ట్రమైన కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మరో విధంగా చెప్పాలంటే తెలుగువారికి సంక్రాంతి అంత సంబరం. రుతుపవనాల ముగింపుకు గుర్తుగా రాక్షసరాజు బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఘనంగా మలయాళీలు జరుపుకునే పండుగ. సంప్రదాయం,రుచులు కలగలిసిన ఓనం అనగానే రకరకాల వంటలు, వైవిధ్యభరితమైన రుచులు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రదేశంలోఉన్నా కేరళ ప్రజలు ఓనంని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సెప్టెంబరు 6 న మొదలైన ఈ ఏడాది ఓనం పండుగ సంబరాలుఆఖరిరోజు సెప్టెంబరు 15న ముగుస్తాయిఓనం అంటే పువ్వులతో అందమైన అలంకరణ, చూడముచ్చటగొలిపే ముస్తాబు. పసందైన విందు భోజనం సాధ్య. ఎర్రబియ్యంతో చేసిన అన్నం, ఇంకా ఉప్పేరి, పసుపు , ఆవాలు మ్యారినేట్ చేసిన పనీర్ కర్రీ, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో చేసే అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఇంకా తోరన్, శర్కరవరట్టి, ఉల్లి వడ అవియల్, సాంబారు, తదితర 20కి పైగా వంటకాలతో అరిటాకు బోజనం మరీ స్పెషల్. పరిప్పు కర్రీపెసరపప్పు, కొబ్బరితో చేసి పరిప్పు కర్రీ. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి (ఇష్టమున్నవారు)వేసి మిక్సీలో వేసుకుని కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. ఇపుడు ఉడికిన పప్పులో పసుపు, కొబ్బరి ముద్ద వేసి బాగా కలపి, దీంట్లో కొద్దిగా నీళ్లుపోసుకుని సన్నని మంట మీద ఉడికించాలి. తగినంత ఉప్పు, చిటికెడు, నల్ల మిరియాల కలపాలి. (కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!)తాలింపు: నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపడలాడాక, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ఓనం సాధ్యలో బియ్యంతో కలిపి వడ్డిస్తారు. దీంతోపాటు, అప్పడం, పచ్చడి ఉంటుంది. అన్నట్టు ఓనంలో మరో స్పెషల్ పచ్చడి.పచ్చడిసాధ్యలో ఎన్నో రకాల పచ్చళ్లను వడ్డిస్తారు. బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్ ఇలా ఏ కూరగాయచ పండుతోనైనా రుచికరంగా తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా భుజిస్తారు.సాంబారుమన విందుభోజనాల్లోఉన్నట్టే కేరళీయులు సాంబారును బాగా ఇష్టపడతారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబారును తయారు చేస్తారు. చివరిగా పాయసం లాంటి ఇతర అనేక తీపి పదార్థాలతో నోరును తీపి చేసుకుంటారు. ఇదీ చదవండి : మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్ -
ఆశిష్ - రూపాలి.. రెండో పెళ్లి తర్వాత తొలిసారిగా అలా!
పోకిరీ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి. ఈ సినిమాలో పోలీసు పాత్రలో అభిమానులను అలరించారు. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించారు. అయితే ట్రావెల్ చేస్తూ వీడియోలు చేస్తున్న ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆయనకు పెళ్లి కాగా.. మొదటి భార్యతో 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!) తాజాగా ఇటీవల ఆయన సొంతూరుకు వెళ్లారు. కేరళలోని హోమ్ టౌన్‌కు వెళ్లిన ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన రెండో భార్య రూపాలిని మొదటిసారి మా ఊరికి వచ్చిందని వెల్లడించారు. తనకు సొంత గ్రామాన్ని సందర్శించడం సంతోషంగా ఉందంటూ తను బాల్యంలో ఉన్న ఇంటిని వీడియో చూపించారు. తొలిసారి తన భార్యతో కలిసి ఓనం పండుగకు వచ్చామని ఆశిష్ వివరించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'కేరళలోని నా స్వస్థలాన్ని సందర్శించాను. ఇక్కడ నా బాల్యంలో జ్ఞాపకాలు ఉన్నాయి. రూపాలికి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. తనతో కలిసి మొదటి ఓనం జరుపుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేటు వయసులో పెళ్లి అవసరమా? అంటూ చాలా మంది విమర్శలు చేశారు. అయితే వాటిని ఆయన సున్నితంగా కొట్టిపారేశారు. రెండో భార్య రుపాలీ బరూవా సైతం అలాంటి వాటిని పట్టించుకోనని గతంలోనే తెలిపింది. (ఇది చదవండి: విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్!) View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) -
ఓనం సెలబ్రేషన్స్‌లో స్టార్ కపుల్.. ట్విన్స్‌తో తొలిసారిగా!
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న భామ గతేడాది జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లిదండ్రులయ్యారు. అయితే నయన్ దంపతులు సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఇప్పటివరకు తమ పిల్లల మొహాలను ఇప్పటివరకు అభిమానులకు చూపించలేదు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి!) తాజాగా కేరళలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓనం పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి తొలిసారిగా ఓనం జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సెలబ్రేషన్స్‌తో పాటు తన భార్య, పిల్లలతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. 'మా జీవితంలో అందమైన, అద్భుతమైన క్షణాలు.. ఉయిర్, ఉలగంతో కలిసి తొలిసారిగా ఓనం పండుగ జరుపుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
మరోసారి వెనక్కు తగ్గిన మోహన్‌లాల్
మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. 2020 మార్చి 26న విడుదలకు షెడ్యూల్ అయిన ఈ చిత్రం కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘మరక్కర్’ సినిమాను ఓనమ్ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మంగళవారం మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 16వ శతాబ్దానికి చెందిన నేవల్ కమాండర్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... తాజా జాతీయ అవార్డుల్లో ‘మరక్కర్’ సినిమా మూడు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్) అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. -
ప్రియుడితో కలిసి కొచ్చికి నయన్
దక్షిణాది స్టార్ ప్రేమ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ నేడు ఉదయం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన ఓనం పండగ కోసం వీరిద్దరూ ప్రైవేటు జెట్ విమానంలో కొచ్చికి విచ్చేశారు. కాగా సుమారు ఎనిమిది నెలలుగా నయన్, విఘ్నేశ్ చెన్నైలోనే ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఓనం పండగ జరుపుకునేందుకు నయన్ తన ప్రియుడితో కలిసి కొచ్చికి వచ్చారు. ఈ సందర్భంగా అప్పుడే ఫైట్ దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యిందా..? ) కాగా సమయం దొరికితే చాలు విహార యాత్రలకు వెళ్లే ఈ ప్రేమ పక్షులు ఈ మధ్య గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టే, వైవాహిక జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా సాగాలని కోరుకునేందుకు పూజలు కూడా చేస్తున్నారని భోగట్టా. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ కెరీర్‌పరంగా అనుకున్నది సాధించాకే పెళ్లి పీటలెక్కుతామని తేల్చి చెప్తున్నారు. ఇదిలా వుంటే నయనతార తాజాగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'నేత్రికన్'ను ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ స్వయంగా నిర్మిస్తున్నారు. అలాగే ఆమె నటిస్తోన్న 'కాతు వాకుల రెండు కధల్' అనే చిత్రానికి విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: బోర్ కొట్టినప్పుడే పెళ్లి ) -
ఓటీటీలో ఓనమ్
కేరళ పెద్ద పండగ ఓనమ్. మలయాళ సినిమాకి ప్రియమైన పండగ. ప్రతీ ఏడాది కనీసం నాలుగు కొత్త సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా థియేటర్లోకి వస్తాయి. అయితే ప్రతీ ఏడాది పండగ థియేటర్స్‌లో జరిగేది. ఈ ఏడాది ఇంట్లోనే జరగనుంది. పని ఆగిపోయుండొచ్చు. కానీ పండగ ఆగకూడదు. సంబరం అస్సలు ఆగకూడదు. తాజాగా మూడు మలయాళీ సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా ఇంటికి (ఓటీటీ)లోకి వస్తున్నాయి. ‘ఓటీటీలో ఓనమ్’ విశేషాలేంటో చూద్దాం. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ టోవినో థామస్ హీరోగా జో బేబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’. కేరళ టూరిజమ్‌ని ఆస్వాదించడానికి వచ్చిన ఓ విదేశీ అమ్మాయికి కేరళను పరిచయం చేసే పాత్రలో టోవినో పాత్ర ఉంటుంది. ఇదో రోడ్ మూవీ. హీరో హీరోయిన్ తమ బైక్ మీద కేరళను ఎలా చుట్టేస్తారనేది కథలో ముఖ్యభాగం. హీరోగా నటించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించారు టొవినో. ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అంతే కాదు ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని నేరుగా టీవీలోనూ (ఏషియానెట్ ఛానెల్) ప్రసారం చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. సీ యూ సూన్ లాక్డౌన్ వల్ల సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఓ కొత్త ఛాలెంజ్ స్వీకరించారు ఫాహద్ అండ్ టీమ్. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో ఫాహద్, రోషన్ మాథ్యూ, దర్శన ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సీ యూ సూన్’. ఈ చిత్రాన్ని చాలా శాతం వరకూ ఐ ఫోన్లోనే చిత్రీకరించారు. తప్పిపోయిన స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటర్నెట్ సహాయంతో ఎలా వెతికి పట్టుకున్నారన్నది కథాంశం. 98 నిమిషాలు నిడివి ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. మణియరాయిలే అశోకన్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే నిర్మాతగానూ మారారు. ఆయన నిర్మాణంలో వస్తున్న మరో సినిమా ‘మణియరాయిలే అశోకన్’. జాకోబ్, అనుమపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి షామ్జూ జేబా దర్శకత్వం వహించారు. అనుపమ హీరోయిన్గా నటించడం మాత్రమే కాకుండా ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేశారు. ‘‘ఇలాంటి ముద్దొచ్చే ప్రేమకథను నిర్మించడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు నటుడు దుల్కర్. ఈ సినిమాలో దుల్కర్ ఓ అతిథి పాత్ర చేశారని కూడా టాక్. ఈ చిత్రం నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. -
ఇక సినీ వెల్లువ
వరద విలయం సృష్టించింది.చేయీ చేయీ కలిపిన జనం దానిని ఎదిరించి నిలబడ్డారు.కొన్ని చోట్ల కరెంటు లేదు.కొన్ని చోట్ల నీళ్లు లేవు.కొన్ని చోట్ల నీడ.కాసింత నిరాశ ఉంటుంది.కాని ఈ నిరాశకు రిలీఫ్‌గా అక్కడ కొత్త సినిమాలు రానున్నాయి.మా సినిమాలు చూసి రీచార్జ్ అవ్వండి అంటున్నారు అక్కడి పెద్ద హీరోలు. నిజమే. ఆ వరదకు జవాబు ఈ వెల్లువే కదా అభిమానులకు. మనకు సంక్రాంతి, దసరాలానే కేరళకు ఓనమ్. ఇది ఓనమ్ సీజన్.ఈ సీజన్లో సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసి జోరుగా బిజినెస్ చేసుకోవాలని భావిస్తుంటారు నిర్మాతలు. కాని అనూహ్యంగా ఈ ఏడాది ఈ సీజన్లోనే కేరళకు వరద వచ్చింది. రాష్ట్రం చాలా దెబ్బ తినింది. సినిమా ఇండస్ట్రీ కూడా. ఆగస్ట్‌లో ఓనమ్ సీజన్లో రిలీజ్ కావల్సిన 5–6 సినిమాలు ఇప్పుడు డేట్ చూసుకొని షోకు సిద్ధం అవుతున్నాయి. ముందు వసతి తర్వాతే వినోదం కేరళ ప్రజలకు ఉండటానికి చోటు, తినడానికి సరైన తిండి కూడా లేనప్పుడు సినిమాల రిలీజు సరిౖయెన పని కాదని అనుకుంది అక్కడి ఇండస్ట్రీ. కనీస వసతుల మీద దృష్టి పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి తానూ చేయ దగ్గ సాయం చేసింది. మరోవైపు ఈ వరదల ద్వారా ఎంతో మంది బాధకు గురవుతుంటే మిగతా వాళ్లు పండగ సంబరాల్లో మునిగి తేలడం కూడా కరెక్ట్ కాదని స్టేట్ గవర్నమెంట్ కూడా పేర్కొంది. అందుకనే కేవలం సినిమా రిలీజ్‌లనే కాదు కేరళలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చాలా సినిమాల షూటింగ్‌లు ఆపేశారు. ఫాహద్ ఫాజల్ లేటెస్ట్ సినిమా కోసం వేసిన సెట్ వరదల్లో కొట్టుకుపోయిందని చిత్రబృందం పేర్కొంది. ఈ పండక్కు రిలీజ్ కావల్సిన కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేశారు చిత్రబృందాలు. ఈ సినిమాలను వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి రీ షెడ్యూల్ చేశారు. మలయాళ సినీ చరిత్రలో ఓనమ్‌కు సింగిల్ సినిమా కూడా రిలీజ్ లేకపోవడం ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఓనమ్‌కు కేరళ మార్కెట్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాల్లో ముందుగా... మలయాళం క్రేజీ ప్రాజెక్ట్.. ‘ప్రేమమ్’ ఫేమ్ నివీల్ పౌలీ హీరోగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘కాయమ్‌కులమ్ కొచ్చున్ని’. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దంలో నివసించిన కాయమ్‌కులమ్ కొచ్చున్ని అనే దొంగ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్న వాళ్ల దగ్గర దోచుకొని పేదవాళ్లకు పంచే రాబిన్‌హుడ్ క్యారెక్టర్. ఈ పాత్రను నివీన్ పౌలీ పోషించగా అతని గురువుగా మోహన్‌లాల్ కనిపిస్తారు. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. వరదల కారణంగా పోస్ట్ పోన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అల్లరి చేసే మమ్ముట్టి.. పండక్కి స్టార్ హీరో సినిమా లేకపోతే కచ్చితంగా ఆ వెలితి కనిపిస్తుంది. అయితే ఈసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’ సినిమాతో వస్తున్నారు. ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి గ్యాంగ్‌కి లీడర్‌గా కనిపిస్తారు మమ్ముట్టి. చేసిన పనికి, చేయని పనికి కచ్చితంగా బ్యాడ్ నేమ్ మాత్రం మన హీరోకే వస్తుందట. ఇలాంటి లైట్ హార్ట్ కామెడీతో రూపొందిన చిత్రం ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’. ‘అవును’ ఫేమ్ పూర్ణ, రాయ్ లక్ష్మీ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. శేతు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్ట్ 24న విడుదల కావల్సింది. ఇప్పుడు సెప్టెంబర్ 14న రిలీజ్ కానుంది. హార్రర్ థ్రిల్లర్‌గా.. ఫాహద్ ఫాజిల్ ‘వరతాన్’ చిత్రం కుడా ఓనమ్‌కు వస్తుందని చాలా రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్నారు చిత్రబృందం. కెమెరామేన్, డైరెక్టర్ అమల్ నీరాద్ తెరకెక్కించిన ఈ సినిమాను అమల్ నీరద్‌తో కలసి ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నిర్మించారు. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సినిమాలో ఓ రొమాంటిక్ పాటను కూడాపాడారు నజ్రియా. చైన్ స్మోకర్ సెటైర్ 2017లో మలయాళం సూపర్ హిట్ ‘మాయనది’తో మంచి పేరు సంపాదించుకున్న టోవినో థామస్ ఈ ఓనమ్‌కు ‘తీవండి’తో వస్తున్నారు. తీవండి అంటే చైన్ స్మోకర్ అని అర్థం. పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓనమ్ ఫెస్టివల్‌కి చాన్స్ లేకపోవడంతో సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఓనమ్‌కి రావాలనుకున్న కొన్ని సినిమాలు ‘కామెడీ పడయోట్టమ్’, ‘జానీ జానీ యస్ పాప్ప’, ‘మాంగళ్యం తంతూనానేనా’ సినిమాలను కూడా వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమాల కోసం థియేటర్లు పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. వరదల కారణంగా పలు థియేటర్లు నీట మునిగిపోయాయి. కేవలం థియేటర్స్ ఏరియా నష్టమే సుమారు 30 కోట్లు వరకూ ఉండొచ్చని కేరళ ఫిల్మ్ చాంబర్ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటు షూటింగ్ నిలిపివేత, అటు కొత్త చిత్రాల విడుదల ఆపివేత.. మొత్తంగా కేరళ ఎంటర్టైన్మెంట్ ఇండ్రస్టీకి తీరిన నష్టమే అని చెప్పాలి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మళ్లీ కేరళ కళకళలాడాలని, కొత్త రిలీజులతో థియేటర్లు సందడి చేయాలని, ఎప్పటిలా షూటింగ్స్ జోరుగా జరగాలని కోరుకుందాం. కాలం మన నేస్తం కేరళ ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ‘ప్రేమదేశం’ కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్ లిరిక్‌ని మార్చి తన కాలిఫోర్నియాలో షోలో పాడారు ఏఆర్ రెహమాన్. ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు రెహమాన్‌కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడారు. అందరూ తమ ప్రేయర్స్‌ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్ పాట ద్వారా తన సందేశం పంపారు. మేమున్నామని... కేరళకు మేమున్నాం అంటూ మోహన్‌లాల్, మమ్ముట్టి చేరో 25 లక్షలు సీయం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. కొంత మంది హీరోలు డబ్బు రూపంలో సహాయం చేస్తే మరికొందరు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కేరళకు సహాయంగా తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, విజయ్ దేవరకొండ ఇలా పలువురు కళాకారులు ఆర్థిక సహాయం చేశారు. తమిళనాడు నుంచి రజనీకాంత్, విక్రమ్, సూర్య, విజయ్ తదితరులు విరాళం అందజేసినవారిలో ఉన్నారు. పలువురు కథానాయికలు సైతం కేరళకు మేమున్నామని సహాయానికి ముందుకొచ్చారు. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి వారు కూడా చేయూతనిచ్చారు. కేరళ వరదలపై డాక్యుమెంటరీ 2018లో వచ్చిన వరదలు గత వందేళ్లలో కేరళ ఎప్పుడూ చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని విజువల్‌గా చూపించదలిచారు దర్శకుడు మధుసూదనన్. వరద సమయాల్లో ఫోన్ లేదా కెమెరాతో షూట్ చేసిన వీడియోస్ అన్నింటినీ కలిపి ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. కెమెరామేన్, దర్శకుడు రాజీవ్ రవి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టెక్నికల్ విషయాలను చూసుకుంటారట. ‘ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌తో వచ్చే డబ్బులను కేరళను మళ్లీ రీ–బిల్డ్ చేసే పనులకు వినియోగిస్తాం’ అని దర్శకుడు మధుసూదనన్ పేర్కొన్నారు. రానా 2 సినిమాలకు బ్రేక్ రానా నటిస్తున్న బహు బాషా చిత్రాలు ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ కూడా కేరళలోని వరదల కారణంగానే ఎఫెక్ట్ అయ్యాయి. ‘హాథీ మేరీ సాథీ’ సినిమా ఎక్కువ శాతం ఏనుగులు, అడవికి సంబంధించిన కథ. ఈ సినిమాకు సంబంధించిన చాలా పోర్షన్ కేరళ దట్టమైన అడవుల్లో షూట్ చేయాలి, కానీ ప్రస్తుతం కేరళలోని వాతావరణ పరిస్థితులు సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించాయి అని రానా పేర్కొన్నారు. అలాగే 1945 కోసం వేసిన సెట్ వరదల కారణంగా ధ్వంసం అవడంతో యూనిట్ డైలమాలో పడింది. అయితే ఈ బ్రేక్ తాత్కాలికమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అల్లుడు ఆలస్యం అయ్యాడు కేరళలోని వరదల ప్రభావం కొన్ని తెలుగు సినిమాలపైన కూడా పడింది. హీరో నాగచైతన్య దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రీ రికార్డింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసుకోవల్సి వచ్చింది. కేరళ సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకుడు మారుతి లాస్ట్ మినిట్ వరకూ కేరళ వాతావరణంతో ఫైట్ చేసి రీ–రికార్డింగ్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దాంతో ఈ సినిమాను వచ్చే నెల 13న రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్రబృందం. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
డ్రైవర్‌కు ఓనం బంపర్ లాటరీ
మల్లప్పురం: కేరళకు చెందిన ముస్తఫా బంపర్ ఆఫర్ కొట్టేశారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఓనం బంపర్ లాటరీ లోరూ 10కోట్లను దక్కించుకున్నాడు. పరప్పనాన్గడి సమీపంలోని మూనినియూర్ కు చెందిన ముస్తఫా మూత్తరమ్మాళ్ (48) ఈ ప్రభుత్వం నిర్వహించే ఓనం లాటరీ ప్రథమ బహుతి గెల్చుకున్నారు. దీని విలువ రూ. 10కోట్లు. శుక్రవారం నిర్వహించిన డ్రాలో బంపర్ బహుమతి విజేతగా నిలిచారు. దీంతో శనివారం ఫెడరల్ బ్యాంక్ మేనేజర్ కు టికెట్ ను (AJ2876) ముస్తఫా అందజేశారు. దీంతో ముస్తఫా కుటుంబంలో దసరా సంబరాలు, వేలదివ్వెల దీపావళి కాంతులు ఒక్కసారిగా విరజిల్లాయి. అటు గ్రామస్తులతో ముస్తఫా సెల్ఫీల జోరు సాగింది. ఐదుగురు సభ్యులతో కూడిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముస్తఫా, పికప్ వాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు . తన తండ్రి మరణించిన తరువాత కొబ్బరి వ్యాపారాన్ని చేపట్టాడు. ఈ సొమ్ముతో కొబ్బరి కాయల వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు, సొంత ఇల్లు కట్టుకోవాలని యోచిస్తున్నాడు. తాను ఇరవై సంవత్సరాల నుంచి లాటరీ టిక్కెట్లను కొనటం మొదలుపెట్టాననీ, ఇపుడు ఓనం బంపర్ టికెట్ బహుమతి గెల్చుకోవడం సంతోషంగా ఉందని ముస్తఫా చెప్పారు. అయితే బహుమతి సొమ్ములో కోటి రూపాయలు కమిషన్ టికెట్ అమ్మిన ఏజెంట్‌కు దక్కనుందని తెలుస్తోంది. -
ఓనం పూట బీఫ్ తిన్న నటి.. విమర్శలు
సాక్షి, కొచ్చి: మళయాళం స్టార్ నటి బీఫ్ వివాదంలో చిక్కుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందిన సురభి లక్ష్మి ఓనం పండగ రోజు బీఫ్ తిన్న కారణంగా విమర్శలు ఎదుర్కుంటోంది. కొన్నాళ్ల క్రితం తన స్నేహితులతో ఓ హోటల్‌కు వెళ్లిన సురభి బీఫ్ ఫ్రైను ఎంజాయ్ చేస్తూ ఓ సెల్ఫీ దిగి దానిని తన ఫేస్బుక్లో షేర్ చేసింది. అయితే వాటిని చూపిస్తూ ఓనం పూట ఓ ఛానెల్ వాళ్లు ఓ కార్యక్రమం ప్రసారం చేశారు. అంతే శాఖాహర ఫెస్టివల్ అయిన ఓనం పూట గోమాంసం తింటావా? అంటూ సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర పదజాలంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే అది ఓనం కంటే మూడు వారాల కంటే ముందే దిగానని, కొజికోడ్‌లోని తన ఫెవరెట్ హోటల్‌కు వెళ్లినప్పుడు దిగిన ఫోటో అని సురభి క్లారిటీ ఇచ్చారు. ‘ఓ కార్యక్రమం కోసం నేను అక్కడికి వెళ్లాను. బాగా ఆకలేసింది. ఆ సమయంలో నేను తింది బీఫా?చికెనా? పంది మాంసమా? అని ఆలోచించలేదు. మనిషికి ఆకలి ముఖ్యం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ఆ కార్యక్రమం ఓనం రోజు ప్రసారం కావటం అని ఆమె చెప్పారు. -
అయ్యో! షి సెడ్ నో!!
అందమైన లోకం ఇతడి పేరు టాంగ్ ఓనమ్. చైనా అబ్బాయి. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు తన ప్రేమను తెలియజెయ్యాలనుకున్నాడు. మామూలుగా అయితే అబ్బాయిలు ఇల్లెక్కి ఐ లవ్ యు అని ఊరంతటికీ వినిపించేలా చెప్తారు. లేదంటే, గుట్టుగా వెళ్లి అమ్మాయి ముందు మోకరిల్లుతారు. టాంగ్ డిఫరెంట్. ఈ రెండూ చెయ్యలేదు. ఆ అమ్మాయి ముఖారవిందం వచ్చేలా ఓ పెద్ద రూబిక్ క్యూబ్‌ని తయారు చేసి ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అమ్మాయి కళ్లు మిలమిల్లాడాయి! ‘వావ్’ అంది. బట్.. సారీ చెప్పేసింది! నీ కానుకను స్వీకరించగలను కానీ, నీ ప్రేమను అంగీకరించలేను అని చెప్పేసింది! ఓనమ్ హర్ట్ అయ్యాడు. కానుక తీసుకుంది అదే పదివేలు అనుకున్నాడు. పదివేలు అనుకున్నా, టాంగ్కి ఇంకా 20 వేలు లాసే! నచ్చిన చిన్నదాన్ని రూబిక్ క్యూబ్‌లోకి తెప్పించడానికి అతడికి 460 డాలర్లు ఖర్చయింది. ఇండియన్ కరెన్సీలో ముప్పై వేలు! ఈ లెక్కలన్నీ మనవి. నిజానికి టాంగ్ డబ్బు లెక్కలు చూసుకోలేదు. పడ్డ కష్టాన్ని కూడా చూసుకోలేదు. టాంగ్ మెకానిక్. తెలివైనవాడు. తెలివైనవాడి ఎక్స్ప్రెషన్ కూడా తెలివిగానే ఉంటుంది కదా! రూబిక్తో ఐ లవ్ యు చెప్పాలన్న ఆలోచన రాగానే ముందతడు ఫొటోషాప్‌లో ఆమె ఫొటోతో నమూనా తయారుచేసుకున్నాడు. 2.1 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పులో ఆ నమూనాకు ఒక ఆకృతిని ఇచ్చాడు. ఆ ఆకృతిలోని గడులను ఫాలో అవుతూ రూబిక్ క్యూబ్‌లోని కలర్స్‌ని సెట్ చేశాడు! సక్సెస్. రెండు నెలల శ్రమ! తన ప్రియురాలి రూబిక్ ఫ్రేమ్‌ని కళ్ల నిండా చూసుకున్నాడు. తన ప్రేమ ఫలించినట్లే అనుకున్నాడు. కానీ అతడి శ్రమ ఒక్కటే ఫలించింది. శ్రమను అభినందించి ఆశ్చర్యపోయిన ఆ ప్రియురాలు, తన హృదయాన్ని మాత్రం టాంగ్‌కు అందించలేకపోయింది. ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. అవి ఏమిటి అని టాంగ్ అడగదలచుకోలేదు. మనుసులోనే ఉండిపోతే అది ప్రేమ కాదు అనుకున్నాడు. అందుకే తన ప్రేమను వ్యక్తం చెయ్యాలనుకున్నాడు. చేశాడు. అంతే. సి.ఎన్.ఎన్. టాంగ్ని ఇంటర్వ్యూ చేసింది. ఏం బాస్? ఆ అమ్మాయి కాదన్నందుకు నీకు బాధనిపించలేదా అని అడిగింది. టాంగ్ నవ్వాడు. తనను ప్రేమిస్తున్న విషయం చెప్పకుండా నా మనసులో ఉంచుకుంటే ఇంకా బాధగా అనిపించేది అన్నాడు. కుర్రాడంటే ఇలా ఉండాలి. బై ది వే... ఆ అమ్మాయిని కూడా కంగ్రాట్స్ చెయ్యాలి. ‘నో’ చెప్పడం తేలికైన సంగతి కాదు కదా! అందుకు. -
ఘనంగా ఓనమ్ వేడుకలు
నూనెపల్లె: క్రాంతినగర్‌లోని నంది అకాడమీ పాఠశాలలో ఓనమ్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ కాదంబరి తెలిపారు. కేరళ రాష్ట్రంలో పదిరోజుల పాటు ఓనమ్ వేడుకలను జరుపుకుంటారన్నారు. తమ పాఠశాలలో కేరళ ఉపాధ్యాయులు ఉండడంతో అక్కడి సంప్రదాయాలు విద్యార్థులకు తెలిసేందుకు వేడుకలను కొనసాగించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీషా రెడ్డి, డాక్టర్ సుప్రజా మాలపాటి ముఖ్యఅతిథులుగా హాజరవ్వగా ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం సంప్రదాయ కేరళ వంటకాలను విద్యార్థులకు వడ్డించారు కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది దివ్వ అండ్రూస్, మౌలాబి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయబద్ధంగా ఓనమ్
చింతలపూడి : స్థానిక భాష్యం స్కూల్లో బుధవారం ఓనమ్ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు కేరళ యువతుల వస్త్ర ధారణలతో ఆకట్టుకున్నారు. భాష్యం జోనల్ ఇన్చార్జి జి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఎల్.కష్ణ, లిటిల్ చాంప్స్ ఇన్చార్జి కె.సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాళ్లపూడి : తాళ్లపూడిలోని మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో ఓనమ్ పడుగను కేరళీయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ వీవీ అనీష్, కేరళకు చెందిన టీచర్లు, ఉపాధ్యాయులు ఈ ఓనమ్ వేడుకల్లో పాల్గొన్నారు. రకరకాల పూలతో రంగవల్లికలు తీర్చిదిద్ది మద్యలో కొబ్బరి పూలను ఉంచారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏటా ఓనమ్ పండుగ జరుపుకుంటున్నట్టు చెప్పారు. -
సచిన్ ఓనం వేడుక
తిరువనంతపురం: భారత మాజీ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తిరువనంతపురంలో సందడి చేశారు. కేరళ బ్లాస్టర్ టీం సభ్యులతో కలిసి ఓనమ్ పండుగను జరుపుకున్నారు. కేరళ బ్లాస్టర్స్ యాజమాని అయిన సచిన్ టీం సభ్యులతో కలిసి భోజనాలు చేశాడు. ఈ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఓనం పండుగను దేశ, విదేశాల్లో ఉన్న కేరళీయులు ఘనంగా జరుపుకుంటారు. -
మాంటిస్సోరిలో ఓనమ్
గుంటూరు ఎడ్యుకేషన్: కేరళ సంప్రదాయ పండుగ ఓనమ్ వేడుకలను బుధవారం లక్ష్మీపురం 4వ లైనులోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేరళ సంస్కతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రధారణతో ఉపాధ్యాయినులు ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పూలతో శోభాయమానంగా అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ఓనమ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కేవీ సెబాస్టియన్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రీయులు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ ఓనమ్ అని తెలిపారు. పురాణాల ప్రకారం బలి చక్రవర్తి పాతాళం నుంచి భూమి పైకి వస్తారనే నమ్మకంతో ఆయనకు ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతూ జరుపుకునేదే ఓనమ్ అని తెలిపారు. అనంతరం సంప్రదాయ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఓనం సంబరాలు
కేరళ సాంప్రదాయ ఓనం వేడుకలను మంగళవారం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సెవెన్‌డేస్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. రంగవల్లులతో వేదిక ప్రాంతాన్ని చూడముచ్చటగా అలంకరించారు. కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించిన స్త్రీలు, పురుషులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. వేడుకల నిర్వాహకుడు సునీల్ నాయర్ మాట్లాడుతూ కేరళలో ఈ ఉత్సవాలను పది రోజులపాటు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కేరళలో మంగళవారం ఓనం వేడుకలు ప్రారంభమవుతాయని, చాలామంది అక్కడికి వెళ్లారని, ఇక్కడ ఉన్నవారి కోసం ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం కేరళ సాంప్రదాయ వంటకాలతో భోజనాలు చేశారు. సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో నంబియార్, పంకజా„ì , మధుస్వామితోపాటుగా అధిక సంఖ్యలో కేరళకు చెందినవారు పాల్గొన్నారు. – విజయవాడ (మొగల్రాజపురం) -
డిచ్‌పల్లిలో ఉత్సాహంగా ఓనం పండుగ
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓనం పండుగ ఉత్సాహంగా జరిగింది. స్థానిక తిరుమల నర్సింగ్ కళాశాలలో చదువుకునే కేరళకు చెందిన విద్యార్థినులు బుధవారం సంప్రదాయ బద్ధంగా ఓనం పండుగను జరుపుకున్నారు. వారితో మణిపూర్ విద్యార్థినులు జతకట్టారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన బలి చక్రవర్తి కథా రూపకం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థినులంతా కలసి ఆడిపాడారు. ఈ కళాశాలలో ఓనం ఉత్సవం ఏటా ఘనంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్, ఓనం, కేరళ విద్యార్థినులు, -
అమిత్ షాకు ట్వీట్ చిక్కు
న్యూఢిల్లీ: ఓనం పండుగ సందర్భంగా కేరళ పౌరులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ట్వీట్ వివాదాన్ని రేపింది. ఆయన ఓనం శుభాకాంక్షలు అని చెప్పడానికి బదులు వామన జయంతి శుభాకాంక్షలు అని చెప్పడంతో కేరళీయుల మనసును గాయపరిచినట్లయింది. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. మొత్తం కేరళ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎందుకు వివాదం అయిందంటే కేరళలో ఓనం పండుగను మహాబలి త్యాగానికి గుర్తుగా చేసుకుంటారు. మహాబలి అంటే మానవత్వానికి ప్రతీక అని, ఐకమత్యానికి చిహ్నం అని భావిస్తారు. అక్కడది అది రాష్ట్ర పండుగ కూడా. వామనావతారంలో విష్ణుమూర్తి పాతాళంలోకి బలిచక్రవర్తిని తొక్కేస్తాడు. అనంతరం అతడి కోరిక మేరకు ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిస్తాడు. దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది భక్తుల నమ్మకం. ఆ రోజే ఓనమ్ పండుగ అతి వైభవంగా జరుపుకుంటారు. పేదవాళ్లు, ధనవంతులు అని భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా ఈ పండుగ వేడుకలను జరుపుకుంటారు. పది రోజులపాటు ఇది జరుగుతుంది. చివరి రోజున బలి రాకకోసం ఎదురుచూస్తూ ఆ రోజు మొత్తాన్ని ఆయనకు అంకితం చేసి భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకుంటారు. అలాంటి రోజున వామనుడి అవతారాన్ని ప్రశంసిస్తూ.. విష్ణు స్వరూపుడైన 'వామన జయంతి' అంటూ శుభాకాంక్షలతో అమిత్ షా ట్వీట్ చేశారు. ఇది కేరళ వాసులకు ఆగ్రహాన్ని తెప్పించింది. సీఎం విజయన్ కూడా క్షమాపణలు డిమాండ్ చేసిన కొద్ది సేపటికే హ్యాపీ ఓనం అంటూ అమిత్ షా మరో ట్వీట్ చేయడం గమనార్హం. -
శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలి!
న్యూఢిల్లీ: కేరళ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే ఓనం పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా దేశంలో శాంతి, సామరస్యాలు మరింతగా వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 'అందరికీ ఓనం శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పర్వదినం మన దేశమంతటా సంతోష, సామరస్యాలను మరింతగా నింపాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు. కేరళవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతలో ఓనం పండుగను జాతి, కుల, మత భేదాలకు అతీతంగా జరుపుకొంటారు. వామనుడు అణచివేసిన బలి చక్రవరి తిరిగి పాతాళం నుంచి భూమిపైకి వచ్చి.. పంటలను, సుఖసంతోషాలను ఇస్తాడనే నమ్మకంతో ఈ పండుగను జరుపుకొంటారు. కేరళతోపాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనూ ఈ పండుగను ప్రజలు సంతోషంగా నిర్వహిస్తున్నారు. -
సత్యసాయి మహా అర్చన యజ్ఞం
పుట్టపర్తి టౌన్ : ఓనం వేడుకలలో భాగంగా కేరళ భక్తులు సోమవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి మహా అర్చన యజ్ఞం ఘనంగా జరిగింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జె.రత్నాకర్రాజు జ్యోతి ప్రజ్వలన చేయగా.. రుత్వికుల వేదమంత్రోచ్ఛారణ నడుమ యజ్ఞక్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుల్వంత్ సభా మందిరంలో కేరళ కళాకారిణులు రుద్ర– భద్రలు సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరి నిర్వహించి భక్తులను మైమరిపించారు. కేరళ భక్తులు భక్తిగీతాలు అలపించారు. సాయంత్రం అదే రాష్ట్రంలోని అలపుజ జిల్లాకు చెందిన సత్యసాయి యూత్ సభ్యులు ‘ధర్మో రక్షతి రక్షితః’ పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి. మూడో రోజు వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పలువురు వక్తలు ప్రసంగాలతో పాటు, కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ భక్తులు వేదపఠనంతో సాయంత్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ గోపకుమార్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రయర్ గోపాలకష్ణ తదితరులు సత్యసాయి వైభవాన్ని, ఓనం వేడుకల విశిష్టతను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ప్రసిద్ధ కేరళ సంగీత విద్వాంసురాలు అంభ్లి బందం సంగీత కచేరి నిర్వహించారు. -
పండగ చేస్కొని బుక్కయ్యారు
తిరువంతపురం: కేరళీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఓనం. అయితే కేరళలోని ఓ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఓనం ఉత్సవం వివాదానికి దారి తీసింది. అత్యంత పరిశుభ్రంగా ఉండాల్సిన ఆపరేషన్ థియేటర్లో పండుగ ఉత్సవాలు జరుపుకొని బుక్కయ్యారు ఆసుపత్రి సిబ్బంది. ఓనం పండుగ సందర్భంగా నిర్శహించే 'ఓనసాద్య' విందును అట్టహాసంగా నిర్వహించుకోవడంతో విమర్శలు చెలరేగాయి. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి డాక్టర్లు, ఇతర సిబ్బంది ఓనం పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆసుపత్రి ఆవరణను పూలతో అందంగా అలంకరించి, ముగ్గులు పెట్టి ఉత్సవాలు జరుపుకున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆపరేషన్ థియేటర్ కు అత్యంత సమీపంలో పండుగ చేస్కోవడం పట్ల రోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యంత హైజీనిక్ గా ఉండాల్సిన ఏరియాలో ఇలా చేయడం వల్ల రోగుల భద్రతను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బందికి మాత్రమే అనుమతి ఉండే ఆపరేషన్ థియేటర్‌కు అంతమందిని అనుమతించడం సరికాదని ఆరోపించారు. దీని వల్ల బాక్టీరియా వ్యాపించి, ఇన్ఫెక్షన్స్ ముదరవా అంటూ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల్ అధికారులను మంత్రి వీఎస్ శివకుమార్ ఆదేశించారు. మరోవైపు ఆపరేషన్ జోన్లో ఓనం పండుగ నిర్వహించడంపై నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడం తప్పుకాదుకానీ, ఆపరేషన్ జోన్‌ను బాక్టీరియా రహితంగా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బంది ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. థామస్ ఖండిస్తున్నారు. థియేటర్‌కు వందమీటర్ల దూరంలో పూవులతో అలంకరించామంటున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించిన రోగులకు కేటాయించే పాలియేటివ్ కేర్ రూములో విందు ఏర్పాటు చేశామంటూ సమర్ధించుకున్నారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఓనం జరుపుకుంటున్నామని తెలిపారు. -
ఓనం..
-
మలయాళీలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన మోడీ
న్యూఢిల్లీ: ఓనం పర్వదినం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ తన సందేశంలో మలయాళీ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ కేరళ యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వ సంపదలను తెలియచేస్తుందన్నారు. శాంతి, సమృద్ధి, సంతోషాలతో ప్రజలు ఈ పండగ జరుపుకోవాలని మోడీ ఆకాంక్షించారు. దేశ సమగ్రతకు మలయాళీ సమాజం అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కీర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మలయాళీలు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మహాబలి చక్రవర్తి ఓనం పండగ రోజు తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మ రూపంలో వస్తాడని కేరళవాసుల నమ్మకం. అతడిని తమ ఇళ్లకు ఆహ్వానించడానికే ఈ పండుగను జరుపుకుంటారు. అదికాక కేరళలో పండిన పంటలు ఈ నెలలోనే ఇండ్లకు చేరతాయి.. దాంతో ఓనం పండగను పంటల పండుగగా కూడా మలయాళీలు జరుపుకుంటారు. -
ఓనమాలు నేర్పిన ఓనమ్
ఓనమ్... మళయాళీలు పది రోజుల పాటు... వేడుకగా, ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ... రకరకాల వంటలతో, సంప్రదాయ నృత్యాలతో... ఆటలతో... పడవల పోటీలతో... పులి వేషాలతో... తెలుగువారి దసరాలను త లపించే పండుగ... ఇంటికి పంటలు చేరి భోగభాగ్యాలతో తులతూగే పండుగ... రేపు ‘ఓనమ్’... తెలుగింటి కోడలుగా మనలో ఒకరైపోయిన పరహారణాల కేరళ కుట్టి సుమ ‘సాక్షి’కి చెప్పిన ఓనమ్ పండుగ కబుర్లు... మీరు మలయాళీ ఇంటి ఆడపడుచు! తెలుగింటి కోడలు! మరి ఓనమ్ బాగా సెలబ్రేట్ చేస్తారా? సుమ: నేను చిన్నతనం నుంచీ ఇక్కడే అంటే హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. మా పెళ్లయినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ వేడుకగా జరుపుకుంటున్నాను. మా ఇంట్లో అటు తెలుగు పండుగలు, ఇటు కేరళ పండుగలు - రెండూ బాగా చేసుకుంటాం. కిందటేడాది మానాన్నగారు పోవడంతో ఆ ఒక్క సంవత్సరమే చేయలేదు. పండుగను ఎలా జరుపుకుంటారు? సుమ: ఓనమ్ పండుగ పది రోజులూ ఇంటి ముందర కళ్లాపి జల్లి, నేల తడిగా ఉండగానే పువ్వులతో పూక్కళమ్ చేస్తారు. అంటే పూల ముగ్గులాంటిదన్నమాట. సాధారణంగా అందరూ పది రోజులూ చేస్తారు. అయితే నేను నా షూటింగులలో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కరోజు మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించి, ఆనందిస్తాను. ఓనమ్ సందర్భంగా ప్రత్యేక వంటలు ఏమేం చేస్తారు? సుమ: ఈ పండుగకు సాధారణంగా 13 రకాల వంటకాలు చేస్తారు. మేం మాత్రం అవియల్, ఓలెన్, ఇంజుప్పులి, పాలడ పాయసం, కరి (సెనగపప్పు వంటకం), అనాస లేదా మామిడికాయతో పచ్చడి చేస్తాం. ప్రతి ఏడాదీ ఈ వంటలన్నీ నేనే చేస్తాను. ఈసారి మా అమ్మ కూడా నా దగ్గరే ఉన్నారు కనుక ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓనమ్ నాడు మీ ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయి? సుమ: ఈ పండుగ నాడు అప్పడం కంపల్సరీ. అరటిపండు (వేందరప్పళన్) ను ఇడ్లీ రేకులలో ఉంచి ఆవిరి మీద ఉడికించి తింటాం. ఈ అరటిపండును నెల రోజుల పసి పాపలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బలాన్నిస్తుంది. ఆవిరి మీద ఉడకపెట్టడం వలన ఇందులోని పోషకాలు ఎక్కడికీ పోవు. ఓనమ్ పండుగకు తప్పనిసరిగా అరటి ఆకులోనే భోజనం చేస్తాం. నాకు అందులో తినడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకులో పాలడ పాయసం వేసుకుని అది అటూ ఇటూ జారిపోతూ ఉంటే చేత్తో గబగబ దగ్గరకు లాక్కుంటూ తినడం భలే సరదాగా ఉంటుంది. నేను కొంచెం చిలిపి పనులు చేస్తుంటాను. నా ఆకు క్లీన్‌గా ఉండాలని, (నవ్వుతూ) నేను అన్నం తినడం పూర్తయిన తర్వాత, నా ఆకులో ఉన్న కరివేపాకు, పచ్చి మిర్చి వంటి వాటిని పక్క వాళ్ల ఆకులలోకి వాళ్లు చూడకుండా తోసేస్తాను. ఈ పండుగకు ప్రత్యేకంగా ముండుమ్ వేష్టి ధరిస్తాం (ఇది ఓనమ్ ప్రత్యేకం). ఇంతకీ మీరు మొట్టమొదటసారి వంట చేసినప్పుడు మీ అనుభవం ఏమిటి? సుమ: పెళ్లయిన పదిహేను రోజులకు మొదటిసారి రాజీవ్ నన్ను పచ్చి మిర్చి పచ్చడి చేయమన్నారు. ఆయన కోరిక మేరకు వంట చేయడానికి వంట గదిలోకి సంతోషంగానే అడుగుపెట్టాను. రాజీవ్ ఉద్దేశం కొబ్బరిలో పచ్చి మిర్చి కలిపిన పచ్చడి! కానీ నేను కేవలం పచ్చి మిర్చితో అనుకుని, పచ్చి మిర్చిలో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పి అన్నంలో వడ్డించాను. ఆ పచ్చడి కలుపుకుని తినేసరికి, ఇంక చూడాలి... రాజీవ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కళ్లలోనూ బాధతో నీళ్లు తిరిగాయి. రాజీవ్‌కి అందరు దేవుళ్లతో పాటు, మా కుటుంబ సభ్యులూ కళ్ల ముందు సాక్షాత్కరించారు. మరి, ఆ తరవాత వంట నేర్చుకున్నారా? సుమ: ఆ తరవాత అనుభవం మీద అదే వచ్చేసింది. వంట చేయడం నాకు ఇష్టమే. కానీ సమయం మాత్రం లేదు. పండుగలకు, వంటమనిషి ఊరెళ్లినప్పుడు, పిల్లలు అడిగితే చేసిపెట్టడం... అంతే తప్ప మిగతా సమయాల్లో వంట చేయాల్సిన అవసరం ఉండదు. మలయాళీలు అన్ని వంటల్లోనూ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారంటారు? సుమ: కొలెస్ట్రాల్ చింత పెరిగిపోవడంతో, ఇప్పుడు కొబ్బరి నూనెతో వంటలు చేయడం బాగా తగ్గిపోయింది. కొన్ని ప్రత్యేకమైన వంటకాలకు మాత్రమే కొబ్బరి నూనె వాడతున్నాం. మీ జీవితంలో ఓనమ్ పండుగ పోషించిన ప్రత్యేక పాత్ర గురించి ఎక్కడో విన్నాం... సుమ: అవును. సికింద్రాబాద్‌లో మలయాళీలకు ప్రత్యేకంగా ‘కేరళ అసోసియేషన్’ అని ఒకటి ఉంది. దానికి మా నాన్నగారు మేనేజర్‌గా ఉండేవారు. అక్కడ ప్రతి యేడూ ఓనమ్ పండుగనాడు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఏమాత్రం భయపడకుండా నేను వాటిలో పాల్గొనేదాన్ని. అందువల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది. అలా నా ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఓనమ్ పండుగ వల్లే వచ్చింది. ఇప్పుడు యాంకర్‌గా ఇంత సక్సెస్ సాధించగలిగానంటే అందుకు కారణం ఓనమ్ పండుగే. అలా ఓనమ్ నుంచి ఓనమాలు నేర్చుకున్నాను. - సంభాషణ: డా. వైజయంతి పాలడ పాయసం కావలసినవి: పాలడ (రైస్ అడ) - ముప్పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నెయ్యి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; కిస్మిస్ - టేబుల్ స్పూను; పాలు - 2 కప్పులు; బెల్లం తురుము - పావు కప్పు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారీ: రైస్ అడను రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత అవి బాగా పొంగి కనపడతాయి. అప్పుడు నీళ్లు వడకట్టి చల్ల నీళ్లలో వేసి వార్చాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో పాలు, బెల్లం తురుము, ఏలకుల పొడి, నానబెట్టి తీసిన పాలడ వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత దించి, వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి అందించాలి. ఇంజిప్పులి కావలసినవి: నూనె - 5 టేబుల్ స్పూన్లు; అల్లం - అర కేజీ (సన్నగా తురమాలి); ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను; కొబ్బరి ముక్కలు - 2 కప్పులు; కరివేపాకు - 2 రెమ్మలు; చిన్న ఉల్లిపాయలు - పావు కేజీ; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేయాలి); పసుపు - అర టీ స్పూను; ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు - 100 గ్రా. (నానబెట్టాలి); బెల్లం తురుము - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి వేడి చేయాలి అల్లం తురుము వేసి వేయించి, ఉప్పు జత చేసి దోరగా వేయించి దించి పక్కన ఉంచాలి మిగిలిన నూనెను బాణలిలో వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొబ్బరి ముక్కలు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక కరివేపాకు జత చేయాలి చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించాలి వేయించి ఉంచుకున్న అల్లం తురుము, చింతపండు పులుసు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి బెల్లం తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. చక్క ఎరిసెరి కావలసినవి: పచ్చిగా ఉన్న పనస తొనలు - పావు కేజీ; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - అర కప్పు; జీలకర్ర - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 2; కొబ్బరినూనె - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 4; చిన్న ఉల్లి పాయలు - 5; కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు తయారీ: ముందుగా పనస తొనలలోని గింజలు వేరు చేసి తొనలను నాలుగైదు ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మూత పెట్టి ఉడకించాలి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల నీళ్లు మిక్సీలో మెత్తగా చేసి పక్కన ఉంచాలి పనస ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి మరొక బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఎండు మిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి దించేయాలి అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి. -
కేరళ పండగ సంబరానికి వెళ్లొద్దాం...
మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకొనే పండగే ఓనమ్. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగను పదిరోజుల పాటు జరుపుతారు. సెప్టెంబర్ 10 వరకు జరిగే ఈ పండగ విశేషాలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు సైతం కేరళ చేరుకుంటారు. ఇక్కడ నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన విద్యలు-ఆటలు, పడవ పందేలు కన్నులపండువగా జరుగుతాయి. వారం రోజులు వేడుకగా.. కేరళ పర్యాటక సంస్థ ఓనమ్ పండగ సందర్భంగా రాష్ట్రరాజధాని అయిన త్రివేండ్రానికి దగ్గరలోని కోవళం గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతోంది. దీంట్లో భాగంగా నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళలు, ఆహార శాలలు, హస్తకళల కేంద్రాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంట్లో చివరి రోజున అలంకరించిన గజరాజుల విన్యాసాలు ఉంటాయి. విందు భోజనం.. సాంప్రదాయిక కేరళ భోజనం తొమ్మిది రకాల వంటకాలతో నోరూరిస్తుంది. దీనిని ‘వన సద్య’ అంటారు. అదనంగా మరో పదకొండు రుచులను అరిటాకుల మీద వడ్డించడానికి కేరళ రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 7న (తిరు ఓనమ్) కేరళలోని అన్ని రెస్టారెంట్లలోనూ విందుభోజనాలు ఉంటాయి. స్నేక్ బోట్ రేస్... ఓనమ్ పండగలో ప్రధాన ఆకర్షణ స్నేక్ బోట్ రేస్. అరన్ముల బోట్ రేస్ పార్థసారధి దేవాలయం దగ్గర పంపానదిలో సెప్టెంబర్ 10న జరుగుతుంది. పులి వేషాలు... శాస్త్రీయ వాద్యపరికరాలను వాయిస్తుండగా పులి వేషాలు కట్టిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేయడమనే ఆచారం ఈ పండగకు మరో ఆకర్షణ. దీనిని ‘పులిక్కలి’ అంటారు. భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. సరైన పులివేషధారికి బహుమతులు కూడా ఉంటాయి. త్రిసూర్‌లో ఈ వేడుకలు సెప్టెంబర్ 9న ఘనంగా జరుగుతాయి. తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతాన్ని అద్భుత లోకంగా మార్చివేస్తుంది. కొత్త దుస్తులు, సంప్రదాయ వంటలు, నృత్యం, సంగీతాలతో రాష్ట్రమంతటా పాటించే ఆచారాలు ఈ వ్యవసాయ పండగకు చిహ్నాలు. ఇలా చేరుకోవచ్చు: త్రిసూర్ మధ్య కేరళ ప్రాంతంలో ఉంటుంది. కొచ్చి నుంచి రెండు గంటల ప్రయాణం. రైలు, బస్సు ద్వారా చేరుకోవచ్చు. స్వరాజ్ రౌండ్/త్రిస్సూర్ రౌండ్ అని ఇక్కడి ప్రాంతాలకు స్థానిక పేర్లు ఉన్నాయి. వసతి: ఇక్కడ బస చేయడానికి పేరొందిన చిన్నా, పెద్ద హోటల్స్ ఉన్నాయి. కేరళ టూర్ ప్యాకేజీ 5 రాత్రుళ్లు/6 పగళ్లు దేశంలో ఏ ప్రాంతం నుంచైనా కొచ్చిన్ చేరుకోవాలి. కొచ్చిన్‌లో విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లు ఉన్నాయి. కొచ్చిన్ నుంచి మున్నార్, తేక్కడి, కుమరకోమ్, అలెప్పీ సందర్శన. ఎ.సి హౌజ్‌బోట్‌లో షికార్లు. డబల్రూమ్ వసతి+ అల్పాహారం+రాత్రి భోజనం, కారులో చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల సందర్శన. మున్నార్‌లో మిస్టీ మౌంటేయిన్, తేక్కడిలో అరణ్యా నివాస్, కుమరకోమ్‌లో వాటర్స్కేప్స్ రిసార్ట్, అలెప్పీలో ఎ.సి డీలక్స్ హౌజ్‌బోట్‌లో వసతి సదుపాయాలు. ఈ మొత్తం ప్యాకేజీ రూ.34,000/- మరిన్ని వివరాలకు: కేరళ టూరిజమ్ పార్క్ వ్యూ, తిరువనంతపురం టోల్ ఫ్రీ నెం. 1-800-425-4747 ఫోన్: +4712321132 -
ఓనమ్మహోత్సవమ్
సందర్భం- 7న ఓనమ్ ఓనమ్ సమయంలో మహాబలి ఆత్మ కేరళ రాష్ట్రమంతా సంచరిస్తుందని ఒక విశ్వాసం. ఆయనను సాదరంగా ఆహ్వానించడానికే కేరళీయులు ఈ పండుగను జరుపుకుంటారు. కేరళీయులకు ఓనమ్ పెద్ద పండుగ. కేరళ ప్రాంతంలో పంటలు ఈ మాసంలోనే ఇంటికి వస్తాయి. అందుకే ఇది పంటల పండుగ కూడా. ఈ పండుగను ఆనందోత్సాహాలతో, కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. బలిచక్రవర్తి గాథ రాక్షసరాజయిన మహాబలి పాలనలో రాజ్యమంతా స్వర్ణయుగంలా ఉండేది. అందుకు కేరళీయులే సాక్ష్యం. రాష్ట్రంలో అందరూ సంతోషంగా, సంపదలతో తులతూగుతుండేవారు. మహాబలికి ఎన్నో మంచి లక్షణాలున్నా, అతనిలో ఒక బలహీనత ఉంది. అదే అతనిలోని అహంకారం. ఆ అహంకారాన్ని అణగదొక్కడానికి దేవతలందరూ పూనుకున్నారు. అదే సమయంలో మహాబలి చేసిన మంచి వల్ల దేవతలు అతనికి ఒక వరం కూడా ఇచ్చారు, అతనితో సన్నిహితంగా ఉండేవారందరినీ ఏడాదికొకమారు కలుసుకోవచ్చన్నది ఆ వరం. అలా మహాబలి తన ప్రజలను కలుసుకోవడానికి వచ్చే రోజే ఓనమ్. ఓనమ్ పదిరోజుల పాటు జరుగుతుంది. పది రకాలుగా జరుగుతుంది. (1. అత్తం 2.చితిర 3. చోఢీ 4. విశాగం 5. అనిళమ్ 6. త్రికేత 7. మూలమ్ 8. పూరడామ్ 9. ఉత్తరాడమ్ 10. తిరు ఓనమ్). తిరు ఓనమ్‌తో ఓనమ్ ఉత్సవాలు ముగుస్తాయి. అయితే తిరు ఓనమ్ తరువాత రెండురోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ పండుగలో ప్రధాన అంశం ఈ పది రోజులుగా పూగళమ్ (పూలముగ్గు)లో ఉంచిన బలిచక్రవర్తి ప్రతిమను నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయడం. నిమజ్జనం తరువాత పూగళమ్ను తీసేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు. ఓనమ్ పండుగ ‘చింగామ్’ మాసం ఆరంభంలో వస్తుంది. ఈ మాసం మన తెలుగువారి చైత్రమాసం లాంటిది. అక్కడ ఇది ఆగస్టు - సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. ఈ పండుగకు ప్రత్యేకంగా విందువినోదాలు, జానపద గీతాలు, అద్భుతమైన నృత్యాలు, చిత్రవిచిత్రమైన క్రీడలు, ఏనుగులపై ఊరేగడాలు, పడవ పోటీలు, పూల అలంకరణ... వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అత్తం రోజున పెద్ద ఊరేగింపు ఉంటుంది. ఆ రోజు నుండి పండుగ వాతావరణం, ఆనందోత్సాహాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పదవరోజైన తిరు ఓనమ్ నాడు అందరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఈ పదవ రోజునే మహాబలి ఆత్మ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని వీరు విశ్వసిస్తారు. ఓనమ్ ఉత్సవాలు ఓనమ్‌లో మరో ముఖ్యమైన ఘట్టం వల్లంకలి, పాము పడవ పోటీలు. పంపా నదిలో ఈ పోటీలు జరుగుతాయి. అందంగా అలంకరించిన ఈ పడవలను వందలమంది పాటలు పాడుతూ నడుపుతూ ఉత్సాహంగా పాల్గొంటారు. - డా. వైజయంతి -
మనస్సిలాయో అంటున్న మలయాళీలు
మధురం..నగరం మలయాళీల పేరు చెప్పగానే నర్సులు, కాన్వెంట్ టీచర్లు గుర్తొస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు హైదరాబాద్‌లోని చాలా చోట్ల మలయాళీలు వేర్వేరు వృత్తుల్లో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. నగరంలో మలయాళీల జనాభా ఏడు లక్షల వరకు ఉంది. హైదరాబాద్‌కు మలయాళీల వలస 1950 కంటే ముందే మొదలైంది. భాగ్యనగరి మలయాళీల మనసు దోచుకోవడంతో ఇక్కడ వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. లక్షల మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం నగరంపై మమకారమే కారణం. ఇదే విషయంపై కొందరు మలయాళీలను కదిలించగా ‘హైదరాబాదీల మనసు మధురం.. మనస్సిలాయో(అర్థమయిందా?)’ అంటూ ముసిముసినవ్వులు చిందించారు.... బ్రిటిష్ హయాంలో ఉన్న ఆస్పత్రుల్లో నర్సులుగా, కాన్వెంట్ స్కూళ్లలో టీచర్లుగా మలయాళీలు పనిచేసేవారు. ఇప్పటికీ మిషనరీ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా మలయాళీలే ఎక్కువగా కనిపిస్తారు. ఇక నర్సులుగా సేవలందిస్తున్న కేరళ యువతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలో పదికి పైగా నర్సింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో తొంబై శాతం మంది మలయాళీ అమ్మాయిలే ఉంటారు. ఇంటర్ పూర్తి కాగానే హైదరాబాద్ వచ్చి, నర్సులుగా శిక్షణ పొంది కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో హోటల్ వ్యాపారంలోనూ మలయాళీలు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. కేరళ వంటకాలు ఇక్కడి మలయాళీలనే కాకుండా, మిగిలిన హైదరాబాదీలనూ ఆకట్టుకుంటున్నాయి. కేరళ బియ్యంతో భాగ్యనగరి బంధం ఒకప్పుడు హైదరాబాదీలు కేరళ బియ్యానికి దాసులుగా ఉండేవారు. చూడటానికి కాస్త లావుగా ఉన్నా, కేరళ బియ్యం రుచి మరెక్కడా దొరకదనే వారు. పూర్వం కేరళ నుంచి వచ్చినప్పుడల్లా పది కిలోల బియ్యం తెచ్చుకునేవాళ్లట. ఇప్పుడా అవసరం లేదు. ఇక్కడే బోలెడన్ని రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కేరళ హోటళ్లలో ఫేమస్ వంటకమంటే దోశ, దాంతో పాటే కేరళీయులు ప్రత్యేకంగా తయారుచేసే కొబ్బరి చట్నీ. సాధారణంగా కేరళ వంటలంటే కొబ్బరినూనెతో చేసిన వంటకాలనే అనుకుంటారు. ఇక్కడ స్థిరపడ్డవారు క్రమంగా మామూలు నూనెకు అలవాటు పడ్డారు. ఎప్పుడైనా కేరళ నుంచి బంధువులు వస్తే తప్ప వారి ఇళ్లలో కొబ్బరినూనె వంటల ఘుమఘుమలు బయటకు రావు. మలయాళీల ఉగాది విషు మలయాళీల కొత్త సంవత్సరం ‘విషు’. మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నట్లే, మలయాళీలు విషు వేడుకలను జరుపుకుంటారు. హైదరాబాద్‌లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాత్రిపూట దేవాలయాలకు వెళ్లి, అక్కడే పడుకుని, తెల్లవారు జామున మూడుగంటలకు లేచి, కళ్లు మూసుకుని దేవుని ఎదుటకు వచ్చి నిలబడతారు. కొత్త ఏడాది మొదటి దర్శనం దేవుని రూపమే కావాలనేది ‘విషు’ పండుగలో ప్రత్యేకత. అలా దేవుడిని చూసే వేడుకను ‘విషుకని’ అంటారు. హైదరాబాద్‌లోని చాలా దేవాలయాలు మలయాళీల కోసం ప్రత్యేకంగా ‘విషుకని’ పూజలు నిర్వహిస్తాయి. ‘దిల్‌సుఖ్‌నగర్‌లోని అయ్యప్ప దేవాలయంలో విషుకని పూజలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పెద్దసంఖ్యలో మలయాళీలు ఆ ఆలయానికి వస్తారు. కొత్త దుస్తులు, ఆభరణాలు ధరించి, పండ్లు, పూలు దేవుడికి సమర్పించి, వేకువ జామున మూడింటికల్లా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడంతో విషు వేడుకలు మొదలవుతాయి. ఇక్కడి వారితో పాటు పండుగకు వచ్చిన వారి స్నేహితులు కూడా గుడికి వస్తారు. వీటితో పాటు దసరా, దీపావళి పండుగలను కూడా అందరితో కలసి సరదాగా సెలిబ్రేట్ చేసుకుంటారు. మంచి వాతావరణం... ‘ఇప్పడంటే అంతా మారిపోయింది గానీ, నలభయ్యేళ్ల కిందట హైదరాబాద్ నగరం స్వర్గంతో సమానం. పచ్చగా ఉండే మా కేరళలో కూడా ఇక్కడ ఉన్నంత చల్లని వాతావరణం ఉండేది కాదు. ఇక్కడ వేసవిలో సైతం ఉక్కబోత ఉండేది కాదు. మలయాళీల మనసు గెలుచుకోవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. కేరళ వెలుపల మలయాళీలు పెద్దసంఖ్యలో ఉన్న నగరం హైదరాబాద్ మాత్రమే. నర్సులు, టీచర్లనే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా యాభయ్యేళ్ల కిందటే చాలామంది ఇక్కడకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బతుకమ్మను సరిపోలే ఓనం... మలయాళీల ప్రధానమైన పండుగ ఓనం. ఆగస్టులో వచ్చే ఈ పండుగను పదిరోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఓనం పండుగను తెలంగాణ పండుగ బతుకమ్మతో పోలుస్తారు. ఇంటి ముందు రంగురంగుల పూలను అలంకరించి, వాటిపై దీపాలు పెట్టి, వాటి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ తిరుగుతారు. దీన్నే తిరువదిర అంటారు. ‘ఈ పండుగకు కేరళలో నాలుగు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు ఉంటాయి. హైదరాబాద్‌లోనూ మేం ఓనం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అసోసియేషన్స కూడా ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో పదిరోజుల ఓనం వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో మా కేరళ మహిళలంతా గోధుమ రంగు చీరల్లో కనిపిస్తారు. ఓనం సందర్భంగా చేసే ‘అడప్రదమన్’ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మా వాళ్లతో పాటు చాలామంది హైదరాబాదీలు ఓనం పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు’ అని వివరించారు మెహదీపట్నానికి చెందిన భార్గవి. -
ఓనంతో పులకించిన తీరం
ఒంగోలు, న్యూస్‌లైన్: కేరళీయుల సంప్రదాయ పండుగ ఓనంను జిల్లాలోని కేరళవాసులు కొత్తపట్నం తీరం ఒడ్డున ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. పదేళ్లుగా వీరు ఓనం పండుగను జరుపుకుంటున్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వందకుపైగా కేరళ కుటుంబాలు పాల్గొన్నాయి. తొలుత కేరళవాసి శ్రీనివాస అయ్యర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేరళ మహిళలు పూలతో భుకలం(ముగ్గు) వేశారు. అనంతరం మళయాళ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు మాంటిస్సోరి ప్రకాష్‌బాబు మాట్లాడుతూ ఓనం హిందూ పండుగే అయినా కేరళలో కులమతాలకు అతీతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. కేరళలో ఈ పండుగను రాష్ట్ర సాంస్కృతిక పండుగగా భావిస్తారన్నారు. మధ్యాహ్నం కేరళ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. అనంతరం కైకొట్టికళి, బొప్పన, కచేరకళి, బలంఒడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మళయాళ కల్చరల్ సొసైటీ కార్యదర్శి ఈ సత్యం, కోశాధికారి ఎస్ విజయన్, ఉపాధ్యక్షులు సునీల్మీనన్, అశోక్, శిభిమైఖేల్, ఓక్బ్రిడ్జి స్కూల్ ప్రిన్సిపాల్ మనో, సెయింట్ మేరీస్ స్కూల్‌కు చెందిన నోబుల్, డియో, మనోజ్ పాల్గొన్నారు -
10రోజులపాటు ఓనమ్ పండుగ సంబరాలు