న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి.
కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్‌లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు.
వీటికి డిమాండ్..
ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్‌లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్‌కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్‌కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు.
ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్‌లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment