ganesh charturdi
-
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్‌లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్‌లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్‌కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్‌కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
లంబోదరుడి సేవలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా (ఫొటోలు)
-
HYD: రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌లో బడా గణేష్‌తో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.సెప్టెంబర్ 7నుంచి 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.ఖైరతాబాద్ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించలేదు.పాత సైఫాబాద్ పీఎస్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్‌దూత్ లేన్‌లోకి అనుమతించరు.ఇక్బాల్ మినార్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమంతించరు.ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు.నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేయాలని పోలీసులు కోరారు. -
చోటు.. నీకు సెల్యూట్!
రహమత్‌నగర్(హైదరాబాద్): ఓ ముస్లిం యువకుడు తొమ్మిదేళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు. కార్మికనగర్‌కు చెందిన షేక్ చోటు స్థానికంగా స్టార్ కేబుల్‌ను నిర్వహిస్తుంటాడు. ఆటోస్టాండ్ వద్ద ఏటా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. గణనాథుడిని ప్రతిష్టించినప్పటి నుంచి నిమజ్జనం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. ఈ క్రమంలోనే మట్టితో తయారు చేయించిన గణపతి విగ్రహాన్ని గురువారం రాత్రి మండపం వద్ద నిమజ్జనం చేశాడు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రతి సంవత్సరం కొత్త వినాయక విగ్రహాన్ని పెట్టడం వెనుక కారణమేంటి?
-
రిచెస్ట్ గణపతి: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!
Richest Ganpati: దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది. గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు. ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of #GaneshChaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6 — ANI (@ANI) September 18, 2023 -
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు పార్లమెంట్లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేక చర్చ సహా కీలక బిల్లులు... సమావేశాల్లో ప్రధానంగా డిసెంబర్ 9, 1946న తొలిసారి పార్లమెంట్ సమావేశమైంది. అది మొదలు 75 ఏళ్ల ప్రయాణంపై తొలిరోజు చర్చ జరుగనుంది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సభ్యులు మాట్లాడనున్నారు. దీంతో పాటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ïదీంతో పాటే లోక్‌సభలో ’ది అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, 2023’, ’ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023’ఉన్నాయి. ’ది పోస్టాఫీస్ బిల్లు, 2023’నూ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లులు సైతం ఈ సమావేశాల్లోనే తెస్తారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర వర్గాలు ధ్రువీకరించడం లేదు. నిరుద్యోగం..ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లాక్‌కు చెందిన మొత్తం 24 పారీ్టలు అంగీకరించాయి. చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీ అక్రమాలు సహా పలు కీలక అంశాలను సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«ధీ ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ నూతన భవనంపై జాతీయ జెండా పార్లమెంట్ నూతన భవనం గజద్వారంపై ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అంతకుముందు ధన్‌ఖడ్, బిర్లాలకు సీఆర్పీఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బలగాలు వేర్వేరుగా గౌరవవందనం సమరి్పంచాయి. రేపు ఎంపీల ఫొటో సెషన్ ఎంపీలందరికోసం మంగళవారం ప్రత్యేక ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే గ్రూప్ ఫొటో సెషన్‌కు రావాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ కోరింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలోనే సభ ముందుంచాలని పలువురు నేతలు కోరారు. బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలు, ఎస్సీలకు ప్రత్యేక కోటా కావాలంటూ డిమాండ్ చేస్తుండటం అడ్డంకిగా మారింది. -
చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు...
చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా గల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. -
ఒజ్జ గణపతికి వందనాలు
‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య! ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు.’’ అంటూ పిల్లలు సంబరంగా జరుపుకునే పండగ వినాయక చవితి. యావద్భారత దేశం వేడుకగా జరుపుకునే పండగ ఇది. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే దైవం వినాయకుడు. ఋగ్వేద కాలం నుండి కీర్తించబడి పూజించబడుతున్న దేవత ఒక్క గణపతి మాత్రమే. దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఐన గణపతిని అన్ని సందర్భాలలోను పూజించటమే కాదు దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి. గణపతి కున్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి, వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది. సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి ‘మహోత్కటుడు‘ అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించి లోకకల్యాణం గావించాడు. త్రేతాయుగంలో, మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి, వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయకవ్రత కల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి, అశ్వారూఢుడై ప్రతిప్రాణిలో పెచ్చుపెరిగిన రాక్షసప్రవృత్తిని నశింప చేస్తూ ఉన్నాడట. వివిధ పురాణాలలో గణపతి వినాయకుడి ఆవిర్భావం, రూపు రేఖలు విభిన్నంగా ఉన్న కారణంగా శిల్పులు వాటికి గణపతి తత్త్వాన్ని, తమ సృజనాత్మకతను జోడించి రకరకాల గణపతులను మన ముందు ఉంచుతున్నారు. మిగిలిన లక్షణాలను ఏరకంగా చూపించినా అన్నింటిలోనూ సామాన్యంగా ఉండేవి – గజ ముఖం, కురచ మెడ, పెద్దబొజ్జ, నాగయజ్ఞోపవీతం, చేతిలో మోదకం, మూషిక వాహనం మొదలైనవి. గజముఖంలో తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు భాగాలు. ప్రపంచ సాహిత్యంలో మొదటిది అయిన ఋగ్వేదంలో గణపతిగానే పేర్కొనటం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ‘‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’’ అని లలితాదేవి కల్పించినది గణేశ్వరుణ్ణే అని తెలుస్తోంది. తరువాత విఘ్నాలకి అధిపతి అయి విఘ్నేశ్వర నామాన్ని పొందటం జరిగింది. గణాలకు అధిపతి కనుక గణపతి, గణాధిపతి అనే నామాలు కలిగాయి. ఏవైనా గణములు అంటే గుంపులు, సముదాయాలు ఉంటే వాటి మీద అధికారం కలిగి, అవన్నీ ఏకోన్ముఖంగా పని చేసేట్టు చేయించ కలిగిన ప్రజ్ఞయే గణపతి. ఏకాత్మతా భావన కలిగించ గలవాడు గణపతి. ఆ ప్రజ్ఞ లేనట్టయితే సృష్టిలోని అన్ని భాగాలు దేనికవే ఉండేవి. కనుకనే సృష్టి చేసే సమయంలో బ్రహ్మ గణపతిని ప్రార్థించాడట! దేవతారూపాలన్నీ ఆయా తత్త్వాలకి ప్రతీకలు. ముఖ్యంగా ప్రత్యేక రూపాలున్న మూర్తులు. గణపతి అనగానే గుర్తు వచ్చేది పెద్ద పొట్ట. దాని నిండా ఉన్నవి విద్యలు. ‘‘కోరిన విద్యలకెల్ల నొజ్జయయి యుండెడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్’’ అంటాము కదా! వొజ్జ అంటే గురువు అని అర్థం. అందుకే గణపతి పూజలో పిల్లల చేత పుస్తకాలు పెట్టించుతాము. పనిలో పనిగా గుంజీలు తీయిస్తాము. గుంజీలు తీయటం వల్ల కుదురు వస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పెద్ద చెవులు బాగా వినమని చెపుతున్నాయి. చిన్న కళ్ళు సూక్ష్మ మైన అంశాలని ఎంత నిశితంగా ఏకాగ్రతతో చూడాలో తెలియ చేస్తాయి. తొండం ఎప్పుడు నోటిని మూసుకుని ఉండాలని తెలియ చేస్తుంది. చంద్రుణ్ణి చూసిన దోషం తొలగటానికి శమంతకోపాఖ్యానం చదవుకోవాలనటం కూడా విశేషమే. ఆ కథని అర్థం చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుందో కదా! ఏదైనా ఒక వరం ఒకరికి ఇస్తే దాన్ని వారు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకి అది ఉపయోగ పడక పోగా ప్రాణాంతకం కూడా కావచ్చును అని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వృత్తాంతమ్ తెలుపుతుంది. ప్రభుత్వం వద్ద కాక వ్యక్తుల దగ్గర ధనం పోగు అయితే ప్రాణాలకే మోసం జరుగుతుందని సత్రాజిత్తు మరణం తెలుపుతుంది. ఎంతటి అవతార పురుషుడికి అయినా దోషఫలం అనుభవించక తప్పదు అని కృష్ణుడికి నీలాపనిందలు రావటం తెలియ చేస్తుంది. సర్వమానవుల మూలాధారంలో కుండలినీ శక్తిగా ఉన్న జగన్మాతకి గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అదే పార్వతీ దేవి గుమ్మంలో కాపలా పెట్టింది అని కథలో చదువుకుంటాం. విఘ్నాధిపతి కనుక మనం చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని అన్ని కార్యాలకి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించటం సంప్రదాయంగా మారింది. గణపతి పూజ మనకి ఏంచెపుతోంది? 1. మాతా పితృభక్తి అది ఉంటే లోకాలనన్ని చుట్టి రావచ్చు. విజయం సాధించవచ్చు. 2. భౌతిక బలం కన్న బుద్ధి బలం మిన్న తమ్ముడు నెమలి వాహనం మీద ఎగురుతూ వెళ్ళాడు. తాను ఎలుకనెక్కి వెళ్ళి గెలవటం ఎంత కష్టం? కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. 3. ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆకుపచ్చరంగులో ఉన్న ఆహారం తింటే తెలివి తేటలు పెరుగుతాయి, చూపు మెరుగుగా ఉంటుంది. అందుకే గరిక తనకి పరమప్రీతి అని చెప్పాడు. బుద్ధి కావాలంటే ఆరాధించవలసింది గణపతినే. గణపతి నక్షత్రమైన హస్తకి అధిపతి బుధుడు. బుద్ధి కారకుడు బుధుడే కదా! 4. ఏక వింశతి 21 రకాల పత్రితో పూజ చేయటం ఒక్క గణపతి పూజలో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి పత్రి సేకరణ పేరుతో చెట్లని, పర్యావరణాన్ని పరిచయం చేయటం జరుగుతుంది. అవన్నీ ఆ సమయంలో వచ్చే తరుణ వ్యాధులకి ఔషధాలు. ప్రత్యేకంగా గరిక పూజ ద్వారా గరికకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాడు. గరిక పవిత్రమైనదే కాదు, భూమి ఆకృతిని పరిరక్షిస్తుంది. 5. రెండుసార్లు ఆవిరిమీద ఉడకబెట్టిన ఆహారం వానాకాలంలో మంచిది. బలం కలిగిస్తుంది. నూనెలో వేయించిన ఆహారం వానలు పడుతున్నప్పుడు అరగటం కూడా కష్టం. 6. మనలో సామర్థ్యం ఉండాలే కాని పరికరాలు ప్రధానం కాదు అని ఎలుక వంటి అతి చిన్న వాహనం ఎక్కి లోకాల నన్నిటిని జయించి చూపించాడు. డా. ఎన్.అనంతలక్ష్మి -
విశాఖలో పర్యావరణ హితంగా వినాయక చవితి
సాక్షి, విశాఖ: పర్యావరణహితంగా ఈసారి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి విశాఖలో విద్యార్థులు సిద్ధమయ్యారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సాక్షి మీడియా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి స్కూల్లో చిన్నారుల చేతులతో మట్టి గణపతి అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేశారు కొందరు ఆ వినాయక విగ్రహాల్లో విత్తనాలను కూడా వేశారు పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తెలిపారు. విద్యార్థి దశలో ఈ రకమైన కార్యక్రమాల ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మట్టి వినాయకులు ఆకర్షణీయంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు తో సహా పలువురు అధికారులు హాజరయ్యారు ఈ ఏడాది పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కూడా జీవీఎంసీ చేపడుతుందని వివరించారు తమకు ఆనందం కలిగిస్తుందని విద్యార్థులు అన్నారు. విద్యార్థులను పర్యావరణహిత కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంపై రవీంద్ర భారతి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు. -
ఎవరైతే “ఈ వృత్తాన్ని" వినాయక చవితి రోజు వింటారో వాళ్లకు అనుగ్రహం కలుగుతుంది
-
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి
-
మహాగణపతికి 60 అడుగుల కండువా
సాక్షి, ఖైరతాబాద్(హైదరాబాద్): ఖైరతాబాద్ మహాగణపతికి ఈసారి కూడా 60 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామిలు తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన కళాకారుల చేత వీటిని తయారుచేయించినట్లు తెలిపారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. ఇదీ చదవండి: మా మట్టి గణపయ్య సాక్షి, హైదరాబాద్:వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. చదవండి: Hyderabad: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’ -
5న ‘మీ కోసం’ కార్యక్రమం రద్దు
ఏలూరు సిటీ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా 5వ తేదీ సోమవారం మీ కోసం కార్యక్రమం ఉండబోదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవరం జరిగే మీ కోసం కార్యక్రమం కోసం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, సోమవారం వినాయకచవితి పర్వదిన సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఆ రోజు మీ కోసం కార్యక్రమం జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి జిల్లాలో ఎక్కడా కూడా మీ కోసం కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ కోరారు.