సాక్షి, విశాఖ: పర్యావరణహితంగా ఈసారి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి విశాఖలో విద్యార్థులు సిద్ధమయ్యారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సాక్షి మీడియా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి స్కూల్లో చిన్నారుల చేతులతో మట్టి గణపతి అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేశారు కొందరు ఆ వినాయక విగ్రహాల్లో విత్తనాలను కూడా వేశారు పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తెలిపారు.
విద్యార్థి దశలో ఈ రకమైన కార్యక్రమాల ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మట్టి వినాయకులు ఆకర్షణీయంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు తో సహా పలువురు అధికారులు హాజరయ్యారు ఈ ఏడాది పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కూడా జీవీఎంసీ చేపడుతుందని వివరించారు తమకు ఆనందం కలిగిస్తుందని విద్యార్థులు అన్నారు. విద్యార్థులను పర్యావరణహిత కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంపై రవీంద్ర భారతి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment