matti vinayaka
-
విశాఖలో పర్యావరణ హితంగా వినాయక చవితి
సాక్షి, విశాఖ: పర్యావరణహితంగా ఈసారి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి విశాఖలో విద్యార్థులు సిద్ధమయ్యారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సాక్షి మీడియా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి స్కూల్లో చిన్నారుల చేతులతో మట్టి గణపతి అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేశారు కొందరు ఆ వినాయక విగ్రహాల్లో విత్తనాలను కూడా వేశారు పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తెలిపారు. విద్యార్థి దశలో ఈ రకమైన కార్యక్రమాల ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మట్టి వినాయకులు ఆకర్షణీయంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు తో సహా పలువురు అధికారులు హాజరయ్యారు ఈ ఏడాది పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కూడా జీవీఎంసీ చేపడుతుందని వివరించారు తమకు ఆనందం కలిగిస్తుందని విద్యార్థులు అన్నారు. విద్యార్థులను పర్యావరణహిత కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంపై రవీంద్ర భారతి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు. -
మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం… (ఫొటోలు)
-
పర్యావరణ హితం ప్రతి ఒక్కరి బాధ్యత
అనంతపురం కల్చరల్: మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆ మేరకు కృషి చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన సరోజినీరోడ్డులోని శ్రీపాద కాంప్లెక్స్ ఆవరణలో హిందూ ధార్మిక ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరవాసులు భారీ సంఖ్యలో హాజరై విగ్రహాలు తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ధర్మప్రచార మండలి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరి, డాక్టర్ నారాయణ, సోమనాథ్ పాల్గొన్నారు. అలాగే ప్రముఖ యోగా సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోనూ ఉచిత మట్టి వినాయకుల పంపిణీ జరిగింది. యోగా శిక్షకులు పొడమల రమేష్‌బాబు, మమత తదితరులు పర్యావరణాన్ని పాడు చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడబోమని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ అనంతపురం సప్తగిరి సర్కిల్: పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సాయి అప్న డ్రైవింగ్ స్కూల్ వారు తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను గురువారం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పంపిణీ చేశారు.