![Hyderabad: 60 Feet Kanduva For Khairatabad Ganesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/9/khairatabadGanesh.jpg.webp?itok=sJUtTNLT)
సాక్షి, ఖైరతాబాద్(హైదరాబాద్): ఖైరతాబాద్ మహాగణపతికి ఈసారి కూడా 60 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామిలు తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన కళాకారుల చేత వీటిని తయారుచేయించినట్లు తెలిపారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి:
మా మట్టి గణపయ్య
సాక్షి, హైదరాబాద్:వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్‌పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు.
చదవండి: Hyderabad: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’
Comments
Please login to add a commentAdd a comment