ganesh idol
-
ఇద్దరు చిట్టి గణపతులు: ఇంట్లోనే నిమజ్జనం చేసిన సూర్యకుమార్ యాదవ్ (ఫొటోలు)
-
చాక్లెట్లతో గణేశుడి విగ్రహం..
-
చిన్నారుల చేతులతో మట్టి గణపతి అనే ప్రత్యేక కార్యక్రమం
-
హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని తెలిపింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గతేడాది హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. పీవోపీ విగ్రహాలు ప్రత్యేక కృత్తిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. అయితే గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలన్న తయారీదారుల పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని వినాయక విగ్రహ తయారీదారులు తమ పిటిషన్లో కోరారు. గతేడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ తెలిపారు. అయితే ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25కి వాయిదా వేసింది. చదవండి: కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం -
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట
సాక్షి, హైదరాబాద్: గణపతి నవరాత్రోత్సవాల్లో ఐదవ రోజు... ఆదివారం కావడంతో నగరం ‘గణేష్ మహరాజ్ కీ జై’ నినాదాలతో మార్మోగింది. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల నిమజ్జనాలు.. మరికొన్నిచోట్ల ప్రత్యేక పూజలు, లడ్డూల వేలం పాటలతో కోలాహలం నెలకొంది. ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భారీ క్యూలైన్లు కన్పించాయి. ఖైరతాబాద్‌కు తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ రోడ్లపై ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ ప్రాంతానికి వచ్చే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు సైతం జనంతో కిటకిటలాడాయి. నగరం నలు మూలల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆదివారం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిటకిటలాడింది. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు అత్యంత రద్దీగా కనిపించాయి. ఖైరతాబాద్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, మెట్రో సిబ్బంది అవస్థలు పడ్డారు. ఆదివారం మూడు మెట్రో మార్గాల్లో రద్దీ నాలుగు లక్షల మార్కు దాటిందని మెట్రో అధికారులు తెలిపారు. (క్లిక్: కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం) -
కోటీ 65 లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ
గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దశావతార గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణనాథుడిని కోటీ అరవై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీలక్ష్మీగణపతికి భక్తులు పూజలు నిర్వహించారు. గుంటూరులోని 21వ డివిజన్ కార్పొరేటర్ కె.గురవయ్య ఆధ్వర్యంలో కేవీపీ కాలనీ 1/10వ లైనులో 16వ వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గణనాథుడిని రూ. 44,44,444 విలువైన కరెన్సీ నోట్లతో సుందరంగా అలకరించారు. – నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) రూ.కోటిన్నర కరెన్సీతో విఘ్నేశ్వరుడికి అభిషేకం ఖిలా వరంగల్: కోటిన్నర రూపాయలతో విఘ్నేశ్వరుడికి శుక్రవారం రాత్రి అభిషేకం నిర్వహించారు వరంగల్ శివనగర్‌లోని వాసవి కాలనీవాసులు. 108 మంది ఇచ్చిన 1,43,11,116 రూపాయల్లో కొన్నింటిని దండలు చేసి మారేడు చెట్టుకు ఉయ్యాల ఊగుతున్న విఘ్నేశ్వరునికి అలంకరించారు. మిగిలిన నోట్ల కట్టలను గణేషుడి ముందుంచి లక్ష్మీపూజ నిర్వహించారు. (క్లిక్: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు) -
తగ్గేదేలే.. బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ గెటప్‌లలో గణేషుడు
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ కనిపిస్తోంది. నవరాత్రోత్సవాలు జరిపేందుకు ప్రతివీధిలోనూ మండపాలు ముస్తాబయ్యాయి. వినాయక చవితి సంబరాలతో నగరాలన్నీ సందడిగా మారాయి.. ఏ గల్లీలో అడుగు పెట్టినా గణనాథుని రూపాలే దర్శనమిస్తున్నాయి. ప్రతిచోటా రకరకాల రూపాల్లో వినాయక ప్రతిమలు మండపాల్లో కొలువుదీరాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో డిఫరెంట్ గణేష్ రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయక విగ్రహాల మీద సినిమాల ప్రభావం కూడా చాలానే ఉంది. గత కొన్నేళ్లుగా సినిమాలోని హీరోలు, వారు పోషించిన పాత్రల రూపంలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కొందరి హీరోల రూపంలో ప్రతిష్టించారు. తాజాగా ఓచోట పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. మరోచోట ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్‌లో పరుగెడుతూ ఉన్నటువంటి, బాణాన్ని ఎక్కుపెడుతున్న గెటప్‌లో ఉన్నాడు గణేషుడు.. అలాగే ఎన్టీఆర్ భీం రూపంలో..కేజీఎఫ్‌లో యశ్ రూపంలో విఘ్నేశుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఇక బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ ఫ్యాన్స్ వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సాధారణ జనాలు సైతం ఆ విగ్రహాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి విగ్రహాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. PushparAAj...Thaggedhe Le 🔥 Allu Arjun Film roles & Ganesh Idols Never Ending Festival VIBE!! 🔥🔥🤩 This time In Pushpa Raj Avatar 🌟🔥#GaneshChaturthi #PushpaTheRule #AlluArjun pic.twitter.com/YuCYEAziMV — Trinadh❤️AADHF🪓 (@TrinadhAADHF) August 30, 2022 -
విశాఖ: గాజువాక లంక మైదానంలో కొలువుదీరిన భారీ గణనాథుడు
-
విశాఖలో 82 అడుగుల భారీ గణనాథుడు
-
నేటినుంచి భక్తులకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనం
-
భారీగా పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు
-
వినాయక చవితి స్పెషల్: తిరుపతి బాలాజీ స్టైల్లో 18 అడుగుల ‘స్వర్ణ గణేష్’
లక్నో: వినాయక చవితి పండగ కోసం యావత్ దేశం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31న గణేష్ చతుర్థి వచ్చింది. పండగ దగ్గరపడుతున్న క్రమంలో గణేషుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో విధంగా, ఒక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు విఘ్నేశుడు. అయితే, ఈసారి ‘స్వర్ణ గణేష్’ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. బంగారంతో సిద్ధం చేస్తున్న 18 అడుగుల వినాయకుడి విగ్రహం వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌసి ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు ఈ స్వర్ణ గణేషుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నట్లు చెప్పారు అజయ్ ఆర్యా అనే నిర్వాహకుడు. ‘గణేషుడి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుపతి బాలాజీ మాదిరిగా బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నాం.’ అని తెలిపారు. బంగారు గణేషుడి విగ్రహం వినాయక చవితి నాటికి పూర్తవుతుందని చెప్పారు అజయ్. #WATCH | 'Swarna Ganesh' adorned with gold is being made in UP's Chandausi for Ganesh Chaturthi "It will be an 18 feet tall idol. It is being prepared with gold decorative items on the lines of Tirupati Balaji," says Ajay Arya, a person associated with the project pic.twitter.com/B5RH2eXTnh — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022 ఇదీ చదవండి: ఆవు పేడతో వినాయక విగ్రహాలు -
hyderabad: మట్టిగణపతుల తయారీ.. సగానికి తగ్గిన వ్యయం
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.3 కోట్ల విలువైన మట్టి గణపతుల విగ్రహాల తయారీని కేవలం పెద్ద ఏజెన్సీలకు కట్టబెట్టాలనుకున్న జీహెచ్ఎంసీ.. ‘సాక్షి’లో వెలువడిన కథనంతో దిగివచ్చి చిన్న సంస్థలకు సైతం అవకాశం కలిగేలా పిలిచిన రీటెండర్లలో ఆరు సంస్థలకు విగ్రహాల తయారీ, సరఫరా అవకాశం లభించింది. తప్పదన్నట్లుగా.. రీటెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ 8 అంగుళాల చిన్నవిగ్రహాల సంఖ్యను లక్ష తగ్గించింది. తొలి టెండరులో ఇవి 3.60 లక్షలు కావాలని పేర్కొనగా, రీటెండరు నోటిఫికేషన్లో అసలు ఎన్ని కావాలో పేర్కొనలేదు. టెండర్ల ఖరారు సమయంలో 2.60 లక్షలు చాలునని పేర్కొంది. దీని వెనుక మతలబేమిటో సంబంధిత అధికారులకే తెలియాలి. ఎటొచ్చీ తొలుత అంచనా వ్యయం రూ.3 కోట్లు కాగా, అంతిమంగా రూ. 1.54 కోట్లతో దాదాపు సగానికి తగ్గింది. ఒకే ఏజెన్సీకి కాకుండా ఎక్కువ సంస్థలు పాల్గొనేలా చేయడంతోపాటు ఎల్ 1 ధరకు ముందుకొచ్చే అందరికీ అవకాశం కల్పిస్తామనడంతో 6 సంస్థలు ఆ అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఒక అడుగు విగ్రహాలకు ఒక్కో విగ్రహం అంచనా వ్యయం రూ.134 కాగా, టెండరులో రూ.130కి, ఒకటిన్నర అడుగు విగ్రహాలకు ఒక్కోదానికి అంచనా వ్యయం రూ. 349 కాగా, టెండరులో రూ.323లకు అప్పగించారు. 8 అంగుళాలవి అంచనా వ్యయం రూ.34.90 కాగా, టెండరులో రూ.31.90కి అప్పగించారు. చదవండి: గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక: కేసీఆర్ టెండర్లు పూర్తయిన విగ్రహాల వివరాలు ఒక అడుగువి: 30,000 అడుగున్నరవి: 10,000 8 అంగుళాలవి: 2,60,000 ►ఎల్ 1 రేట్లుగా వీటిని ఖరారు చేసి ఆరు సంస్థలకు అప్పగించారు. టెండర్లు దక్కించుకున్న సంస్థల్లో సనాతన ఆహార్ హస్తకళా ప్రైవేట్ లిమిటెడ్, జైగణేశ్ ఆర్ట్స్, స్వామి కన్స్ట్రక్షన్స్ అండ్ కాంట్రాక్టర్స్, ఆర్ట్ ఆఫ్ ఇండియా పాటరీస్, క్లే గణేశ స్టాట్యూస్ మాన్యుఫ్రాక్చరర్స్ సొసైటీలున్నాయి. విగ్రహాలన్నీ ప్రజలకు ఉచితంగా పంచేందుకు ఉద్దేశించినవే అయినప్పటికీ, 8 అంగుళాల విగ్రహాలు ఏకంగా లక్ష ఎందుకు తగ్గించుకున్నట్లో ఉన్నతాధికారులకే తెలియాలి. తొలుత అవసరానికి మించి టెండరు పిలిచారా.. లేక ఇంకేదైనా కారణముందా అన్నది అనుమానాలకు తావిస్తోంది. ఉచితంలోనూ ఔచిత్యం లేకపోవడం కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. -
గణేశ్ విగ్రహాల తయారీపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే(బేబి పాండ్స్) పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని పేర్కొంది. కాగా గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పీవోపీ విగ్రహాల నిషేధంపై మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. దుర్గాపూజపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది. చదవండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం -
మహాగణపతికి 60 అడుగుల కండువా
సాక్షి, ఖైరతాబాద్(హైదరాబాద్): ఖైరతాబాద్ మహాగణపతికి ఈసారి కూడా 60 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామిలు తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన కళాకారుల చేత వీటిని తయారుచేయించినట్లు తెలిపారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. ఇదీ చదవండి: మా మట్టి గణపయ్య సాక్షి, హైదరాబాద్:వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. చదవండి: Hyderabad: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’ -
కర్రపూజ: పదితలాల రూపంలో ఖైరతాబాద్ గణపతి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఈసారి ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ ఏకాదశ రుద్ర మహాగణపతిగా దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ నామకరణం చేశారు. నిర్జల ఏకాదశి సందర్భంగా మహాగణపతికి సోమ వారం ఉత్సవ కమిటీ సభ్యులు నిరాడంబరంగా కర్రపూజ నిర్వహించారు. గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 18 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరణం చేసి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనుకున్నా కరోనా సెకండ్ వేవ్‌తో ఖైరతాబాద్ మహాగణపతి తయారీపై సందిగ్ధత నెలకొంది. పరిస్థితులు అదుపులోకి రావడంతో మహాగణపతి తయారీకి కర్రపూజ నిర్వహించారు. అయితే ఈసారి మహాగణపతి ఎత్తు, నమూనాపై త్వరలో ప్రకటన చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. సెప్టెంబర్ 10న వినాయకచవితి ఉందని, 11 తలలతో నిలబడి ఉండే ఆకారంలో భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దనున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఘర్షణ: గణేశుడి విగ్రహం ధ్వంసం?
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావం ఈసారి వినాయక చవితి మీద బాగానే పడింది. గళ్లీకో రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఇప్పుడు ఊరంతా వెతికినా కనిపించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే హైదరాబాద్‌లో గణేశుడిని ప్రతిష్టాపించే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహం ముందే రెండు గ్రూపులవారు ఒకరినొకరు తన్నుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు వారించినప్పటికీ ఎవరూ వినిపించుకునే పరిస్థితిలోనే లేరు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే గణేశుడిని ప్రతిష్టించడం కొందరికి ఇష్టం లేదని, దీంతో హిందూ వ్యతిరేక శక్తులు గొడవకు దిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రతిమను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇది నిజమేనని నమ్మిన నెటిజన్లు ఆ ఇరు వర్గాలను హిందూ, ముస్లింలుగా భావిస్తూ, ఈ ఘర్షణకు మతం రంగు పులుముతున్నారు. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ఈ ప్రచారంలో నిజం లేదని తేలింది. ఈ గొడవకు ముస్లిం వ్యక్తులకు సంబంధమే లేదని నిర్ధారణ అయింది. (ఏనుగు అతడిపైకి ఎలా వచ్చిందో చూడండి) అసలేం జరిగిందంటే.. మొఘల్‌పురలోని బాలగంజ్ ప్రాంతంలో 20 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలోనే గణపయ్యను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఆ మండపానికి సమీపంలోని భూమిని ఓ వ్యక్తి కొనుగోలు చేసి నివాసమేర్పరుచుకున్నారు. ఇంటి ముందే ఉండే మండపంలో జరిగే వేడుకల వల్ల తమ కుటుంబ గోపత్య దెబ్బ తింటోందని ఆయన స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని నెలల క్రితం వాళ్లు అక్కడ మండపాన్ని తీసివేశారు. ఇదిలా వుండగా తాజాగా వినాయక చవితి రోజు ఎప్పటిలాగే విగ్రహాన్ని తీసుకుని ఆ మండపం ప్రాంతానికి చేరుకోగా సదరు వ్యక్తి, ఆయన కుటుంబం వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ రాజుకుందని ఓ పోలీసు తెలిపారు. అంతేకాక గణేశుడి విగ్రహం దారి మధ్యలోనే విరిగిపోయినట్లు బాలాగంజ్ ఆలయ కమిటీ సభ్యుడు జిత్తూ తెలిపారు. (ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా?) వాస్తవం: హైదరాబాద్‌లోని మొఘల్‌పురలో వినాయక చవితి నాడు జరిగిన ఘర్షణ హిందువులకు మధ్యే జరిగింది. This is happening in Hyderabad & not Pakistan Some local goons were opposing to the installation of Shri Ganesha’s statue & damaged it too,then some brothers had to bash them KCR thinks that he’s the next Nizam is teaming up with Razakars#AntiHinduKCR pic.twitter.com/0gEIQJ4IRX — Ashish Jaggi (@AshishJaggi_1) August 23, 2020 -
‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ గణపతి ఉత్సవాల కోసం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ ఏడాది గణపతి ఉత్సవాల్లో భాగంగా కేవలం ఆరు అడుగుల వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఉత్సవ కమిటీ పేర్కొంది. అదే విధంగా అత్యంత ఆసక్తికరంగా నిర్వహించే వినాయకుడి లడ్డూ వేలంపాట ఏడాది నిర్వహించబోమని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల దర్శనం నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. -
పీఓపీ విగ్రహాలే అత్యధికం
సాక్షి,సిటీబ్యూరో: గతానికి భిన్నంగా ఈసారి గ్రేటర్ నగరంలో పర్యావరణ హిత మట్టివిగ్రహాల ఏర్పాటుపై సిటీజనుల్లో అవగాహన పెరిగినప్పటికీ...ఈసారి సుమారు 50 వేల ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇళ్లలో పూజలందుకునే చిన్న పరిమాణంలో ఉన్న మట్టి ప్రతిమలను నగరవాసులు ఎక్కువగా ప్రతిష్టించినప్పటికీ..కాలనీలు, బస్తీల కూడళ్లలో ఏర్పాటుచేసిన విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌వే అత్యధికంగా ఉన్నాయి. మహానగరం పరిధిలో సుమారు 30 జలాశయాల్లో వినాయకనిమజ్జనం జరగనున్నప్పటికీ..అత్యధిక విగ్రహాలు నిమజ్జనం జరిగే 21 చెరువుల్లో నీటి కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. ఇక జలమండలి అధికారులు శోభాయాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం శోభాయాత్ర జరిగే మార్గంలో 115 తాగునీటి క్యాంపులను ఏర్పాటుచేయనుంది. ఈ క్యాంపుల్లో 32 లక్షల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైతే నీటి ప్యాకెట్ల సంఖ్యను పెంచుతామని ఎండీ దానకిశోర్ తెలిపారు. 21 చెరువుల కాలుష్యంపై పీసీబీ నజర్.. నవరాత్రి పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం చేసే చెరువులు, కొలనుల కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. గ్రేటర్ పరిధిలో హుస్సేన్‌సాగర్ సహా 21 చెరువుల్లో కాలుష్య మోతాదును పీసీబీ నిపుణులు లెక్కించనున్నారు. నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగే రోజులు, నిమజ్జనం తరవాత ఆయా జలాశయాల్లో నీటి నమూనాలను సేకరించి వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. వీటిలో మీరాలం(బహదూర్‌పురా), లంగర్‌హౌజ్ లేక్, సరూర్‌నగర్ లేక్, రంగధాముని చెర్వు, సఫిల్గూడా చెర్వు, హస్మత్‌పేట్‌లేక్, అంబర్‌చెర్వు(కూకట్పల్లి), కాప్రాచెర్వు, దుర్గంచెర్వు, పెద్దచెర్వు, లింగంచెర్వు(సూరారం), ముండ్లకుంట(మూసాపేట్), పత్తకుంట(రాజేంద్రనగర్), నాగోల్‌చెర్వు, కొత్తచెర్వు(అల్వాల్), నల్లచెర్వు(ఉప్పల్), కాయిదమ్మకుంట(హఫీజ్‌పేట్), గుర్నాథ్‌చెర్వు(మియాపూర్), సాఖిట్యాంక్(పటాన్‌చెర్వు), రాయసముద్రం (రామచంద్రాపురం), గోపిచెర్వు(లింగంపల్లి) చెర్వులున్నాయి. ఈ చెరువుల్లో నిమజ్జనానికి ముందు ఆగస్టు 26న, నిమజ్జనం జరిగే సెప్టెంబరు 3,5,8,11,12 తేదీలతోపాటు సెప్టెంబరు 20న (నిమజ్జనం అనంతరం)నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించనున్నారు. ఈ జలాశయాల నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, గాఢత, బ్యాక్టీరియా, ఘన వ్యర్థాలు, కాఠిన్యత, విద్యుత్ వాహకత, కోలిఫాం, భారలోహాలు ఇలా అన్ని రకాల కాలుష్యాలను లెక్కించనున్నారు. నిమజ్జనం సందర్భంగా ఆయా జలాశయాల్లోకి సుమారు యాభైవేల వరకు విగ్రహాల నిమజ్జనం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఆయా జలాశయాలు కాలుష్యకాసారంగా మారనున్నాయి. ఈ విషయంపై స్థానికులను అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
ఎదుటే గణేష్ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!
గాంధీనగర్ : దేశమంతా బొజ్జ గణపయ్యను భక్తి ప్రపత్తులతో కొలువుదీర్చుకుంటే గుజరాత్లో మాత్రం కొందరు మత్తులో మునిగిపోయారు. గణేష్ విగ్రహం ఎదుటే విచ్చలవిడిగా మద్యం సేవించి, బాలీవుడ్ పాటలతో పిచ్చెక్కినట్టు డ్యాన్సులు చేశారు. వీధుల్లో బీర్లు పారించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 8 మందిని అరెస్టు చేశారు. వివరాలు.. సూరత్‌లోని గోల్వాడ్లో శివగణేష్ యూత్ అసోసిషేషన్ సభ్యులు వినాయక ప్రతిమ ప్రతిష్టించాలనుకున్నారు. ఓ భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భక్తి ముసుగులో మద్యం సేవించి, భారీ లౌడ్ స్పీకర్లతో డ్యాన్సులు వేశారు. పక్కా ఆధారాలు లభించడంతో 8 మందిని అరెస్టు చేశామని ఏసీపీ జేకే పాండ్యా చెప్పారు. ఏ మతాన్నైనా కించపరిచే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మల్కాజిగిరి గణేష్ మండపంలో అగ్నిప్రమాదం
-
గణేష్ మండపంలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరిలోని ఓ గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక విఫ్ణుపురి కాలనీలోని మైత్రీనివాస్ అపార్ట్మెంట్ సెల్లార్లో ఏర్పాటు చేసిన మండలంలో మంటలు చెలరేగడంతో రెండు కార్లు, పది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సహాయంతో మిగితా వాహనాలను అపార్ట్మెంట్ వాసులు బయటకు తీసుకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా ప్రాణ నష్టం తప్పడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
వెరైటీ వినాయకుడు..
సాక్షి, కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంగా బొరివంకలో శ్రీబాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లేఖినీరూప కాణిపాక గణపతిని రూపొందించారు. గత ఏడేళ్లుగా పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న ఉద్దానం యూత్ క్లబ్ సభ్యుడు, శిల్పి భైరి తిరుపతిరావు ఈ విగ్రహాన్ని రూపొందించారు. 3,500 సుద్దముక్కలను తీసుకుని ప్రతీ సుద్ద ముక్కపై గణనాథుడిని చెక్కాడు. వీటిని మట్టితో చేసిన గణనాథుడి శరీర ఉపరితలంపై అందంగా అలంకరించాడు. వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులను అద్ది ఆకర్షణీయంగా సిద్ధం చేశాడు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వరి నారు, నారికేళ, నలుగుపిండి, వనమూలిక, గోధుమ నారు, కొబ్బరిపూలతో వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేశారు. వీటికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషం. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
‘ఎకో’దంతుడికి జై!
ఏకదంతుడు.. క్రమంగా ‘ఎకో’దంతుడవుతున్నాడు..మట్టి గణపతికి జై..రంగు ప్రతిమలకు బై.. అంటున్నారు భక్తులు. మట్టి విగ్రహాలకే మొక్కుతున్నారు..నీటి వనరుల కాలుష్యాన్ని పెంచుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ) మోజు నుంచి బయటపడుతున్నారు. నాలుగైదేళ్లుగా మట్టి విగ్రహాల వైపు భక్తజనం దృష్టి సారిస్తున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలపై ప్రత్యేక కథనం.. - సాక్షి, హైదరాబాద్ సాగర్ నిమజ్జనంలో 43 శాతం మట్టివే.... గతేడాది నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాల్లో 43 శాతం మట్టివేనని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కలు తేల్చింది. ఈసారి ఆ సంఖ్య 55 శాతాన్ని దాటుతుందని అంచనా. ప్రజల్లో అవగాహన మెరుగుపడిందన్న స్పష్టమైన సంకేతాలున్నాయని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ చెప్పారు. నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా అవగాహన పెరిగిందన్నారు. ఎకోఫ్రెండ్లీ గణపతి ఐడియాలు కొన్ని.. చెరకు గణపతి... తమిళనాడులో 20 మంది కార్మికులు రెండు టన్నుల చెరకుతో భారీ గణపతిని తయారుచేశారు. ఆ తరువాత నిమజ్జనానికి బదులు ఆ చెరకుగడలను తీసి, భక్తులందరికీ పంచిపెట్టడంతో ఇప్పుడు చాలా చోట్ల చెరకు గణపతులు వెలుస్తున్నారు. తద్వారా వేస్టేజ్ ఉండదు, భక్తులకు ఉపయోగకరంగానూ ఉంటుంది. గోబర్ గణేషుడు... హిందువులు ఆవుని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవు నెయ్యికీ, పేడకూ అంతే పవిత్రత ఉంది. పేడ నీటిలో త్వరగా కరిగిపోతుంది. అందుకే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మట్టిలో ఆవుపేడని కలిపి వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలుతో పాటు పవిత్రతకి పవిత్రతా చేకూరుతుంది. చేప మిత్రుడిగా... నిమజ్జనం చేసే నీటిలో ఉన్న చేపలకి ప్రమాదకరంగా మారకుండా ఉండడమే కాకుండా ఫిష్ ఫ్రెండ్లీ గణపతులను ముంబైకి చెందిన స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ ఎన్జీవో తయారుచేస్తోంది. ఆనంద్ పెంధార్కర్ అనే పర్యావరణ వేత్త ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుల తయారీని పరిచయం చేశారు. ఇలాంటి గణపతి విగ్రహాలు చేపలకు హానిచేయకపోవడమే కాదు, చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. అంటే చేపలు తినే పదార్థాలతోనే ఈ గణేషులను తయారుచేస్తారన్నమాట. తీపి గణపతి... వినాయకచవితికి కొంత మధురంగా మలచాలనుకున్న ముంబైకి చెందిన రింటూ రాథోడ్ 50 కేజీల చాక్లెట్ గణేషుడిని తయారు చేసింది. దీన్ని నీటిలో నిమజ్జనం చేయకుండా ఆ చాక్లెట్‌నంతా తీసి పిల్లల నోళ్లు తీపిచేశారు. అంతేనా పాలల్లో నిమజ్జనం చేసి మిల్క్‌షేక్‌ని భక్తులకు పంపిణీ చేశారు. గణపతిని విత్తుకోండిలా... ముంబైకి చెందిన దత్తాద్రి కొత్తూర్ ఓ సరికొత్త గణపతిని తయారుచేశారు. విత్తగణపతి అన్నమాట. అన్ని గణపతి విగ్రహాల్లా దీన్ని నీటిలో ముంచక్కర్లేదు. కుండీలో పెట్టుకుని కొద్దిగా నీరు పోస్తుంటే చాలు పండుగ రోజులు పూర్తయ్యేనాటికి మీ యింట్లో మీకు నచ్చిన కూరగాయ మొక్కల్ని ప్రసాదించేస్తాడు ఎకోఫ్రెండ్లీ వినాయకుడు. విత్తనాలేవైనా మీ యిష్టం, ధనియాలో, బెండకాయ, తులసి విత్తనాలో ఏవైనా మీకు కావాల్సిన విత్తనాలను మట్టితో కలిపి గణేషుడిని తయారుచేయడమే. తలా ఓ చేయి... పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు,ప్రభుత్వ విభాగాల అధికారులు ఈసారి మట్టి విగ్రహాలపై ముమ్మర ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రసార మాధ్యమాలు కూడా తోడవడంతో జనంలో మార్పు కనిపిస్తోంది. - మట్టి విగ్రహాలపై దేవాలయాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. - గతేడాది 40 వేల మట్టి విగ్రహాలను రూపొందించి ఉచితంగా అందజేసిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఈ సారి ఆ సంఖ్యను 60 వేలకు పెంచింది. - వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నీటి వనరులకు చెడుపు చేయకుండా సహజ రంగులతో విగ్రహాలు తయారు చేశారు. - నగరంతోపాటు జిల్లాల్లో ఉన్న కొన్ని కుమ్మరి సంఘాలు కూడా మట్టి విగ్రహాల తయారీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. - కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, భక్త మండళ్లు, మహిళా మండళ్లు కూడా మట్టి విగ్రహాలకే జైకొట్టాయి. -
కూలిన వినాయకుడి మండపం
సాక్షి, విశాఖపట్నం: వినాయక చవితి పురస్కరించుకుని భారీ వినాయక విగ్రహం ఏర్పాటులో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గణనాథుడి మండపం కుప్పకూలిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది.సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా నాతయ్యపాలెంలో 70 అడుగుల గణనాథుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా అతి పెద్ద మండపాన్ని నిర్మించి అందులోనే విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. ఇందుకోసం గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలితో పాటు భారీ వర్షం కారణంగా మండపం పేకపేడలా కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సుమారు రూ.15 లక్షలతో నెల రోజులుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.