ఎదుటే గణేష్‌ విగ్రహం.. ఏం చేశారో చూడండి..! | Crowd At Ganesh Idol Drunk And Dance In Surat Gujarat | Sakshi
Sakshi News home page

ఎదుటే గణేష్‌ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!

Published Wed, Sep 4 2019 11:26 AM | Last Updated on Wed, Sep 4 2019 12:42 PM

Crowd At Ganesh Idol Drunk And Dance In Surat Gujarat - Sakshi

గాంధీనగర్‌ : దేశమంతా బొజ్జ గణపయ్యను భక్తి ప్రపత్తులతో కొలువుదీర్చుకుంటే గుజరాత్‌లో మాత్రం కొందరు మత్తులో మునిగిపోయారు. గణేష్‌ విగ్రహం ఎదుటే విచ్చలవిడిగా మద్యం సేవించి, బాలీవుడ్‌ పాటలతో పిచ్చెక్కినట్టు డ్యాన్సులు చేశారు. వీధుల్లో బీర్లు పారించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 8 మందిని అరెస్టు చేశారు.

వివరాలు.. సూరత్‌లోని గోల్వాడ్‌లో శివగణేష్‌ యూత్‌ అసోసిషేషన్‌ సభ్యులు వినాయక ప్రతిమ ప్రతిష్టించాలనుకున్నారు. ఓ భారీ గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భక్తి ముసుగులో మద్యం సేవించి, భారీ లౌడ్‌ స్పీకర్లతో డ్యాన్సులు వేశారు. పక్కా ఆధారాలు లభించడంతో 8 మందిని అరెస్టు చేశామని ఏసీపీ జేకే పాండ్యా చెప్పారు. ఏ మతాన్నైనా కించపరిచే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement