surath
-
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనాన్ని ప్రారంభించిన మోదీ
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్‌లో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. సూరత్ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. సూరత్‌లో రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Surat Diamond Bourse It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. It will be a global centre for trading both rough and polished diamonds as well as jewellery. The… pic.twitter.com/2bEz3J3RGv — ANI (@ANI) December 17, 2023 సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ భవనం.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్‌లోని 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండ్ సెంటర్ కంటే సూరత్‌లోని డైమండ్ బోర్స్ సెంటర్ అతిపెద్దది. ఇజ్రాయెల్ డైమండ్ సెంటర్లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్ బోర్స్‌లో 4500 ఆఫీస్‌లు ఉన్నాయి. ఇదీ చదవండి: షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ -
రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టేసిన సూరత్ సెషన్స్ కోర్టు
-
ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. తొమ్మిది మంది ‘సున్నా’లే! మరీ చెత్తగా
Vijay Merchant Trophy- సూరత్: భారత దేశవాళీ క్రికెట్లో ఈశాన్య రాష్ట్ర జట్ల పేలవ ప్రదర్శనపై తరచుగా వస్తున్న విమర్శలకు మరింత బలమిచ్చే మ్యాచ్ మరొకటి ముగిసింది. బీసీసీఐ అధికారిక అండర్–16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ)లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం ‘6’ పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వీష్ ఒక ఫోర్ కొట్టగా, తొమ్మిదో స్థానంలో వచ్చిన అక్షద్ 2 పరుగులు సాధించాడు. మిగతా తొమ్మిది మంది ‘సున్నా’లే! ఈ మ్యాచ్‌లో ముందుగా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 414 పరుగులు చేసి డిక్లేర్ చేయగా... తొలి ఇన్నింగ్స్‌లో సిక్కిం 43 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనైతే మరీ చెత్తగా ఆడి అనూహ్య రికార్డు నమోదు చేయడంతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్, 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల పేర్లు ముడిపెట్టి.. ‘‘మరీ ఇంత దారుణ వైఫల్యమా.. సీనియర్లను బాగా ఫాలో అవుతున్నట్లున్నారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. సిక్కిం ఓపెనర్ రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే అవుట్ కావడంతో భారత సారథి రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సిక్కిం కెప్టెన్ దిన్రీ రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. మరోవైపు మధ్యప్రదేశ్ కెప్టెన్ మనాల్ చౌహాన్ 170 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? Sikkim bowled out for 6 in the Vijay Merchant Trophy against Madhya Pradesh. — Mufaddal Vohra (@mufaddal_vohra) December 23, 2022 -
Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై రాయితో దాడి.. నేనేం తప్పు చేశా?
సూరత్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పైకి ఓ వ్యక్తి రాయి విసిరాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సూరత్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చేశాడు. అయితే కేజ్రీవాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ విషయంపై కేజ్రీవాల్ స్పందించారు. ప్రత్యర్థులు తన కన్ను పోగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను ఏం తప్పు చేశానని దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మిస్తామని తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మహిళలు, యువతలో విశేష స్పందన లభిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మొత్త 182 సీట్లకు 92 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై చేసిన దాడిలో ఓ చిన్నారి గాయపడినట్లు ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా తెలిపారు. బీజేపీ గూండాలే ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపించారు. મારી માતા, બહેન, દિકરીઓને પ્રતિ માસ રૂ 1000 સન્માન રાશિ તરીકે આપવામાં આવશે. - @ArvindKejriwal pic.twitter.com/j9vq5vvOAY — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 28, 2022 మరోవైపు కేజ్రీవాల్‌పై దాడి జరగలేదని గుజరాత్ పోలీస్ అధికారులు చెప్పారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతతో రోడ్‌షో జరిగిందని పేర్కొన్నారు. అయితే సూరత్‌లో కేజ్రీవాల్ ర్యాలీ సమయంలో ఆప్, బీజేపీ కార్యకరక్తల మధ్య తోపులాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. తామ వెంటనే పరిస్థితిని అదుపు చేశామన్నారు. చదవండి: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం! -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్‌లోని సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. A tanker carrying 12,000 litres of edible oil for processing from #Surat in #Gujarat to #Mumbai overturned on the busy Mumbai-#Ahmedabad highway at #Palghar in #Maharashtra. A number of locals rushed to the spot and looted the #oil overflowing from the tanker.#ACCIDENT #News pic.twitter.com/GktU2tztkd — Chaudhary Parvez (@ChaudharyParvez) May 22, 2022 -
చిరుతిండి వ్యాపారికి పెటా అవార్డు
సూరత్: గుజరాత్‌కు చెందిన చిరుతిండ్లు అమ్ముకునే చేతన్ పటేల్‌కు పెటా ఇండియా హీరో టు యానిమల్స్ అవార్డును ప్రకటించింది. చిన్న వ్యాపారైనా పెద్ద మనసుతో పక్షుల సంరక్షణకు చేతన్ కృషి చేశాడని కొనియాడింది. గాలిపటాల్లో వాడే మాంజా(నైలాన్ దారం) కారణంగా పక్షుల ప్రాణాలు పోతున్నాయని చేతన్ పలువురికి నచ్చజెప్పేవారు. అంతేకాకుండా ఉత్తరాయణ పండుగ అనంతరం బజార్లో పడేసిన కిలో మంజాను ఎవరు తెచ్చిఇచ్చినా వారికి కిలో చిరుతిండి ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో రోడ్లపై అడ్డదిడ్డంగా ఈ దారాలు పడిపోకుండా పక్షులకు ఇబ్బంది కలగకుండా చేతన్ యత్నించారని పెటా తెలిపింది. ఈ మేరకు చేతన్‌కు సర్టిఫికెట్‌ను అందించింది. మంజా దారం చాలా పదునుగా ఉంటుంది. దీనివల్ల పక్షుల కాళ్లు రెక్కలు తెగిపోతూఉంటాయి. -
ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!
3D-print saree business in Gujarat: యూపీ ఎన్నికలతో గుజరాత్లో త్రీడీ ప్రింట్ చీరల వ్యాపారం ఊపందుకుంది. ఎన్నికలు జరగన్నును రాష్ట్రాలలో కోవిడ్ -19 దృష్ట్య బహిరంగ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారం కాస్త గుజరాత్‌లోని సూరత్‌లో చీరల వ్యాపారానికి ఊతం ఇచ్చింది. ఈ మేరకు సూరత్‌లోని టెక్స్టైల్ మార్కెట్‌కు చెందిన ఒక బట్టల వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖాల త్రీడి ప్రింట్లతో చీరను తయారు చేశాడు. దీనికి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మద్దతు ఉంది. పైగా వారి డిమాండ్ మేరకు సూరత్ వ్యాపారులు ఈ చీరలను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ చీరలపై రామమందిరం, వారణాసిలోని వివిధ ఘాట్లు, ఇటీవల ప్రధాని ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ల ప్రింట్లను ముద్రించారు. పైగా ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చీరలను పెద్దమొత్తంలో పంపించాలని సూరత్‌కు చెందిన వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు కూడా బీజేపీ మద్దతుదారులే చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో తమ ఎన్నికల ప్రచారానికి సహకరించే మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చీరల్లో కొన్నింటిపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం చిత్రం కూడా ఉంటుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సుమారు లక్ష చీరలను పంపనున్నట్లు వస్త్ర వ్యాపారి లలిత్ శర్మ తెలిపారు. (చదవండి: ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ) -
కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా?
James & Jewellery International Exhibition: ప్రపంచ వ్యాపార సాంమ్రాజ్యంలో సూరత్‌కు ప్రత్యేకస్థానం ఉంది. ఈసారి జరిగిన జేమ్స్ అండ్ జ్యువెలరీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో సూరత్ వజ్రాల వ్యాపారులు తయారు చేసిన అరుదైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూరత్ వ్యాపారులు వజ్రాలతో తయారు చేసిన గొడుగు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ విశేషాలు మీకోసం.. ఈ డైమండ్ గొడుగును తయారు చేసిన చేత్న మంగూకియా మాటల్లో.. ‘175 క్యారెట్ల డైమండ్‌ను ఈ గొడుగులో ప్రత్యేకంగా అమర్చాం. అంతేకాకుండా 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో తయారుచేశాం. దాదాపు 25 నుంచి 30 మంది వర్కర్లు 25 రోజులపాటు దీనిని తయారు చేశారు. డైమండ్ మార్కెట్లో దీని ధర 25 నుంచి 30 లక్షల వరకు పలకొచ్చు. సాధారణంగా అమెరికా, యూరప్, హాన్‌కాంగ్ వంటి దేశాల నుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయని’ మీడియాకు వెల్లడించారు. చదవండి: Smart Phone Addiction: స్మార్ట్ ఫోన్‌కు అడిక్టయి.. గతం మర్చిపోయిన యువకుడు ఈ ఎగ్జిబిషన్‌ను చూసిన గ్రేసీ అనే మహిళ ‘ఒకటికంటే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటికంటే వజ్రాల గొడుగు ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంద’ని పేర్కొంది. మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడుతుంటే.. వజ్రాల పరిశ్రమ మాత్రం రెక్కలు విప్పుకుంటున్నట్లు అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
Maitri Patel: రైతు కూతురు.. అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్..
ఆకాశంలో విమానం ఎగురుతున్న శబ్దం వచ్చిందంటే చాలు ఇంట్లో ఏ మూలన ఉన్నా.. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి విమానం కనపడినంతసేపూ గాలిలో చేతులూపుతూ సంతోషపడుతుంటారు చిన్నపిల్లలు. గుజరాత్‌కు చెందిన మైత్రి పటేల్ కూడా తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తొలిసారి విమానాన్ని చూసింది. ‘అబ్బ! బలే ఉంది! ఆకాశంలో ఎంత బాగా ఎగురుతుందో అని సంబరపడడమేగాక, తను కూడా పెద్దయ్యాక విమానం నడపాలని అప్పుడే నిర్ణయించుకుంది. అనాటి కలను ఈరోజు నిజం చేసుకుని, దేశంలోనే తొలి అతి పిన్న కమర్షియల్ పైలట్‌గా నిలిచింది. సూరత్‌లోని ఓల్పాడ్ నగరానికి చెందిన మైత్రి తండ్రి కాంతీలాల్ వ్యవసాయం చేస్తున్నారు. తల్లి రేఖ బెన్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలో సివిల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కూతుర్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టాలన్న తపనతో ప్రైవేటు స్కూల్లో చేర్చి ఇంగ్లీష్ మీడియంలో చదివించారు కాంతీలాల్ దంపతులు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ స్కూల్ విద్య అయ్యాక.. ఇంటర్మీడియట్లో ఉండగా మైత్రిని ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో చేర్పించారు. అక్కడ కెప్టెన్ ఏడీ మాణిక్ మైత్రికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో.. ఒకపక్క ఇంటరీ్మడియట్ చదువుతూనే పైలట్‌కు సంబంధించిన గ్రౌండ్ శిక్షణను పూర్తిచేసింది. శని, ఆదివారాల్లో ఎంట్రన్స్ పరీక్షకు సన్నద్ధమవుతూ అమెరికాలో పైలట్ ట్రైనింగ్ తీసుకునేందుకు అర్హత సాధించింది. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగినప్పటికీ అగ్రరాజ్యంలో పైలట్ ట్రైనింగ్ తీసుకోవడానికి కావలసినంత డబ్బు సమకూరలేదు. చిన్నప్పటి నుంచి తమ కూతుర్ని పైలట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రోత్సహిస్తున్న కాంతీలాల్... తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న స్థలాన్ని విక్రయించి మైత్రిని అమెరికాలో పైలట్ ట్రైనింగ్ కోర్సులో చేర్పించారు. పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన ట్రైనింగ్‌ను మైత్రి కేవలం పన్నెండు నెలల్లోనే పూర్తిచేసింది. చాలామంది పద్దెనిమిది నెలలు పూర్తయినా కూడా ట్రైనింగ్‌ను పూర్తిచేయలేరు. అటువంటిది ఆరునెలల ముందుగానే పైలట్ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి అమెరికా పైలట్ లైసెన్స్‌ను పొందింది మైత్రి. దీంతో ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్‌గా రికార్డు సృష్టించింది మైత్రి పటేల్. ఈ విషయం తెలిసిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆమెను అభినందించారు. ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది.. ‘‘మైత్రి సూరత్‌లో, స్కైలైన్ ఏవియేషన్ ముంబైలో ఉంటుంది. ఒకపక్క చదువుకుంటూ, మరోపక్క పైలట్ శిక్షణ తీసుకోవడం కష్టం. అందుకే ఆమెకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాము. త్వరగా నేర్చుకునే అమ్మాయి కావడంతో... కరోనా సమయంలో కూడా పూర్తి సమయాన్ని కేటాయించి గ్రౌండ్ స్థాయి శిక్షణ పూర్తి చేసింది. అమెరికాలో 18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా కష్టపడే శిక్షణను, పన్నెండు నెలల్లోనే పూర్తిచేసి దేశమంతా గర్వపడేలా చేసింది. ఇప్పుడు మైత్రి పటేల్ మహిళాభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది. ఈమెను చూసి మరికొంతమంది పైలట్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అని కెప్టెన్ మాణిక్ చెప్పారు. ప్రస్తుతం మైత్రి బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి త్వరలోనే శిక్షణ తీసుకోడానికి సన్నాహకాలు చేసుకుంటోంది. ‘‘ప్రస్తుతం అమెరికా లైసెన్స్ వచ్చింది. త్వరలో దానిని ఇండియన్ లైసెన్స్‌గా మార్చుకుని ఎయిర్ లైన్స్‌లో పనిచేస్తాను. పైలట్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సాయపడతాను’’ అని మైత్రి చెబుతోంది. 19 ఏళ్ల వయసులో ఇంత గొప్ప విజయం సాధించిన మైత్రి ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్ -
Youngest Commercial Pilot: ఆమె పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది..
గుజరాత్: దేశంలోనే అత్యంత పిన్న వయసులో కమర్షియల్ పైలట్ అయిన ఘనత మైత్రి పటేల్ సొంతం చేసుకున్నారు. సూరత్‌కి చెందిన మైత్రి కేవలం 19 యేళ్ల వయసులోనే ఆకాశం అంచులను అందుకున్నారు. ‘నా ప్రయాణంలో ఎదురైన సవాళ్లన్నింటిని నా కలను నెరవేర్చుకోవడానికి పునాదులుగా మల్చుకున్నాను’ అని ఆమె మీడియాకు వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన మైత్రి, 8 యేళ్ల వయసులో మొదటిసారిగా విమానం చూశానని, అప్పుడే తాను పైలట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 12 వ తరగతి వరకు మన దేశంలోనే చదివినా.. అనంతరం పైలట్ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్లానని చెప్పారు. ఐతే ఈ ట్రైనింగ్‌ను కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. మైత్రి తండ్రి కాంతిలాల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ సూరత్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు పడవలో ప్రయాణికులను చేరవేస్తూ డబ్బు సంపాందించేవాడినని తెలిపాడు. విమానాలు టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడం చూస్తూ ఉండేవాడినని, అప్పుడే తన కూతురు కూడా ఫైలట్ అయ్యి, ప్రపంచమంతా పర్యటించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తన కూతురిని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో కూడా చేర్పించానని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ పిన్న వయస్కురాలైన పైలట్ మైత్రి పటేల్ మాత్రం తన దృష్టి భవిష్యత్ ప్రణాళికపై కేంద్రీకరించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆకాశంలో విహరించాలని, బోయింగ్ విమానంలో ఎగరాలని, అందుకు త్వరలోనే ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. -
వీరులకు రీతూ బంధన్
మరో మూడు రోజుల్లో అప్యాయతలు, అనుబంధాల మధ్య జరుపుకోనున్న‘రక్షాబంధన్ పండగ’ హడావుడి మొదలైంది. సరికొత్త రాఖీలు మార్కెట్లో కళకళలాడుతుండడంతో...తమ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలి? అందమైన రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆడపడుచులంతా ఓపిగ్గా షాపింగ్ చేస్తుంటే... సూరత్‌కు చెందిన రీతూ రాథీ మాత్రం తన సైనిక సోదరులకు కట్టేందుకు వేల సంఖ్యలో రాఖీలు తయారు చేయిస్తోంది. దేశ ప్రజలను తమ కుటుంబ సభ్యులు, తోబుట్టువులుగా భావించి ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్న వీర జవాన్లకు రాఖీలు కట్టి గౌరవించాలనుకుంది రీతు. ఈక్రమంలోనే ఏడు వేల రాఖీలను తయారు చేయిస్తోంది. రీతు నడిపిస్తోన్న ‘సోచ్ ఫౌండేషన్’ ద్వారా వితంతువులు, వికలాంగులతో రాఖీలు తయారు చేయిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తోంది. వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిన రీతుకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సాయం చేయడమంటే ఇష్టం. బీకాం తరువాత ఢిల్లీలోని జేడీ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పోర్ట్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసింది. తర్వాత సోమేశ్వర్ డెవలపర్స్ డైరెక్టర్ ఆశిస్ రాఠీని పెళ్లి చేసుకుని ఒక పక్క వ్యాపార పనులు చూసుకుంటూనే, సేవాకార్యక్రమాల దిశగా అడుగులు వేసింది. కోవిడ్ సమయంలో శానిటైజింగ్ మెషిన్‌ను దానం చేయడం, ఫేస్ మాస్కులు పెట్టుకోవడంపై అవగాహన కల్పించడం, ఆహారం లేక అల్లాడుతున్న నిరుపేదల ఆకలి తీర్చడం, ప్రతి ఆదివారం మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం, పోషకాహారం, శానిటరీ పాడ్స్ ఇవ్వడం, వికలాంగులకు మర్మా థెరపీ వంటివి కార్యక్రమాలెన్నింటినో తన టీమ్‌తో చేపట్టింది. గతేడాది ‘ఏక్ సోచ్: ఏక్ ఆత్మనిర్భర్ హిందుస్థాన్ కి ఔర్’ పేరిట ఎన్జీవోని స్థాపించి వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ, నిరుపేదల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ‘‘మనందరికోసం ప్రాణాలు అర్పిస్తోన్న సైనికుల త్యాగాలను దేనితోనూ పోల్చలేము. అనుబంధాల పండుగనాడు వారికి రాఖీ కట్టి గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు వేల రాఖీలను రూపొందిస్తున్నాము, వీటిని వితంతువులు, వికలాంగులతో తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కలుగుతుంది’ అని రీతు చెప్పింది. -
కోవిడ్-పాజిటివ్ రోగుల కోసం గుజరాత్ లో వాక్సిన్ పంపిణీ
కోవిడ్ పాజిటివ్ రోగులకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందజేయనున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ పేర్కొన్నారు. సీఆర్ పాటిల్ సూరత్ సీవిల్ ఆసుపత్రిని సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆసుపత్రిలో 5000 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇది వ్యాధి సంక్రమణ చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ఔషధం కొరత ఏర్పడిందని పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని వెంటనేఈ ఏర్పాట్లు చేసినట్లు పాటిల్ తెలిపారు. ఔషధం అవసరమైన రోగులు పార్టీని ఉచితంగా పొందటానికి సంప్రదించవచ్చుఅని పాటిల్ తెలిపారు. వడోదరలోని బీజేపీ ఆసుపత్రులలోని కోవిడ్ పాజిటివ్ రోగులకు ఉచిత ఆహార ప్యాకెట్లను కూడా సరఫరా చేస్తోందని చెప్పారు. మూడు లక్షల యాంటీ వైరల్ ఔషధం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు పెట్టినట్లు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. గుజరాత్‌కు అదనంగా 24,687 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు లభించగా మొత్తం ఏప్రిల్ నెలలో 1,70,738 ఇంజెక్షన్లు అందుకున్నారు. గుజరాత్ ఫుడ్ & డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ హేమంత్ కోషియా దేశంలో ఔషధ తయారీదారులు ఆరుగురు మాత్రమే ఉన్నారని వారు రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల ఇంజెక్షన్లను ఉత్పత్తి చేస్తారు అని పేర్కొన్నారు.. చదవండి: కరోనా విలయం: రెండో స్థానంలోకి భారత్ -
'125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించారు'
న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన గుజరాత్ స్థానిక ఎన్నికల ఫలితాలతో కొత్త శకం ఆరంభం అయ్యిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఆమ్ అడ్మి పార్టీ (ఆప్)కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సూరత్ ప్రజలు 125 ఏళ్ల చరిత్ర ఉన్నకాంగ్రెస్‌ను ఓడించారని, ప్రజల భాగస్వామ్యంతో గుజరాత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తమ పార్టీ అభ్యర్థులు ఎంతో నిజాయితీతో, నిబద్ధతతో పని చేస్తారని మాటిస్తున్నట్లు తెలిపారు. తమకు ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రజలను నేరుగా కలిసేందుకు ఈనెల 26న సూరత్‌లో పర్యటిస్తామని కేజ్రివాల్ పేర్కొన్నారు. కాగా ఆదివారం గుజరాత్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఎన్నికలు జరగగా, వాటిలో 483 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, కాంగ్రెస్ 55 సీట్లు మాత్రమే గెలుపొందింది. అయితే 120 వార్డులు ఉన్నసూరత్ కార్పొరేషన్లో బీజేపీ 93 గెలవగా కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. తొలి సారి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సూరత్‌లో 27 స్థానాలు గెలుచుకుని, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. సూరత్‌లో పటేల్ సామాజిక వర్గానికి చెందిన పాటిదార్ అనామత్ ఆరాక్షన్ సమితి (పిఎఎఎస్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బహిష్కరించింది. దీనిని అవకాశంగా మరల్చుకున్న ఆప్..వారి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇచ్చి కాంగ్రెస్‌ను ఢీ కొట్టింది. ఫలితంగా సూరత్‌లో ఆప్ అనూహ్య రీతిలో విజయం సాధించింది. మరోవైపు ఆప్ విజయంతో రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే పాటిల్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి : (80 ఏళ్ల వృద్ధుడికి.. రూ.80 కోట్ల కరెంట్ బిల్లు) (ఆ ఆటో డ్రైవర్‌కు నెటిజన్లు ఫిదా : భారీ విరాళాలు) -
కోర్కెలు తీర్చలేదని, లేటు వయసులో ఏడో పెళ్లి
సూరత్: సకల రోగాలతో సతమవుతూనే 63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ ధనిక రైతు. తన కంటే వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఆరో భార్య అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తుందన్న కారణంగా అతను మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ వితంతువును ఆరో వివాహం చేసుకున్న అతను..కరోనా కారణంగా ఆమె దూరం పెట్టడంతో డిసెంబర్ నెలలో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. తనకు గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయని, తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని, అందుకే తను మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన్నది అతని వాదన. ఈ విషయంపై ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతని లీలలు వెలుగు చూశాయి. ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితోనూ ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఎరగా చూపి వివాహం చేసుకొని, వాడుకొని వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన గత వివాహాల గురించి తన వద్ద దాచి పెట్టి వివాహం చేసుకున్నాడని, పెళ్లి సందర్భంగా తనకు ఇస్తానన్న నగదు, ఇళ్లు కూడా ఇవ్వలేదని బాధిత మహిళ ఆరోపించింది. కాగా, అతని మొదటి భార్య.. 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయస్కులైన తన సంతానంతో కలిసి అదే గ్రామంలో ఉంటుందన్న విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిపై 498-A సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ అచార వ్యవహారాల్లో ఇలా వివాహాలు చేసుకోవడం రివాజేనని నిందితుడు వాదించడం కొసమెరుపు. -
నిద్రిస్తున్నవారి పైకి దూసుకెళ్లిన ట్రక్కు..13 మంది మృతి
సూరత్ : గుజరాత్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని కొసాంబ సమీపంలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందాగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ట్రాక్టర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో ట్రక్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మృతులంతా రాజస్తాన్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
మేనకోడలితో సంబంధం.. ప్రైవేట్ వీడియో లీక్
సూరత్ : మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్‌కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్‌లోని సూరల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు. ( చదవండి : నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్మెయిల్) నో చెప్పి, దూరం పెట్టిందని.. ఇదిలా ఉంటే యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : భార్యను హత్య చేసిన కొద్దిసేపటికే..) -
అతడిపై కఠిన చర్యలు తీసుకోండి: నిర్మల
న్యూఢిల్లీ : గుజరాత్లో మహిళా బ్యాంక్ ఉద్యోగినిపై దాడి కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా సూరత్‌లోని కెనరా బ్యాంక్(ఒకప్పటి సిండికేట్ బ్యాంక్) మహిళా ఉద్యోగినిపై సోమవారం సాయంత్రం ఓ కానిస్టేబుల్ దాడి చేయడమే కాకుండా బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన అనంతరం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇలాంటి చర్యల నుంచి బ్యాంకు ఉద్యోగులను రక్షించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్‌తోపాటు సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి, కేసు విచారణణు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. (కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం) ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె ‘బ్యాంకు ఉద్యోగుల భద్రత ప్రాముఖ్యత. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బ్యాంకులు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. బ్యాంకుకు చెందిన మహిళ సిబ్బంది దాడి ఘటనపై డాక్టర్ ధవాల్ పటేల్, సూరత్ జిల్లా కలెక్టర్, కమిషనర్ భ్రాంభట్తో మాట్లాడాను. మహిళా బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈ కేసుపై సకాలంలో చర్యలు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే నిందితుడు కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని పోలీస్ కమిషనర్ భ్రాంభట్ పేర్కొన్నారు’ అని నిర్మలా తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. (అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్! ) -
అక్కడ మరోసారి పోలీసులపై దాడి
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌జిల్లా మోర గ్రామంలో శనివారం మరోసారి వలసకార్మికులు పోలీసులకు మధ్య ఘర్షణ ఏర్పడింది. తమను ఇళ్లకు పంపించాలంటూ కార్మికులకు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసు వాహనాల మీద రాళ్లతో దాడి చేశారు. ఈ విషయం పై అధికారులు మాట్లాడుతూ వలస కార్మికులను వారివారి ఇళ్లకు పంపించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. (అహ్మదాబాద్‌లో పోలీసులపై రాళ్ల దాడి) వలస కార్మికుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా, నుంచి వచ్చారు. వీరందరూ హజీర్ పారిశ్రామిక వాడలో పనిచేస్తూ మోర గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఈ ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకొని అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పోలీసులపై దాడి చేసినందుకు గాను 50 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతమంతా స్టేట్ రిజర్వ్ పోలీసులు మోహరించారు. (లాక్డౌన్: ఇళ్లకు వెళతాం.. వదిలేయండి!) -
అహ్మదాబాద్‌లో పోలీసులపై రాళ్ల దాడి
అహ్మదాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్లో వలస కార్మికులు, పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. కార్మికులందరూ తమని స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు, కార్మికుల మధ్య జరిగిన వాగ్వవాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో వలస కార్మికులు... పోలీసులపై రాళ్లదాడికి దిగారు. సూరత్‌లో వస్త్ర, వజ్రాల పరిశ్రమలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కార్మికులు గుజరాత్‌కు వస్తూ ఉంటారు. అయితే లాక్డౌన్ కారణంగా వారందరూ అక్కడే చిక్కుకుపోయారు. అనేక సార్లు తమని సొంత గ్రామాలకు పంపించాలని వారు రోడ్లపై బైఠాయించి రహదారులను బ్లాక్ చేశారు. సోమవారం కూడా వారేలీ మార్కెట్లో కార్మికులు గుంపులుగా ఏర్పడి నిరసన తెలిపారు. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరగా వారు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. (వలస కార్మికులపై చార్జీల భారమా!?) అదేవిధంగా పాలన్పూర్ ప్రాంతంలో కూడా వలస కార్మికులు నిరసనకు దిగారు. తమను లాక్డౌన్ కాలంలో కూడా పనిచేయమంటున్నారని, అక్కడ వారికి సరిపడినంత ఆహారం లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వగ్రామలకు తరలించడానికి అధికారులు చొరవతీసుకోవాలని కోరారు. గుజరాత్లో ఏప్రిల్ 10న వలసకార్మికులు వాహనాలను తగులబెట్టి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా ఇప్పటి వరకు గుజరాత్లో 5,428 కరోనా కేసులు నమోదు కాగా, 290 మంది మరణించారు. (అత్యధిక కరోనా మరణాల రేటు ఆ రాష్ట్రంలోనే) -
టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని సూరత్ జిల్లా సరోలి ప్రాంతంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 50కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరాయని అధికారులు తెలిపారు. కాగా కొద్దిరోజుల కిందట ఇదే భవనంలోని నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలను కొద్దిసేపటిలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. చదవండి : అగ్ని ప్రమాదం; 14 కార్లు దగ్ధం -
పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి నిలిచిపోతుంది
సూరత్ : కొందరు చావు పేరు చెబితేనే ఆమడ దూరం వెళ్లిపోతారు. మరికొందరు చావు పేరు వింటేనే మా గుండెల్లో దడ మొదలవుతుంది అంటారు. మరీ అలాంటిది ఒక మహిళ మాత్రం కొద్దిరోజుల్లో తాను మరణిస్తానన్న విషయం తెలిసినా ఏ మాత్రం అధైర్యపడకుండా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ఎంచుకున్నారు. ఆమె గుజరాత్‌కు చెందిన 27ఏళ్ల శ్రుచి వదాలియా.. గుజరాత్‌లోని సూరత్ సిటీకి వెళ్లి అడిగితే ఎవరైనా ఈమె గురించి వివరిస్తారు. మరి ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 'చనిపోయేలోగా నేను నాటిన మొక్కల ద్వారా కొంతమేరకైనా వాయు కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నట్లు' శ్రుచి వదాలియా పేర్కొంటున్నారు. శ్రుచి వదాలియాకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ సోకింది. ఇప్పుడామే తన జీవితంలో చివరి దశకు వచ్చేసింది.. అంటే కొన్ని రోజుల్లో ఈ లోకం విడిచివెళ్లనుంది. అయినా ఆమె ఏమాత్రం బెదరకుండా తాను చనిపోయేలోగా సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించింది. తనకు బ్రెయిన్ ట్యూమర్ రావడానికి వాయు కాలుష్యం కూడా ఒక కారణమని భావించిన శ్రుచి వదాలియా తాను చనిపోయేలోగా వీలైనన్ని మొక్కలు నాటి ప్రమాదకర కాన్సర్‌తో పాటు, కొంతమేరైనా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని నిర్ణయించుకొంది. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మంచి చేయడంతో పాటు ప్రమాదకర కాన్సర్‌ను నివారించే అవకాశం ఉందని శ్రుచి పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు సంవత్సరాలలో 30వేలకు పైగా మొక్కలు నాటడమే గాక మిగతవారిని కూడా ఆ పని చేయమని ప్రోత్సహిస్తున్నారు. 'నేను చనిపోతానని నాకు తెలుసు. కానీ నేను పెంచే మొక్కల ద్వారా వచ్చే గాలిని పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు. నాలాగా ఎవరు ఈ వ్యాధికి గురవకూడదనేదే నా ప్రయత్నం. అందుకే వీలైనన్ని మొక్కలను పెంచి నా వంతుగా పర్యావరణానికి మేలు చేస్తున్నానని' శ్రుచి వదాలియా భావోద్వేగంతో తెలిపారు. శ్రుచి వదాలియా సూరత్‌లోని ప్రతీ పాఠశాలలకు తిరిగి ఒక్కో పిల్లాడి చేత మొక్కను నాటించి పర్యావరణాన్ని కాపాడే భాద్యతను ఎత్తుకున్నారు. -
విమానంలో విషాదం; కన్నతల్లికి కడుపుకోత
ముంబై : విమానంలో ప్రయాణిస్తున్న నెలలు నిండని ఓ చిన్నారి దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే మరణించింది. బిడ్డ పడుకుందని భావించిన ఆ తల్లి కూతురు శాశ్వత నిద్రలోకి వెళ్లిందని గమనించలేకపోయింది. ఈ హృదయ విదారకర ఘటన శుక్రవారం మహరాష్టలో చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి రియా.. తల్లి ప్రీతి జిందల్, అమ్మమ్మ తాతయ్యలతో కలిసి జైపూర్ నుంచి ముంబై వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తుంది. వీరు సూరత్‌లో విమానం ఎక్కగా.. ముంబైలో విమానం దిగే సరికి చిన్నారి నుంచి ఎలాంటి అలికిడి, స్పందన లేకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ముంబై విమానాశ్రయంలో దిగగానే విమాన సిబ్బందికి తెలియజేసి వైద్య సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది హుటాహుటిన చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మరణించిందని ధ్రువీకరించడంలో ఆ తల్లి ఆర్తనాదాలు మిన్నంటాయి. విమానం ఎక్కే సమయంలో కూతురు బాగానే ఉందని, అంతకముందే పాపకు పాలు తాగించానని, తరువాత పడుకోవడంతో నిద్రలోకి వెళ్లిందనుకున్నానని తల్లి కన్నీరు మున్నీరవడం అక్కడున్న వారిని కలిచివేసింది. ఇక శిశువు మృతికి కారణాలు వెల్లడి కాలేదు. శిశువు మృతదేహానికి పోస్టుమార్టం చేసినా కారణాలు తెలియకపోవడంతో శరీరం నుంచి నమూనాలను సేకరించి ఆసుపత్రికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తామని సంబంధిత విమాన అధికారులు తెలిపారు. -
ఎదుటే గణేష్ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!
గాంధీనగర్ : దేశమంతా బొజ్జ గణపయ్యను భక్తి ప్రపత్తులతో కొలువుదీర్చుకుంటే గుజరాత్లో మాత్రం కొందరు మత్తులో మునిగిపోయారు. గణేష్ విగ్రహం ఎదుటే విచ్చలవిడిగా మద్యం సేవించి, బాలీవుడ్ పాటలతో పిచ్చెక్కినట్టు డ్యాన్సులు చేశారు. వీధుల్లో బీర్లు పారించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 8 మందిని అరెస్టు చేశారు. వివరాలు.. సూరత్‌లోని గోల్వాడ్లో శివగణేష్ యూత్ అసోసిషేషన్ సభ్యులు వినాయక ప్రతిమ ప్రతిష్టించాలనుకున్నారు. ఓ భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భక్తి ముసుగులో మద్యం సేవించి, భారీ లౌడ్ స్పీకర్లతో డ్యాన్సులు వేశారు. పక్కా ఆధారాలు లభించడంతో 8 మందిని అరెస్టు చేశామని ఏసీపీ జేకే పాండ్యా చెప్పారు. ఏ మతాన్నైనా కించపరిచే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ముక్తి కోసం అన్నీ విడిచి..
అహ్మదాబాద్ : సూరత్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక భౌతిక ప్రపంచానికి దూరంగా జైన సన్యాసినిగా మారాలని నిర్ణయం తీసుకుంది. బాలిక నిర్ణయాన్ని ఆమె కుటుంబం స్వాగతిస్తూ తమ కుమార్తె నిర్ణయం తమకు సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఈ ప్రపంచం తాత్కాలికమని, ఇక్కడ మనం అనుభవించే సుఖాలన్నీ అశాశ్వతమని, నిరాడంబర జీవనంతోనే శాంతి, ముక్తి సాధ్యమని బాలిక ఖుషీ షా చెబుతున్నారు. తన కుటుంబం నుంచి తాను ఒక్కరినే ఈ నిర్ణయం తీసుకోలేదని, శాంతియుత జీవనం కోసం గతంలో తమ కుటుంబంలో నలుగురు సన్యసించారని తెలిపారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రతిఒక్కరూ ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలని సిమంధర్ స్వామీజీ చెబుతారని, తాను 12 ఏళ్ల వయసులో సత్వరమే దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని అన్నారు. చిన్న వయసులోనే తమ కుమార్తె ఖుషీ తీసుకున్న నిర్ణయం అసాధారణమని, దీనికి తాము గర్వపడుతున్నామని బాలిక తండ్రి, ప్రభుత్వోద్యోగి వినీత్ షా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సన్యాసినిగా మారిన తర్వాత లక్షలాది మంది జీవితాల్లో వెలుగునింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరవ తరగతిలో 97 శాతం మార్కులు సాధించిన ఖుషీ గత ఏడాది నవంబర్‌లో నిరాడంబర జీవనం గడిపేందుకు పాఠశాల విద్యకు దూరమైందని చెప్పారు. తమ కుమార్తె ఇప్పటికే కాలినడకన వేల కిలోమీటర్లు నడిచిందని, దీక్షానంతర జీవితంపై అవగాహన పెంచుకుందని తెలిపారు. ఖుషీని డాక్టర్‌గా చూడాలని తాను కోరుకున్నా ఆమె ఆకాంక్షలు ఫలించాలని తన దీక్షకు తల్లితండ్రులుగా తామిద్దరం అంగీకరించామని చెప్పారు. -
‘సూరత్’ రియల్ హీరో
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న కోచింగ్ సెంటర్లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్ జొరవాడియా అనే యువకుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు. తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ కేతన్ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 22కు చేరుకున్న మృతులు తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఈ విషయమై సూరత్ ఏసీపీ పీఎల్ చౌధరి మాట్లాడుతూ.. మృతుల్లో 18 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారని తెలిపారు. ఓ నాలుగేళ్ల చిన్నారికి కూడా ఈ సందర్భంగా కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువమంది 18 ఏళ్లలోపువారే. కోచింగ్ సెంటర్లో తగిన సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. భవన యజమాని అరెస్ట్.. పలువురు విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్ బుటానిని అరెస్ట్ చేశామని ఏసీపీ పీఎల్ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్ వెకరియా, జిగ్నేశ్ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో ముగ్గురు విద్యార్థులు శనివారం వెలువడ్డ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. యశ్వీ కేవదీయా 67శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, మాన్సీ వర్సని 52 శాతం, హస్థీ సురానీ 69శాతం మార్కులతో పాసయ్యారు’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో అగ్నిప్రమాదాల సందర్భంగా తప్పించుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయమై ఆడిట్ చేపట్టాలని సీఎం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే సూరత్ అగ్నిప్రమాదంపై అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. మృతులకు నివాళులర్పిస్తున్న సూరత్ విద్యార్థినులు -
యువతులను కాపాడి.. హీరో అయ్యాడు
సూరత్ : గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద సమయంలో.. ప్రాణాలను పణంగా పెట్టి యువతులను కాపాడిన ఓ వ్యక్తిని రియల్ హీరో అంటూ సామాజిక మాధ్యమాల్లో కీర్తిస్తున్నారు. కోచింగ్ క్లాసులు నడుస్తున్న 4అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు వ్యాపించి 22 మంది విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. మంటల నుంచి తప్పించుకునేందుకు మూడో, నాల్గో అంతస్తుల నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు చనిపోగా, పొగకు ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాద సమయంలో కేతన్ జొరవాడియా అనే యువకుడు చూపించిన తెగువకు నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Heroic Efforts done by a young man , who put his life in danger to save the Students who were stuck in fire !#surat #sarthana pic.twitter.com/NX58MbaG4g — Hitesh Pandya (@Hiteshpandya21) May 24, 2019 సూరత్‌లో ఉన్న కోచింగ్ సెంటర్లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్న సమయంలో చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్ జొరవాడియా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు. తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ కేతన్ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కేతన్ చూపించిన తెగువను మెచ్చుకున్న వారిలో ఉన్నారు. My heartfelt condolences to children who lost their lives in the tragic incident in Surat yesterday. Very proud of Ketan Jorawadia, who showed exemplary courage and saved atleast 2 children from falling in the fire. pic.twitter.com/dNW1qjb75o — VVS Laxman (@VVSLaxman281) May 25, 2019 తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. భవనంపైన రేకులతో వేసిన షెడ్డు వంటి నిర్మాణాల నీడలో ఈ తరగతులు నిర్వహించేవారనీ, ఇది అక్రమ నిర్మాణమేమో పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ముందుగా కింది అంతస్తులో మంటలు మొదలవడంతో అక్కడ ఉన్నవారు భయంతో భవనంపైకి వెళ్లారనీ, తర్వాత మంటలు పైకి ఎగబాకాయి. పైన ఏసీ కంప్రెసర్లు, టైర్లు వంటివి ఉండటంతో వాటికి మంటలు అంటుకుని దట్టమైన పొగలు వెలువడి, పైన రేకులు ఉండటంతో పొగలు ఆకాశంలోకి వెళ్లక విద్యార్థులకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. భవనం పైన నుంచి విద్యార్థులు తప్పించుకునేందుకు మరో మార్గం లేదనీ, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను యాజమాన్యం ఏర్పాటు చేయలేదని అధికారి మీడియాకు వెల్లడించారు. కోచింగ్ సెంటర్లను అన్నింటినీ తనిఖీ చేసి అవి భద్రతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో అధికారులు ధ్రువీకరించే వరకు నగరంలోని కోచింగ్ సెంటర్లను మూసేయాల్సిందిగా అహ్మదాబాద్ నగరపాలక అధికారులు ఆదేశాలిచ్చారు. విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్ బుటానిని అరెస్ట్ చేశామని ఏసీపీ పీఎల్ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్ వెకరియా, జిగ్నేశ్ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు. Braveheart 🙏 Ketan Jorawadia climbed up to 2nd floor & saved life of 2 students yesterday in Takshshila complex #SuratFireTragedy Putting his own life at risk in sure death zone & going all out to save lives of fellow citizen is an extraordinary bravery Salute & Respect Ketan🙏 pic.twitter.com/9t6vTaGFTn — Major Surendra Poonia (@MajorPoonia) May 25, 2019 -
కోచింగ్ సెంటర్లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోచింగ్ క్లాసులు నడుస్తున్న 4అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు వ్యాపించి 20 మంది విద్యార్థులు మరణించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు మూడో, నాల్గో అంతస్తుల నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు చనిపోగా, పొగకు ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. మంటల నుంచి తమనుతాము కాపాడుకునేందుకు విద్యార్థులు కిందకు దూకుతున్న భయానక దృశ్యాలను టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సూరత్‌లోని సర్థానా ప్రాంతంలో ఉన్న తక్షశిల కాంప్లెక్స్ అనే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. దాదాపు 10 మంది విద్యార్థులు భవనం నుంచి దూకారనీ, ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వైద్యశాలకు తరలించామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. 19 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. విద్యార్థులను కాపాడేందుకు స్థానిక పోలీసులు, ప్రజలు అగ్నిమాపక దళ సిబ్బందికి సాయం చేశారు. చనిపోయిన విద్యార్థుల బంధువులకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని గుజరాత్ సీఎం రూపానీ ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. ప్రమాదం సమయంలో దాదాపు 50 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మోదీ, రాహుల్ విచారం.. సూరత్‌లో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘సూరత్‌లో అగ్నిప్రమాదం నన్ను తీవ్రంగా వేదనకు గురిచేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్‌చేశారు. కోచింగ్ సెంటర్లో మంటలు భవనంపైన రేకులతో వేసిన షెడ్డు వంటి నిర్మాణాల నీడలో ఈ తరగతులు నిర్వహించేవారనీ, ఇది అక్రమ నిర్మాణమేమో పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ముందుగా కింది అంతస్తులో మంటలు మొదలవడంతో అక్కడ ఉన్నవారు భయంతో భవనంపైకి వెళ్లారనీ, తర్వాత మంటలు పైకి ఎగబాకాయి. పైన ఏసీ కంప్రెసర్లు, టైర్లు వంటివి ఉండటంతో వాటికి మంటలు అంటుకుని దట్టమైన పొగలు వెలువడి, పైన రేకులు ఉండటంతో పొగలు ఆకాశంలోకి వెళ్లక విద్యార్థులకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. భవనం పైన నుంచి విద్యార్థులు తప్పించుకునేందుకు మరో మార్గం లేదనీ, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను యాజమాన్యం ఏర్పాటు చేయలేదని అధికారి మీడియాకు వెల్లడించారు. కోచింగ్ సెంటర్లను అన్నింటినీ తనిఖీ చేసి అవి భద్రతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో అధికారులు ధ్రువీకరించే వరకు నగరంలోని కోచింగ్ సెంటర్లను మూసేయాల్సిందిగా అహ్మదాబాద్ నగరపాలక అధికారులు ఆదేశాలిచ్చారు. -
గాడ్సే పుట్టిన రోజు వేడుకలు.. 6గురు అరెస్ట్
గాంధీనగర్ : మహాత్మున్ని చంపిన గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సూరత్‌కు చెందిన హిందూ మహాసభ కార్యకర్తలు.. లింబాయత్ ప్రాంతంలోని సూర్యముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గాడ్సే ఫోటో చుట్టూ దీపాలు వెలిగించి.. పూజలు చేశారు. స్వీట్లూ పంచుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. అంతటితో ఊరుకోక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘మహాత్మ గాంధీని చంపిన నేరస్థుడికి పుట్టిన రోజుల వేడుకలు నిర్వహిచండం నిజంగా చాలా విచారకరం. ఇలాంటి పనులు వల్ల దేశ ప్రజలు మనోభావాలు దెబ్బ తింటాయి. ఫలితంగా గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ చర్యలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశామ’ని తెలిపారు. ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్య మాట్లాడుతూ.. ‘గాంధీజిని అవమానించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిదే. బుద్ధి లేని వారే ఇలాంటి తలకు మాసిన పనులు చేస్తారు. వారికి మహాత్ముడి ఆదర్శాలు ఎన్నటికి అర్థం కావ’న్నారు. -
సేల్స్‌మ్యాన్ నిజాయతీ!
సూరత్: రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఈ సేల్స్‌మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. సూరత్‌లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్‌కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నారని తెలిపారు. -
‘నోట్ల రద్దు గొప్పదనమే’
సూరత్: చవక ధరకు ఇళ్లు కొనుగోలు చేయాలనే యువత ఆకాంక్ష తమ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పుకొచ్చారు. తన హయాంలో జరిగినన్ని పనులు పూర్వ ప్రభుత్వాలు చేయాలంటే కనీసం 25 ఏళ్లు పడుతుందన్నారు. సూరత్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ‘పెద్ద నోట్లను రద్దు చేస్తే కలిగిన ప్రయోజనమేమిటి అని అనేకమంది అడిగారు. ఈ మాటను మీరు యువత వద్ద అనండి. ఈ నిర్ణయం వల్ల తమకు చవక ధరలకు ఇళ్లు లభిస్తున్నా యని వారు మీకు జవాబిస్తారు. నల్లధనం మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంపైనే పెట్టారు. అయితే నోట్ల రద్దు, రెరా (రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం)లను అమల్లోకి తీసుకురావడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగాం’ అని అన్నా రు. తమ ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని, దీంతో సామాన్యులు సైతం విమానయానం చేయగలుగుతున్నారన్నారు. 1.30 కోట్ల గృహాలు నిర్మించాం గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం 1.30 కోట్ల గృహాలను నిర్మించిందని మోదీ చెప్పారు. అయితే యూపీఏ హయాంలో కట్టింది కేవలం 25 లక్షల ఇళ్లేనని ఆయన తెలిపారు. గడచిన మూడు దశాబ్దాల కాలంల్లో హంగ్ పార్లమెంట్‌ను కూడా దేశం చవిచూసిందని, దీని వల్ల అభివృద్ధికి విఘాతం కలిగిందని చెప్పారు. అయితే తమ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. -
మోదీ ఫోటోతో గోల్డ్, సిల్వర్ బిస్కెట్లు..
సూరత్ : ధనత్రయోదశి సందర్భంగా సూరత్‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన బంగారు, వెండి కడ్డీలు విక్రయిస్తున్నారు. మోదీ బొమ్మతో రూపొందిన గోల్డ్ బార్లను పెద్ద సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని జ్యూవెలర్ చెబుతున్నారు. ప్రతి దీపావళికి లక్ష్మీదేవి, గణేష్‌లను కొలుస్తారని, ప్రధాని మోదీ కూడా తమకు భగవంతుడేనని, ఈ ఏడాది ప్రధాని మోదీ బొమ్మతో కూడిన గోల్డ్, సిల్వర్ బార్లను కొనుగోలు చేసి పూజిస్తామని ఓ కస్టమర్ చెబుతున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో దివాళీ సందర్భంగా ఆయన బొమ్మతో బంగారు, వెండి కడ్డీలు రూపొందిచాలనే ఆలోచన తనకు కలిగిందని జ్యూవెలరీ షోరూం యజమాని మిలన్ చెప్పుకొచ్చారు. గతంలోనూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల ఫోటోలతో మిలన్ గోల్డ్ రాఖీలను తయారుచేశారు. 22 కేరట్ల బంగారంతో తయారుచేసిన ఈ కాఖీలు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని ఆయన వెల్లడించారు. -
‘లాభం’ చూపించి లూటీ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ ట్రేడింగ్ పేరుతో ప్రక టనలు గుప్పించాడు. ఆకర్షితులైన వారు పెట్టిన పెట్టుబడులు, ‘లాభాలు’చూపించడానికి ఓ వెబ్సైట్ సృష్టించాడు. ఈ హంగామాతో నగరానికి చెందిన వైద్యుడు కొంత పెట్టుబడి పెట్టి వారంలోనే ‘లాభం’ పొందాడు. రెండోసారి ఏకంగా రూ.1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తం కాజేసి టోకరా వేసిన నిందితుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు గురువా రం సూరత్‌లో పట్టుకున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నగరానికి చెందిన వైద్యుడు దినేశ్‌ను వాట్సాప్‌లో వచ్చిన ఓ ప్రకటన ఆకర్షించింది. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఉన్న తమ సంస్థ ద్వారా ఫారిన్ ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఉంది. వారంలోనే రూ.10 లక్షలిచ్చాడు... దీనికి ఆకర్షితుడైన దినేశ్ ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌కు సంప్రదించాడు. ముంబైకి చెందిన అలీ షేక్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడాడు. తమ వద్ద పెట్టుబడి పెడితే అంతర్జాతీయ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతామని, డాలర్, యూరోల విలువతో పాటే ఇది పెరుగుతుందం టూ నమ్మబలికాడు. దినేశ్ తొలుత రూ.50 లక్ష లు పెట్టుబడి పెట్టాడు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించిన అలీ షేక్... వైద్యుడి పేరుతో ఖాతా తెరిచాడు. రూ.50 లక్షలు ఫారెన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టినట్లు, దాని విలువ డాలర్, యూరో విలువతో పాటే మారుతున్నట్లు చూపించాడు. అలాగే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వైద్యుడికి ఇచ్చి చూసుకునే అవకాశం ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన వారంలోనే 10లక్షలు లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లోని ఖాతా ద్వారా వైద్యుడికి తెలిసేలా చేశాడు. ఇది చూసిన దినేశ్ ఆ మొత్తం తనకు బదిలీ చేయాలని కోరడంతో అలీ షేక్ మొత్తం రూ.60లక్షలూ దినేశ్‌కు పంపాడు. ఈసారి రూ.కోటిన్నర పెట్టుబడి... వారంలో రూ.10లక్షలు లాభం రావడంతో వైద్యుడు అలీ మాయలో పూర్తిగా పడిపోయాడు. ఇది నిర్ధారించుకున్న అలీ అసలు కథ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ లాభాల బాటలో ఉందని, ఈసారి మరింత లాభం వచ్చే అవకాశం ఉందంటూ ఎర వేశాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి తీసుకున్నది కలిపి మొత్తం రూ.1.5కోట్లు దినేశ్ పెట్టుబడిగా పెట్టా డు. డబ్బు కోసం దినేశ్ ఎంతగా ప్రయత్నించినా అలీ నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గుర్తించి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఈ మోసానికి పాల్పడింది అలీ షేక్‌గా చెప్పుకున్న అమీర్ ఆరిఫ్ అగాడీగా తేల్చారు. అతడు ఉండేది ముంబై కాదని, గుజరాత్‌లోని సూరత్ అని నిర్ధారించారు. దీంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. -
ఆ స్టేషన్లో ఎయిర్పోర్ట్ తరహా సౌకర్యాలు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన స్టేషన్ పునఃఅభివృద్ధి కార్యక్రమం కింద సూరత్ రైల్వే స్టేషన్‌ను అత్యంత అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే సర్వాంగ సుందరంగా ముస్తాబు కానున్న మూడవ స్టేషన్‌గా సూరత్ నిలవనుంది. గుజరాత్లో గాంధీనగర్ తర్వాత సూరత్ రైల్వే మంత్రిత్వ శాఖ రూ లక్ష కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది. కార్యక్రమానికి కేటాయించే నిధులతో రైల్వే మంత్రిత్వ శాఖ సూరత్ రైల్వేస్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహా సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. స్టేషన్లో మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టేషన్ హబ్ ఏర్పాటుకు ఐఆర్ఎస్డీసీ, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్, జీఎస్ఆర్టీసీల సంయుక్త సంస్థ సిట్కో టెండర్లను ఆహ్వానించింది. రూ 5000 కోట్లతో నిర్మించే ఈ హబ్ 2020 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్ధానిక సంస్థ సంయుక్తంగా చేపడతాయని, నిర్మాణ పనులు ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతాయని ఐఆర్ఎస్డీసీ ఎండీ ఎస్కే లోహియా చెప్పారు. స్టేషన్లో విశాల ప్రాంగణంలో బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని 900 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రోజూ 3 లక్షల మంది ప్రయాణీకులను హ్యాండిల్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. స్టేషన్ సమీపంలో అయిదు రోడ్డు అండర్‌బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో దేశంలోని తొలి ప్రపంచశ్రేణి రైల్వే స్టేషన్లు హబీబ్‌గంజ్, గాంధీనగర్‌లు సేవలందించేందుకు సిద్ధమవుతాయన్నారు. -
రాజస్థాన్‌లో పట్టుబడ్డ నిందితుడు
సాక్షి, జైపూర్ : సూరత్‌లో మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్ సంకేతాల ఆధారంగా రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. సవాయ్ మధోపూర్ నివాసి అయిన రామ్ సహాయ్ గుజ్జార్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సూరత్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. 9 నుంచి 11 సంవత్సరాల వయసుగల బాధిత బాలికను ఇంకా సూరత్ పోలీసులు గుర్తించలేదు. బాధిత బాలికను గుర్తించేందుకు చివరి ప్రయత్నంగా ఆమె ఫోటోను పోలీసులు ట్వీట్ చేశారు. కాగా ఆమె తమ కుమార్తె అంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ జంట ముందుకు రాగా వారు అందించిన వివరాలు, వేలిముద్రలు, పుట్టుమచ్చ, ఎత్తు వంటి ఆధారాలు సరిపోలలేదు. దీంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. బాధిత బాలిక శరీరంపై 80 గాయాలున్నాయని, మృతదేహాన్నిసూరత్ నగరంలోని స్టేడియం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఈనెల 6న కనుగొన్నామని పోలీసులు చెప్పారు. -
వజ్రాల వ్యాపారి కుమారుడు అన్నీ వదిలేసి..
సాక్షి, సూరత్ : కోట్ల రూపాయల సంపద, సకల సౌకర్యాలను విడిచిపెట్టి భవ్య షా అనే 12 ఏళ్ల బాలుడు జైన సన్యాసిగా మారిపోయాడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడు షా నిర్ణయంతో కుటుంబసభ్యులు గర్వపడుతున్నామని చెప్పారు. తమ కుమారుడు గురువారం జైన సన్యాసిగా మారడాన్ని వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆథ్యాత్మిక బాటలో జీవితాన్ని అంకితం చేయాలన్న నిర్ణయంపై బాలుడు స్పందిస్తూ భగవంతుడు చూపిన సత్యమార్గంలో పయనించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాను తల్లితండ్రులను విడిచి వెళుతున్నానని, భవిష్యత్‌లో వారు సైతం ఇదే బాటలో పయనిస్తారని చెప్పాడు. భవ్య జైన దీక్ష స్వీకరించడం పట్ల తామెంతో సంతోషంగా ఉన్నామని డైమండ్ వ్యాపారి అయిన భవ్య తండ్రి దీపేష్ షా సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కుమారుడు తమను విడిచివెళుతున్నాడన్న బాధ తమకు లేదని, నాలుగేళ్ల కిందట 12 ఏళ్ల వయసులో తమ కుమార్తె సైతం జైన సన్యాసినిగా మారిందని చెప్పుకొచ్చారు. జైన సన్యాసులు భౌతిక వాంఛలు, వస్తువులను వీడటంతో పాటు భావోద్వేగాలు, కోరికలకు మూలమైన కర్మలను కూడా విడిచిపెట్టి ప్రశాంత జీవనం గడుపుతారు. -
రెండో భార్యను చంపి ముక్కలు చేసిన భర్త
సూరత్: మొన్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన మరువక ముందే.. కట్టుకున్న భార్యను హత్య చేసి పాశవికంగా ముక్కలుగా చేశాడో భర్త. ఈ పైశాచిక ఘటన సూరత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యను హతమార్చి అనంతరం ఆమె శరీర భాగాలను ఉద్నాలోని కాలువలో పడేస్తుండగా నిందితున్ని పోలీసులు రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. షానవాజ్ అలియాస్ షానూ యూసుఫ్‌మియా షైక్ (32) పార్సీ షెరీలోని రాణి తలావ్‌లో సరుకు రవాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడే తన భార్య జొహ్రాబ్ నబీతో పాటు నివాసముంటున్నాడు. రెండేళ్లక్రితం షానవాజ్ అమ్రావతికి చెందిన జులేఖతో ప్రేమాయణం సాగించి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే మొదటి భార్య జొహ్రాబ్ నబీకి, జులేఖకి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన షానవాజ్ ఎలాగైనా తన రెండో భార్య జులేఖ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి ఆమెను చంపి, శరీరాన్ని 11 ముక్కలుగా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా భతేనా ఖడీలోని ఉద్నా కాలువలో పడేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని మొదటి భార్య, సోదరి ఈ హత్యలో అతనికి సహాయపడొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి పరారైన ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కాగా, నిందితుని కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సూరత్ ఏసీపీ (రేంజ్-1) హెచ్‌కే పటేల్ మాట్లాడుతూ.. ‘ షానవాజ్ తన రెండో భార్యను ముక్కలుగా కోసి ఆమె శరీర భాగాలను కాలువలో పడేస్తుండగా రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. అతనిపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేశాం’అని తెలిపారు. -
సూరత్ అత్యాచార బాధితురాలు తెలుగు బిడ్డే..!
సూరత్: గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక ఎవరో తెలిసిపోయింది. గత పన్నెండు రోజులుగా బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు పోలీసులు చేపట్టిన ‘సోషల్ పోస్టర్’ ప్రచారం ఫలించింది. సోషల్ మీడియాలో మృతురాలి ఫోటో చూసి ఆమె తమ కూతురేనంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం సూరత్ పోలీసులను ఆశ్రయించింది. తమ కూతురు గతేడాది అక్టోబర్‌లో అదృశ్యమైందని వారు పేర్కొన్నారు. పోలీసులు వారి వద్ద గల చిన్నారి ఆధార్ కార్డుతో మృతదేహాన్ని పోల్చి చూశారు. మృతురాలి తల్లిదండ్రులు వారేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 10 రోజుల జాప్యమెందుకు..? శరీరంపై 86 గాట్లతో సూరత్‌లోని భేస్తాన్ ప్రాంతంలో గల క్రికెట్ స్టేడియం వద్ద బాలిక మృతదేహాన్ని ఏప్రిల్ 6న పోలీసులు గుర్తించారు. దాదాపు 5 గంటల పోస్టుమార్టం అనంతరం బాలిక దాదాపు 8 రోజలు అత్యాచారానికి, ఆపై హత్యకు గురైందని తేలింది. అయితే ఫోరెన్సిక్ పరీక్షల కోసం బాలిక శరీర నమూనాలను పోలీసులు ఏప్రిల్ 6న పంపించాల్సి ఉంది. కానీ 10 రోజుల జాప్యం తర్వాత ఏప్రిల్ 16న ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆ నమూనాలు చేరినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల్ని వివరణ కోరగా నమూనాలను ఏప్రిల్ 6నే పంపినట్లు చెప్పడం గమనార్హం. ఈ పది రోజుల జాప్యానికి కారణాలేమై ఉంటాయన్నది ఎన్నో పశ్నలను లేవనెత్తుతోంది. బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు అటు పోలీసులు,వ్యాపారులు స్పందించిన తీరు అమోఘం. సూరత్ ప్రాంతంలోని ప్రతి వ్యాపారి తమ వంతుగా ఆమె ఆచూకీని తెలుపుతూ వారివారి దుకాణాల ముందు ఆ చిన్నారి ఫోటోని ప్రదర్శించారు. -
సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
బార్ డ్యాన్సర్‌ను హత్య చేసిన ప్రియుడు
సూరత్ : మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఓ బార్ డ్యాన్సర్‌ను ప్రియుడే అతికిరాతకంగా తల నరికి చంపాడు. ఈ సంఘటన ముంబై శివారులోని కమ్రేజ్ సమీపంలోని టింబా గ్రామంలోని ఓ ఫామ్ హౌస్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కి చెందిన మోడల్ జ్యోతి సూర్జిత్ సింగ్ అలియాస్ నిషాజ్యోతి ముంబైలో బార్ డ్యాన్సర్‌గా పనిచేసేది. సూరత్ సమీపంలోని టింబా గ్రామానికి చెందిన ప్రీతేష్ పటేల్(30) తరచూ ముంబైలోని బార్లకు వెళుతుండటంతో నిషాజ్యోతితో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో నిషాజ్యోతి, ప్రీతేష్ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే డిసెంబరు 27న ప్రీతేష్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌కు నిషాజ్యోతి హాజరైంది. అనంతరం కొత్త సంవత్సర వేడుకల కోసం డిసెంబర్ 28న ముంబై బయలుదేరి తిరిగి సోమవారం టింబాకు చేరుకున్నారు. అయితే నిషాజ్యోతికి మరో యువకుడితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రీతేష్ మంగళవారం ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై కొడవలితో నిషాజ్యోతి తల నరికి చంపాడు. ఈ హత్య జరిగిన సమయంలో నిషాజ్యోతి డ్రైవర్ సందీప్ సింగ్‌తో పాటూ అతడి భార్య కూడా అక్కడే ఉన్నారు. సందీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. తమను కూడా అతడుచంపుతాడేమోనని భయంతో అక్కడి నుంచి పారిపోయామని వారు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ప్రీతేష్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా తాను నిషాజ్యోతి కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టానని, ఆమె మరో యువకుడితో చనువుగా ఉంటుందని పోలీసులకు చెప్పాడు. నిషాజ్యోతితో ప్రీతేష్ వివాహేతర సంబంధం కొనసాగించడంతో తన భార్యతో తరచూ గొడవలు కూడా అయ్యేవి. చివరికి జ్యోతి కోసం అతడు తన భార్యకు కూడా విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఒకేసారి 251 జంటలకు పెళ్లిళ్లు
సాక్షి, అహ్మదాబాద్: డబ్బు సంపాదనలోనే కాదు సమాజ సేవలోనూ ముందున్నారు గుజరాత్ నగరం సూరత్‌వాసి మహేశ్ సవానీ. ఏటా ఆయన వందలాది పేదలకు పెళ్లిళ్లు చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా 251 జంటలను ఒకటి చేశారు. కుబేరుల పెళ్లి వేడుకలకు ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో లక్ష మందికిపైగా అతిథులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి మరీ ఈ సామూహిక వివాహాలు జరిపించారు. పెళ్లి కానుకగా ఖరీదైన నగలు, బహుమతులు అందించారు. ఆయన వివాహం జరిపించిన వాటిలో ఐదు ముస్లిం జంటలు, ఒక క్రైస్తవ జంట ఉంది. హిందువులకు వైదిక సంప్రదాయం ప్రకారం.. మిగిలిన వారికి ఆయా సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరిపించారు. ఇప్పటి వరకు సవానీ వెయ్యి జంటలకు వివాహం జరిపించారు. 2008లో తనదగ్గర పనిచేస్తున్న ఒక ఉద్యోగి చనిపోయాడు. మరికొద్ది రోజుల్లో ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాల్సి ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మహేశ్ సవానీ పెళ్లి పెద్దగా మారారు. అప్పటి నుంచి ప్రతిఏటా ఎంతోమంది అనాధ యువతులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపిస్తున్నారు. -
దండియాత్రకు సాక్షిగా నిలిచిన అవ్వ ఓటు
సాక్షి, గాంధీనగర్ : జాతిపిత మహాత్మా గాంధీ 1930లో నిర్వహించిన దండి సత్యాగ్రహం యాత్రకు ప్రత్యక్ష సాక్షి, 106 ఏళ్ల వద్ధురాలు మోత్లీ బా గుజరాత్ అసెంబ్లీకి శనివారం జరిగిన మొదటి విడత పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. ఆ తర్వాత ఆమె గర్వంగా వేలిపై ఓటువేసినట్లు సిరా గుర్తును చూపిస్తూ మీడియాకు ఫోజిచ్చారు. ఆమె సూరత్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసినట్లు తెలియజేస్తూ ఆకాశవాణి ట్వీట్ చేసింది. మొదటి విడతగా ఈ రోజు 89 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 977 మంది అభ్యర్థులు తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెల్సిందే. వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. -
రంగులతో హాట్ భామ చిందులు
ముంబయి: ఒకప్పటి పోర్న్‌స్టార్, నేటి బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ హోలీ వేడుకల్లో పాల్గొంది. గుజరాత్‌లోని సూరత్‌లో ఆమె హోలీ సంబురాల్లో పాల్గొని ఉత్సాహంగా గంతులు వేసింది. చుట్టూ జనం చేరి ఉండగా తెల్లటి వస్త్రాల్లో ఉన్న ఆమె తనను చూసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి మైకులో మాట్లాడుతూ ఆ వెంటనే అది పక్కకు పెట్టేసీ హ్యాపీ హోలీ అంటూ చిందులు వేసింది. పక్కనే వస్తున్న మ్యూజిక్ కు తగ్గట్లుగా ఆమె వేస్తున్న స్టెప్పులకు, గోలకు చుట్టుపక్కల వారు కూడా తోడై ఆ ప్రాంతంలో రంగులతో దుమ్మురేపి అదరహో అనిపించారు.