సూరత్: గుజరాత్‌కు చెందిన చిరుతిండ్లు అమ్ముకునే చేతన్ పటేల్‌కు పెటా ఇండియా హీరో టు యానిమల్స్ అవార్డును ప్రకటించింది. చిన్న వ్యాపారైనా పెద్ద మనసుతో పక్షుల సంరక్షణకు చేతన్ కృషి చేశాడని కొనియాడింది. గాలిపటాల్లో వాడే మాంజా(నైలాన్ దారం) కారణంగా పక్షుల ప్రాణాలు పోతున్నాయని చేతన్ పలువురికి నచ్చజెప్పేవారు. అంతేకాకుండా ఉత్తరాయణ పండుగ అనంతరం బజార్లో పడేసిన కిలో మంజాను ఎవరు తెచ్చిఇచ్చినా వారికి కిలో చిరుతిండి ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో రోడ్లపై అడ్డదిడ్డంగా ఈ దారాలు పడిపోకుండా పక్షులకు ఇబ్బంది కలగకుండా చేతన్ యత్నించారని పెటా తెలిపింది. ఈ మేరకు చేతన్‌కు సర్టిఫికెట్‌ను అందించింది. మంజా దారం చాలా పదునుగా ఉంటుంది. దీనివల్ల పక్షుల కాళ్లు రెక్కలు తెగిపోతూఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment