Road Accident In Gujarat Today: 13 Labour Deceased, 5 Injured | ఘోర రోడ్డు ప్రమాదం.. - Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

Jan 19 2021 7:27 AM | Updated on Jan 19 2021 12:22 PM

Road Accident In Gujarat - Sakshi

సూరత్‌ : గుజరాత్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని కొసాంబ సమీపంలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందాగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ట్రాక్టర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో ట్రక్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మృతులంతా రాజస్తాన్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement