
గాంధీనగర్ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం(11 మంది)ఆదివారం సాయంత్రం తమ స్వస్థలం భుజ్‌కు చేరుకునేందుకు కారు(స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం)లో బయల్దేరింది. వీరి కారు బచావ్ హైవే గుండా ప్రయాణిస్తున్న సమయంలో... రోడ్డుకు ఆవలి వైపు నుంచి వస్తున్న ఓ ట్రక్కు... డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. వీరి కారుకు సమాంతరంగా ప్రయాణిస్తున్న మరో ట్రక్కుపై పడింది. దీంతో రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కున బాధితుల కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment