
గాంధీనగర్: గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మరణించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment