గుజరాత్‌లో విషాదం: ముగ్గురు మృతి | Building Collapsed And Three People Deceased In Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో విషాదం: ముగ్గురు మృతి

Published Tue, Sep 29 2020 6:27 AM | Last Updated on Tue, Sep 29 2020 7:01 AM

Building Collapsed And Three People Deceased In Gujarat - Sakshi

గాంధీనగర్: గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్టంలోని వడోదర జిల్లా బవమన్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న స్థానిక పోలీసులు, రెస్కూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement