PETA Award
-
చిరుతిండి వ్యాపారికి పెటా అవార్డు
సూరత్: గుజరాత్‌కు చెందిన చిరుతిండ్లు అమ్ముకునే చేతన్ పటేల్‌కు పెటా ఇండియా హీరో టు యానిమల్స్ అవార్డును ప్రకటించింది. చిన్న వ్యాపారైనా పెద్ద మనసుతో పక్షుల సంరక్షణకు చేతన్ కృషి చేశాడని కొనియాడింది. గాలిపటాల్లో వాడే మాంజా(నైలాన్ దారం) కారణంగా పక్షుల ప్రాణాలు పోతున్నాయని చేతన్ పలువురికి నచ్చజెప్పేవారు. అంతేకాకుండా ఉత్తరాయణ పండుగ అనంతరం బజార్లో పడేసిన కిలో మంజాను ఎవరు తెచ్చిఇచ్చినా వారికి కిలో చిరుతిండి ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో రోడ్లపై అడ్డదిడ్డంగా ఈ దారాలు పడిపోకుండా పక్షులకు ఇబ్బంది కలగకుండా చేతన్ యత్నించారని పెటా తెలిపింది. ఈ మేరకు చేతన్‌కు సర్టిఫికెట్‌ను అందించింది. మంజా దారం చాలా పదునుగా ఉంటుంది. దీనివల్ల పక్షుల కాళ్లు రెక్కలు తెగిపోతూఉంటాయి. -
‘జోకర్’ నటుడికి 'పెటా' అవార్డు!
ప్రముఖ హాలీవుడ్ నటుడు, జోకర్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ జోక్విన్ ఫీనిక్స్.. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) 2019 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపిక అయ్యాడు. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ ది హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం.. ఫీనిక్స్ మూడు సంవత్సరాల వయస్సు నుంచే శాకాహారిగా ఉన్నాడు. స్వతహాగా జంతు ప్రేమికుడైన అతడు.. 'వీగన్' ఆహరశైలికి అలవాటు పడి, దీర్ఘకాలం నుంచి జంతు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇదే విషయాన్ని పెటా అధ్యక్షుడు ఇంగ్రీడ్ న్యూకిర్క్ ప్రస్తావిస్తూ.. నిరంతరం జంతు హక్కుల కోసం పోరాడేందుకు ఎల్లవేళలా ముందుండే వ్యక్తి జోక్విన్ ఫీనిక్స్ అని అన్నారు. జంతువుల సంరక్షణ కోసం ఎటువంటి సంకోచం లేకుండా పాటుపడే వ్యక్తి అని కొనియాడారు. కాగా వన్యప్రాణులను సర్కస్‌లో ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం కోసం ఇటీవల పెటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వి ఆర్ ఆల్ ఎనిమల్స్' అనే కార్యక్రమంలో ఫీనిక్స్ పాల్గొన్నారు. ఇక మతగురువు పోప్ ఫ్రాన్సిస్, అమెరికన్ టెలివిజన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే, అంజెలికా హస్టన్, ఒలివియా మున్, ఎవా మెండిస్, అలిసియా సిల్వర్‌స్టోన్ వంటి ప్రముఖులకు గతంలో 'పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డును దక్కించుకొన్నారు. ఇక మనదేశం తరపు నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటా-2019కు ఎంపికయ్యాడు. -
ఆ అవార్డు తీసుకున్నందుకు అవమానంగా ఉంది
చెన్నై: మూగజీవుల సంరక్షణ సంస్థ పెటాపై తమిళ హీరో ధనుష్ విమర్శలు చేశాడు. పెటాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొన్నేళ్ల క్రితం ఆ సంస్థ నుంచి అవార్డు తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తున్నానని చెప్పాడు. తాను శాకాహారి అయినందుకు కొన్నేళ్ల క్రితం పెటా తనకు అవార్డు ప్రదానం చేసిందని, దీన్ని తీసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నానని అన్నాడు. 2012లో పెటా హాటెస్ట్ వెజిటేరియన్ అవార్డుతో ధనుష్‌ను సత్కరించింది. పెటా వల్ల సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించడం, తమిళనాడులో జల్లికట్టు మద్దతుదారులు తీవ్ర ఆందోళన చేపట్టడం, పెటాపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో ధనుష్ స్పందించాడు. తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ పెటాతో ఎలాంటి సంబంధాల్లేవని చెప్పాడు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు.