‘జోకర్‌’ నటుడికి 'పెటా' అవార్డు! | Joker Hero Joaquin Phoenix Selected For PETA Award | Sakshi

‘జోకర్‌’ నటుడికి 'పెటా' అవార్డు!

Dec 3 2019 4:46 PM | Updated on Dec 3 2019 4:58 PM

Joker Hero Joaquin Phoenix Selected For PETA Award - Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, జోకర్‌ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ జోక్విన్ ఫీనిక్స్.. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌ (పెటా)  2019 'పర్సన్ ఆఫ్ ద ఇయర్‌' అవార్డుకు ఎంపిక అయ్యాడు. ప్రముఖ హాలీవుడ్‌ మేగజీన్‌ ది హాలీవుడ్ రిపోర్ట్‌ ప్రకారం.. ఫీనిక్స్ మూడు సంవత్సరాల వయస్సు నుంచే శాకాహారిగా ఉన్నాడు. స్వతహాగా జంతు ప్రేమికుడైన అతడు.. 'వీగన్‌' ఆహరశైలికి అలవాటు పడి, దీర్ఘకాలం నుంచి జంతు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇదే విషయాన్ని పెటా అధ్యక్షుడు ఇంగ్రీడ్‌ న్యూకిర్క్ ప్రస్తావిస్తూ.. నిరంతరం జంతు హక్కుల కోసం పోరాడేందుకు ఎల్లవేళలా ముందుండే వ్యక్తి జోక్విన్ ఫీనిక్స్ అని అన్నారు. జంతువుల సంరక్షణ కోసం ఎటువంటి సంకోచం లేకుండా పాటుపడే వ్యక్తి అని కొనియాడారు.

కాగా వన్యప్రాణులను సర్కస్‌లో ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం కోసం ఇటీవల పెటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వి ఆర్ ఆల్‌ ఎనిమల్స్' అనే కార్యక్రమంలో ఫీనిక్స్‌ పాల్గొన్నారు. ఇక మతగురువు పోప్ ఫ్రాన్సిస్, అమెరికన్‌ టెలివిజన్‌ యాంకర్‌ ఓప్రా విన్‌ఫ్రే, అంజెలికా హస్టన్, ఒలివియా మున్, ఎవా మెండిస్, అలిసియా సిల్వర్‌స్టోన్ వంటి ప్రముఖులకు గతంలో 'పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డును దక్కించుకొన్నారు. ఇక మనదేశం తరపు నుంచి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటా-2019కు ఎంపికయ్యాడు. 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement