Joker
-
TN: అన్నామలైపై దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై ఒక జోకర్ అని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ‘అన్నామలై ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీట్ పరీక్షను వ్యతిరేకించాడు. ఇప్పుడు నీట్‌ను సమర్థిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన తనకు హిందీ రాదన్నాడు. ఇప్పుడేమో హిందీ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్నామలై లాంటి వాడు కావాలి. అతను మంచి వినోదం పంచే వ్యక్తి. ప్లీజ్ అన్నామలై కంటిన్యూ’ అని మారన్ ఎద్దేవా చేశారు. కాగా, అన్నామలైని ఉద్దేశించి ఇటీవల దయానిధి మారన్ ఓ నేషనల్ టీవీలో చేసిన జోకర్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడం గమనార్హం. అన్నామలైపై మారన్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే క్యారెక్టర్‌ను తెలియజేస్తున్నాయని ప్రధాని అన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని ఈ గ్యారెంటీలు ఇవ్వగలరా.. మోదీకి స్టాలిన్ సవాల్ -
Joker 2: జోకర్ 2లో 15 కవర్ సాంగ్స్?
హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘జోకర్’ 2019లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జోక్విన్ ఫీనిక్స్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం జోక్విన్, ఫిలిప్స్ కాంబినేషన్లోనే ‘జోకర్: ఫోలీ ఏ డ్యూక్స్’ (జోకర్ 2) చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఆర్ధర్ ప్లెక్ అలియాస్ జోకర్ పాత్రలో జోక్విన్, హార్లే క్విన్‌గా లేడీ గగా కనిపిస్తారు. ఈ ఏడాది అక్టోబరులో ‘జోకర్ 2’ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో దాదాపు 15 కవర్ సాంగ్స్ (రీమిక్స్ తరహాలో) ఉంటాయని హాలీవుడ్ సమాచారం. ‘ది బ్యాండ్ వాగన్’ (1953) సినిమా నుంచి ‘దట్స్ ఎంటర్టైన్మెంట్’ పాట, ‘మమ్మా మియా’ (2008) చిత్రంలోని ఓ పాట.. ఇలా పలు పాటలు ‘జోకర్ 2’లో కవర్ సాంగ్స్‌గా వినిపిస్తాయట. అంతే కాదు.. ఈ కవర్ సాంగ్స్‌లో కొన్నింటిని జోక్విన్, లేడీ గగా పాడనున్నారని హాలీవుడ్ టాక్. ‘జోకర్ 2’ సినిమాకు ఐజీ హిల్దుర్ స్వరకర్త. -
చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒక జోకర్‌గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్‌ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్‌ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలు కోరి మాట్లాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళ్దామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాలలో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు. మనకు అంత బలం ఉందా? బూత్ స్థాయి బలగం ఉందా? భోజనం పెట్టే ఖర్చులు ఇవ్వగలమా? అంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకన అయిపోయారు. ఈ పరిణామం సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు పదో- పరకో సీట్లు ఇస్తే, పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. దానిని పవన్ నిజం చేశారు. రెండు పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు దానిని టీడీపీలో చేరిక సభగా మార్చి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు టీడీపీ కండువా కప్పుతుంటే పవన్ కళ్యాణ్ బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. పవన్ కళ్యాణ్ తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అవుతుండడం చిత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్ణు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు సార్లు కలుస్తానని కబురు చేసి, పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరువైపు కూడా వెళ్లకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి. ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు. అంటే పవన్‌తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడే ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడుతుండవచ్చు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఇప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్‌తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎందురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమి చేయలేని నిన్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నింటి కారణంగా పవన్‌తో కలిసి ప్రయాణించడానికి సిద్దపడితే.. పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీకి తన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 80 అసెంబ్లీ సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అడగాల్సి ఉండగా, ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే, మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయాయని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరువిప్పలేదు. జనసేననేతలు కూడా ఎవరూస్పందించలేదు. ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మీ ఖర్మ అని వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆయనను తూలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైఎస్సార్సీపీ కోవర్టుగా ముద్రవేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి, కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే తనను కోవర్టు అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్‌ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. ఇరవై సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ, తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు, జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి వారికి బోధపడింది. ఇప్పటికైనా చంద్రబాబు నోట రెండున్నరేళ్లపాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. ఎందుకంటే తన కుమారుడు లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అంత సమర్ధుడు కాదని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అవమానంగా ఫీల్ కాలేదు. అయితే జోగయ్య వంటివారి అనుమానం ఏమిటంటే ఒకవేళ కూటమికి అధికారం వస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని, అప్పుడు పవన్ అడ్డురాకూడదని కోరుకుంటారని కావచ్చు. ఈ రకంగా చంద్రబాబు ఆడుతున్న జూదంలో పవన్ కళ్యాణ్ ఒక పావుగానో, లేక ఒక జోకర్గానో ఉంటున్నారనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు చేతిలో పవన్ బందీ అయిపోయారు. బీజేపీతో పొత్తులో ఉండి, అక్కడ కాపురాన్ని వదలివచ్చినట్లు చెప్పకుండా, అనైతిక రాజకీయ సంబంధం పెట్టుకుని టీడీపీతో కలిసి ఉంటున్నారు. పైగా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ పరువు కూడా తీశారు. కానీ, బీజేపీ అధిష్టానం వీరికి ఏ సంగతి చెప్పకుండా అల్లాడిస్తోంది. దాంతో పవన్ ఎప్పుటికప్పుడు ఢిల్లీ వెళతారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లి బీజేపీతో ఒప్పందం చేసుకుంటారని ప్రచారం చేయిస్తుంటారు. కానీ, అది జరగలేదు. బీజేపీతో పొత్తు కోరుతూనే ఈ రెండు పార్టీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి నచ్చుతుందా అన్నది సందేహం. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోతే పవన్‌కు ఒకరకంగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివాటిపై క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తంటాలుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడటం ఒక కోణం అయితే, కాపులు, బీజేపీ, తన అభిమానుల మధ్య సాలెగూడులో చిక్కిన పరిస్థితి ఆయనకు ఎదురవుతోందని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Joker 2 : ‘జోకర్’ మళ్లీ వచ్చేస్తున్నాడు!
హాలీవుడ్ జోకర్ మళ్లీ వస్తున్నాడు. హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘జోకర్’. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో టాడ్ ఫిలిప్స్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జోకర్ 2’ (జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్)ను ప్రకటించారు టాడ్ ఫిలిప్స్. ఈ చిత్రంలో జోక్విన్ ఫీనిక్స్‌తో పాటు లేడీ గగా మరో లీడ్ రోల్ చేస్తున్నారు. జాజై బీట్జ్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, న్యూ జెర్సీ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ట్రైలర్ ఏప్రిల్ 4న విడుదల కానుం దని హాలీవుడ్ టాక్. సినిమాను ఈ ఏడాది అక్టోబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. టాడ్ ఫిలిప్స్, బ్రాడ్లీ కూపర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. -
జోకర్ వేషంలో కల్లోలం సృష్టించాడు..చివరికీ అదే..
ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా మనుషులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఏమిటీ అనే కారణాలతో సంబంధం లేకుండా దారుణాలకు ఒడిగట్టాడు. దొరకననే ధైర్యమా లేక టైం పాస్‌కి అలా చేశాడో తెలియదు. చివరికీ ప్రజలంతా అతడ్ని చంపేయాలని తీర్మానించారు. అప్పుడైనా మార్పు వచ్చిందో లేదో గానీ అకారణంగా అమాయకులు ప్రాణాలు బలిగ్నొ దుర్మార్గుడిగా నిలిచిపోయాడు. వివరాల్లోకెళ్తే..ఓ వ్యక్తి కామిక్ బుక్‌లో ఉండే జోకర్లా వేషం ధరించి టోక్యలోని ఓ రైలులో మారణకాండకు తెగబడ్డాడు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 70 ఏళ్ల వృద్ధిడితో సహా దాదాపు 12 మంది వ్యక్తులను నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఆ దారుణం 2021లో జరిగింది. ఐతే ఆ టైంలో ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవ్వరో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. ఎందువల్ల ఇలా చేశాడని ఎంతలా ఆరా తీసినా? ఎవరా వ్యక్తి? అనేది ఓ మిస్టరీలా మిగిలిపోయింది. ఐతే చేసిన పాపం వదిలిపెట్టదు కదా. ఎట్టకేలకు పోలీసులు శతవిధాల చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యి ఆగంతకుడిని పట్టించేలా చేసింది. పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని క్యోటా హట్టోరి(26)గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి..కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణలో తాను ప్రజలు చంపాలనుకున్నట్లు ఒప్పుకున్నాడు కూడా. దీంతో కోర్టు అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దొరక్కూడదని చేసిన ఏ చిన్న నేరమైన ఏదో రూపంలో దోషిగా నిలబెట్టేస్తుంది. ఇక ఆ సమయంలో నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
మళ్లీ రానున్న 'జోకర్'.. అతనికి ప్రేయసిగా పాపులర్ సింగర్!
Lady Gaga As Harley Quinn In Joaquin Phoenix Joker 2: జోకర్.. 2008లో వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ 'బ్యాట్‌మేన్: ది డార్క్ నైట్' సినిమాతో ఎంతో పాపులర్ అయ్యాడు. అందులో విలన్‌గా అలరించిన జోకర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాత్రకున్న క్రేజ్ చూసిన దర్శకనిర్మాతలు 2019లో 'జోకర్' సినిమా తెరకెక్కించారు. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో అలరించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా 1.07 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా అనేక ఇంటర్నేషన్ల్ అవార్డులను కూడా అందుకుంది. ఈ మూవీలో జోకర్‌గా నటించిన జోక్విన్ ఫీనిక్స్కు ఉత్తమ నటుడిగా ఆస్కార్ రావడం విశేషం. అయితే ఈ జోకర్ మళ్లీ రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్' తెరకెక్కుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన టాడ్ ఫిలిప్స్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను 2024 అక్టోబర్ 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే 'జోకర్'కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సీక్వెల్లో హార్లే క్విన్ అనే కీలక పాత్రలో అమెరికన్ పాపులర్ సింగర్ లేడీ గాగా అలరించనుంది. Joker: Folie à Deux 10.04.24 pic.twitter.com/obp7T9lBFL — Lady Gaga (@ladygaga) August 4, 2022 కాగా 2016లో వచ్చిన డిస్నీ సినిమాటిక్ ఎక్స్టెండ్ యూనివర్స్ (డీసీఈయూ) మూవీ 'సూసైడ్ స్క్వాడ్'లో హార్లే క్విన్‌గా మార్గోట్ రోబీ పరిచయమైంది. ఇందులో జోకర్‌కు ప్రేయసిగా హార్లే క్వీన్ పాత్ర ఉంటుంది. తర్వాత వచ్చిన డీసీ సిరీస్‌లోని బర్డ్స్ ఆఫ్ ప్రే, ది సూసైడ్ స్క్వాడ్ చిత్రాల్లో హార్లే క్వీన్‌గా మార్గోట్ రోబీ అదరగొట్టింది. మరీ ఇప్పుడు వస్తున్న సీక్వెల్ మూవీ 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్'లో లేడీ గాగాను జోకర్‌కు ప్రేయసిగా చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ది డేంజరస్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఐదు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ప్రడియో ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో కన్పించింది. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించింది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగల్ ప్లే స్టోర్‌పై మరోసారి జోకర్ మాల్వేర్ విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ప్రడియో ఒక అలర్ట్ జారీ చేసింది. జోకర్ మాల్వేర్ సుమారు పది యాప్స్‌లో ఉన్నట్లు ప్రడియో గుర్తించింది. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని ప్రడియో పేర్కొంది. ఈ యాప్స్ మీ స్మార్ట్ఫోన్లలో ఉంటే హ్యకర్లు మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను క్షణాల్లో ఊడ్చేస్తారని ప్రడియో వెల్లడించింది. జోకర్ మాల్వేర్ డిటెక్ట్ఐనా యాప్స్ ఇవే..! కలర్ మెసేజ్ యాప్ సేఫ్టీ యాప్‌లాక్ కన్వీనియెంట్ స్కానర్ 2, ఎమోజి వాల్‌పేపర్స్ సెపరేట్ డాక్ స్కానర్ ఫింగర్‌టిప్ గేమ్బాక్స్ ఈజీ పీడీఎఫ్ స్కానర్ సూపర్-క్లిక్ వీపీఎన్ యాప్ వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వలైజర్ ఫ్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ యాప్ చదవండి: టెస్లా కంటే తోపు కారును లాంచ్ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..! ప్రత్యర్థి ఆటోమొబైల్ కంపెనీలకు చుక్కలే..! -
Joker: ఈ యాప్స్ యమడేంజర్! సీక్రెట్‌గా డేటాను..
Joker Malware Strikes Again on Android Apps: ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం సురక్షితమేనా? చాలామందికి ఈ విషయంలో అనుమానాలు ఉంటాయి. అయితే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ (యాప్స్)లోనూ కోడ్ రూపంలో డివైజ్‌ల మీద వైరస్ దాడి చేసే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో యాప్స్ డౌన్లోడ్ చేసేప్పుడు కొన్ని కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే జోకర్ లాంటి మాల్వేర్.. డివైజ్‌లోని డాటా మొత్తాన్ని గుంజేస్తుంటుంది మరి! 2017 నుంచి తన జోరు చూపిస్తున్న ‘జోకర్’ మాల్వేర్ విషయంలో గూగుల్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. కోడింగ్ బలంగా లేని యాప్స్ ద్వారా అది ప్రభావం చూపెడుతూనే వస్తోంది. తాజాగా 14 ఆండ్రాయిడ్ యాప్స్‌లో జోకర్‌ను గుర్తించినట్లు కాస్పర్‌స్కై అనలిస్ట్ తాన్య షిష్కోవా చెబుతున్నారు. డాటాను తస్కరించే ఈ మాల్వేర్ .. యాప్స్‌లో కోడింగ్ మార్చేయడం ద్వారా తన పని చేసుకుంటూ పోతుందని, తద్వారా కాంటాక్ట్ లిస్ట్, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఓటీపీల తస్కరణ, ఎస్సెమ్మెస్‌లను రీడ్ చేయడం చేస్తోందని షిష్కోవా చెబుతున్నారు. కోడ్‌లో దాగి ఉండే ఈ మాల్వేర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే రిస్క్ కూడా ఎక్కువేనని ఆండ్రాయిడ్ యూజర్లను షిష్కోవా హెచ్చరిస్తోంది. సూపర్ క్లిక్ వీపీఎన్, వాల్యూమ్ బూస్టింగ్ హియరింగ్ ఎయిడ్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ బబుల్ ఎఫెక్ట్స్, ప్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ ఆన్ కాల్, ఈజీ పీడీఎఫ్ స్కానర్, స్మార్ట్‌ఫోన్ రిమోట్, హలోవీన్ కలరింగ్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డు, వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వెలైజర్, సూపర్ హీరో ఎఫెక్ట్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ వాల్ పేపర్, డాజిలింగ్ కీబోర్డ్, ఎమోజీవన్ కీబోర్డు, నౌ క్యూఆర్ స్కాన్.. ఈ యాప్స్‌ను తక్షణమే అన్ఇన్స్టాల్ చేయడం మంచిదని షిష్కోవా చెబుతోంది. VIDEO: జోకర్ ఏం చేస్తాడో చూడండి -
‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో ఆదివారం హాలోవీన్ కార్యక్రమం జరిగింది. చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో వచ్చి జనాలను భయభ్రాంతులకు గురి చేయడమే దీని ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రతి ఏటా అక్టోబర్ 31న హాలోవీన్ సంబరాలు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో జపాన్‌లో హాలోవీన్ సందర్భంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలో విలన్ ‘జోకర్’ వేషధారణలో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో బీభత్సం సృష్టించాడు. ట్రైన్లో మంట పెట్టాడు.. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. 29 ఏళ్ల యువకుడు ఒకరు హాలోవీన్ సందర్భంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలో విలన్ ‘జోకర్’లా తయరయ్యాడు. అనంతరం రద్దీగా ఉండే షింజుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. రైలు ఎక్కిన తర్వాత చేతిలో కత్తి, యాసిడ్ బాటిల్‌తో లోపల ఉన్న ప్రయాణికులను భయపెట్టాడు. అంతటితో ఆగక 60 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అంతేకాక సదరు వ్యక్తి ట్రైన్ చుట్టూ ఒకలాంటి ద్రవం పోసి.. మంటపెట్టాడు. (చదవండి: కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్.. షాక్‌లో అభిమానులు!) అతడి చర్యలకు కంపార్ట్మెంట్లో ఉన్న ప్రయాణికులు బిక్కచచ్చిపోయారు. కొందరు కిటికీలోంచి బయటకు దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలో ఓ ఎమర్జెన్సీ స్టాప్ ఉండటంతో రైలు అక్కడ ఆపి.. అందరూ బయటకు పరుగు తీశారు. సదురు జోకర్ వేషదారి చేసిన పనుల వల్ల సుమారు 10మంది గాయపడినట్లు సమాచారం. (చదవండి: ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట..) అప్పటికే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఎమర్జెన్సీ స్టాప్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడమే కాక ప్రయాణికులకు సాయం చేశారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. ‘‘జోకర్ గెటప్‌లో వచ్చిన సదరు వ్యక్తి హాలోవీన్ స్టంట్‌లో భాగంగా ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నాం. ఎందుకంటే ట్రైన్ ఆగిన తర్వాత అతడు అక్కడ నుంచి నింపాదిగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు’’ అని తెలిపాడు. చదవండి: Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా? -
'జోకర్' రంగంలోకి దిగింది.. స్క్విడ్ గేమ్ క్రేజ్ మాములుగా లేదుగా..!
‘స్క్విడ్ గేమ్’.90 దేశాల వీక్షకుల్ని ఊపేస్తున్న కొరియన్ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్‌ను క్యాష్ చేసుకునేందుకు హ్యాకర్స్ మాల్వేర్తో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన గూగుల్ 'ప్లే స్టోర్'లో స్క్విడ్ గేమ్ పేరుతో ఉన్న యాప్స్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మాల్వేర్ ఉన్న ఆ యాప్స్ 5వేల డౌన్ లోడ్లు దాటిన్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు యూజర్లను టార్గెట్ చేసేందుకు జోకర్ రంగంలోకి దిగినట్లు మాల్వేర్ రీసెర్చర్లు గుర్తించారు. 12ఏళ్ల కష్టం దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ 12 ఏళ్ల క్రితం అంటే 2009 లో స్క్విడ్‌గేమ్ పేరుతో స్టోరీ రాసుకున్నారు. కాలం కలిసిరాక, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తెరక్కెక్కేందుకు ఇన్నేళ్లు పట్టింది. అయినా ఈ ఏడాది సెప్టెంబర్ 17న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు ఊహించని విధంగా వీక్షకులు బ్రహ్మరథం పడుతుంటే డైరెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 21.4 మిలియన్ల బడ్జెట్ తో ఈ సిరీస్‌ను తెరకెక్కించగా 900 మిలియన్ల లాభాల్ని గడించింది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ సిరీస్‌ను 142మిలియన్ల మంది యూజర్లు వీక్షించారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ట్విట్టర్ యూజర్ @ReBensk పేరుతో స్క్విడ్ గేమ్ వాల్ పేపర్లుతో ఓ యాప్‌ను డిజైన్ చేశారు. ఆ యాప్‌లో మాల్వేర్ ఉందనే విషయాన్ని తొలిసారి గుర్తించారంటూ ఫోర్బ్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ స్క్విడ్ గేమ్ వాల్ పేపర్ యాప్‌తో ప్రమాదకరమైన యాడ్స్ తో పాటు ఎస్ఎంఎస్లతో పెయిడ్ సబ్స్క్రిప్షన్ చేయాలని డిమాండ్ చేసినట్లు ఈఎస్ఈటీ మాల్వేర్ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో గుర్తించారు. అంతేకాదు ఈ యాప్స్‌లలో జోకర్ మాల్వేర్ ఇన్ స్టాల్ చేసినట్లు లుకాస్ తెలిపారు. జోకర్ మాల్వేర్ జోకర్ మాల్వేర్..! ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. మొదటిసారి 2017లో గూగుల్‌లో ప్లేస్టోర్లలో యాప్స్‌పై దాడి చేసింది. దీంతో దీన్ని గుర్తించేందుకు గూగుల్‌కే మూడేళ్లు పట్టింది. గుర్తించిన తరువాత సుమారు జోకర్ మాల్వేర్ నిండిన 1800 యాప్స్‌ను గూగుల్ డిలీట్ చేసింది. తాజాగా స్క్విడ్ గేమ్ పేరుతో ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌లలో ఈ జోకర్ మాల్వేర్ ఉన్నట్లు ఈఎస్ఈటీ మాల్వేర్ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో హెచ్చరించారు. చదవండి: అక్కడేమో ప్రాణాలతో చెలగాటం! ఇక్కడేమో.. -
జోకర్‌తో నవ్వాలనుకుంటే అది ఏడిపిస్తోంది
'పెగసెస్' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్' మాల్వేర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాల్వేర్. మనకు తెలిసిన జోకర్ నవ్విస్తే..ఈ జోకర్ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్ నుంచి 1800యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ ఏడాది జూన్ నెలలో జోకర్ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్ యాప్స్, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్ ప్లేస్టోర్ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్ సీఈఓ నయ్యర్ తెలిపారు. డాక్టర్ వెబర్ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల్వేర్ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కు చెందిన యాప్ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. చదవండి: భారత్ ఎకానమీ చెక్కు చెదర్లేదు -
బీ అలర్ట్..! ఈ యాప్‌లు డిలీట్ చేసి ‘జోకర్’ని తరిమేయండి
జోకర్ మాల్వేర్ మళ్లీ వచ్చేసింది. ఈ మాల్వేర్ ఒక్కసారి మన ఫోన్లోకి వచ్చిదంటే అంతే సంగతులు..! మీ ఫోన్లో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేకాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్ మాల్వేర్ తొలిసారిగా 2017 గూగుల్ ప్లేస్టోర్‌లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్ (సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. తాజాగా సైబర్ సెక్యూరిటీ ఫ్రిమ్ క్విక్ హీల్ టెక్నాలజీస్ జోకర్ వైరస్ మాల్వేర్ ఉన్న ఎనిమిది యాప్‌లను గుర్తించింది. వీటిని వెంటనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచి ఆన్ఇన్స్టాల్ చేయమని సూచించింది. జోకర్ మాల్వేర్కు గురైన యాప్స్ ఇవే... 1. ఆక్జిలారీ మెస్‌జ్ యాప్ 2. ఫాస్ట్ మ్యాజిక్ ఎస్ఎమ్ఎస్ 3. ఫ్రీ క్యామ్ స్కానర్ 4. సూపర్ మెసేజ్ 5. ఏలిమేంట్ స్కానర్ 6. గో మెసేజ్స్ 7. ట్రావెల్ వాల్‌పేపర్ 8. సూపర్ ఎస్ఎమ్ఎస్ జోకర్ వైరస్ మాల్వేర్: జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్స్జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
భయపెడుతున్న జోకర్ సాఫ్ట్ వేర్
-
జోకర్ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్
-
Joker Malware Android: జోకర్ మళ్లొచ్చాడు.. తస్మాత్ జాగ్రత్త!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ఖతర్నాక్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. ముంబై: జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో దర్శనమిచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించుకుంది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇక ఇప్పుడు జోకర్ మాల్వేర్ గురించి ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ జారీ చేయడం విశేషం. ఏం చేయాలంటే.. యాప్‌లకు(అవసరం లేనివాటికి) ఎస్సెమ్మెస్ యాక్సెస్ పర్మిషన్ను తొలగించాలి. అవసరం లేని సర్వీసులు, సబ్స్క్రిప్షన్ల నుంచి బయటకు వచ్చేయాలి. ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌బ్యాంకింగ్ సమాచారాన్ని ఫోన్లో దాచిపెట్టుకోకపోవడం మంచిది. క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం.. తెలియకుండా జరిగిన కొనుగోళ్లపై దృష్టి సారించడం. అనవసరమైన యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోకపోవడం. రివ్యూల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ అయినా సరే.. అనుమానంగా అనిపిస్తే తొలగించడం. యాంటీ వైరస్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవడం. 2020లో 11 ‘జోకర్’ అనుమానిత యాప్స్‌ను ప్లే స్టోర్‌లో గుర్తించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 22కి పైనే ఉంది. మొండి జోకర్ జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
గవర్నర్ పదవికి పోటీ.. జోకర్ వేషంలో నామినేషన్
గవర్నర్ పదవి కోసం పోటీ పడుతున్న ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశాడు. ప్రముఖ కామిక్ సూపర్ విలన్ వేషధారణతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించాడు. వివరాలు.. జపాన్‌లోని టోక్యోకు చెందిన యుసుకే కవాయ్.. చిబా ప్రాంత గవర్నర్ పదవి కోసం పోటీ పడుతున్నాడు. తాజాగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాడు. నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయన వేష ధారణ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ కామిక్ సూపర్ విలన్ జోకర్ వేశాన్ని ఆయన ధరించారు. అనంతరం తన యూట్యూబ్ ఖాతా ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తానన్న దానికి సంబంధించిన ప్లాన్స్‌ను వెల్లడించాడు. అయితే తన ప్రత్యర్థి మసయుకి హిరత్సుకాను రెచ్చగొట్టడానికే ఆ విధంగా జోకర్ వేషం వేశాడని లోకల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కవాయ్ తన జాబ్‌ను వదిలేసిన తర్వాత సినిమా రంగంలో కమెడియన్‌గా స్థిరపడాలనుకున్నాడని వెల్లడించాయి. కాగా, కవాయ్ వేషంపై స్పందిస్తున్న నెటిజన్లు.. ముఖం చూపించడానికి భయపడే అతడలా వేషం వేసుకున్నాడని విమర్శిస్తున్నారు. చదవండి : నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని.. సింహం పిల్లను తెచ్చుకుని మరీ వెడ్డింగ్ ఫొటోషూట్ -
‘జోకర్’కు 11 ఆస్కార్ నామినేషన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డుల బరిలో టాడ్ ఫిలిప్స్ నిర్మించిన ‘జోకర్’ సినిమా 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ‘ది ఐరిష్‌మేన్’, శ్యామ్ మెండిస్ నిర్మించిన ‘1917’, క్వెంటిన్ టరాంటినో నిర్మించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రాలు పదేసి నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన ‘పారాసైట్’ చిత్రం ఆరు నామినేషన్లతో మూడవ స్థానంలో నిలిచింది. మొట్టమొదటి సారిగా ఆస్కార్ బరిలో దక్షిణ కొరియా చిత్రం పోటీ పడడం ఓ విశేషం కాగా, ఉత్తమ చిత్రంతోపాటు, ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీలకు పోటీ పడడం మరో విశేషం. ‘పారాసైట్’ చిత్రం భారత్‌లో ఈ నెల 31వ తేదీన విడుదలవుతోంది. ‘లిటిల్ విమెన్’ లాంటి ఉత్తమ చిత్రాలను తీసిన గ్రేటా గెర్విగ్ సహా మహిళా దర్శకులెవరూ ఈ సారి ‘ఉత్తమ దర్శకులు’ కేటగిరీకి ఎంపిక కాకపోవడం దురదృష్టకరం. విమర్శకుల ప్రశంసలందుకున్న ‘పోట్రేట్ ఆఫ్ లేడీ ఆన్ ఫైర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సెలైన్ సియమ్మా, ‘ది నైటింగేల్’ దర్శకులు జెన్నిఫర్ కెంట్, ‘ది ఫేర్వెల్’కు దర్శకులు లూలూ వాంగ్, ‘బుక్స్మార్ట్’ దర్శకులు ఓలివియా వైల్డ్, ‘హస్టలర్స్’ దర్శకులు లొరేన్ స్కఫారియా, ‘ఏ బ్యూటీఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్’ దర్శకులు మేరెల్లీ హెల్లర్లలో ఎవరూ ఆస్కార్‌కు ఎంపిక కాకపోవడం శోచనీయం. అయితే డాక్యుమెంటరీ కేటగిరీలో ఎక్కువ మంది మహిళలు పోటీ పడడం విశేషమే. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్లను వసూలు చేసిన ‘జోకర్’ సినిమాలో నటించిన జాక్విన్ ఫోనిక్స్‌కు ఉత్తమ నటుడు అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలివుడ్’ చిత్రంలో నటించిన లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్లు కూడా ప్రధానంగా ఉత్తమ నటుడి అవార్డుకు పోటీ పడుతున్నారు. అలాగే ఉత్తమ నటి అవార్డుకు ‘మ్యారేజ్ స్టోరీ’లో నటించిన స్కార్లెట్ జాన్సన్, ‘జూడీ’లో నటించిన రెన్నా జెల్వెగర్, ‘లిటిల్ విమెన్’లో నటించిన సోయిస్ రోనన్, ‘హరియెట్’లో నటించిన సింథియా ఎరివో, ‘బాంబ్‌షెల్’లో నటించిన చార్లిజ్ థెరాన్లు పోటీ పడుతున్నారు. -
గోల్డెన్ గ్లోబ్-2020 విజేతలు వీరే..
77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల మహోత్సవం లాస్ ఎంజెల్స్‌లోని ది బెవెర్లీ హిల్టన్ హోటల్లో అట్టహాసంగా జరుగుతుంది. జనవరి 5న ప్రారంభమైన ఈ అవార్డుల కార్యక్రమం ఈ రోజుతో (సోమవారం) ముగియనున్నది. హాలీవుడ్, టెలివిజన్, ఫిల్మ్ అండ్ డిజిటల్ విభాగాలలో అందిస్తున్న ఈ ఫంక్షన్లో ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రం ఉత్తమ స్క్రీన్‌ప్లే సినమాగా నిలిచింది. కాగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఉత్తమ చిత్రంగా 1917.. ఉత్తమ నటుడిగా ‘జోకర్’ సినిమా నుంచి జాక్విన్ ఫీనిక్స్కు అవార్డు లభించింది. రెనీ జెల్వెగర్కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ప్రతి విభాగంలో నాలుగు నుంచి అయిదు పోటీ పడగా.. చివరగా ఒకటి విజేతగా సత్తాచాటాయి. గోల్డెన్ గ్లోబ్ విజేతల వివరాలు... ఉత్తమ చిత్రం(డ్రామా) ► 1917(విన్నర్) ఐరిష్ జోకర్ మ్యారియేజ్ స్టోరీ ది టూ పోప్స్ ఉత్తమ నటుడు ► జాక్విన్ ఫీనిక్స్(జోకర్)-విన్నర్ క్రిస్టియన్ బాలే-ఫోర్డ్ వి. ఫెరారీ ఆంటోనియో బాండెరాస్- పెయిన్ అండ్ గ్లోరి అడమ్ డ్రైవర్- మ్యారేజ్ స్టోరి జోనాథన్ ప్రైస్- ది టూ పోప్స్ ఉత్తమ నటి ► రెనీ జెల్వెగర- (జూడీ)-విన్నర్ సింథియా ఎరివో-హ్యరియెట్ స్కార్లెట్ జోహన్సన్- మ్యారేజ్ స్టోరి సోయిర్స్ రోనన్- లిటిల్ వుమెన్ చార్లిజ్ థెరాన్-బాంబ్ షెల్ ఉత్తమ చిత్రం-మ్యూజికల్, కామెడీ ► వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్(విన్నర్) ఉత్తమ నటుడు-మ్యూజికల్, కామెడీ ► టారోన్ ఎగర్టన్-రాకెట్‌మన్ ఉత్తమ నటి-మ్యూజికల్, కామెడీ ► అక్వాఫిన- ది ఫేర్వెల్ ఉత్తమ సహాయ నటుడు ►బ్రాడ్ పిట్-వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఉత్తమ సహాయ నటి ►లారా డెర్న్- మ్యారేజ్ స్టోరి ఉత్తమ దర్శకుడు ►సామ్ మెండిస్ 1917 ఉత్తమ స్క్రీన్ ప్లే ►క్వింటెన్ టారంటినో-వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఉత్తమ యానిమెటేడ్ ఫీచర్ ►మిస్సింగ్ లింక్.. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ►హిల్దుర్-జోకర్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ►ఐయామ్ గొన్న లవ్ మి ఎగెన్- రాకెట్ మ్యాన్ టెలివిజన్ సిరీస్- డ్రామా ►సక్కెషన్ ఉత్తమ టెలివిజన్ నటుడు-డ్రామా ►బ్రియాన్ కాక్స్- సక్సెషన్ ఉత్తమ టెలివిజన్ నటి-డ్రామా ►ఒలివియా కోల్మన్ ఉత్తమ విదేశి భాషా సినిమా ►పారాసైట్ ►ఉత్తమ టెలివిజన్ నటుడు- మ్యూజికల్,కామెడీ ►రామి యూసఫ్-రామి ఉత్తమ టెలివిజన్ నటి- మ్యూజికల్,కామెడీ ►ఫోబ్ వాలర్-బ్రిడ్జ్, ఫ్లీబాగ్ ఉత్తమ నటుడు- టెలివిజన్ లిమిటెడ్ సిరీస్ ►రస్సెల్ క్రోవ్-ది లౌడెస్ట్ వాయిస్ ఉత్తమ నటి- టెలివిజన్ లిమిటెడ్ సిరీస్ ►మిచెల్ విలియమ్స్- ఫోస్సే, వెర్డాన్ ఉత్తమ టెలివిజన్ సిరిస్-మ్యూజికల్ కామెడీ ►ఫ్లీబాగ్ ఉత్తమ లిమిటెడ్ సిరీస్- టీవీ ►చెర్నోబిల్ ఉత్తమ సహాయ నటి-టీవీ ►ప్యాట్రిసియా ఆర్క్వేట్-ది యాక్ట్ ఉత్తమ సహాయ నటుడు-టీవీ ►స్టెల్లన్ స్కార్స్‌గార్డ్- చెర్నోబిల్ -
‘జోకర్’ నటుడికి 'పెటా' అవార్డు!
ప్రముఖ హాలీవుడ్ నటుడు, జోకర్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ జోక్విన్ ఫీనిక్స్.. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) 2019 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపిక అయ్యాడు. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ ది హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం.. ఫీనిక్స్ మూడు సంవత్సరాల వయస్సు నుంచే శాకాహారిగా ఉన్నాడు. స్వతహాగా జంతు ప్రేమికుడైన అతడు.. 'వీగన్' ఆహరశైలికి అలవాటు పడి, దీర్ఘకాలం నుంచి జంతు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇదే విషయాన్ని పెటా అధ్యక్షుడు ఇంగ్రీడ్ న్యూకిర్క్ ప్రస్తావిస్తూ.. నిరంతరం జంతు హక్కుల కోసం పోరాడేందుకు ఎల్లవేళలా ముందుండే వ్యక్తి జోక్విన్ ఫీనిక్స్ అని అన్నారు. జంతువుల సంరక్షణ కోసం ఎటువంటి సంకోచం లేకుండా పాటుపడే వ్యక్తి అని కొనియాడారు. కాగా వన్యప్రాణులను సర్కస్‌లో ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం కోసం ఇటీవల పెటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వి ఆర్ ఆల్ ఎనిమల్స్' అనే కార్యక్రమంలో ఫీనిక్స్ పాల్గొన్నారు. ఇక మతగురువు పోప్ ఫ్రాన్సిస్, అమెరికన్ టెలివిజన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే, అంజెలికా హస్టన్, ఒలివియా మున్, ఎవా మెండిస్, అలిసియా సిల్వర్‌స్టోన్ వంటి ప్రముఖులకు గతంలో 'పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డును దక్కించుకొన్నారు. ఇక మనదేశం తరపు నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటా-2019కు ఎంపికయ్యాడు. -
‘జోకర్’కు చైనా ఫ్యాన్స్ ఫిదా.. సరికొత్త రికార్డులు
జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ 'జోకర్' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను స్థిరంగా కొనసాగిస్తుంది. అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'జోకర్' సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉందని కొందరు విమర్శకులు పెదవి విరిచినా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు దాటిన తొలి ఆర్-రేటెడ్ సినిమా(హింసాత్మకంగా భావించినప్పటికీ)గా నిలిచింది. ఆర్- రేటడ్ జాబితాలో ఇంతకుముందు 2018లో వచ్చిన ర్యాన్ రేనాల్డ్స్ నటించిన కామెడి థ్రిల్లర్ 'డెడ్‌పూల్ 2' సినిమా (78.3), 'డెడ్‌పూల్'(75.4) మిలియన్ డాలర్లు వసూలు చేయగా, తాజాగా జోకర్ ఆ సినిమాల రికార్డును అధిగమించింది. అంతేగాక చైనాలో ఆర్-రేటడ్ సినిమాలను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ జోకర్ సినిమాను మాత్రం చైనా ప్రేక్షకులు హిట్ సినిమాగా నిలిపారు. జోకర్‌గా నటించిన జోక్విన్ ఫీనిక్స్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 62.3 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిలిమ్స్ సంస్థ జోకర్ సినిమాను తెరకెక్కించగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు. డీసీ ఫిలిమ్స్ సంస్థ రూపొందించిన ఆక్వామెన్, ది డార్క్ నైట్ రైజస్, ది డార్క్ నైట్ సినిమాలు 1బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, తాజాగా ఆ జాబితాలో జోకర్ నాలుగో స్థానాన్ని సంపాందించింది. ది డార్క్ నైట్ సినిమాలో జోకర్ పాత్రలో హెత్ లెడ్జర్ బ్యాట్‌మెన్ సిరీస్ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ది డార్క్‌నైట్ సినిమాలో జోకర్ పాత్ర విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భయంకరమైన జోకర్‌గా నటించిన హెత్ లెడ్జర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా ఇంటరాగేషన్ సీన్లో జోకర్ పాత్రలో హెత్ లెడ్జర్ వెకిలి నవ్వులు ఎవరు అంత తొందరగా మరిచిపోలేరు. దాని నుంచి ప్రేరణగా తీసుకొని ఒక సీరియల్ కిల్లర్ గా జోకర్ ఎందుకు మారాడనే బ్యాక్‌డ్రాఫ్‌లో జోకర్ చిత్రం తెరకెక్కింది. జోకర్ పాత్రకు ప్రాణం పోసిన హెత్ లెడ్జర్ 2008 లో డ్రగ్స్‌కు బానిసై చనిపోవడంతో ఈ సినిమాలో జోక్విన్ ఫీనిక్స్ జోకర్ పాత్రను ధరించారు. -
చిన్న సినిమాకు సూపర్‌స్టార్ ప్రశంసలు
తమిళ సినిమా: ఎవరినైనా ప్రశంసించాలంటే చాలా పెద్ద మనసు కావాలి. అదే విధంగా రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ నుంచి అభినందనలు అందుకోవాలంటే వారు ఎంతో ప్రతిభను చాటు కోవాల్సి ఉంటుంది. అలాంటి అభినందనలను నవ దర్శక, కథానాయికలు పొందగలిగారు. వారే అరువి చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్తమన్, ఆ చిత్ర కథానాయకి అతిధిబాలన్. పలు భారీ చిత్రాలను నిర్మించిన డ్రీమ్‌వారియర్ ఫిలింస్ అధినేతలు ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన తాజా చిత్రం అరువి. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన అరువి చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను విశేషంగా పొందుతోంది.ఇక చిత్ర ప్రముఖులు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం చూసి ఫోన్లోనే చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్మమన్ను అభినందించారు.తాజాగా ఇటీవల మరోసారి అరువి సినిమా చూసిన రజనీకాంత్ ఆ చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు, కథానాయకి అతిధిబాలన్లను ఇంటికి పిలిపించి ప్రశంసలలో ముంచెత్తడంతో పాటు బంగారు గొలుసులను బహూకరించారు. ఈ సందర్భంగా అరువి చిత్ర నిర్మాత ఎస్ఆర్.ప్రభును మీరు ఇంతకు ముందు నిర్మించిన చిత్రాలేమిటని అడిగారు. జాతీయ అవార్డును గెలుచుకున్న జోకర్, మానగరం, ధీరన్ అధికారం ఒండ్రు లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించినట్లు నిర్మాత చెప్పడంతో మీ చిత్రాలన్నీ తాను చూశానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి చిత్రాలు నిర్మించాలని అభినందించారు. దర్శకుడిని ఉద్దేశించి బ్రిలియంట్, ఎక్స్లెంట్, ట్రెమండస్ చిత్రం అరువి అని ప్రశంసించారు.ఈ చిత్ర కథను ఎక్కడ నుంచి మొదలెట్టారని అడిగారు. తానీ చిత్రాన్ని తన ఇంట్లో ఒంటరిగా చూశానని, అయినా ప్రేక్షకుల మధ్య చూసినంత అనుభూతి కలిగిందని అన్నారు. ఎంతగా ఏడ్చేశానో, ఇంకెంతగా నవ్వుకున్నానో అని అన్నారు.ఇక హీరోయిన్ అతిధిబాలన్ అద్భుతంగా అభినయించారని అభినందించారు. ఇలాంటి టీమ్ పది కాలాల పాటు పరిశ్రమలో ఉండాలని ఆకాంక్షిస్తూ అభినందించారు.రజనీ అభినందనలకు అరువి చిత్ర దర్శక నిర్మాతలు, కథానాయకి పులకించిపోయారు. -
కబాలిపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్లానింగ్ అభిమానులకు మాత్రం నిరాశే మిగులుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన కబాలి సినిమాను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలపకపోయినా.. ఇతర చిత్రాల నిర్మాతలు కన్ఫామ్ చేస్తున్నారు. సాధారణంగా రజనీ సినిమా రిలీజ్ సమయంలో మరే సినిమా రిలీజ్ చేయడానికి సాహసించరు. అయితే కబాలి రిలీజ్ అనుకుంటున్న జూలై 1న కటప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్సన్ దురైతో పాటు మరో తమిళ సినిమా జోకర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన కబాలి టీం... సుల్తాన్‌తో పోటీ వద్దని తమ సినిమాను వాయిదా వేసుకుంటున్నారట. ఎలాగూ కబాలి వాయిదా పడుతుందన్న నమ్మకంతో ఆ గ్యాప్‌ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు కోలీవుడ్ దర్శక నిర్మాతలు. -
జోకర్లా కేటీఆర్: భట్టి
టీఆర్ఎస్ వల్లే ప్రాంతీయ విద్వేషాలు సాక్షి, హైదరాబాద్: కేబినెట్ మంత్రిగా సీరియస్‌గా పని చేయకుండా జోకర్లా, తుపాకి రామునిలా, పిట్టలదొరలా కేటీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని కేటీఆర్‌ను హెచ్చరించారు. ‘‘ఇప్పటిదాకా సీమాంధ్రులను నోటికొచ్చినట్టు తిట్టిన నోటితోనే కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.సీమాంధ్ర నేతల పేరు ఉచ్ఛరించడానికే అసహ్యించుకున్న కేసీఆర్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. టీఆర్ఎస్వి అవకాశవాద, దుష్ట రాజకీయాలు. ఇతర పార్టీల నేతలను బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివాటితో రాజకీయ ఉగ్రవాదానికి టీఆర్ఎస్ నేతలు తెర తీశారు. టీఆర్ఎస్ గెలిస్తే భయభ్రాంతులు సృష్టిస్తారు. జాగో-బాగో నినాదాలతో తమ నిజ స్వరూపాన్ని నెలరోజుల్లోనే చూపిస్తారు’’ అన్నారు. కాంగ్రెస్ హయాంలో నగరానికి తెచ్చిన గోదావరి నీళ్లను నెత్తిన చల్లుకుని, వాటిని తామే తెచ్చినట్టు చెప్పుకోవడం కేటీఆర్‌కు సిగ్గుచేటన్నారు. తెలంగాణలో అంతరించిపోతున్న టీడీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ‘ఉత్త రెడ్డి’ అని, తనను ‘వట్టి’ విక్రమార్క అని మాట్లాడటంపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్త రెడ్డి, వట్టి విక్రమార్కల సంగతేమిటో 2019లో చూపిస్తామన్నారు. బీజేపీ-ఎంఐఎం వంటి మతతత్వ పార్టీలను తిరస్కరించాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ అన్నీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే, బీజేపీకి ఎక్కడ కోపమొస్తుందోననే భయంతోనే అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని ఆరోపించారు. ఐజేయూ సీనియర్ నేత కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు టి.కోటిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాహుల్ గాంధీ ఓ జోకర్ అన్న కాంగ్రెస్ నేత
'రాహుల్ గాంధీ ఒక జోకర్. ఆయన తనంతట తానుగా పార్టీ పదవులనుంచి తప్పుకోవాలి. లేకపోతే ఆయన్ని బలవంతంగా పంపించేయాలి. ఆయన జోకర్ వ్యవహారం వల్లే కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. ప్రధానమంత్రి పదవి అంటే పిల్లలాట కాదు.' ఈ మాటలన్నది ఏ విపక్ష నేత లేక రాజకీయ విమర్శకుడో కాదు. ఏకంగా ఒక కాంగ్రెస్ నేత. ఆయన కూడా ఆషామాషీ నేత కాదు. కేరళలో మంత్రిగా పనిచేశారు. టీ హెచ్ ముస్తఫా అనే సీనియర్ నేత రాహుల్ గాంధీని ఏకంగా జోకర్ అని అన్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీ వ్యవహారం పిచ్చోడిలా ఉందని కూడా అన్నాడు. మరి పార్టీని బతికించి, బాగుచేయాలంటే ఏం చేయాలని విలేఖరులు అడిగితే ఆయన ప్రియాంకాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. ముస్తఫా మరో అడుగు ముందేసి, భజనపరుల వల్లే రాహుల్ దెబ్బతిన్నారని, రక్షణ మంత్రి ఏ కె ఆంటోనీ కూడా ఆ భజనపరుల్లో ఒకరని అనేశారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ముస్తఫాని విమర్శించే ధైర్యం కూడా చేయలేదు. -
'రాహుల్ ఓ జోకర్ లా ప్రవర్తించారు'
కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ సోమవారం కేరళ పర్యటనలో జోకర్ లా ప్రవర్తించారని సీపీఐ-ఎం నేత విమర్శించారు. కాంగ్రెస్ లో ప్రధాని అభ్యర్థి హోదాలో కొనసాగుతున్న రాహుల్ ఓ పోలీస్ జీప్ లో ప్రయాణించి జోకర్ లా బిహేవ్ చేశాడని వామపక్ష నేత పినరాయి విజయన్ అన్నారు. పోలీస్ జీప్ టాప్ పై ప్రయాణించడం ఆయన మానసిక స్ఠితికి అద్దం పడుతోంది అని అన్నారు. విపక్షాల విమర్శలు పక్కన పడితే.. ర్యాలీలో రాహుల్ తీరు తనను ఆకట్టుకుందని కేరళ ప్రభుత్వ చీప్ విప్ పీసీ జార్జ్ అన్నారు. నెహ్రూ, గాంధీ వంశం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ సాధారణ పౌరుల హృదయాల్లో చోటు సంపాదించడాన్ని కేరళ పర్యటనలో చూశాను అని ఆయన అన్నారు. పేద ప్రజల హృదయాల్లో చోటు ఉందని రాహుల్ కేరళ పర్యటనలో రుజువు చేసుకున్నారని జార్జ్ తెలిపారు.