కబాలిపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప | Jackson Durai and Joker Movies releasing on July 1st | Sakshi
Sakshi News home page

కబాలిపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప

Published Tue, Jun 14 2016 9:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

కబాలిపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప

కబాలిపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్లానింగ్ అభిమానులకు మాత్రం నిరాశే మిగులుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన కబాలి సినిమాను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలపకపోయినా.. ఇతర చిత్రాల నిర్మాతలు కన్ఫామ్ చేస్తున్నారు. సాధారణంగా రజనీ సినిమా రిలీజ్ సమయంలో మరే సినిమా రిలీజ్ చేయడానికి సాహసించరు. అయితే కబాలి రిలీజ్ అనుకుంటున్న జూలై 1న కటప్ప పాత్రతో తెలుగు  ప్రేక్షకులకు దగ్గరయిన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్సన్ దురైతో పాటు మరో తమిళ సినిమా జోకర్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేసిన కబాలి టీం... సుల్తాన్తో పోటీ వద్దని తమ సినిమాను వాయిదా వేసుకుంటున్నారట. ఎలాగూ కబాలి వాయిదా పడుతుందన్న నమ్మకంతో ఆ గ్యాప్ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు కోలీవుడ్ దర్శక నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement