rajani kanth
-
రజినీకాంత్‌కు వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్..
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్‌లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్ అబితాబ్ బచ్చన్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేసింది. తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌కు వన్డే ప్రపంచకప్-2023 గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ అందించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా వెళ్లి గోల్డన్ టికెట్‌ను అందించి టోర్నీకి ఆహ్వానించారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ట్విట్ చేసింది. "బీసీసీఐ కార్యదర్శి జైషా బంగారు టిక్కెట్‌ను రజినీకాంత్‌కు అందించారు.భాషలు, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో దిగ్గజ నటుడు రజినీకాంత్ చెరగని ముద్రవేశారు. తలైవా విశిష్ట అతిథిగా హాజరై టోర్నీకి మరింత వెలుగు తెస్తారని తెలియజేయడానికి సంతోషం ఇస్తున్నామని" బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చింది. కాగా ఈ గోల్డన్ టిక్కెట్ కలిగి ఉన్న వ్యక్తులు ప్రపంచ కప్ 2023 లోని అన్ని మ్యాచ్‌లను వీఐపీ స్టాండ్ నుండి ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్ -
జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కేరళలో పుట్టిన సంజూకు చిన్నతనం నుంచే రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. తలైవాను కలవాలన్న తన చిన్నప్పటి కోరికను సంజూ 28ఏళ్ల వయస్సులో నేరవేర్చుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో రజినీని తన నివాసంలో కలిశాడు. ఇక తాజాగా మరోసారి సూపర్ స్టార్‌పై తన అభిమానాన్ని సంజూ చాటుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో రజినీ కాంత్ నటించిన 'జైలర్' సినిమాను శనివారం ఐర్లాండ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దీనికి సంజూ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఐర్లాండ్-భారత్ రెండో టీ20 సందర్భంగా కామేంటేటర్ నైల్ ఓబ్రియన్ వెల్లడించాడు. ఇటీవలే సంజు తన అభిమాన నటుడి సినిమాను చూశాడాని ఓబ్రియన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమా.. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు రూ.500 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సంజూ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన సంజూ.. ఐర్లాండ్‌పై అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. జైలర్ సినిమా చూసిన తర్వాత సంజూ రెచ్చిపోయాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు నేడు ఆసియాకప్ జట్టు ప్రకటన నేపథ్యంలో సంజూకు చోటు దక్కాలని కోరుకుంటున్నారు. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ Just IN : Indian Cricketer #SanjuSamson WATCHED superstar #Rajinikanth's #Jailer movie. ||#JailerHits500cr | #ShivaRajkumar |#Mohanlal ||pic.twitter.com/M59u7eizgu — Manobala Vijayabalan (@ManobalaV) August 20, 2023 -
రజనీ కాంత్ రేంజ్ ఏంటో చెప్పే సంఘటన
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో తలైవా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలేషియా,జపాన్ సింగపూర్‌లో ఈయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ 'బాషా', 'ముత్తు' లాంటి సినిమాలు అక్కడి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వాటిని రిపీటెడ్‌గా చూస్తారు. కానీ ఆయన నటించిన గత చివరి సినిమాలు 'పేట', 'దర్బార్', 'అన్నాత్తే' కమర్షియల్‌గా అక్కడ హిట్ కొట్టాయి. (ఇదీ చదవండి: నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్) తాజాగా జైలర్ సినిమాను చూసేందకు జపాన్‌లోని ఒసాకా నుంచి ఒక జంట చెన్నైకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలైంది. కానీ తలైవా గడ్డపైనే జైలర్‌ను చూడాలని వారు ఇంత దూరం వచ్చినట్టు రజనీకాంత్ జపాన్ ఫ్యాన్స్ అసోషియేషన్ లీడర్ యసుదా హిడెతోషి తెలిపారు. ఆయన రజనీ పేరుతో జపాన్‌లో పలు సేవా కార్యక్రమాలు చేశారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాల కోసం జపాన్‌కు రజనీ వెళ్తే ఆ ఏర్పట్లాన్ని యసుదానే చూసుకుంటారు. ఇక, జపాన్‌లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అత్యంత అధికంగా ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన సినిమాలు అక్కడ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. కథల పుస్తక రూపంలో అక్కడ ఎంతగానో ఆకట్టుకుంది. -
నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా
గ్లామర్‌కు కేరాఫ్ మిల్కీబ్యూటీ తమన్న. ఈమె ఇంత కాలం నటిగా నిలబడ్డారంటే అందాలారబోత ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కాగా కథానాయకిగా నటిస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్‌లకు సై అంటున్న ఈ బ్యూటీ తాజాగా తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్, తెలుగులో రజనీకాంత్‌తో జైలర్ చిత్రాల్లో నటించారు. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అవుతున్నాయి. మరో విషయం ఏమిటంటే జైలర్ చిత్రంలో తమన్న రజనీకాంత్‌కు ఫెయిర్ కాదు. ఇక భోళాశంకర్ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తీసురేష్కే అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. కాగా ఇద్దరు సీనియర్ హీరోలతో నటించడం గురించి తమన్నపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. సీనియర్ నటులతో జత కట్టడానికి ఎందుకు అంగీకరిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు? అవకాశాలు రాకా, లేక డబ్బు కోసమా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఇదేనా?) దీనికి స్పందించిన తమన్న నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఎందుకు మాట్లాడతారు? నటించే పాత్రలను చూడండి అని ఘాటుగా పేర్కొన్నారు. కాదూ కూడదూ అంటారా వయసు గురించి మాట్లాడాలంటే తాను హలీవుడ్ నటుడు టామ్ క్రూస్ మాదిరి సాహసాలు చేయగలను, డాన్స్ చేయగలను అని పేర్కొన్నారు. ఇకపోతే సీనియర్ నటులతో కలిసి నటించడం తనకు ఎప్పుడూ సంతోషమేనన్నారు. -
ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా బాధను చూడలేకపోతున్నా: రజనీకాంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదారబాద్ గత కొన్ని సీజన్లగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్‌లు మారుతున్నప్పటికీ.. ఎస్ఆర్ఆహెచ్ ఆటతీరు మాత్రం మారడం లేదు. కనీసం ఈ ఏడాది సీజన్లోనైనా అదరగొడుతుందని భావించిన అభిమానులను ఎస్ఆర్హెచ్ మరోసారి నిరాశ పరిచింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. ఇక తాజాగా ఎస్ఆర్హెచ్ ప్రదర్శనపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ యాజమాని కావ్యా మారన్ పడే బాధను తన చూడలేక పోతున్నాని రజనీ అన్నారు. తన రాబోయే చిత్రం ‘జైలర్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. "ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశా. కాబట్టి కళానిధి మారన్(కావ్య మారన్ తండ్రి)కు నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నాను. జట్టులో మంచి ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి. వేలంలో మెరగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవాలి. జట్టున మరింత బలపేతం చేయాలని" సూచించారు. కాగా కళానిధి మారన్ రజినీ జైలర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024కు ముందు మరోసారి తమ జట్టును ప్రక్షాళన చేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హెడ్‌కోచ్ బ్రియాన్ లారాను ఉద్వసన పలకనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు)ను వదులుకోవాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs WI: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్
టీమిండియా క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు సంబంధించి 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 7 ఏళ్ల వయసు నుంచి తన ఆరాధ్య కథానాయకుడు రజనీకాంత్‌ను కలవాలనుకున్న సంజూ కల ఎట్టకేలకు మార్చి 12, 2023న నెరవేరింది. సూపర్‌స్టార్, తలైవా రజనీకాంత్‌ను అతని స్వగృహంలోనే కలుస్తానని సంజూ చిన్నతనంలో తల్లిదండ్రులతో శపథం చేశాడట. At the age of 7 already being a Super Rajni fan,,I told my parents ..See one day I will go and meet Rajni sir in his house… After 21 years,that day has come when The Thalaivar invited me..☺️🙏🏽 pic.twitter.com/FzuWWqJkif — Sanju Samson (@IamSanjuSamson) March 12, 2023 21 ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు సంజూ శపథం నెరవేరింది. నిన్న సంజూ శాంసన్‌ను రజనీకాంత్ తన స్వగృహానికి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా రజనీకాంత్ సంజూ మెడలో శాలువ వేసి సత్కరించాడు. ఈ విషయాన్ని సంజూ ట్విటర్ వేదికగా షేర్ చేసి, తన అవధుల్లేని ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. కాగా, కేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ శాంసన్‌కు చిన్నతనం నుంచి రజనీకాంత్ అంటే పిచ్చ అభిమానం ఉండేది. గతంలో చాలా సందర్భాల్లో సంజూ స్వయంగా ఈ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో పుస్తక పఠనం, మెడిటేషన్‌తో పాటు తనకెంతో ఇష్టమైన రజనీకాంత్ సినిమాలు, మళయాలం సినిమాలతో కాలం వెల్లబుచ్చానని సంజూ ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ ఇటీవలికాలంలో టీమిండియాలోకి తరుచూ వస్తూ పోతున్న విషయం తెలిసిందే. రకరకాల కారణాల చేత సంజూకు టీమిండియాలో పర్మనెంట్ పొజిషన్ దక్కడం లేదు. అయితే సంజూ ఐపీఎల్లో మాత్రం అదరగొడుతున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ.. గత సీజన్లో అ జట్టును రన్నరప్‌గా నిలబెట్టాడు. అంతర్జాతీయ స్టార్లతో నిండిన రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ను సంజూ విజయవంతంగా నడిపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. -
జైసల్మేర్ టు మంగళూరు
మంగళూరుకు షిఫ్ట్ అయ్యారు జైలర్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొం దుతున్న సినిమా ‘జైలర్’. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపా త్రలు పో షిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగింది. ఈ షెడ్యూల్లో రజనీ, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ‘జైలర్’ షూటింగ్ మంగళూరులో జరుగుతోంది. రజనీ, శివరాజ్కుమార్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లా న్ చేశారట. -
రజనీ కాంత్ చేతులమీదుగా ధోని 'అధర్వ' తొలికాపీ విడుదల
MS Dhoni Atharva First Copy Released By Rajinikanth: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమా ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ అద్భుతమైన నటనను కనబర్చాడు. ప్రస్తుతం ధోని ప్రధాన పాత్రలో రూపొందిన గ్రాఫిక్ నవల 'అధర్వ: ది ఆరిజన్'. ఈ గ్రాఫిక్ నవల ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ధోని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అధర్వ గ్రాఫిక్ నవల తొలికాపీని తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ గురువారం చెన్నైలోని తన నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ తొలికాపీని రజనీ కాంత్ విడుదల చేయడంపై ధోని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే బుక్ పబ్లిషర్స్, రచయిత రమేశ్ తమిళమణి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1499తో అందుబాటులో ఉందని.. కావాల్సిన వారు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. రజనీ కాంత్ తమ కష్టాన్ని గుర్తించడంతో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. -
ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు: రజనీ కాంత్
దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబరు 4న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ పరిచయ పాటను రిలీజ్ చేశారు. రజనీ నటించిన ఈ పాటను ఎస్పీబీ పాడారు. ఈ సందర్భంగా ఆయన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘‘నలభైఅయిదేళ్లు నా గాత్రంలా జీవించారు ఎస్పీబీ గారు. నా ‘అన్నాత్తే’ సినిమా కోసం ఆయన పాడిన పాటలో నటిస్తున్నప్పుడు నాకు ఆయన పాడే చివరి పాట ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ తన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు’’ అని రజనీకాంత్ తమిళంలో ట్వీట్ చేశారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే 45 வருடங்கள் என் குரலாக வாழ்ந்த எஸ்பிபி அவர்கள் அண்ணாத்தே படத்தில் எனக்காகப் பாடிய பாடலின் படப்பிடிப்பின் போது, இதுதான் அவர் எனக்குப் பாடும் கடைசிப் பாடலாக இருக்கும் என்று நான் கனவில் கூட நினைக்கவில்லை. என் அன்பு எஸ்பிபி தன் இனிய குரலின் வழியாக என்றும் வாழ்ந்து கொண்டே இருப்பார். — Rajinikanth (@rajinikanth) October 4, 2021 -
నో మోర్ పాలిటిక్స్: కుండబద్దలు కొట్టిన రజినీ
-
మళ్లీ రాజకీయాల్లోకి సూపర్‌స్టార్ రజనీకాంత్?
-
రజనీ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళన.. ప్రత్యేక విమానంలో...
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే హీరో రజనీకాంత్ కోరిన మీదట అమెరికా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇంతకీ విషయం ఏంటంటే... రజనీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారని సమాచారం. ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలసి రజనీ వెళ్లారట. ఈ విమానంలో పద్నాలుగు మంది వరకూ ప్రయాణించవచ్చట. కాగా, ఇప్పటికే హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ నిమిత్తం అమెరికాలో ఉన్నారు రజనీ అల్లుడు, హీరో ధనుష్. అలాగే ధనుష్ భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారట. కాగా, రజనీ అమెరికా వెళ్లారనే వార్త వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. -
ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్!
ప్రముఖ నటులు రజనీకాంత్, మోహన్‌బాబుల స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. రజనీకాంత్, మోహన్‌బాబు కలిసి ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణను ముగించుకుని తిరిగి చెన్నై వెళ్లడానికి ముందు తన ఆత్మీయ మిత్రుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. రెండు రోజుల పాటు మిత్రుడి ఇంట్లో ఉన్న రజనీ ఆ తర్వాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. కాగా రజనీ, మోహన్‌బాబు ఇద్దరూ దిగిన ఫోటోలను, ఈ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోను ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు మంచు విష్ణు. -
రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు!
హీరోలకు పారితోషికం ఎక్కువ ఉంటుంది. వారితో పోలిస్తే – హీరోయిన్లకు చాలా తక్కువ ఉంటుంది. ఇక వయసు విషయానికొస్తే.. హీరో ఎప్పటికీ హీరోనే! 50 – 60 ఏళ్లు దాటినా హీరోగా చేయొచ్చు. కానీ హీరోయిన్‌కు 30 మహా అయితే 40 టచ్ అయ్యేవరకూ ఓకే. అది కూడా ఏ కొందరో 30 దాటినా హీరోయిన్లుగా చేయగలుగుతారు. చాలామటుకు 30 టచ్ అయ్యాక అక్కా, వదిన పాత్రలకు అడుగుతారు. 40 దాటితే అమ్మ పాత్రలు ఆఫర్ చేస్తారు. మేల్ యాక్టర్, ఫీమేల్ యాక్టర్‌కి ఉన్న ఈ వ్యత్యాసం గురించి ఓ కార్యక్రమంలో నటి రాధిక మాట్లాడుతూ – ‘‘నేను ఒకవైపు సినిమాల్లో నటించడంతో పాటు బిజినెస్ ఉమన్ (సినిమా, సీరియల్ నిర్మాణం) గానూ మారాను. ఎందుకంటే నా కెరీర్ నా కంట్రోల్లో ఉండాలనుకున్నాను. భవిష్యత్తులో నన్ను రజనీకాంత్‌కి అమ్మ (రజనీ సరసన తమిళంలో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించారు రాధిక)గా చేయమని అడుగుతారని నాకు ముందే తెలుసు. నటుల విషయంలో ఎవరికీ ఎలాంటి ముందస్తు ఆలోచనలు ఉండవు. కానీ నటీమణుల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఏది ఏమైనా కెరీర్ పరంగా దాటుతున్న ప్రతి మైలురాయికీ నేనింకా బెటర్ అవుతున్నాను’’ అన్నారు. కథానాయికగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ – ‘‘చూసేవారికి నా కెరీర్ చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలున్నాయి. అసలు నేను యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఒక డైరెక్టర్ నన్ను నటించమని అడిగారు. నేను లెజండరీ యాక్టర్ ఎం.ఆర్. రాధ కూతుర్ని అని ఆయనకు తెలియదు. వాస్తవానికి నేనప్పుడు అంత అందంగా కూడా ఉండేదాన్ని కాదు. ‘నా ముఖాన్ని ఎవరు చూస్తారు’ అని ఆయనతో అన్నాను. ఎలాంటి అంచనాలు, కలలు లేకుండానే కెమెరా ముందుకొచ్చాను. ఇంతదాకా వచ్చేశాను’’ అన్నారు రాధిక. -
నో పార్టీ.. ఓన్లీ సేవ: రజనీకాంత్
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా..ప్రజాసేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపుతానని మంగళవారం ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఒక ప్రకటన ద్వారా సుదీర్ఘ సంజాయిషీ ఇచ్చుకున్నారు. అందులోని వివరాలు యథాతథంగా..‘నా జీవనాధారమైన తమిళనాడు ప్రజలకు ప్రేమపూర్వక నమస్సులు. జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి వైద్యుల సూచనలను ఖాతరు చేయకుండా అన్నాత్తే చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాను. 120 మంది సభ్యులతో కూడిన చిత్రబృందంలో నాతో సహా జాగ్రత్తలు తీసుకున్నా నలుగురికి పాజిటివ్ నిర్ధారణైంది. చిత్రదర్శకులు వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి అందరికీ మరోసారి పరీక్షలు జరిపించగా నాకు నెగెటివ్ వచ్చింది. అయితే బీపీలో హెచ్చుతగ్గులు గుర్తించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నందున ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో హైదరాబాద్‌లోనే చికిత్స చేయించుకున్నా. అన్నాత్తే చిత్ర షూటింగ్‌ను రద్దు చేయగా పలువురి ఉపాధి దెబ్బతింది, కొందరికి కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. వీటన్నింటికీ నా అనారోగ్యమే కారణం. ఈ పరిణామాలు దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నాను. నేను పార్టీ ప్రారంభించిన తరువాత మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే ప్రజల్లో నేను ఆశించిన చైతన్యాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో ఘనవిజయం సాధించలేను. ఈ వాస్తవాన్ని రాజకీయ అనుభవజ్ఞులెవ్వరూ కొట్టిపారేయలేరు. ఎన్నికల ప్రచార సభలతో లక్షలాది మంది ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. 120 మంది చిత్రబృందంలోనే కరోనా సోకడంతో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. కరోనా కొత్తరూపుదాల్చి రెండోవేవ్ వ్యాపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లి అనారోగ్యం పాలైతే నన్ను నమ్ముకుని నా వెంట రాజకీయ ప్రయాణం చేసే వారిని సైతం సంకట పరిస్థితుల్లోకి నెట్టినవాడినవుతాను. నా ప్రాణం పోయినా పరవాలేదు, ఇచ్చిన మాటను మీరను. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఇపుడు రావడం లేదని ప్రకటించడాన్ని నలుగురు నాలుగు విధాలుగా వ్యాఖ్యానిస్తారనే కారణంతో నమ్ముకున్న వారిని బలిపశువులను చేయలేను. ఈ కారణాలతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ఎంతో బాధాతప్త హృదయంతో చెబుతున్నాను. ఈ నిర్ణయం రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులకు, అభిమానులకు, ప్రజలకు ఎంతో నిరాశను కలిగిస్తుంది. నన్ను క్షమించండి. మూడేళ్లుగా నా మాటలకు కట్టుబడి, కరోనా కాలంలో ప్రజలకు సేవలందించిన నిర్వాహకుల శ్రమ వృథాపోదు. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుతుంది. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రజనీ మక్కల్ మన్రం యథాప్రకారం పనిచేస్తుంది. మూడేళ్లుగా నా వెంట నిలిచిన తమిళరువి మణియన్‌కు, బీజేపీ నుంచి వైదొలిగి నాతో కలిసి పనిచేసేందుకు సమ్మతించిన అర్జున్‌మూర్తికి రుణపడి ఉంటాను. ఎన్నికల రాజకీయాల్లోకి రాకుండా ప్రజలకు వీలయినంత సేవ చేస్తాను. నిజాలు మాట్లాడేందుకు ఎన్నడూ వెనుకాడను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెద్ద హృదయంతో అందరూ అంగీకరించాలని వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. ఆందోళనకు గురైన అభిమానులు తమ అభిమాన హీరో రాజకీయ అరంగేట్రంపై మూడు దశాబ్దాలకుపైగా ఎదురుచూసిన అభిమానులు రజనీకాంత్ ప్రకటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరో రెండురోజుల్లో పార్టీ ప్రకటన ఖాయమని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్తతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయపార్టీలు స్వాగతించాయి. ‘రజనీకాంత్ చేసిన ప్రకటనతో నా మానసిక పరిస్థితి ఆయన అభిమానుల్లానే ఉంది. కొద్దిగా నిరాశ చెందినా ఆయన క్షేమంగా ఉండాలి’అని నటుడు కమల్‌హాసన్ అన్నారు. అప్పట్నుంచే ఒత్తిడి ► 1996 నుంచే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమాన సంఘాల ఒత్తిడి. ► జయలలిత, కరుణానిధి మరణానంతరం 2017లో అభిమానులతో విస్తృత సమావేశాలు. అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తి. ► డిసెంబర్ 31న పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీ స్థాపన, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ నవంబర్‌లో ప్రకటన. ► ‘అన్నాత్తే’ చిత్రం షూటింగ్ కోసం ఈ నెల 13న చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లి, అనారోగ్యంపాలు. -
ప్రేమకు నిర్వచనం నా తమ్ముడు
‘‘నా తమ్ముడు మంచి మనిషి. ప్రేమకు నిర్వచనం’’ అన్నారు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ. జనవరిలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన రజనీకాంత్ ఈ సందర్భంగా తన అన్నయ్య సత్యనారాయణ ఆశీస్సులు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం (డిసెంబర్, 12) రజనీ పుట్టినరోజు. చెన్నైలో ఆయన బర్త్‌డే వేడుకలు జరిగాయి. తమ్ముడికి ఏం బహుమతి ఇచ్చారు? అసలు పుట్టినరోజులకు ఏమైనా ఇచ్చి పుచ్చుకుంటారా? అని సత్యనారాయణను ‘సాక్షి’ అడిగితే – ‘‘అలాంటివి ఏమీ లేదు. మా తమ్ముడు చూపించే ప్రేమను నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. నా ప్రేమను ఆయన అలానే అనుకుంటారు. కుటుంబ సభ్యులంటే ఆయనకు చాలా ప్రేమ. కుటుంబం అనే కాదు.. మనుషులందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి’’ అన్నారు. మీ తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి ఏమంటారు? అంటే, ‘‘ఇన్నేళ్లుగా సినిమా హీరోగా ఉన్నారు. ఆయనకు అన్ని విషయాలూ తెలుసు. బాగా రాణిస్తారు’’ అన్నారాయన. ‘‘నా ఆరోగ్యం బాగుంది. తమ్ముడి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. తను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఎంత బిజీగా ఉన్నా నా క్షేమసమాచారాలు తెలుసుకుంటారు’’ అన్నారు సత్యనారాయణ. ఇదిలా ఉంటే ఈ 15 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొననున్నారు రజనీకాంత్. అందరికీ ధన్యవాదాలు ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులకు, ప్రపంచవ్యాప్తంగా నా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న అభిమాన దేవుళ్లకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
తలైవా కథ తయారా?
బస్ కండక్టర్ నుంచి ఇండియన్ సూపర్‌స్టార్‌గా రజనీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. పక్కా కమర్షియల్ కథలాంటి జర్నీ. ఇప్పుడు ఈయన ప్రయాణం ఓ సినిమా కాబోతోందని కోలీవుడ్ టాక్. రజనీ జీవిత కథను బయోపిక్‌గా తీసుకురావాలని తమిళ దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేస్తున్నారట. లింగుస్వామి తమిళంలో తెరకెక్కించిన ‘సండై కోళి’, ‘పయ్యా’ (తెలుగులో ‘పందెం కోడి, ఆవారా’) వంటి సినిమాలు తెలుగులోనూ బాగా ఆడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సందర్భంలో ‘రజనీ బయోపిక్ చేయాలనుంది. రజనీ పాత్రలో ధనుష్ యాక్ట్ చేస్తే బావుంటుంది’ అని పేర్కొన్నారు లింగుస్వామి. రెండేళ్లుగా లింగుస్వామి కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. తలైవా (నాయకుడా అని అర్థం. రజనీని చాలామంది అలానే పిలుస్తారు) రజనీ బయోపిక్‌కి సంబంధించిన కథ మీదే వర్క్ జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. -
రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని తలైవాను కోర్టు హెచ్చరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని కొడంబాకంలోరాఘవేంద్ర కళ్యాణమంటపం పేరిట రజనీకాంత్‌కు ఒక కళ్యాణమండపం ఉంది. అయితే దానికి సంబంధించి రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఆయనకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కళ్యాణమండపం మూసి ఉందని... అప్పటి నుంచి కళ్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టులో పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ పన్నును చెల్లించలేనని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ రజనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. చదవండి: మీరు లేకపోతే నేను లేను! -
మీరు లేకపోతే నేను లేను!
రజనీకాంత్... కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా సూపర్ స్టార్. స్టయిల్‌తో, గ్రేస్‌తో భాష, ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రజనీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 45 ఏళ్లు కావస్తోంది. 1975లో ‘అపూర్వ రాగంగళ్’ ద్వారా తెరపై కనిపించారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న వారికి ట్విట్టర్ ద్వారా రజనీ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘సినిమాల్లో నా ప్రయాణం 45 ఏళ్లుగా సాగుతోంది. నన్ను ఆదరించిన వాళ్లకు, ఈ ప్రయాణంలో తోడ్పడినవాళ్లకు, మరీ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను లేను’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
అన్నయ్య ఆలస్యంగా వస్తాడు
అనుకున్న సమయానికి అన్నయ్య రాడట. ‘అయినా ఫర్వాలేదు.. మా అన్నయ్య లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు’ అని తమ్ముళ్లు (ఫ్యాన్స్) అంటున్నారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో ఓ సినిమా ఆరంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రానికి ‘అన్నాత్తే’ అని టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. అంటే.. ‘అన్నయ్య’ అని అర్థం. 2021 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నామని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలిపింది. అయితే లాక్డౌన్ ముందు వరకూ జరిపిన షెడ్యూల్స్‌లో 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. వచ్చే నెల కానీ మరో రెండు నెలల తర్వాత కానీ షూటింగ్ మొదలుపెట్టినా సంక్రాంతి లోపు పూర్తి చేయడం కష్టం అని చిత్రబృందం భావిస్తోందట. అందుకని విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: డి. ఇమ్మాన్, కెమెరా: వెట్రి. -
రజనీకాంత్‌కి కరోనా
‘‘రజనీకాంత్‌ని మేం దేవుడిలా భావిస్తాం, ఆయన గురించి సరదాగా జోకులు వేసినా ఊరుకోం, నీది చాలా బ్యాడ్ టేస్ట్ కాబట్టే ఇలాంటి పిచ్చి జోక్ వేశావ్, కరోనా అనేది కామెడీ కాదు, ఇలాంటి జోక్ వేయడం భారతీయ సంస్కృతి కాదు. ఇంకోసారి ఇలా చేశావంటే జాగ్రత్త’’ అంటూ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ పై నెటిజన్లు మండిపడ్డారు. శనివారం రోహిత్ పై తిట్ల వర్షం కురిపించారు రజనీ అభిమానులు. దానికి కారణం ‘రజనీకాంత్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ కరోనానే క్వారంటైన్లో ఉంది’ అని తన ఇన్ స్టాగ్రామ్‌లో రోహిత్ పెట్టిన పోస్ట్. రజనీకి కరోనా వస్తే అదే నిర్భందంలో ఉండాలి తప్ప రజనీకేం కాదు అనేది అతని పోస్ట్ అర్థం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సూపర్ స్టార్‌పై వేసిన ఈ జోక్ ఆయన అభిమానులకు మింగుడుపడక, రోహిత్ రాయ్ పై మండిపడ్డారు. ‘‘నవ్వించడానికి చేశాను. అయితే అది ఇలా అవుతుందనుకోలేదు. క్షమించండి. కానీ ఇది చెత్త జోక్ అని నేను అనుకోవడంలేదు. ఇది టిపికల్ రజనీ సార్ జోక్. ఒకర్ని కామెంట్ చేసే ముందు అసలు వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో ఒకసారి ఆలోచించాలి. మీరందరూ నన్ను బాధపెట్టడానికి మెసేజులు పోస్ట్ చేస్తున్నట్లు మిమ్మల్నందర్నీ బాధపెట్టడానికి నేను ఆ జోక్ వేయలేదు’’ అని రోహిత్ రాయ్ పోస్ట్ చేశాడు. ఉద్దేశం ఏదైనా ఎవరిపై జోక్ వేస్తున్నామనేది ముఖ్యం అని కొందరు అంటున్నారు. -
ఆగస్ట్‌లో ఆరంభం
కెరీర్ ప్రారంభంలో కమల్ హాసన్, రజనీకాంత్ పలు సినిమాల్లో కలిసి నటించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే నటులుగా కాదు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా వేసవిలో ప్రారంభం కావాలి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ సినిమాను ఆగస్ట్ నెలలో ప్రారంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. మరి ఈ సినిమాకి కమల్ కేవలం నిర్మాతగానే ఉంటారా? అతిథి పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాలి. -
స్వచ్ఛ రాజకీయాలు కావాలన్నప్పుడు వస్తా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి కావాలని తాను ఎన్నడూ అనుకోలేదని, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని తమిళ ప్రజలు గట్టిగా కోరుకున్న రోజున రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అవినీతి రహిత, స్వచ్ఛమైన రాజకీయాలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం మూడంచెల ఫార్ములాను అనుసరిస్తున్నట్లు రజనీ చెప్పారు. పార్టీ వ్యవహారాలకు, పాలనకు మధ్య సంబంధం అస్సలు ఉండదని, సమర్థమైన సంస్థాగత వ్యవస్థ ఉంటుందని, యువతకు పెద్దపీట వేస్తామని ఆయన గురువారం చెన్నైలో విలేకరులకు చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలు గట్టిగా కోరుకున్న రోజున తాను రాజకీయాల్లోకి వచ్చితీరతానని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చోవాలని కలలో కూడా ఊహించలేదని, తనను భావి ముఖ్యమంత్రిగా చిత్రీకరించడాన్ని ఇప్పటికైనా మీడియా మానుకోవాలని కోరారు. మూడేళ్ల క్రితం అంటే 2017 డిసెంబర్ 31న రజనీకాంత్ ఒక ప్రకటన చేస్తూ.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ‘రాజకీయ, ప్రభుత్వ మార్పు ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు’అని కూడా ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిల మరణం తరువాత తమిళనాడులో రాజకీయ శూన్యం ఏర్పడిన నేపథ్యంలో రజనీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రజినీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ‘రజనీ మక్కల్ మన్రం(ఆర్ఎంఎం)’ శ్రేణులకు ప్రముఖ నటుడు రజనీకాంత్ పిలుపునిచ్చారు. రాజకీయ రంగప్రవేశానికి సహకరించే ఉద్దేశంతో రజినీకాంత్ ‘రజినీ మక్కల్ మన్రం(ఆర్ఎంఎం)’ అనే సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో గురువారం ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కమల్‌తో కలిసి వెళ్తే లాభమా..నష్టమా? ఒంటరిగా పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి? అని చర్చించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఆ వివరాలను రజినీ మీడియాతో పంచుకున్నారు. ‘చాలా విషయాలు చర్చించుకున్నాం. వాళ్లంతా సంతృప్తి చెందారు. నాకే ఒక విషయంలో మోసపోయానన్న భావన ఉంది. సమయం వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తా’ అని రజినీ వ్యాఖ్యానించారు. -
పెద్దన్నయ్యా వద్దన్నయ్యా
కరోనా వైరస్సే ప్రస్తుతం ఎక్కడ చూసినా వైరల్ టాపిక్. జనాలందర్నీ భయపెడుతూ, సినిమా షూటింగులను ఇబ్బంది పెడుతోంది కరోనా. ఆల్రెడీ ఇప్పుడు కరోనా వ్యాప్తి ఉన్న దేశాల్లో ఎప్పుడో ప్లాన్ చేసిన కొన్ని సినిమాల షూటింగ్‌లు రద్దయ్యాయి. తాజాగా రజనీకాంత్ కొత్త చిత్రం ‘అన్నాత్తే’ కూడా కరోనా ఇబ్బందికి గురైందని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’ (పెద్దన్నయ్య). మీనా, ఖుష్భూ, నయనతార, కీర్తీ సురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోల్కత్తా, పుణే నగరాల్లో జరగాలి. కరోనా కారణంగా ముందు అనుకున్న ప్లాన్‌ని మార్చేసారట. పెద్దన్నయ్యా.. నార్త్ వైపు వద్దన్నయ్యా అంటూ ఈ షెడ్యూల్స్‌ను కూడా సౌత్‌లోనే పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారని తమిళనాడు టాక్. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. -
ముహూర్తం కుదిరింది
సుమారు 35 ఏళ్ల విరామం తర్వాత కమల్‌హాసన్ – రజనీకాంత్ కలసి సినిమా చేయబోతున్నారు. అయితే ఇందులో ఇద్దరూ కలసి నటించడం లేదు. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజనీకాంత్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే దర్శకుల పేర్లలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘ఖైదీ’ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్, ‘ఖాకీ’ తీసిన హెచ్. వినోద్ ఈ రేస్‌లో ఉన్నారు. మరి ఈ సినిమాలో ఏదైనా సన్నివేశంలో కమల్–రజనీ కనిపించే అవకాశం ఉంటుందా? వేచి చూడాలి. ∙రజనీకాంత్, కమల్ హాసన్ -
చికుబుకు చికుబుకు రైలే
హైదరాబాద్‌లోని ఓ రైల్వేస్టేషన్‌కు రాబోతున్నారు రజనీకాంత్. కానీ ఇది నిజమైన రైల్వేస్టేషన్ కాదండోయ్. సినిమా కోసం వేసిన సెట్ రైల్వేస్టేషన్ . రజనీకాంత్ హీరోగా శివ ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రకాష్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. -
సీఏఏ, ఎన్పీఆర్పై రజనీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అనుకూల గళాలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం వివాదాస్పద చట్టానికి మద్దతుగా నిలిచారు. సీఏఏ చట్టం ఏ భారతీయ పౌరుడిని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, ఒకవేళ వారు ఇబ్బందులను ఎదుర్కొంటే, వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి తానే అవుతానని రజనీకాంత్ వెల్లడించారు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) చాలా అవసరమని కూడా వ్యాఖ్యానించారు. బయటివారు ఎవరో తెలుసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. భారత, పాకిస్తాన్ విభజన సందర్భంగా భారతదేశంలో ఉండటానికే నిర్ణయించుకున్న ముస్లింలను దేశం నుండి ఎలా పంపిస్తారు?" అని రజనీకాంత్ ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలంటూ గతంలో రజనీకాంత్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మోదీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై ఇప్పటివరకూ మౌనాన్ని ఆశ్రయించిన రజనీకాంత్ చివరకు మద్దతు పలకడం విశేషం. (ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద 50 రోజులుగా ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి : వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది Rajinikanth: Citizenship Amendment Act will not affect any citizen of our country, if it affects Muslims then I will be the first person to stand up for them. NPR is a necessity to find out about the outsiders. It has been clarified that NRC has not been formulated yet. pic.twitter.com/wyXMCY8pH9 — ANI (@ANI) February 5, 2020 -
స్పెషల్ 2020
సిద్ధార్థ్‌కి ఈ ఏడాది స్పెషల్‌గా ఉండబోతోందని కోలీవుడ్ టాక్. తమిళ సూపర్‌స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాల్లో సిద్ధార్థ్ కీలక పాత్రలు చేయడమే అందుకు కారణం. ఇప్పటికే కమల్‌హాసన్–శంకర్ ‘ఇండియన్ 2’లో సిద్దార్థ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా రజనీకాంత్–శివ సినిమాలో ఓ పాత్ర కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించారట. ఈ సినిమాలో మీనా, ఖుష్భూ, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకాంత్ కుమార్తెగా కీర్తీ సురేశ్ కనిపిస్తారు. కీర్తీకి జోడీగా సిద్ధార్థ్ పాత్ర ఉండబోతోందట. ఒకేసారి రజనీ, కమల్ సినిమాల్లో కీలక పాత్ర చేయడం అంటే సిద్ధార్థ్‌కి ఈ 2020 స్పెషల్ ఇయర్ అనే చెప్పొచ్చు. -
‘దర్బార్’ ప్రీ రిలీజ్ వేడుక
-
తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం
‘‘1976లో తెలుగులో నా ‘అంతులేని కథ’ సినిమా విడుదలైంది.. ఇçక్కడున్న వారిలో 99శాతం మంది అప్పుడు పుట్టి ఉండరు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘దర్బార్’. ఎ. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న ‘దర్బార్’ విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఎన్వీ ప్రసాద్‌గారు నాకు 20ఏళ్లుగా తెలుసు.. సినిమా ఆడినా, ఆడకున్నా ఒకేలా ఉంటారాయన. మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌ను ఆయన కొంచెం లో ప్రొఫైల్‌లో చేసేవారు. కానీ ‘దర్బార్’ సినిమా హిట్ అని తెలిసిపోయినట్టుంది ఆయనకు.. అందుకే ఇంత భారీ వేడుక ప్లాన్ చేశారు. నా వయసు 70 ఏళ్లు.. ఇంకా నేను హీరోగా నటిస్తున్నానంటే ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహమే కారణం.. అవే నా ఎనర్జీ. ఈ వయసులోనూ మీరు ఇంత సంతోషంగా, ఉత్సాహంగా ఎలా ఉన్నారని కొందరు అడుగుతారు.. నేను వారికి చెప్పేది ఒక్కటే. తక్కువగా ఆశ పడండి.. తక్కువ ఆలోచనలు పెట్టుకోండి.. తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి.. తక్కువగా వ్యాయామాలు చేయండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ‘పెదరాయుడు, బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ వంటి సినిమాలు రజనీ ఉన్నాడని బాగా ఆడలేదు.. ఆ సినిమాలు బాగున్నాయి.. వాటిల్లో రజనీ ఉన్నాడంతే. అందరూ సక్సెస్ఫుల్ సినిమా తీయాలి, బాగా ఆడాలని తీస్తారు. సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్ జరుగుతుంది, ఆ సినిమా బాగా వస్తుంది. అయితే అది మన చేతుల్లో ఉండదు. ‘దర్బార్’ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ మాకు తెలిసిపోయింది. మురుగదాస్‌గారితో పని చేయాలని 15ఏళ్లుగా చూశాను కానీ కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. సుభాస్కరన్‌గారు పెద్ద వ్యాపారవేత్త. సినిమాలంటే ఇష్టంతో తీస్తున్నారు.. ఇప్పుడు మన ‘బాహుబలి’లాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చివరలో రజనీసార్ నడుచుకుంటూ వచ్చే షాట్‌కి నేను ఫిదా అయిపోయా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇరగదీస్తున్న మురుగదాస్‌గారికి సెల్యూట్. రజనీ సార్ ‘జీవన పోరాటం’ సినిమా టైమ్‌లో నేను పిల్లాణ్ణి.. ఆ సినిమాలో ఆయన స్టైల్ చూసి, అలా చేయాలని ప్రయత్నించా. కానీ, రాలేదు’’ అన్నారు. మురుగదాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే రజనీగారితో నేను చేసిన తొలి మూవీ. అలాగే నేను తీసిన తొలి పోలీస్ స్టోరీ. పదిహేనేళ్ల క్రితం రజనీగారిని ప్రేక్షకులు ఎలా చూశారో ఆ స్టైల్, ఆ మాస్ అంశాలన్నీ ‘దర్బార్’లో ఉన్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ సార్‌కి ధన్యవాదాలు. సుభాస్కరన్‌గారు నిజమైన హీరో. భవిష్యత్‌లో ఆయన లైఫ్ స్టోరీ ఒక బయోపిక్‌గా రావొచ్చు. అంత మంచి లైఫ్ స్టోరీ ఆయనది. రజనీగారికి ప్రత్యర్థిగా ఉండే బలమైన పాత్రని సునీల్శెట్టిగారు బ్యాలెన్స్ చేశారు’’ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాలో ఈ పాత్రకి నేను సరిపోతానని అవకాశం ఇచ్చిన మురుగదాస్‌గారికి చాలా థ్యాంక్స్. షూటింగ్లో రజనీ సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నటిస్తున్నారని చూస్తూనే ఉండేదాన్ని. విజయ్, అజిత్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాని.. ఇలా అందర్నీ మనం అభిమానిస్తాం. వాళ్లందరికీ కామన్‌గా నచ్చే ఒక యాక్టర్ రజనీ సార్’’ అన్నారు. పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘2.ఓ’కి ఓ పాట, ‘పేట’కి ఓ పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘దర్బార్’లో రెండు పాటలు రాశా’’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం.. ఎందుకంటే నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన రజనీసార్‌కి, తన కలల చిత్రంలో చాన్స్ ఇచ్చిన మురుగదాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘రజనీగారిని అందరూ సూపర్‌స్టార్ అని పిలుస్తారు. కానీ, నా వరకు ఆయన గాడ్ ఆఫ్ సినిమా. ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సెట్లో మురుగదాస్‌గారు మా అందరికీ గురువు’’ అన్నారు బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి. ‘‘రజనీకాంత్‌గారితో తొలిసారి ‘దళపతి’ సినిమాకు చేశాను. ఆయన ఎనర్జీలో మార్పు లేదు’’ అన్నారు కెమెరామేన్ సంతోష్ శివన్. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కేకే రాధామోహన్, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయిత కృష్ణకాంత్, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డుమ్ డుమ్ డుమ్
‘డుమ్ డుమ్ డుమ్ గట్టి మేళం మోగేట్టు...’ అంటూ సాగే పెళ్లి పాటను ‘దర్బార్’ చిత్రబృందం గురువారం విడుదల చేసింది. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాలోని రెండో పాట (డుమ్ డుమ్..)ను గురువారం రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను నకాష్ అజీజ్ పాడారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. గేయరచయిత కృష్ణకాంత్ మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారికి పాట రాసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇదంతా ఓ కలలా ఉంది. సినిమాలో ఓ యువ జంటకు పెళ్లయ్యే సందర్భంలో వచ్చే పెళ్లి పాట ఇది. భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించి చిన్న ఫిలాసఫీ ఉన్న పాట. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: సంతోష్ శివన్. -
రజనీ కూతురు?
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారని తెలిసింది. శనివారం ఖుష్బూ ఈ సినిమా సెట్లో జాయినయ్యారు. దాదాపు 28ఏళ్ల తర్వాత రజనీ–ఖుష్బూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమాలో రజనీ కూతురి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారని, ఆల్రెడీ ఆమె షూటింగ్లో పాల్గొంటున్నారన్నది తాజా సమాచారం. అలాగే ఈ సినిమాలో రజనీ రెండు పాత్రలు చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రకాష్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
కొబ్బరికాయ కొట్టారు
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించనున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా ముహూర్తం బుధవారం జరిగింది. 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమాలో ఖుష్బూ నటించనుండటం విశేషం. అలాగే ఖుష్భూ తమిళ సినిమాలో కనిపించి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ నెల రెండోవారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. -
మ్యాజికల్ మైల్స్టోన్
కెరీర్లో ‘మైల్స్టోన్’ అని చెప్పుకునే అవకాశాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ‘మహానటి’ రూపంలో కీర్తీ సురేష్ కెరీర్లో ఓ మంచి మైల్స్టోన్ వచ్చి చేరింది. నటిగా సినిమా సినిమాకీ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళుతోన్న కీర్తి ఇప్పుడు తన కెరీర్లో ‘మ్యాజికల్ మైల్స్టోన్’ చేరుకున్నానని అంటున్నారు. మరి.. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అవకాశం అంటే.. ఏదో మ్యాజిక్ జరిగినట్లే కదా. రజనీ 168వ సినిమాలో కీర్తీకి ఈ చాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ‘‘రజనీకాంత్ సార్ సరసన నటించడం అనేది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంలాంటిది. నా సినిమా కెరీర్లో ఇదొక ‘మ్యాజికల్ మైల్స్టోన్’’ అన్నారు కీర్తీ సురేష్. -
రజనీ వ్యూహం?
సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం మాస్ డైరెక్టర్ శివ సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సన్ పిక్చర్స్ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇది రజనీకాంత్ కెరీర్లో 168వ చిత్రం. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. అలాగే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం జ్యోతిక, కీర్తీ సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మరోవైపు డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రాలు ‘వీరమ్, వేదాలం, వివేగమ్, విశ్వా సం’ తర్వాత మరోసారి ‘వి’ సెంటిమెంట్‌తో ఆయన సినిమా టైటిల్ తెరపైకి రావడం విశేషం. ఇంతకుముందు డైరెక్టర్ శివ తెలుగులో ‘శౌర్యం, శంఖం, దరువు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
రజనీ @ 168
రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా చిత్రీకరణ ముగిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి ఈ చిత్రం ముస్తాబవుతోంది. మరి.. రజనీకాంత్ తర్వాతి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఏ దర్శకుడిని వరిస్తుందనే ప్రశ్నకు శుక్రవారం సమాధానం దొరికింది. తమిళంలో అజిత్‌తో వరుసగా ‘వీరమ్’, ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన శివ ఆ చాన్స్‌ను దక్కించుకున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ‘‘యందిరిన్ (తెలుగులో ‘రోబో’), ‘పేట’ చిత్రాల తర్వాత మరోసారి రజనీకాంత్‌గారి సినిమాను నిర్మించనుండటం సంతోషంగా ఉంది’’ అని సన్ పిక్చర్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 168వ చిత్రం. మాస్ ఎంటర్టైనింగ్ కథను రెడీ చేశారట శివ. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో వచ్చిన ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలు శివ దర్శకత్వంలోనే తెరకెక్కాయన్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
‘పది నెలలైనా పారితోషికం రాలేదు’
చెన్నై : సౌత్ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించే ప్రముఖ సబ్‌టైటిలిస్ట్ రేఖ్స్ రజనీ-అక్షయ్ కుమార్ మూవీ 2.ఓ నిర్మాతలపై ఫైర్ అయ్యారు. ఈ సినిమాకు తనకు రావాలల్సిన బకాయిలను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తనకు ఇంకా చెల్లించలేదని ఆరోపించారు. పది నెలలు గడిచినా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2.ఓ తెలుగు, తమిళ్ వెర్షన్‌కు తాను సబ్‌టైటిల్ వర్క్ చేసినా తనకు ఇంకా పేమెంట్ అందలేదని ఆమె ట్విటర్లో తన ఆవేదన వెళ్లగకక్కారు. సినిమా గత ఏడాది నవంబర్‌లో విడుదల కాగా తనకు రావాల్సిన మొత్తం సెటిల్ చేసేందుకు నిర్మాతలకు పదినెలల సమయం ఇచ్చినా ఫలితం లేకపోయిందని, తాను పలుమార్లు వారికి మెసేజ్‌లు, మెయిల్, కాల్స్ చేసినా స్పందన లేదని వాపోయారు. సినిమాలకు వెన్నెముక వంటి సబ్‌టైటిల్స్ పనులు చేసేవారి శ్రమకు ఫలితం అందడం లేదని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తనతో వర్క్ చేయించుకునే నిర్మాతలకు తమ పరిస్ధితి తెలియాలనే ఉద్దేశంతోనే తాను ట్వీట్ చేస్తున్నానని చెప్పారు. 2.ఓ మూవీకే కాకుండా కమల్ హాసన్, గౌతమ్ మీనన్, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్‌ల నుంచి కూడా తనకు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. కాగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. తాము అందరికీ సకాలంలో చెల్లింపులు జరిపామని, ఎవరికీ బకాయి లేమని స్పష్టం చేశారు. రికార్డులు పరిశీలించి ఆమెకు చెల్లింపులు జరిపిన విషయం నిర్ధారించాలని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోరారని చెప్పారు. తన పనికి డబ్బు చెల్లించలేదని ఆరోపించడం ఆమెకు అలవాటని లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
వండర్బార్ను మూసి వేయలేదు
... అంటున్నారు హీరో ధనుష్. తన మావయ్య రజనీకాంత్ హీరోగా వండర్‌బార్ ఫిల్మ్స్ సంస్థపై ధనుష్ ‘కాలా’ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించినంత వసూళ్లు రాబట్టలేదు. పైగా ‘కాలా’ తర్వాత మళ్లీ ఇదే బేనర్లో రజనీకాంత్‌తో సినిమా ఉంటుందనే వార్త వినిపించింది. అయితే రజనీతో మరో సినిమాని ధనుష్‌ని ప్రకటించకపోవడంతో వండర్ బార్ ఫిల్మ్స్‌ని మూసేశారని కోలీవుడ్ టాక్. ఈ వార్తలపై స్పందించిన ధనుష్ మాట్లాడుతూ–‘‘వండర్ బార్ ఫిల్మ్స్ సంస్థ మూతపడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. రజనీ సార్‌తో నా తర్వాతి ప్రాజెక్ట్‌ను ప్రకటించకపోవడం వల్ల ఇలాంటి వార్తలు వస్తున్నాయి. మంచి కథ కుదరగానే రజనీసార్‌ని సంప్రదించి, సినిమా చేస్తాం. ఏ సంస్థకైనా హిట్లు, ఫ్లాపులు మామూలే. అంతేకానీ, మా బ్యానర్‌ను మూసివేయలేదు’’ అని స్పష్టం చేశారు. -
రజనీ ఫిట్నెస్ రహస్యం ఇదే..
చెన్నై : సూపర్ స్టార్ రజనీ కాంత్ పేరు వింటేనే సినీ ప్రియులు, అభిమానుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వెల్లువెత్తుతాయి. సినిమాల్లో తన డ్యాన్సులు, ఫైట్లతో అలరించే రజనీ ఆఫ్‌స్క్రీన్‌లోనూ అదే ఫిట్నెస్, చురుకుదనంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. 68 ఏళ్ల రజనీ ఈ వయసులోనూ మెరుగైన ఫిట్నెస్ను కలిగిఉండటం వెనుక సీక్రెట్‌ను ఆయన తనతో పంచుకున్నారని వెట్రీ థియేటర్స్ అధినేత రాకేష్ గౌతమన్ చెప్పారు. రజనీతో తాను ఇటీవల 15 నిమిషాలు ముచ్చటించానని, ఈ క్రమంలో పేట సక్సెస్‌తో పాటు సినిమాలు, ఫిట్నెస్ సహా పలు అంశాలపై తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు. రజనీకాంత్ రోజూ యోగా చేయడంతో పాటు ఆయనకు తరచూ స్విమ్మింగ్ చేసే అలవాటు ఉందని ముఖ్యంగా సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో విధిగా ఆయన స్విమ్ చేస్తానని తనతో చెప్పారని గౌతమన్ ట్వీట్ చేశారు. నిత్యం యోగా, వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తామని అన్నారని చెప్పారు. ఇక పేట వంటి పక్కా మాస్ సినిమాల్లోనే మిమ్మల్ని చూసేందుకు అభిమానులు ఇష్టపడతారని చెప్పగా రజనీ తన సహజ శైలిలో అలాగే చేద్దాం అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. -
రూ 700 కోట్ల క్లబ్లో 2.ఓ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ 700 కోట్లు వసూలు చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ రూ 700 కోట్ల క్లబ్లో చేరిన తొలి కోలీవుడ్ సినిమాగా నిలిచింది. 2.ఓ ప్రపంచవ్యాప్తంగా రూ 710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ 166.98 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ 2.ఓ మెరుగైన వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల తర్వాత కూడా అమెరికాలో 2.ఓ వందకు పైగా థియేటర్లలో రన్ అవుతోంది. ఉత్తర అమెరికాలో ఈ తరహాలో ఎక్కువ రోజులు మరే ఇతర భారతీయ సినిమా ప్రదర్శింపబడలేదని చెబుతున్నారు. ఈ ప్రపంచం కేవలం మానవాళి కోసమే కాకుండా సమస్త జీవరాశుల కోసం సృష్టించబడిందనే సందేశంతో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్ డాక్టర్ వశీకరణ్, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్ 3.ఓ వంటి పలు పాత్రల్లో మెప్పించారు. -
కరుణానిధి మృతిపై ప్రముఖుల సంతాపం
-
స్క్రీన్ ప్లే 18th June 2018
-
మేకింగ్ ఆఫ్ మూవీ - కాలా
-
'కాలా'కు తప్పని పైరసీ భూతం
-
కాలా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైలైట్స్
-
‘కాలా’ విడుదలకు చర్యలు తీసుకోండి
బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్ఐఎఫ్సీసీ)ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో చర్చించాలని సూచించింది. కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక అమలు చేయాలని రజనీకాంతలో గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో కర్ణాటకలో ఈ నెల 7న కాలా విడుదలపై కేఎఫ్సీసీ నిషేధం విధించింది. సినీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదల చేసేలా కేఎఫ్సీసీతో చర్చించాలని ఎస్ఐఎఫ్సీసీకి సూచించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సాక్షి మహ్రా తెలిపారు. కర్ణాటకలోని రజనీకాంత్ అభిమానుల సంఘం కూడా కేఎఫ్‌సీసీకి లేఖ రాసింది. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరింది. కాలాతో సంబంధమేంటి?: ప్రకాశ్‌రాజ్ యశ్వంతపుర: రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు, కావేరి జలాల వివాదానికి సంబంధమేంటి? అని నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. ‘కావేరి పర్యవేక్షక మండలిని ఏర్పాటు చేయాలంటూ రజనీకాంత్ తమిళనాడుకు మద్దతు పలికారు. అయితే కాలా సినిమాకు, కావేరి వివాదానికి సంబంధం ఏమిటి? ఆ సినిమాను మాత్రమే కన్నడ సంఘలు ఎందుకు లక్ష్యం చేసుకున్నాయి. గతంలో బీజేపీ నాయకులు కూడా ‘పద్మావత్’ సినిమా విడుదల సమయంలో ఇలాగే వివాదం చేశారు. సినిమాను విడుదల చేయనివ్వండి, సినిమా చూడాలో వద్దో అభిమానులే నిర్ణయిస్తారు’ అని ట్విటర్లో పోస్ట్‌చేశారు. చర్చలతోనే ‘కావేరి’ పరిష్కారం కుమార స్వామి, కమల్ హాసన్ ఆకాంక్ష సాక్షి, బెంగళూరు: కావేరి జలాల వివాదాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కర్ణాటక సీఎం కుమార స్వామి అభిలషించారు. ప్రముఖ నటుడు, మక్కల నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. కుమారస్వామిని కలిశారు. గంటకుపైగా చర్చించారు. కమల్‌తో కావేరి వివాదం, యాజమాన్య బోర్డు అంశాలపై చర్చించినట్లు కుమారస్వామి మీడియాతో చెప్పారు. ఇరు రాష్ట్రాలు ఏకతాటిపై నడుస్తూ చర్చలు జరిపితే సమస్య పరిష్కారమవుతుందని కమల్ సూచించారు. కావేరిపై కోర్టుకెళ్లడం చివరి మెట్టుగా కావాలని పిలుపునిచ్చారు. కాలా చిత్ర ప్రదర్శనపై అడగ్గా, సినిమాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. -
సీఎస్కే ‘కాలా’ టీజర్
-
రజనీ పార్టీలోకి ధనుష్, సౌందర్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళనాట కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆయన కుటుంబసభ్యులు చేరనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతోపాటు పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్‌లు పార్టీలో చేరతారని సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కాగా, రాజకీయాల్లోకి వచ్చిన వారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. రిషీకేశ్‌లో ఓ ఇంగ్లిష్ చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘రాజకీయ నాయకుడిగా కొత్త పాత్రను దేవుడిచ్చాడు. ఈ పాత్రకూ 100 శాతం న్యాయం చేయగలను’ అని చెప్పారు. -
పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాను
రిషీకేశ్: తానింకా పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాలేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఆయన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో ఉన్న దయానంద సరస్వతి ఆశ్రమానికి మంగళవారం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన రాజకీయ అరంగేట్రంతో పాటు ఆధ్యాత్మిక అంశాలపై రజనీ మీడియాతో ముచ్చటించారు. ‘నేనింకా పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాలేదు. కనీసం పార్టీ పేరును కూడా నేను ప్రకటించలేదు. కాబట్టి ఇక్కడ (ఆశ్రమంలో) రాజకీయ వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు’ అని రజనీ చెప్పారు. ‘మనిషి జీవిత లక్ష్యం తనను తాను తెలుసుకోవడమే. నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే నేను ఆధ్యాత్మిక బాట పట్టాను’ అని వెల్లడించారు. తానిక్కడికి రావడం ఇదే తొలిసారి కాదనీ, గతంలోనూ చాలాసార్లు వచ్చినట్లు రజనీ స్పష్టం చేశారు. తమిళనాడులోని తేని జిల్లాలో 10 మంది ట్రెక్కర్లు సజీవదహనం కావడంపై విచారం వ్యక్తం చేసిన రజనీ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మంగళవారం దయానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకున్న రజనీకాంత్‌తో ఫొటోలు దిగేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. -
‘కాలా’ కొత్త టీజర్...సోషల్ మీడియాలో వైరల్!
-
‘కాలా’ టీజర్ వచ్చేసింది
-
‘కాలా’ తమిళ్ టీజర్
-
మంచి స్నేహితురాలిని కోల్పోయాను
-
సూపరావతారం
కామిక్స్‌లో, పురాణాల్లో సూపర్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్ అయ్యారు రజనీ!సౌత్‌కే కాదు... మొత్తం భారత్‌కే ఇప్పుడు రజనీకాంత్ ఓ సూపర్ స్టార్. ఆయన పేల్చే బులెట్‌కు ఎంత పవరో... ‘తుపుక్’ మని ఆయన ఊసే బబుల్గమ్.. అంత పవర్.‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...’ అని ‘అంతులేని కథ’లో పాడుకుంటూ తిరిగిన రజనీ...తనే ఇప్పుడు దేవుడై సినిమాకో అవతారంలో... ప్రేక్షక భక్తులకు ‘ఫస్ట్ లుక్’లతో సాక్షాత్కరిస్తున్నారు. మూడేళ్లుగా రెండు విషయాల్లో రజనీకాంత్ అభిమానులు ముఖం వాచి ఉన్నారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ.రజనీ బర్త్‌డే సెలబ్రేషన్స్.తమిళనాడులో ‘పొంగల్’కు నెల ముందు డిసెంబర్ 12న వచ్చే పెద్ద పండుగ రజనీ బర్త్ డే. అయితే మూడేళ్లుగా సెలబ్రేషన్స్ జరగడం లేదు. రజనీ జరగనివ్వలేదు. 2015లో చెన్నైలో ఫ్లడ్స్. 2016లో జయలలిత మరణం. 2017లో తుఫాను. వేడుకలు వద్దన్నారు రజనీ. ఆయన పొలిటికల్ ఎంట్రీని కూడా మూడేళ్లుగా ఏ దేవుడో డిలే చేస్తున్నట్లుగానే ఉంది! ‘వచ్చేస్తున్నారు.. వచ్చేస్తున్నారు’ అని ఆశ. ‘ఇప్పుడే కాదు’ అని రజనీ అనగానే నిరాశ. ఇరవై ఏళ్ల నుండీ రజనీ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాడులో ఊహలు సాగుతున్నా, అభిమానుల ఆశలు చిగురించింది మాత్రం 2014 ఎండింగ్లో రజనీ బర్త్ డేకి ‘లింగా’ రిలీజ్ అయినప్పుడే. ‘లింగా’లోడ్యామ్కాంట్రాక్టర్ కుట్రల నుండి ఊరిని కాపాడే క్యారెక్టర్ రజనీది. సినిమాలో జనం తరఫున ఆయన ఏ డైలాగ్ కొట్టినా, అది పొలిటికల్ డైలాగే అనిపించింది ఆడియన్స్‌కి. అందుకే పాలిటిక్స్‌లోకి వచ్చేస్తాడనుకున్నారు. రజనీ బర్త్‌డే, రజనీ పొలిటికల్ ఎంట్రీ.. ఈ రెండూ కాకుండా, రజనీ అభిమానులకు మూడో పెద్ద పండుగ రజనీ సినిమాల ‘ఫస్ట్ లుక్’ రిలీజ్. ఈ ఏడాదైతే, పండుగలో పండుగగా ఆయన పుట్టిన రోజే కొత్త పిక్చర్ ‘కాలా’ ఒరిజినల్ లుక్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ సంతోషానికి పగ్గాల్లేవు. తలైవర్ రగ్డ్ లుక్‌తో ఉన్నాడు. గ్రీజీ బ్లాక్ షర్ట్, సన్ గ్లాసెస్, లోపల యాంగ్రీ ఐస్, చక్కగా ట్రిమ్ చేసిన తెల్లటి గడ్డం, వెనక్కి దువ్విన హెయిర్ స్టయిల్.. టోటల్‌గా గ్యాంగ్‌స్టర్ లుక్. ఈ లుక్‌కి రజనీ ఏ డైలాగ్ కొడతారు? తమిళనాడు ఇప్పుడు వెయిటింగ్. టీజర్ రిలీజ్ అయితే కానీ యూట్యూబ్ భళ్లుమనదు. ‘‘హియర్ యు గో!! ది కింగ్ ఆఫ్ స్టయిల్. అవర్ సూపర్ స్టార్స్ ‘కాలా’ సెకండ్ లుక్’’.ఒరిజినల్ లుక్‌ను విడుదల చేస్తూ రజనీ అల్లుడు ధనుష్ పెట్టిన ట్వీట్ ఇది. అయితే ఇది ఒరిజినల్ లుక్కే కానీ, ‘కాలా’ ఫస్ట్ లుక్ కాదు. సెకండ్ లుక్. ఫస్ట్ లుక్‌లో లైట్ కలర్ పంచె, బ్లాక్ లాల్చీతో కాలు మీద కాలు వేసుకుని ఒక వెహికిల్ బానెట్ మీద నవ్వులు చిందిస్తూ కూర్చొనిఉంటాడు. అది మే నెలలో విడుదలైంది. తమిళనాడు నుంచి ముంబైకి ఎస్కేప్ అయి, అక్కడి ధారవి ప్రాంతంలోని మురికివాడలో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వ్యక్తి లుక్ అది. ఇప్పుడీ సెకండ్ లుక్ అసలు రూపం. స్పాట్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ స్వరూపం. రజనీకి ఇది 67వ బర్త్‌డే. ‘కాలా’ రజనీ 164వ మూవీ. లాస్ట్ ఇయర్ ‘కబాలి’లో కూడా రజనీ దాదాపు ఇదే లుక్‌తో కనిపించారు. అందులోనూ గ్యాంగ్‌స్టరే కాబట్టి పోలికలు కనిపిస్తాయి. ‘కబాలి’ ఫస్ట్ లుక్ ఒక సెన్సేషన్. రజనీ అప్పియరెన్స్ అదిరిపోతుంది. బ్యాక్ గ్రౌండ్లో ‘నిరుప్పుడా’ అని వినిపించగానే.. యూత్ ‘ఓ’ అంటూ లేచింది. నిప్పుల మీదైనా సరే, ఉల్లాసంగా నడిపించేంత కిక్ అది. వైట్ షర్ట్, పైన గ్రే కోట్, సూటు, బూటుతో ఎంట్రీ ఇస్తాడు రజనీ. సేమ్ తెల్లగడ్డం, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ‘ఎవడ్రా ఆ కబాలి. పిలవండ్రా వాణ్ణి’ అని విలన్ అనగానే.. ఇమీడియెట్ షాట్లో రజనీ తన స్టెయిల్లో హా.. హా.. హా.. అని నవ్వుతాడు. ఆ చిన్న లుక్‌తో, ఆ చిన్న డైలాగ్ డెలివరీతో కబాలిలో రజనీ లైఫ్ సైజ్ క్యారెక్టర్ చాలా సింపుల్‌గా ఎస్టాబ్లిష్ అయింది. రజనీ స్టార్ యాక్టర్. ‘పోన్లే ఉత్సాహపడుతున్నారు’ అని అప్పుడప్పుడు ఆయన కొత్త కుర్రాళ్లకు తనని డైరెక్ట్ చేసే చాన్స్ ఇస్తుంటారు కానీ, రజనీతో సినిమా తీసేవాళ్లంతా దాదాపుగా స్టార్ డైరెక్టర్లు, స్టార్ నిర్మాతలే. రజనీకి ఓ స్టెయిల్ ఉంది. అది తగ్గకుండా తమ ‘స్టెయిల్ ఆఫ్ మేకింగ్’ని చూపించాలి. రజనీకి ఓ ఇమేజ్ ఉంది. దాన్ని నిలబెడుతూనే, తమను నిలబెట్టుకోవాలి. ఇంత జాగ్రత్తగా, ఇంత భారీగా రజనీతో సినిమా తయారౌతున్నప్పుడు ఆయన ఫ్యాన్స్ ఇంకెంత సూక్ష్మంగా మూవీ డెవలప్మెంట్స్ కోసం చూస్తుంటారు. ఫస్ట్ అసలు రజనీ లుక్ ఎలా ఉందో చూడాలని అరాటపడతారు. వారి ఆరాటాన్ని తీర్చడానికే ‘ఫస్ట్ లుక్’ అనే ఒరవడి మొదలైంది. ‘ఇదిగో రజనీ ఈ కొత్త సినిమాలో ఇలా ఉంటాడు అని పోస్టరో, టీజరో రిలీజ్ చెయ్యాలంటే.. సినిమాలో రజనీ క్యారెక్టర్‌లోని క్రీమ్‌ని బయటికి తియ్యాలి. అలా తియ్యడం.. ఇంకో సినిమా తియ్యడమే! తెలుగులో రజనీ తొలి సినిమా అంతులేని కథ. 1976లో వచ్చింది. మనకు గుర్తొచ్చే రజనీ కమర్షియల్ హిట్ మూవీ ‘బాషా’. 1995లో వచ్చింది. ఆ రెండు సినిమాల మధ్య ఇరవై ఏళ్ల వ్యవధిలో రజనీ నటించిన ఏ సినిమాకూ ఫస్ట్ లుక్ ట్రెండ్ లేదు. ‘బాషా’కు ముందు వరకు కథే రజనీని నడిపించింది. ‘బాషా’ చిత్రం నుంచి రజనీయే సినిమాను నడిపించే శకం మొదలైంది. అందుకే ఆయన సినిమాలకు ఫస్ట్ లుక్ మస్ట్ అయింది. బాషా తర్వాత పెదరాయుడు, ముత్తు, అరుణాచలం, నరసింహ, బాబా, చంద్రముఖి, శివాజీ, రోబో, లింగా, కబాలీ.. ఇప్పుడు ‘కాలా’.. ఫస్ట్ లుక్‌తోనే బయటికి వచ్చాయి. ‘అంతులేని కథ’ టైమ్‌కి రజనీకి సూపర్‌స్టార్ అనే ఇమేజ్ లేదు. కానీ కథలోని క్యారెక్టర్.. ఇప్పటి ఫస్ట్ లుక్లా అప్పటి ప్రేక్షకులకు రజనీపై ఫస్ట్ ఇంప్రెషన్ని ఇచ్చింది. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..’ అని పాడతాడు రజనీకాంత్. బాధ్యత లేని అన్న లుక్ అది. తర్వాత్తర్వాత ‘దళపతి’లో సూర్యగా పేదవాడల లీడర్ లుక్. ‘ముత్తు’లో కైండ్ హార్ట్ లుక్. ‘అరుణాచలం’లో కోటీశ్వరుడి వారసుడి లుక్. ‘నరసింహ’లో బాధ్యత ఉన్న కొడుకు లుక్. ‘బాబా’లో దైవాంశ సంభూతుడి లుక్. ‘చంద్రముఖి’లో సైకియాట్రిస్ట్ లుక్. ‘శివాజీ’లో అక్రమార్కులపై విక్రమార్కుడి లుక్. ‘రోబో’లో యంత్రుడి లుక్. అసలైతే రోబో నుంచే క్లియర్ కట్‌గా ఫస్ట్ లుక్‌లు ఎంటర్ అయ్యాయి. లేటెస్ట్గా 2.ఓ, కాలా.. రజనీ కొత్త సినిమాలు. 2018లో విడుదల అవుతున్నాయి. వాటి ఫస్ట్ లుక్‌లు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఇక స్క్రీన్ లుక్కే మిగిలింది. ఇంకో లుక్ కూడా.రజనీ పొలిటికల్ ఎంట్రీ లుక్! -
వన్ అండ్ ఓన్లీ కాలా
ఫొటోలో కళ్లను కళ్లద్దాలు కవర్ చేస్తున్నాయి కానీ ఆ కళ్లలో మాత్రం కసి ఉందన్న విషయం ఫేస్‌లో ఉన్న కోపం చెప్తోంది. మరి ఆ కోపం, కసి ఎందుకు? ఎవరిపై అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే. ‘కబాలి’లో స్టైలిష్‌గా చూపించిన రంజిత్. పా దర్శకత్వంలో మళ్లీ సూపర్ స్టార్ రజనీ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ కాలా’. మంగళవారం రజనీకాంత్ (67) బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన అల్లుడు, హీరో, దర్శక–నిర్మాత ధనుష్ ‘కాలా’ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘మా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కాలా’ సెకండ్ లుక్. హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్. వన్ అండ్ ఓన్లీ ‘కాలా’’ అని ధనుష్ పేర్కొన్నారు. మరోవైపు రాజకీయల్లో రజనీ రాక గురించిన ఎనౌన్స్మెంట్ మంగళవారం వస్తుందని ఊహించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘కాలా’ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. -
రజనీతో కలసి పనిచేయడానికి సిద్ధమే
తమిళసినిమా (చెన్నై): సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలసి పనిచేయడానికి తాను సిద్ధమేనని సినీ నటుడు కమలహాసన్ అన్నారు. చెన్నైలో కమలహాసన్ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి రాజకీయ సమావేశం సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పారు. నిజానికి తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అదే విధంగా బీజేపీ తదితర పార్టీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు భావించడం సరికాదన్నారు. రజనీకాంత్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నారని రజనీ, తానూ మంచి మిత్రులమని చెప్పారు. ఇద్దరి రాజకీయపరమైన సిద్ధాంతాలు, అభిప్రాయాలు కలిస్తే రజనీకాంత్‌తో కలసి పని చేయడానికి తాను సిద్ధమేనని కమల్ స్పష్టం చేశారు. -
కుదిరితే కొన్ని చిత్రాలు.. రొమాన్స్ సీన్స్ !
చెన్నై: అంతేనా ఎమీ? కుదిరితే కొన్ని చిత్రాలు, అందులో మరికొన్ని రొమాన్స్ సీన్స్ అందించే అవకాశం ఉండదా? ఇది ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ గురించి అభిమానుల అభిప్రాయం. ఇంతకీ ఏమిటీ ఎమీ గోల అనేగా మీ ఆసక్తి. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన నటి ఎమీజాక్సన్. ఆ చిత్రం ఒక్కటే ఈ అమ్మడికి సరైన సక్సెస్. ఆ తర్వాత బహుళ ప్రాచుర్యం పొందిన చిత్రం ‘ఐ’.. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ ఆదరణే అందుకుంది. అయితే ఆ చిత్రంలో హద్దుల అంచుల వరకూ అందాలను ఆరబోసి అభిమానులను ఖుషీ పరిచింది. అందుకే ఎమీ కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు కోలీవుడ్‌నే నమ్ముకుని ఇక్కడే మక్కాం పెట్టింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కోసం రజనీ సహా చిత్ర వర్గాలు, సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎమీ కూడా 2.ఓ చిత్రం అందించే విజయం కోసం ఎదురు చూస్తోందని అనుకుంటున్నారు. నిజమే ఇదివరకూ ఆమె అలాంటి స్టేట్మెంట్ ఒకటి చేసింది. ఈ చిత్రం విజయం ఎమీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ జాణకు చేతిలో ఏ భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. ఇవేవీ పట్టించుకోకుండా హాలీవుడ్ సూపర్ గర్ల్ సిరీస్‌లో నటించడానికి అమెరికాలోని లాస్ఏంజెల్స్కు పరిగెత్తింది. అంత వరకూ బాగానే ఉంది. ఈ అమ్మడు ఇక 2018 వరకూ ఇదే నా ఇల్లు అన్ని ట్విట్టర్లో పోస్టు చేసి ఇండియన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో అంతేనా కుదిరినప్పుడైనా కోలీవుడ్‌లో కొన్ని చిత్రాలు లేదా సింగిల్ సాంగ్స్‌లో రొమాన్స్ చేసే అవకాశం లేదా అని ఎమీ అభిమానులు ట్విట్టర్లో అడుగుతున్నారు. మరి అభిమానుల కోసం అయినా ఎమీ మనసు మార్చుకుంటుందో.. లేదో చూడాలి. -
తలైవాకు పోటీగా తలైవి?
సాక్షి, చెన్నై: తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయనతార భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. కోలీవుడ్‌లో తలైవాగా చాలా మంది ఎదిగారు. అలా ప్రస్తుతం తలైవాగా అభిమానులు తలకెక్కించుకుంటున్న హీరో రజనీకాంత్. ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఆశతో నిరీక్షిస్తున్నారు. అయితే అనూహ్యంగా విశ్వనటుడు దూసుకొచ్చారు. రజనీకాంత్ కూడా తన పుట్టిన రోజు(డిసెంబర్12)న తన రాజకీయ రంగప్రవేశం గురించి స్పష్టమైన ప్రకటన చేస్తారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ప్రచార విషయాలు జగమెరిగిన సత్యమే. లెడీ సూపర్‌స్టార్‌గా నయన.. ప్రస్తుతం కొత్తగా తలైవి పేరు వేలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు లెడీ సూపర్‌స్టార్ అంటే విజయశాంతినే. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత నటనకు దూరం ఉండడంతో మరొకరి కోసం ఆ బిరుదు ఎదురు చూస్తోంది. చాలా కాలం తర్వాత హీరోయిన్ నయనతార అభిమానులతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా నటించిన అరమ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అభిమానులు తలైవిగా పిలుస్తున్నారు.. ఈ చిత్రంలో కలెక్టర్‌గా నయనతార పాత్ర పోషణ విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సంతోషంలో థియేటర్లను విజిట్ చేస్తున్న నయనతారను అభిమానులు తలైవి అంటూ పేర్కొనడం విశేషం. తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయన భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న సామెత గుర్తుకొస్తోంది కదూ. కాగా అరమ్ సక్సెస్ బాటలో పయనించడంతో ఆ చిత్ర నిర్మాత అరమ్కు సీక్వెల్ నిర్మిస్తానని వెల్లడించారు. -
నా వ్యాఖ్యలు కరెక్టే!
చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సమర్థించుకున్నారు. ప్రధాని మోదీ నాకంటే పెద్ద నటుడు.. అందులో సందేహం లేదని ఆయన మరోసారి చెప్పారు. ప్రధాని మోదీ గురించే కాకుండా కమల్ హాసన్, రజనీకాంత్లపైనా ఆయన స్పందించారు. కమల్, రజనీకాంత్లకు సినిమాలు, నటన పరంగా పెద్ద అభిమానిని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. అయితే వారు పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి దిగితే మాత్రం వారికి ఓటు వేయనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పట్లో తనకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. అయితే వర్తమాన రాజకీయాలు, ఇతర అంశాలపై నా భావాలను ప్రకటిస్తూనే ఉంటానని తెలిపారు. మెర్శిల్ వివాదాల నేపథ్యంలో.. విశాల్ ఇంటిపై జరిగిన ఐటీ దాడికి బీజేపీ సంబంధలేదని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం విశేషం. -
20 కోట్లు తగ్గించారు!
విడుదలకు ముందే హిందీలో సెంచరీ చేసేయాలని రజనీకాంత్ ‘2.0’ నిర్మాతలు (లైకా ప్రొడక్షన్స్ సంస్థ) చాలా ఆశపడ్డారు! కానీ, డక్‌వర్త్ లూయిస్ సిస్టమ్ ప్రకారం మీ సినిమాకు సెంచరీ కష్టమంటూ నిర్మాతల ఆశలపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నీళ్లు చల్లారట. దాంతో సెంచరీకు 20 తక్కువతోనే సరి పెట్టుకోవల్సి వచ్చిందట! అసలు మేటర్ ఏంటంటే... రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న టెక్నో థ్రిల్లర్ ‘2.0’. ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 100 కోట్లకు రూపాయి తక్కువ అయితే ఇచ్చేది లేదంటూ నిర్మాతలు కూర్చున్నారట! ‘రోబో’ హిందీ వెర్షన్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? రూ.18 నుంచి 20 కోట్ల మధ్య. అలాంటప్పుడు సీక్వెల్‌కు 100 కోట్లు ఎలా ఇస్తారనే డౌట్ రావొచ్చు. ఇందులో హిందీ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు కదా. పైగా, ‘బాహుబలి’తో హిందీలో డబ్బింగ్ సినిమాల మార్కెట్ పెరిగిందనే విషయాన్ని గుర్తు చేశారట! రేటు విషయమై నిర్మాణ సంస్థకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పలుమార్లు డిస్కషన్స్ జరిగాయి. చివరకు, ‘2.0’ హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ డీల్ 80 కోట్లకు కుదిరిందట! ఇప్పటికి 80తో సరిపెట్టుకున్నా... విడుదల తర్వాత ‘2.0’ సెంచరీ చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో అమీ జాక్సన్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
రజనీకి భార్యగా ఈశ్వరీరావు?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కాలా. ఈ చిత్రం ఆరంభానికి ముందు నుంచే చాలా ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటి ప్రచారం అవుతూ చిత్ర హైప్‌ను పెంచేస్తున్నాయి. కబాలి చిత్రం తరువాత రజనీకాంత్ మరోసారి డాన్ పాత్రలో నటిస్తున్న చిత్రం కాలా. ఆయన అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. కాగా ఇందులో రజకాంత్కు జంటగా బాలీవుడ్ బ్యూటీ హ్యూమ ఖురేషి నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరో కీలక పాత్రలో అంజిలీపటేల్ నటిస్తున్నారు. కాగా ప్రముఖ హిందీ నటుడు నానాపటేకర్ రాజకీయనాయకుడిగా ప్రధాన పాత్ర పోషించనున్నారని, అదే విధంగా మరో బాలీవుడ్ నటుడు పంకజ్ తివారి పోలీస్ అధికారిగా నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే నటుడు సముద్రకని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ భార్యగా నటి ఈశ్వరీరావు నటించనున్నట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈశ్వరిరావు 1990 ప్రాంతంలో కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో రాణించారన్నది గమనార్హం. దీంతో రజనీకాంత్ కాలాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక ప్రేమలో విఫలమై నటి ఈశ్వరిరావును పెళ్లి చేసుకుంటారా? హ్యూమఖురేషీ రజనీకాంత్ ప్రేయసిగా నటిస్తున్నారా? అదీగాక రజనీ చిన్న వయసు పాత్రలో ధనుష్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు జంటగా హ్యూమఖరేషీ నటిస్తున్నారా? లాంటి పలు సందేహాలు కాలా చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి. వీటి గురించి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. ముంబైలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చి కాలా చిత్ర యూనిట్ ఈ నెల 24 నుంచి చెన్నైలో రెండో షెడ్యూల్‌ను మొదలెట్టడానికి సిద్ధం అవుతున్నారు. -
తారలు.. పారితోషికాలు
సినిమా అన్ని రంగాల మాదిరిగానే వ్యాపార రంగమే. అయితే ఇతర రంగాల్లా పెట్టుబడికి పెద్దగా గ్యారెంటీ లేని రంగం. ఇక్కడ నిర్మాతలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. కొడితే లక్కు, లేకుంటే కిక్కు కూడా ఉండదు. అయితే చిత్రాల్లో నటించే తారలకు మాత్రం లక్కుంటే యమ కిక్కే. వారికి మొదట ఒక్క అవకాశం, ఆ తరువాత ఒకే ఒక్క విజయం అంతే చాలు. ఆ సక్సెస్ చూపిస్తూ మొదట పెంచుకునేది పారితోషికాలే. అలా తారల పారితోషికాలు ఇవాళ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం టాప్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న తారల పారితోషికాలెంతన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుడికి ఉంటుంది. తారల పారితోషికాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి హక్కులకు గాను వారికి చేతికందుతు న్న మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అలాంటి కొందరు టాప్ తారల పారితోషికాల వివరాలివి. ముందుగా సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్‌తోనే మొదలెడదాం. 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసి కాలా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న రజనీ తాజా పారితోషికం రూ.60కోట్లు, విజయ్, అజిత్‌లు రూ.48కోట్ల నుంచి రూ.50కోట్లు, సూర్య రూ.38కో ట్లు, విక్రమ్ రూ.20 కోట్లు, ధనుష్ రూ.15 కోట్లు, శివకార్తికేయన్ రూ.15కోట్లు, జయంరవి రూ.10 కోట్లు, శింబు రూ.10 కోట్లు, సంతానం రూ.8కోట్లు, విజయ్‌సేతుపతి రూ.6కోట్లు, ఇక తారల్లో అగ్ర స్థానం అనుష్కదేనట. ఈ స్వీటీ రూ.5 కోట్లు, నయనతార రూ.4కోట్లు, శ్రుతీహాసన్ రూ.2కోట్లు, కాజల్‌అగర్వాల్, సమంతలు రూ.రెండు కోట్లు, త్రిష రూ.ఒక కోటి పారితోషికాలు పుచ్చుకుంటున్నారట. అయితే ఈ సంఖ్య అధికారికంగా ప్రకటించినది కాదు. కోలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న బేస్‌లెస్ లెక్కలే అన్నది గమనార్హం. అయితే పైన చెప్పిన తారలు ఇంచు మించు అంత పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారన్నది వాస్తవమే. ఇక ఈ విషయంలో వారి వెర్షన్ వేరేలా ఉంటుందని వేరే చెప్పాలా! -
రజనీ సినిమాలో విద్యాబాలన్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటి విద్యాబాలన్ నటించనున్నారు. ‘కబాలి’ చిత్రం తర్వాత మళ్లీ రంజిత్ పా దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్‌బార్ ఫిలిమ్స్ సంస్థ రూపొందిస్తోంది. మే లో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనున్నట్టు సమాచారం. దీని గురించి విద్యాబాలన్‌తో చిత్రబృందం చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. కబాలి చిత్రంలో మొదట్లో రజనీకి జంటగా నటించేందుకు విద్యాబాలన్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే విద్యబాలన్ మరో ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో చిత్ర అవవకాశం రాధికా అప్టేను వరించింది. ప్రస్తుతం మళ్లీ రజనీతో నటించే అవకాశం విద్యాబాలన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రంలోనూ రజనీ వృద్ధ గెటప్‌లో నటించనున్నారని సమాచారం. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రజనీకాంత్
-
హీరో భార్యకు వెన్నులో వణుకు..
నిప్పుకణికల్లా రగిలే కళ్లు, పెద్దపెద్ద గోర్లు, భయానికే భయం పుట్టించే ఆకారంతో (రోబో)2.0లో విలన్ గా కనిపిస్తోన్న అక్షయ్ కుమార్ గెటప్ చూసి ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా బెదిరిపోయిందట! సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొంతుతోన్న రోబో 2.0కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆదివారం విడుదలైంది. రజనీ వశీకర్ పాత్రలో కొనసాగుతుండగా, అక్షయ్ ‘క్రౌమ్యాన్’గా తలపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఫస్ట్ లుక్‌తో రెట్టింపయ్యాయి. 2.0లో రజనీ, అక్షయ్ ల గెటప్ లపై సోషల్ మీడియాలో ఎడతెగని చర్చలు జరుగుతుండగానే అక్షయ్ భార్య ట్వింకిల్ ‘15 ఏళ్ల తర్వాత కూడా మా ఆయన నా వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు’ అని ట్విట్టర్ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ పాత్ర పురాణాల్లోని రాక్షసుడిలా ఉందని ఆమె పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2017 దీపావళికి (త్రీడీలో) విడుదల చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన ఫస్ట్ లుక్ వేడుకల్లో (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహ రించారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్, హీరోయిన్ అమీ జాక్సన్లతో పాటు చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. (అక్షయ్‌కుమారే ‘2.0’ హీరో - రజనీకాంత్) Mr K after 15 years you still manage to send shivers down my spine :) #savage https://t.co/UuiHJOS2Jc — Twinkle Khanna (@mrsfunnybones) 21 November 2016 -
వేలానికి కబాలి కోటు, కారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తూ రజనీ కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్‌ను మరింత ఉపయోగించుకోవాలని భావిస్తున్న చిత్రయూనిట్ కొత్త ప్లాన్ చేస్తోంది. కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ వినియోగించిన కారుతో పాటు ఆయన వేసుకున్న దుస్తులను కూడా వేలానికి ఉంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వందల కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన కబాలి.. వేలం ద్వారా మరింత భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. రజనీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు వేలంలో పాల్గొంటారని.. అందుకు తగని ఏర్పాట్లు చేసే పనిలో ఉంది చిత్రయూనిట్. -
కబాలి కొత్త పోస్టర్ అదిరింది
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ లో వేగం పెంచింది. ఇప్పటికే నిర్మాత అఫీషియల్ గా సినిమా డేట్ ఎనౌన్స్ చేయగా.. సెన్సార్ సభ్యులనుంచి కూడా సినిమా సూపర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలను మరింత పెంచే స్థాయిలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రిలీజ్ డేట్ తో పాటు ఉన్న ఈ పోస్టర్ లో రజనీ గాయలతో కనిపిస్తున్నాడు. సాధారణంగా రజనీ సినిమా అంటే వన్ మేన్ షోలా సాగుతుంది. హీరోయిన్ తో పాటు ఇతర పాత్రధారులెవరికి పెద్దగా గుర్తింపు రాదు కానీ కబాలి విషయంలో మాత్రం హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లోనూ రజనీ హృదయంలో రాధికా ఆప్టే ఉన్నట్టుగా చూపించారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ, రాధికల మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కబాలి రిలీజ్ కు ముందే 200 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న కబాలి రికార్డ్ స్థాయిలో 3500 థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. -
కబాలి రిలీజ్ డేట్ వచ్చేసింది
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి విడుదలపై సందిగ్ధత తొలగిపోయింది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు నమోదు చేసిన కబాలి రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్ లు సృష్టించటం కాయం అంటున్నారు ఫ్యాన్స్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా సూచించకపోవటం విశేషం. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాలం, హిందీలలోనూ ఒకేసారి రిలీజ్ అవుతున్న కబాలి మలయ్ లాంటి విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. కొచ్చాడయాన్, లింగా లాంటి భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. #Kabali will be releasing worldwide on 22 July 2016 !! We couldn't be more excited @superstarrajini @beemji :) pic.twitter.com/HOll88EzuU — Kalaippuli S Thanu (@theVcreations) 11 July 2016 -
'ఆ ఫ్లైట్ డిజైనింగ్‌కు నెల రోజులు పట్టింది'
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలి. ఈ సినిమాకు అఫీషియల్ ఎయిర్‌లైన్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్ ఏసియా ఇండియా, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏసియాలోనే తొలిసారిగా ఓ పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సినిమా పోస్టర్లతో డిజైన్ చేయించింది. ఈ శుక్రవారం నుంచి ఈ కబాలి ఫ్లైట్ గగనవీధుల్లో షికారు ప్రారంభిస్తున్న సందర్భంగా.. ఎయిర్ ఏసియా ప్రతినిధి, ఫ్లైట్ డిజైనింగ్ వెనుక కష్టాలను వివరించాడు. ఫ్లైట్‌పై కబాలి పోస్టర్‌ను ఏర్పాటుచేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టినట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ ఫ్లైట్ బెంగళూరు, న్యూ డిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు సేవలందించనుంది. అంతేకాదు కబాలి సినిమా రిలీజ్ తరువాత కూడా ఈ స్పెషల్ ఫ్లైట్ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. మలేషియాలో ఆశ్రయం పొందుతున్న శరణార్థుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ కాంత్ వయసు మళ్లిన డాన్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి సినిమాను ఈ నెల రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
కబాలి టీంలోకి మలయాళ సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్‌తో పాటు యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న కబాలి సినిమాపై మాలివుడ్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా కేరళ రైట్స్‌ను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ రైట్స్ తీసుకోవటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు కబాలి యూనిట్. రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. మలేషియాలో స్థిర పడిన శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ వయసు మళ్లిన డాన్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి జూలై రెండో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఇండియాలో తొలి సినిమాగా 'కబాలీ'!
లేటు వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఘాటుగా మాయ చేస్తున్నాడు. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, నిరుప్పుడా సాంగ్, ఫస్ట్ పోస్టర్ లతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు కోట్ల ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్లను సూపర్ స్టార్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నాడు. చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో నిండిపోతున్నాయి. తాజాగా విమానాలపై సినిమా పోస్టర్లు అంటించి ప్రచారం చేయడంతో 'కబాలీ' మేనియా ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఏయిర్ ఏషియా విమానాలపై కబాలీ పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు అంతర్జాతీయ విమానాలకు కబాలి పోస్టర్స్ వేశారు. గతంలో దేశంలో ఏ చిత్రానికి లేని తరహాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న తొలి ఇండియన్ మూవీగా కబాలీ సెన్సెషన్ గా నిలువనుంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్క సినిమాకు మాత్రమే ఈ తరహా ఆదరణతో కూడిన ప్రచారం లభించింది. ఎయిర్ న్యూజీలాండ్ విమానసంస్థ వారు 'ద హాబిట్' మూవీకి మాత్రమే విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేశారు. రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలన్న ప్రయత్నంలో భాగంగా రజనీ పోస్టర్లతో కబాలీ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు. -
రజనీ అలా కనిపించేది 20 నిమిషాలే..
ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా కబాలి. రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డ్‌లు క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు తగ్గట్టుగానే చిత్రయూనిట్ భారత్‌లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే కబాలి చిత్రానికి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రజనీ లుక్. వయసైన డాన్ పాత్రలో రజనీ లుక్కు మంచి స్పందన వచ్చింది. భాషా సినిమా తరువాత రజనీ డాన్‌గా నటిస్తుండం కూడా సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వటానికి కారణం అయ్యింది. అయితే కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. కబాలి సినిమాలో రజనీ కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే డాన్ కనిపిస్తాడట. మలేషియాలో ఉంటున్న శరణార్థుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ ఎక్కువగా భాగం యంగ్‌గానే కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌లో వచ్చే కీలక సన్నివేశాల్లో మాత్రం రజనీ డాన్ లుక్‌లో కనిపిస్తాడట. మరి రజనీని డాన్ గా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. -
కబాలి లిస్ట్‌లో మరో రికార్డ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రికార్డ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో వేగం పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు భారీగా ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఓవర్సీస్లో రజనీ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో పారిస్‌లోని ఓ ప్రస్టీజియస్ స్క్రీన్ మీద కబాలి సినిమా ప్రదర్శింపబడుతోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ప్రదర్శింపబడిన ది లె గ్రాండ్ రెక్స్ హాల్లో కబాలి సినిమాను తొలి రోజే ప్రదర్శిస్తున్నారు. దాదాపు 2800 మంది ఒకేసారి చూసే ఏర్పాటు ఉన్న ఈ థియేటర్లో భారతీయ చిత్రాలు రిలీజ్ కావటం చాలా అరుదు. అలాంటి అరుదైన రికార్డ్ ఇప్పుడు కబాలి సొంతమైంది. -
రోబో 2 రిలీజ్ మరింత ఆలస్యం
ఐ సినిమా ఫెయిల్యూర్ తరువాత సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రోబో 2. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో సినిమాకు సీక్వల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ రజనీ సరసన ఆడిపాడనుంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2017 సమ్మర్ నాటికి ఆడియన్స్ ముందుకు వస్తుందని భావించారు. అయితే భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందనున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అందుకే హడావిడిగా రిలీజ్ చేసేకన్నా, కాస్త సమయం తీసుకొని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సమ్మర్లో బాహుబలి పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ పరంగా కూడా రోబో వాయిదా వేయటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు యూనిట్ సభ్యులు. -
విమానాలకు కబాలి పోస్టర్స్
రజనీ కాంత్.. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేస్తున్నాడు. ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్లను కొల్లగొట్టిన సూపర్ స్టార్, తాజాగా మరో రికార్డ్‌కు రెడీ అవుతున్నాడు. రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రచారం విషయంలోనూ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో అలంకరించేస్తున్నారు. అది కూడా చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా విమానాలకే కబాలి పోస్టర్స్ వేస్తున్నారట. రెండు డొమాస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్‌కు కబాలి పోస్టర్స్ వేస్తున్నారు. గతంలో హాలీవుడ్ సినిమా హాబిట్ కోసం ఈ తరహా ప్రచారం చేయగా, ఇండియాలో మాత్రం కబాలినే తొలిసారిగా ఈ రికార్డ్ సొంతం చేసుకోనుంది. -
కోట్లలో మోసం..? చిక్కుల్లో రజనీ, కమల్ చిత్రాలు!
చెన్నై: తమిళ సినీ రంగంలో దిగ్గజాలతో సినిమాలను నిర్మిస్తున్న లైకా సంస్థ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలు కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై తమిళ పత్రికల్లో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫ్రాన్స్ పోలీసులు ఆ సంస్థకు చెందిన ప్రధాన నిర్వాహకుడి సహా మొత్తం 19 మందిని అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తపాలాశాఖ ద్వారా కోట్లాది రూపాయలను లైకా సంస్థ రహస్య చిరునామాలకు పంపిందనీ, ఆ డబ్బును అక్కడి నుంచి జర్మనీకి తరలించే ప్రయత్నం జరిగిందని తెలిసింది. ఈ విషయంపై యూరప్ దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ కు చెందిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, లైకా సంస్థ గతంలో శ్రీలంక కేంద్రంగా టెలికాం వ్యాపారాలను నడుపుతున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంది. సంస్థ యజమాని అలీరాజా సుభాష్ కరణ్ కు బ్రిటన్, ఫ్రాన్స్ లలో సిమ్ కార్డుల వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కార్యాలయాలను కలిగివుంది. సినీరంగంలో నిర్మాణ సంస్థగా అడుగుపెట్టిన లైకా.. విజయ్ తో కత్తి చిత్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత రజనీకాంత్ తో 2.0, కమల్ హాసన్ తో శభాష్ నాయుడు చిత్రాలకు నిర్మాణసంస్థగా వ్యవహరిస్తోంది. విదేశాలకు అక్రమంగా రూ.129 కోట్లను తరలించారని, ఈ విషయం తెలుసుకున్న ఫ్రాన్స్ పోలీసులు సంస్థ ప్రధాన నిర్వహకుడిని అరెస్టు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న రజనీ, కమల్ ల చిత్రాల నిర్మాణం చిక్కుల్లో పడతాయేమోనని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే, లైకా ఈ వార్తలను ఖండించింది. తమ సంస్థ ఎలాంటి మోసానికి పాల్పడలేదని ప్రకటన వెలువరించింది. సంస్థపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
కబాలిపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్లానింగ్ అభిమానులకు మాత్రం నిరాశే మిగులుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన కబాలి సినిమాను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలపకపోయినా.. ఇతర చిత్రాల నిర్మాతలు కన్ఫామ్ చేస్తున్నారు. సాధారణంగా రజనీ సినిమా రిలీజ్ సమయంలో మరే సినిమా రిలీజ్ చేయడానికి సాహసించరు. అయితే కబాలి రిలీజ్ అనుకుంటున్న జూలై 1న కటప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్సన్ దురైతో పాటు మరో తమిళ సినిమా జోకర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన కబాలి టీం... సుల్తాన్‌తో పోటీ వద్దని తమ సినిమాను వాయిదా వేసుకుంటున్నారట. ఎలాగూ కబాలి వాయిదా పడుతుందన్న నమ్మకంతో ఆ గ్యాప్‌ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు కోలీవుడ్ దర్శక నిర్మాతలు. -
రజనీ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త సంచలనం సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. అక్షయ్ చేస్తున్న రోల్‌కు సంబందించి కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్షయ్ రెమ్యూనరేషన్‌కు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆసియాలోనే అత్యంత పారితోషికం తీసుకుంటున్న జాబితాలో రజనీకాంత్ రెండో స్థానంలో ఉన్నాడు. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తరువాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో రజనీనే. అయితే రోబో సీక్వల్ కోసం అక్షయ్, రజనీ కన్నా ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాడట. ముందుగా ఈ సినిమాలో విలన్ రోల్‌కు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్లను సంప్రదించారు. అయితే నెగెటివ్ రోల్లో నటించటంతో పాటు భారీగా డేట్స్ ఇవ్వాల్సిరావటంతో వాళ్లు అంగీకరించలేదు. అయితే జాతీయ స్థాయిలో సినిమాకు క్రేజ్ తీసుకు వచ్చేందుకు బాలీవుడ్ స్టార్ తోనే ఆ పాత్ర చేయించాలని భావించిన రోబో యూనిట్ భారీ మొత్తం ఆఫర్ చేసి అక్షయ్‌ని ఒప్పించారట. ఎంత అన్నది తెలియక పోయినా.. ఈ సినిమాకు రజనీ కన్నా అక్షయ్ కుమారే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
కష్టాల్లో కబాలి
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేదని, ఆ తరువాత రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ అభిమానులకు రెండు షాక్‌లు ఇచ్చింది కబాలి టీం. అయితే తాజాగా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కబాలి టీంకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. గతంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన విక్రమ సింహా(కొచ్చాడయాన్) సినిమా తెలుగు రైట్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. అయితే సినిమా రిలీజ్‌కు ముందు నష్టాలు వస్తే బరిస్తామంటూ మాట ఇచ్చిన విక్రమసింహా నిర్మాతలు తరువాత వారికి ఎలాంటి సాయం చేయలేదు. రజనీకాంత్ తాజా సినిమా కబాలి తెలుగు రైట్స్‌ను షణ్ముక పిక్చర్స్ 32 కోట్లకు సొంతం చేసుకుంది. అదే స్ధాయిలో భారీగా ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అయితే రజనీ సినిమా మూలంగా గతంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తమ లెక్కలు తేల్చే వరకు కబాలి సినిమా రిలీజ్ కానివ్వమంటున్నారు. జులై 7న రిలీజ్‌కు రెడీ అవుతున్న కబాలి అనుకున్నట్టుగా తెలుగు నాట కూడా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.