ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్‌! | Original Gangsters Rajinikanth and Mohan Babu | Sakshi
Sakshi News home page

ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్‌!

Published Sat, May 22 2021 12:38 AM | Last Updated on Sat, May 22 2021 3:18 AM

Original Gangsters Rajinikanth and Mohan Babu - Sakshi

రజనీకాంత్, మోహన్‌బాబు

ప్రముఖ నటులు రజనీకాంత్, మోహన్‌బాబుల స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. రజనీకాంత్, మోహన్‌బాబు కలిసి ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చారు రజనీకాంత్‌. ఈ సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను ముగించుకుని తిరిగి చెన్నై వెళ్లడానికి ముందు తన ఆత్మీయ మిత్రుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు.

రెండు రోజుల పాటు మిత్రుడి ఇంట్లో ఉన్న రజనీ ఆ తర్వాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. కాగా రజనీ, మోహన్‌బాబు ఇద్దరూ దిగిన ఫోటోలను, ఈ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోను ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్‌’ అంటూ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశారు మంచు విష్ణు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement