మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మహదేవ శాస్త్రి గ్లింప్స్ చూశారా? | Kannappa Movie Glimpse of Mahadeva Shastri On Mohan Babu Birthday | Sakshi
Sakshi News home page

Mohan Babu: మోహన్ బాబు బర్త్‌ డే స్పెషల్.. మహదేవ శాస్త్రి గ్లింప్స్ చూశారా?

Published Wed, Mar 19 2025 6:34 PM | Last Updated on Wed, Mar 19 2025 6:53 PM

Kannappa Movie Glimpse of Mahadeva Shastri On Mohan Babu Birthday

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలువురు అగ్రతారల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్‌ కుమార్, కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)

అయితే ఈ చిత్రంలో మోహన్‌ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహదేవ శాస్త్రి పాత్రను పరిచయం చేసే సాంగ్‌ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ పాటను ఓకేసారి ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement