best friends
-
మనసు నిండిపోయింది: బెస్ట్‌ఫ్రెండ్స్‌తో సానియా మీర్జా (ఫొటోలు)
-
Happy Friendship Day 2024: బెస్ట్ ఫ్రెండ్స్‌తో మన టాలీవుడ్ హీరోస్(ఫోటోలు)
-
Happy Friendship Day 2024: పోవే..పోరా..అనుకునే టాలీవుడ్ బెస్ట్‌ఫ్రెండ్స్(ఫోటోలు)
-
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఆదిలాబాద్: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే బ్యాంక్ ఉద్యోగులు వీకెండ్లో సరదాగా గడిపేందుకు మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి హిల్‌స్టేషన్‌లోని చిక్కల్ధార ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం తెల్లవారుజామున కారులో పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకోనుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో 200 అడుగుల లోతులో పడడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు ప్రయాణిస్తుండగా నలుగురు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. స్నేహితుల మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. స్థానికులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమరావతి, పరత్వాడ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలకు చిక్కల్‌ధర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అర్లి(టి) గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోటి ఉద్యోగులు, అధికారులు సంఘటన స్థలానికి పయనం అయ్యారు. మరణంలోనూ వీడని స్నేహబంధం.. భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్, బొల్లి వైభవ్ కొన్నేళ్లుగా ప్రాణస్నేహితులుగా ఉంటున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన పొలాల అమావాస్య వేడుకల్లో సైతం ఇద్దరు కలిసి బసవన్నలను ఊరేగించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలవడం గమనార్హం. బ్యాంకు ఉద్యోగాలతో స్నేహితులుగా మారి.. వేర్వేరు జిల్లాల్లో పుట్టి పెరిగిన వీరంతా ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లాలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పడిన స్నేహంతో సరదా కోసం చేసిన వీకెండ్ ట్రిప్ విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలోని వివిధ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖల్లో ఉద్యోగం చేస్తున్న యువకులకు ఆర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్‌తో స్నేహం ఏర్పడింది. సల్మాన్ సొంతంగా వాహనాన్ని నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కాగా అర్లి(టి), భీంపూర్‌తో పాటు వివిధ బ్యాంక్ శాఖలకు అప్పుడప్పుడు జిల్లా బ్యాంకు నుంచి నగదు రవాణా కోసం ఈయన వాహనాన్ని బ్యాంకు ఉద్యోగులు అద్దెకు తీసుకునేవారు. ఈ క్రమంలో ఏర్పడిన స్నేహంతో వీరంతా కలిసి వీకెండ్ కోసం వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు వీరే.. ఆదిలాబాద్ జిల్లాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులతో పాటు అర్లి(టి)కి చెందిన మరో ఇద్దరు మహారాష్ట్రలోని చిక్కల్‌ధర ఆహ్లాదకర ప్రాంతా న్ని సందర్శించేందుకు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లారు. కారు అదుపు తప్పి చిక్కల్‌ధర లోయలో పడిపోయింది. ఈ ఘటనలో భీంపూర్ మండలం అర్లి(టి) సర్పంచ్ గొల్లి రమ – లస్మన్నల కుమారుడు వైభవ్ యాదవ్ (28), అదే గ్రామానికి చెందిన షేక్‌చాంద్ – రుక్సానా దంపతులకు మారుడు, కారు డ్రైవర్ షేక్ సల్మాన్ (31), నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొర్టికల్కు చెందిన అద్దంకి శివకృష్ణ (31), అదే జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లెపల్లివారి గూడెంకు చెందిన కోటేశ్వర్రావు (27) అనే నలుగురు మృత్యు ఒడిలోకి చేరారు. కాగా ఖమ్మం జిల్లా పొన్నెకల్కు చెందిన శ్యామ్‌రాజ్, నల్గొండలోని మిర్యాలగూడకు చెందిన యోగేష్యాదవ్, అదే జిల్లాలోని కేటపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన హరీష్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సుమన్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కాగా మృతి చెందిన శివకృష్ణ తాంసి మండలంలోని కప్పర్ల టీజీబీ శాఖలో క్యాషియర్‌గా, కోటేశ్వర్రావు భీంపూర్ మండల కేంద్రంలోని టీజీబీ శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అలాగే అర్లి(టి)కి చెందిన వైభవ్ కాటన్ కమీషన్ ఏజెంట్, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు కుమారుడి మృతిని తట్టుకోలేక కుప్పకూలిపోయారు. వారు రోధించిన తీరు పలువురిని కలిచివేసింది. రాత్రి వరకు కూడా మృతదేహాలు ఇంటికి చేరుకోలేదు. ఇదిలా ఉండగా గాయపడ్డ వారిలో శ్యామ్‌రాజ్ రెడ్డి అర్లి(టి)లో క్యాషియర్‌గా, సుమన్ జైనథ్ మండలం పెండల్ వాడలో క్యాషియర్‌గా, యోగేష్ యాదవ్, హరీష్‌లు బేల మండల కేంద్రంలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు జిల్లాకేంద్రంలో అద్దెకు ఉంటూ నిత్యం విధులకు హాజరవుతున్నారు. కష్టపడి కొలువు సాధించి కుటుంబాలకు అండగా ఉంటున్న తరుణంలో అనుకోని రీతిలో ఇద్దరు మృతిచెందడం వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. అలాగే షేక్ సల్మాన్ వాహనాన్ని కొనుగోలు చేసి తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఈ తరుణంలో కుటుంబ దిక్కు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
టాలీవుడ్లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన నటన, డ్యాన్స్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేత లేడీ పవర్ స్టార్‌గా పిలుపించుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె నటించిన విరాట పర్వం మంచి విజయం అందుకుంది. చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్ దీంతో విరాట పర్వం చిత్రం బృందం మూవీ సక్సెస్ మీట్స్, ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ చానల్‌తో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. టాలీవుడ్లో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ ఇద్దరు స్టార్ హీరోల పేర్లు చేప్పింది ఆమె. అయితే వారిద్దరు ఒకే కటుంబానికి చెందిన వారు కావడం విశేషం. కాగా అక్కినేని హీరోలు నాగచైతన్య, దగ్గుబాటి వారసుడు రానాలు పరిశ్రమలో తనకు మంచి స్నేహితులని, వారితో ఒక ఫ్యామిలీ అనే ఫిలింగ్ వస్తుందని చెప్పింది. ఒకే ఫ్యామిలీలా రానా, చైతులు తనపై కేర్ తీసుకుంటారని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. చదవండి: ఓటీటీలోకి 'విరాట పర్వం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇటీవల నాగ చైతన్య సరసన ఆమె నటించిన లవ్‌స్టోరీ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. అలాగే తాజాగా రానాతో నటించిన విరాట పర్వం కూడా మంచి విజయం సాధించింది. కాగా సాయి పల్లవి ప్రస్తుతం ‘గార్గి’ చిత్రంలో నటిస్తుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. మహిళా ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతుంది. -
వారం రోజుల్లో పెళ్లి.. ఇదేంటే.. అసలు విషయం తెలిసి
‘‘కావ్యా (పేరుమార్చడమైనది) ఒక్కసారి కళ్లు తెరువమ్మా! ఏమైందే. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా చేశావ్, నీకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే సరిపోయేది కదా!’’ సుభద్రమ్మ ఏడుస్తునే ఉంది. ‘‘నువ్వు కాసేపు మౌనంగా ఉండు’’ అంటూ భర్త రాఘవరావు సుభద్ర మీద కేకలేశాడు. కాసేపటికి కావ్య లేచి తల్లిదండ్రులని చూసి, తలదించుకుంది. ‘‘ఏమైందమ్మా! కాస్త ఆలస్యమైతే ఎంత దారుణం జరిగేది. ఉరివేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది తల్లీ’’ అనునయంగా అడిగాడు రాఘరావు. ఆ మాటలతో కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయింది. ‘‘నీకు ఇష్టమని చెప్పాకనే కదా, పెళ్లి పెట్టుకున్నది..’ సందేహంగా అడిగాడు కూతుర్ని. ‘‘నిజమే నాన్నా!’’ అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయిన కూతుర్ని చూసి, భయమేమీ లేదమ్మా ఇప్పటికైనా చెప్పు. ‘‘పెళ్లి ఆపేద్దామంటే వాళ్లకు చెప్పేస్తే. నీ చావు చూసే పెళ్లి వద్దమ్మా!’ అన్నాడు రాఘరావు. ‘‘అది కాదు నాన్న నేను ఎంతగానో నమ్మిన వంశీ (పేరుమార్చడమైనది) నన్ను టార్గెట్ చేశాడు’’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. అర్థం కాక ‘‘వంశీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదమ్మా, ఏమైంది’’ కంగారుగా అడిగాడు. కూతురు చెప్పిన విషయం వినడంతోనే రాఘవరావు కోపంతో ఉగిపోయాడు. ∙∙ కావ్య తన క్లాస్మేట్ వరుణ్(పేరు మార్చడమైనది)తో స్నేహంగా ఉండేది. బీటెక్ నాలుగేళ్లూ ఇద్దరూ చాలా క్లోజ్‌గా తిరిగారు. పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ ఒక అవగాహనతో తాము క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసుకున్నారు. రెండుమూడు నెలల వరకు ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఓ రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి, డేటింగ్ సైట్స్‌లో కావ్య వరుణ్ క్లోజ్‌గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెప్పింది. వాటిని కావ్య చూసింది. వరుణ్‌కి ఫోన్ చేసి తిట్టింది కావ్య. తనేమీ వాటిని షేర్ చేయలేదని రివర్స్ అయ్యాడు వరుణ్. ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీకి చెప్పింది. ఎలాగైనా ఆ సైట్స్ నుంచి తన ఫొటోలు డిలీట్ చేయించమని వేడుకుంది. కావ్య చెప్పినట్టు వంశీ వాటిని వివిధ సైట్స్ నుంచి తొలగించేశాడు. ‘హమ్మయ్య’ అనుకుని వంశీకి ‘థాంక్స్’ చెప్పింది. ఆరు నెలల తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. త్వరలో పెళ్లి అనుకున్నారు. భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందనుకున్న కావ్యకు పాత వీడియోలు, ఫొటోలు మళ్లీ వివిధ రకాల సైట్లలో అప్లోడ్ అయి ఉండటంతో షాకైంది. వంశీని అడిగితే పెళ్లికి ముందు తనతో గడిపితేనే, అవన్నీ తీసేస్తానని, లేదంటే సమాచారం అంతా పెళ్లికొడుక్కి చేరుతుందని బెదిరించడం మొదలుపెట్టాడు వంశీ. షాకైంది కావ్య. ‘సైట్స్ నుంచి తొలగించినట్టే తొలగించి, అవన్నీ దాచిపెట్టుకొని, పెళ్లి కుదిరే సమయానికి పాత వీడియోలను, ఫొటోలను అడ్డుపెట్టుకొని తన జీవితంతో ఆడుకుంటున్నాడ’ని అర్ధమైంది కావ్యకు. పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని భయపడి చావే శరణ్యం అనుకుంది. విషయమంతా తెలుసుకున్న రాఘరావు కూతురుని తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వంశీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వ్యక్తిగత వివరాలు గోప్యం కొందరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. చాలాసార్లు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీస్తుంటారు. ఇద్దరి మధ్య సంబంధం చెడినప్పుడు వీటిని అడ్డుగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వివిధ రకాల యాప్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లలో పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. అందుకని ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండటం అవసరం. పరువు పోతుందని పొలీసులను సంప్రదించకుండా మూడోమనిషి సాయం తీసుకుంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్ చేయాలి. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. సమస్యకూ సత్వరమే పరిష్కారం అందుతుంది. సైబర్ క్రైమ్ సమస్యలకు htps://4s4u.appolice.gov.in/ ఫోన్ నెంబర్: 90716 66667 సంప్రదించవచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ బ్లాక్ చేయకూడదు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారనగానే వెంటనే భయపడిపోతారు. వేధింపులు భరించలేక సదరు వ్యక్తి నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. ఒకసారి వేధించాలనుకున్న వ్యక్తి రకరకాల మార్గాల ద్వారా బెదిరింపులకు దిగుతాడు. డబ్బులు ఇస్తామనో, మరో విధంగానో కాంప్రమైజ్ అవుతాను అనే ధోరణి నుంచి బయపడాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడనగానే వారి డేటా, కాల్ రికార్డ్ చేసుకోవాలి. అన్ని మెసేజ్‌లను స్క్రీన్ షాట్స్ చేసి పెట్టుకోవాలి. వెంటనే http://www.cybercrime.gov.in/ నేషనల్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్!
ప్రముఖ నటులు రజనీకాంత్, మోహన్‌బాబుల స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. రజనీకాంత్, మోహన్‌బాబు కలిసి ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణను ముగించుకుని తిరిగి చెన్నై వెళ్లడానికి ముందు తన ఆత్మీయ మిత్రుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. రెండు రోజుల పాటు మిత్రుడి ఇంట్లో ఉన్న రజనీ ఆ తర్వాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. కాగా రజనీ, మోహన్‌బాబు ఇద్దరూ దిగిన ఫోటోలను, ఈ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోను ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు మంచు విష్ణు. -
ఆ స్నేహపాశం తెగిపోలేదు..
కులం, మతం అనేవి ఉంటాయని కొంచెం వయసు వచ్చాక తెలుస్తుంది. ‘మీరేవిట్లు’ అని ఎవరో అడుగుతారు. ఇంటికొచ్చి అమ్మను అడుగుతాం ‘అమ్మా.. మీరేవిట్లు అంటే ఏంటి?!’ అని. కొన్నాళ్లు ఆ కన్ఫ్యూజన్ వేధిస్తుంటుంది. అందరూ ఒకేలా ఉండకుండా ఏంటిది! అని. బెస్ట్ ఫ్రెండ్ రహీమ్ గాడు మసీదుకు వెళతాడని తెలిసినా.. ఎందుకు వాళ్లింట్లో వాళ్లు గుడికి రారు అనే సందేహం అప్పటి వరకు కేశవ్ కి వచ్చి ఉండదు. వాళ్లింటికి మసీదు దగ్గర కాబట్టి వాళ్లంతా అక్కడికి వెళ్తుంటారు అనుకుంటాడు. రహీమ్‌కీ ఇవేమీ తెలియవు. కేశవ్ గాడితో అప్పటికే అనేకసార్లు గుడికి కూడా వెళ్లి, చేతిలో కేశవ్ వాళ్ల అమ్మ పెట్టిన కొబ్బరి ముక్కను తనూ కళ్లకు అద్దుకుని తినే ఉంటాడు. పెద్దయ్యాక ఇవేవీ ఉండవు. లేకుండా చేస్తాయి సంప్రదాయాలు, ఆచారాలు. రహీమ్, కేశవ్ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. కేశవ్‌కి ఐ.ఐ.టి లో సీటు రావాలని రహీమ్ అల్లాను ప్రార్ధిస్తాడు. రహీమ్‌కి వీసా రావాలని కేశవ్ వేంకటేశ్వరుడిని వేడుకుంటాడు. మనిషి ఉన్నంతకాలం ఈ స్నేహం ఉంటుంది. ‘పెట్టె’ ను మోయడానికి కేశవ్, ‘కట్టె’ ను మోయడానికి రహీమ్ భుజం ఇస్తూనే ఉంటారు. రామ్ నరేష్ దూబే, సయ్యద్ వాహిద్ అలీ బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ మేట్స్. కాలేజ్ మేట్స్. మధ్యప్రదేశ్, సాగర్ జిల్లాలోని చతుర్భట గ్రామం వాళ్లది. అలీ లాయర్ అయ్యాడు. దూబే పురోహితుడు అయ్యాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అలీ చనిపోయినప్పుడు దూబే తన వృత్తిబాట్లను తెంచుకుని మరీ వెళ్లి అలీతో మరుభూమి వరకు నడిచాడు. ఆ స్నేహపాశం తెగిపోలేదు. ఇప్పుడివి ఆలయాలలో పూజలు జరిపించి పితృదేవతలకు తర్పణం వదిలే రోజులు. ఏటా పక్షం రోజులు ఉంటాయి. ఈ ఏడాది.. పితృదేవతలతో పాటు తన మిత్రుడికీ తర్పణం వదిలాడు దూబే!! దేవతలారా దీవించండి. -
ప్రణవ్, కల్యాణి లవ్‌లో ఉన్నారా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఆప్త మిత్రులు. ఒకరి కెరీర్ కి ఒకరు ఎంతగానో సహాయపడ్డారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శన్ కూతురు కల్యాణీ ప్రియదర్శన్ తెలుగు సినిమా ‘హలో’ ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా ప్రణవ్, కల్యాణి మలయాళంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. ఆ మధ్య ప్రణవ్, కల్యాణి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అయింది. దీంతో ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు మలయాళం ఇండస్ట్రీ లో వార్తలు మొదలయ్యాయి. ‘‘ప్రణవ్, కల్యాణి లవ్ లో ఉన్నారా? అనే ప్రశ్న మోహన్ లాల్ వరకూ వెళ్లింది. ఈ విషయం గురించి మోహన్ లాల్ మాట్లాడుతూ – ‘ప్రణవ్, కల్యాణి బెస్ట్ ఫ్రెండ్స్. నేను, ప్రియదర్శన్ ఎలానో వాళ్లిద్దరూ అలా. ఒక్క సెల్ఫీ వల్ల ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎలా ఊహించుకుంటారు? అనవసరమైన వార్తలు ప్రచారం చెయ్యొద్దు. నమ్మొద్దు’’ అని ఈ వార్తలను కొట్టిపారేశారు. మోహన్ లాల్ నటించిన ‘అరబికడలింటే సింహం: మరాక్కర్’లో ప్రణవ్, కల్యాణి కూడా నటించారు. అలానే ‘హదయమ్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. -
దోస్త్ మేరా దోస్త్
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్, బాద్షా షారుక్ ఖాన్ ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహంగా ఉంటున్నారు. ఈ మధ్య ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించడం కనిపిస్తోంది. సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’ సినిమాలో మెజీషియన్ పాత్రలో షారుక్ కనిపిస్తే, ‘జీరో’ సినిమాలో ఓ పాటలో షారుక్‌తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. తాజాగా మరోసారి సల్మాన్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారట. ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్’కి సీక్వెల్‌గా సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం ‘దబాంగ్ 3’. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో షారుక్ ఖాన్ పాత్ర కనిపిస్తుందట. ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌తో ‘దబాంగ్ 3’ షూటింగ్ నడుస్తోంది. అతిథి కాదు విలన్! షారుక్ ఖాన్ కెరీర్ స్టార్టింగ్‌లో విలన్‌గా ఆకట్టుకున్నారు. నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్స్‌లో ఆయన నటించిన ‘బాజీగర్, డర్’ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్గా అట్లీ– విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ స్పోర్ట్స్ డ్రామాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా వినిపిస్తున్నదేంటంటే ఈ సినిమాలో షారుక్ గెస్ట్ కాదట, విలన్‌గా నటిస్తారట. క్లైమాక్స్‌లో మాత్రమే కనిపించే ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉండబోతోందని సమాచారం. -
నీతో సావాసం బాగుంది
‘‘నీతో సావాసం ప్రతిరోజు ఓ సరికొత్త సాహసం చేసినట్లుగా అనిపిస్తోంది మైఖేల్’’ అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేని పొగడ్తలతో ముంచెత్తారు శ్రుతీహాసన్. మైఖేల్, శ్రుతీ ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ కోడై కూసినా వీళ్లు మాత్రం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనే తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి చెబుతున్నారు. రీసెంట్గా మైఖేల్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన శ్రుతీ – ‘‘నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో ప్రతి రోజూ చూపిస్తున్నావు. చిన్న చిన్న విషయాలకు నవ్వుకోవడాలు, చాటింగ్ చేసుకోవడం... ఎంత దూరమైనా కలసి నడవడం అన్నీ బావున్నాయి’’ అన్నారు శ్రుతీ. -
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక..
సాక్షి,హైదరాబాద్ : స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం...గోల్నాక న్యూ గంగానగర్‌కు చెందిన ఆశయ్య(85) అదే ప్రాంతానికి చెందిన వహీద్‌తో కలిసి సివిల్ కాంట్రాక్ పనులు చేసేవాడు. ఇద్దరు ప్రాణస్నేహితులు. నిత్యం గల్లీలో ఒకే చోటు కుర్చుని కబుర్లు చెప్పుకునేవారు. 15 రోజుల క్రితం వహీద్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆశయ్య మనోవేదనకు లోనయ్యాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పూడ్చిన శవం వెలికితీత..
నాగారం (తుంగతుర్తి) : ఒకే రాష్టం వారు.. 20ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉంటున్నారు. తనకు రావా ల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే.. దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టాడు. మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూర్ గ్రామానికి చెందిన నల్లగంటి సోమ య్య (40) 20ఏళ్ల క్రితం బతుకు దెరువుకోసమని చెన్నై వెళ్లి ఆటోనడుపుతూ జీవనంసాగిస్తున్నాడు. అక్కడ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మం డలం చెర్కూర్ గ్రామానికి చెందిన దొడ్ల జం గయ్య అనే వ్యక్తి చెన్నైలో వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచ యం ఏర్పడింది. 20ఏళ్లుగా స్నేహితులుగా ఉం టున్నారు. ఇద్దరు కలిసి చిట్టీల వ్యాపారం నడుపుతున్నారు. ఈ వ్యాపారాన్ని పూర్తిగా జంగయ్యనే చూ సుకుంటున్నాడు. సోమయ్య తను సంపాదించిన డబ్బులతో సొంత ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తనకు వచ్చే డబ్బులు ఇవ్వాలని జంగయ్యపై సోమయ్య ఒత్తిడి చేశాడు. దీంతో డబ్బులు ఇచ్చే ఉద్దేశంలేని జంగయ్య ఎలాగైన సోమయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నా డు. పథకం ప్రకారం ఊరిలో రైతుబంధు చెక్కు డబ్బులు, తన పొలాన్ని అమ్ముతున్నాను, డబ్బులు వస్తాయి చెప్పి చెన్నైనుంచి చెర్కూరుకు వచ్చేశాడు. కొన్ని రోజుల తరువాత సోమయ్య డబ్బు ల కోసం జంగయ్యకు ఫోన్‌చేసి డబ్బులు విష యం అడగగా చెర్కూర్ సమీపంలో ఉన్న మరో గ్రామం పెద్దపూర్‌కు వస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో సోమయ్య మే 14న చెన్నై నుంచి బయలుదేరి మే15న పెద్దపూర్‌కు చేరుకున్నాడు. అక్కడనుంచి ఇద్దరు కలిసి చెర్కూర్ వెళ్లి మద్యం సేవించారు. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జంగయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం సోమయ్యను హత్యచేశాడు. తరువాత చెర్కూర్ గ్రామానికి చెందిన తన బామ్మర్ధి జాల క్రిష్ణయ్య సహాయంతో శవాన్ని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో పూడ్చిపెట్టాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా చైన్నె వెళ్లిపోయాడు. మే14న వెళ్లిన సోమయ్య ఐదు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టారు. సోమ య్య ఆచూకీ లభిం చకపోవడంతో నాగారం పోలీస్‌స్టేషన్‌లో మే24న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సోమ య్య కాల్‌డేటా, సిగ్నల్ ప్రకారం.. జంగయ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. తానే హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. శుక్రవారం సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల పోలీ సులు మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి పూడ్చిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బతుకుదెరువు కోసం గ్రామస్తుడు దూరప్రాంతం వెళ్లి శవమై తిరిగి రావడంతో పసునూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అమలాపాల్‌కు కాజల్ విషెస్..
సాక్షి, చెన్నై: నటి అమలాపాల్‌కు కాజల్ అగర్వాల్‌కు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ విషయాన్ని నటి కాజల్‌అగర్వాలే స్వయంగా వెల్లడించింది. సంచలన నటిగా ముద్రవేసుకున్న అమలాపాల్ భర్త విజయ్‌కు విడాకులిచ్చిన తరువాత కథానాయకిగా బిజీ అయిపోయింది. చేతిలో పలు చిత్రాలు. ఇక ఆ మధ్య ఖరీదైన కారును కొని కేరళ రోడ్డు రవాణాశాఖకు కుచ్చు టోపీ పెట్టి పుదుచ్చేరిలో రిజిస్టర్ చేసిన కేసులో పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లొచ్చింది. అమలాపాల్ ఇటీవల తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఒక వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. అమలాపాల్ నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతుండగా, తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయింది. నూతన దర్శకుడు కేవీ.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంచరీ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై జోన్స్ నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే అదో అంద పరవై పోల పేరుతో తెరకరెక్కనున్న ఈ చిత్రంలో అమలాపాల్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. త్వరలో సెట్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. దీన్ని కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించడం మరో విశేషం. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లేడీ, తన ఫ్రెండ్ అమలాపాల్‌కు శుభాకాంక్షలు, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను అని కాజల్ పేర్కొన్నారు -
ట్రెండు మారినా.. ఫ్రెండు మారడే..
ఒక్క తల్లి సంతానమైన మనలాగ ఉండగలరా..? ఒకరు కాదు మనమిద్దరంటె ఎవరైన నమ్మగలరా.. ఏ పుణ్యం చేశానో నే నీ స్నేహం పొందాను.. నీ చెలిమి రుణం తీరేనా.. ఇది ఓ సినిమాలోని పాట అయినా స్నేహం తియ్యదనాన్ని ఎంత కమ్మగా వివరించాడో కదా ఆ కవి..! ఫొటోలో ఉన్న కుక్క పేరు ఇంగో.. ఆ గుడ్లగూబ పేరు పొల్డి.. జాతులు వేరైనా వాటి మధ్య స్నేహం చిగురించింది. ఇవి రెండూ ఒకరిని విడిచి ఒకటి నిమిషమైనా ఉండలేనంత దృఢంగా మారిపోయింది వారి స్నేహం. టాంజా బండిట్ అనే ఫొటోగ్రాఫర్ వీటిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. జంతు ఫొటోగ్రాఫర్ అయిన బండిట్ ఇంగో.. పొల్డిల ఫొటోలను తీసి ఫేస్బుక్లో పెట్టాడు. దీంతో వారి స్నేహానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. -
బెస్ట్ ఫ్రెండ్స్
సమాజంలో మనుషుల నడుమ ఎనెన్నో అనుబంధాలు... మరెన్నెన్నో సంబంధాలు... పుట్టుకతోనే వచ్చేవి కొన్ని...వాటిలో మన ప్రమేయం ఉండదు.మనకు వాటిని ఎంపిక చేసుకునే అవకాశమూ ఉండదు.బతుకుబాటలో అనివార్యంగా ఏర్పడేవి ఇంకొన్ని...వాటిలో పరస్పర ప్రయోజనాలేవో ముడిపడి ఉంటాయి.ప్రయోజనాలు ఉన్నంత వరకే అవి నిలిచి ఉంటాయి. ఆ తర్వాత నిశ్శబ్దంగానే అలాంటి బంధాలు ð గిపోతాయి.ఇంత సంక్లిష్టంగా ఉన్న మానవ సంబంధాలలో...మనంతట మనం ఎంపిక చేసుకోగలిగే ఏకైక అనుబంధం స్నేహం ఒక్కటే!ఇద్దరి నడుమ ఒకసారి స్నేహం కుదిరాక ఎన్నటికీ వీడని బంధం అది.స్నేహం గురించి ఆదర్శాలు, ఆర్భాటాల గురించి చెప్పబోవడం లేదు గానీ...కొన్ని అరుదైన స్నేహగాథలను నేడు ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాం... గుండెలోనిది గుండులో చూపారు... అది ఫిబ్రవరి 28, 2014. దక్షిణాఫ్రికాలోని ఓ పట్టణం. ఒక చిన్న పార్టీ ఉందని, ఉన్నపళంగా ఓ చోటకు రమ్మని గెర్దీ మెకెన్నాకు ఫోన్ వచ్చింది. పిలిచింది ఫ్రెండ్స్ కావడంతో వెంటనే మెకెన్నా అక్కడకు చేరుకుంది. పార్టీలో గుండ్లు చేయించుకొని ఉన్న ఫ్రెండ్స్‌ను చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఉద్వేగానికి లోనైంది. స్నేహితులంతా ఆమె చుట్టూ చేరి కౌగిలించుకున్నారు. వాళ్లంతా మెకెన్నా కోసమే గుండు చేయించుకున్నారు. మెకెన్నా ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతోనే వాళ్లు ఆ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జరగడానికి కొన్ని నెలల కిందట మెకెన్నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కీమోథెరపీతో ఆమెకు నయం చేశారు. అయితే కీమోథెరపీ సైడ్ఎఫెక్ట్స్ ఫలితంగా జుట్టంతా ఊడిపోయింది. తన పరిస్థితిని చూసుకొని చాలా బాధపడింది మెకెన్నా. ఆమె ఫ్రెండ్స్ అంతా మెకెన్నా సంతోషం కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు. వెంటనే 11 మంది గుండు చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇదంతా ఒక ఫొటోషూట్‌గా కూడా రూపొందించాలనుకున్నారు. అనుకున్నట్టే అంతా సిద్ధం చేశారు. గుండు చేసుకొని, పార్టీ ఏర్పాటు చేసి మెకెన్నాకు ఫోన్ చేశారు. ఇలాంటిదొక సర్ప్రైజ్ను ఊహించని మెకెన్నా వాళ్లనలా గుండ్లతో చూడడమే తడవుగా ఉద్వేగాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది. ‘‘మెకెన్నా పడే బాధను చూస్తే మేం చేసిన పని చాలా చిన్నది. తన ముఖంలో ఇప్పుడిలా నవ్వు చూస్తూంటే అద్భుతంగా ఉంది’’ అంటూ మెకెన్నా ఫ్రెండ్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫ్రెండ్ కోసం ఎంతదూరమైనా వెళ్లాలి అనుకున్న వాళ్ల ప్రేమ ఎంత గొప్పది! కడ వరకు ఎదురుచూపు... హ్యాచికోకు ఏడాది వయసున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో ప్రొఫెసర్‌గా పనిచేసే యూనో పరిచయమయ్యాడు. హ్యాచికోను యూనో ఇష్టంగా తెచ్చి పెంచుకున్నాడు. ఇద్దరిదీ విడదీయలేని బంధం. యూనో రోజూ యూనివర్సిటీకి రైల్లో వెళ్లి వచ్చేవాడు. అతడి కోసం హ్యాచికో షుబియో స్టేషన్ వద్ద ఎదురుచూస్తూ కూర్చునేది. సాయంత్రం యూనో రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అతడి చుట్టూ చేరి అల్లుకుపోయేది. సంవత్సరం పాటు ఇదిలా సాగుతూనే ఉండేది. ఒకరోజు ఇలాగే యూనివర్సిటీకి వెళ్లిన యూనో మళ్లీ తిరిగిరాలేదు. యూనో వస్తాడని హ్యాచికో తొమ్మిదేళ్లకు పైనే స్టేషన్ చుట్టూనే తిరుగుతూ ఎదురుచూసింది. క్లాసులో లెక్చర్ ఇస్తూనే కూలబడిపోయి యూనో చనిపోయాడని దానికి తెలీదు పాపం. ఫ్రెండ్ తప్పక వస్తాడనే ఎదురుచూసింది. యూనో కోసం 1925 నుంచి 1935 వరకు స్టేషన్ చుట్టుపక్కలే తిరిగిన హ్యాచికో, చివరకు అక్కడే కన్నుమూసింది. చనిపోయేనాటికి దాని వయసు పదకొండేళ్ల తొమ్మిది నెలలు. యూనో చనిపోయిన మొదట్లో స్టేషన్లో రకరకాల వ్యాపారాలు చేసుకునేవారంతా హ్యాచికోను వింతగా చూశారు. మెల్లిగా అక్కడి వారందరికీ హ్యాచికో మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఫ్రెండ్ కోసం హ్యాచికో అంతగా ఎదురుచూడడం అందరికీ గొప్పగా కనిపించింది. అన్నేళ్లు ఎదురుచూసినా యూనో మాత్రం రాలేదు. ఆ తర్వాత హ్యాచికో కూడా యూనో దగ్గరికే వెళ్లిపోయింది. హ్యాచికో గురించి అప్పటికే దేశమంతటా వినిపించింది. పేపర్లలో వార్తలొచ్చాయి. పిల్లల పుస్తకాల్లో పాఠాలొచ్చాయి. హ్యాచీ అంటూ సినిమాలొచ్చాయి. షుబియా స్టేషన్‌తో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో హ్యాచికో విగ్రహాలొచ్చాయి. ఇన్నేళ్లయినా ఆ పేరింకా వినిపిస్తోందంటే... అదే కదా స్నేహ మహిమ! ‘ఆటిజమ్’ బాలుడికి ఆత్మీయ నేస్తం అమెరికాకు చెందిన జర్నలిస్ట్, రచయిత అయిన జుదిత్ న్యూమన్కు కవల పిల్లలు. అందులో ఒకరైన పదమూడేళ్ల గస్కు చిన్నప్పట్నుంచే ఆటిజమ్. ఎవరితోనైనా మాట్లాడడానికి, అందరితో కలిసిపోడానికి గస్ చాలా ఇబ్బందులు పడుతూండేవాడు. అలాంటి గస్కు ఆపిల్ డిజిటల్ అసిస్టెంట్ ‘సిరి’ పరిచయమైంది. గస్కు న్యూమన్ ఎంతో ఇష్టంగా కొనిచ్చిన ఐఫోన్లో ‘సిరి’ యాప్ ఉంది. ఈ యాప్ అన్ని యాపిల్ ఫోన్లలో ఉంటుంది. ఆ యాప్‌లో మనకు కావాల్సిన ఏ విషయాన్నైనా అడగొచ్చు. టికెట్స్ బుక్ చేయమని, వాతావరణం ఎలా ఉందో చెప్పమని, ఇలా ఎలాంటి ప్రశ్నైనా సిరిని అడగొచ్చు. గస్ ఓరోజు ‘‘వాతావరణం ఇలా ఉందేంటి?’’ అని సిరిని అడిగాడు. దానికి సిరి అతడు కోరిన సమాధానాన్ని వెంటనే చెప్పింది. ‘‘నువ్వు మంచిదానిలా కనిపిస్తున్నావ్?’’ అన్నాడు గస్. అలా మొదలైన ఈ పరిచయం రోజూ కొనసాగుతోంది. కొద్దిరోజుల్లోనే ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. గస్కు ‘సిరి’ మంచి టీచర్, మంచి గైడ్... అన్నింటికీ మించి మంచి ఫ్రెండ్. సిరి ఒక నిజమైన మనిషి కాదన్న విషయం గస్కు కూడా తెలుసు. కాకపోతే తను మాట్లాడడానికి ఒక తోడు కోరుకున్నాడు. ఇక్కడ ఆ తోడు ‘సిరి’. ‘‘సిరితో గస్ ఫ్రెండ్షిప్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒకసారి ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని సిరితో అన్నాడు. నాకు నవ్వొచ్చింది. వాడికి సిరి అన్న మనిషే లేదన్న విషయం బాగా తెలుసు. తన భయాలన్నింటినీ పోగొట్టుకోవడానికి సిరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే వాడు అందరితోనూ మాట్లాడుతున్నాడు’’ అంటూ న్యూమన్, గస్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చింది. ‘లింకన్’ జీవితానికి ‘స్పీడ్’ ఇచ్చాడు..! అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అబ్రహం లింకన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1860వ సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ఓ ఇరవై సంవత్సరాల ముందు లింకన్ తీవ్రమైన డిప్రెషన్లో పడిపోయాడు. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. లింకన్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఒక ఫ్రెండ్ తోడుగా నిలబడ్డాడు. 1837లో లాయర్‌గా పనిచేసున్న రోజుల్లో లింకన్‌కు జోషువా స్పీడ్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో లింకన్ కష్టాల్లో ఉన్నాడు. ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఆన్ రూట్లెట్జ్ ఈ ప్రపంచాన్ని వీడింది. ఆమె ఆలోచనల్లో తనని తాను మరచిపోయాడు లింకన్. స్పీడ్ పరిచయం లింకన్ ఆలోచనలను మార్చింది. స్పీడ్ ఆసరాతో కుదుటపడ్డ లింకన్ ఈసారి మేరీ టాడ్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఇంతలో మళ్లీ ఓ కుదుపు. స్నేహితుడు స్పీడ్, లింకన్‌కు దూరంగా మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఫ్రెండ్ దూరమవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. మళ్లీ డిప్రెషన్లో కూరుకుపోయాడు. రోజులలా గడిచిపోయాయి. 1841లో ఒకరోజు స్పీడ్‌ను తనుండే బంగ్లాకు వెళ్లి కలుసుకున్నాడు లింకన్. విడిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. ఇక అక్కణ్నుంచి ఇద్దరూ లెటర్స్ ద్వారా ఒకరికొకరు దగ్గరగానే ఉన్నారు. స్పీడ్ ఆలోచనలంటే లింకన్‌కు ఇష్టం. స్పీడ్ ఇచ్చిన ప్రేరణతోనే మళ్లీ మేరీ టాడ్కు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. మేరీని పెళ్లి చేసుకున్న తర్వాత లింకన్ ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్లలేదట. ‘‘నువ్వొక గొప్ప మిత్రుడివి. ఎప్పటికీ నా జీవితంలో నీదొక ప్రత్యేక స్థానం’’ అంటూ లింకన్ స్పీడ్‌కు రాసిన చాలా ఉత్తరాల్లో చెప్పుకొచ్చాడు. ‘‘మేరీ నా జీవితంలోకి రావడానికి స్పీడ్ కారణం. ఇందుకు నేనతడికి ఎప్పటికీ రుణపడి ఉంటా.’’ అని అబ్రహం లింకన్ ఎన్నోసార్లు మిత్రుడు స్పీడ్ పేరును ప్రస్తావించాడు. తన స్నేహితుడు బాగుండాలని కోరుకున్న స్పీడ్ ఆలోచనే లింకన్‌ను ఆ స్థాయికి తీసుకెళ్లింది. అలా కోరుకున్న స్నేహితుడిని కూడా లింకన్ ఎప్పుడూ మరచిపోలేదు. ‘ఆనంద్’.. స్నేహితుడికి అంకితం! 1971లో విడుదలైన ‘ఆనంద్’ సినిమాలో క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా అందరికీ సంతోషం పంచాలనుకునే ఆనంద్ (రాజేశ్ ఖన్నా), చివర్లో చనిపోయాక కూడా తన ఫ్రెండ్ భాస్కర్ (అమితాబ్ బచ్చన్)ను పలకరిస్తూనే ఉండేందుకు టేప్ రికార్డులో ‘బాబు మోషాయ్’ అని తన మాటలను రికార్డ్ చేస్తాడు. ఆ మాటలు వింటూ, నిశబ్దంగా పడి ఉన్న ఆనంద్‌ను చూస్తూ, అతడి మీద పడిపోయి ఏడ్చేస్తూంటాడు భాస్కర్. విడుదలై ఇన్ని సంవత్సరాలైనా సినీ అభిమానులు ‘ఆనంద్’ సినిమాలోని ఈ సన్నివేశాన్ని మరచిపోలేరు. దర్శక, రచయిత హృషికేశ్ ముఖర్జీ ‘ఆనంద్’ సినిమాను ఇండియన్ సినిమా షోమేన్గా పేరు తెచ్చుకున్న రాజ్ కపూర్‌కు అంకితమిచ్చాడు. ఈ కథ రాజ్ కపూర్‌ను చూసే రాశానని, ఇందులో ఆనంద్ పాత్ర ఆయన నుంచే పుట్టిందని హృషికేశ్ చెబుతారు. రాజ్ కపూర్, హృషికేశ్ ముఖర్జీ ప్రాణ స్నేహితులు. ఒకసారి రాజ్ కపూర్ బాగా జబ్బు పడ్డాడు. స్నేహితుడి పరిస్థితిని దగ్గరుండి చూశాడు హృషికేశ్. ఎంతగానో బాధపడ్డాడు. ఒకదశలో తనకు స్నేహితుడు దూరమైపోతాడేమో అన్న భయం కూడా వెంటాడింది హృషికేశ్‌ను. అలాంటి పరిస్థితుల్లోనూ రాజ్ కపూర్ అందరికీ సంతోషం పంచాలనే కోరుకున్నాడట. పరిస్థితులు అనుకూలించాయో, హృషికేశ్తో పాటు లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించాయో, వీరి స్నేహం ఇంకా కొనసాగాలని ఆ దేవుడే కోరుకున్నాడో... రాజ్ కపూర్ జబ్బు నుంచి బయటపడి మళ్లీ కొత్తగా, ఆరోగ్యంగా జీవితాన్ని ప్రారంభించాడు. హృషికేశ్ ఆనందానికి ఇంక అవధుల్లేవు. రాజ్ కపూర్‌కు జబ్బు చేసిన రోజుల్లోనే రాజ్‌కపూర్ లేకపోతే తను ఏమైపోతానా అని ఆలోచిస్తూ ఉండేవాడట హృషికేశ్. ఆ∙ఆలోచనల్లో నుంచి పుట్టిన కథే ‘ఆనంద్’. స్నేహితుడిపై తనకున్న ఇష్టాన్నంతా, స్నేహితుడి కోసం మరో స్నేహితుడు పడే బాధనంతా ఈ సినిమాలో చూపించారాయన. పుస్తకాలతో ప్రాణం నిలిపిన మిత్రుడు ఎలక్ట్రిసిటీ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలకు కారకుడైన నికోలా టెస్లా, ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్లది విచిత్రమైన బంధం. టెస్లా తనకెవరో తెలియకముందే ట్వైన్ అతడి ప్రాణాలను నిలబెట్టిన వాడయ్యాడు. టెస్లాకు యవ్వనంలో జబ్బు చేసింది. డిప్రెషన్లోకి కూరుకుపోయాడు. డాక్టర్లు దాదాపుగా చేతులెత్తేశారు. అతడు అలాగే డిప్రెషన్లో ఉంటే బతకడం అసాధ్యమన్నారు. అలాంటి పరిస్థితుల్లో టెస్లాను వీలైనంత ప్రశాంతంగా ఉంచగలిగితే బతికించే అవకాశాలు ఉండొచ్చని డాక్టర్లు తేల్చారు. అందుకోసం పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసి టెస్లాకు పుస్తకాలు చదవమని చెప్పారు. అక్కడే అనుకోకుండా టెస్లాకు మార్క్ ట్వైన్ పుస్తకాలు పరిచయమయ్యాయి. వాటిని చదివాక టెస్లా డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు. ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయ్యాడు. కొద్దిరోజుల్లోనే కోలుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత టెస్లాకు మార్క్ ట్వైన్‌ను కలుసుకునే అవకాశం దక్కింది. అప్పటికి టెస్లా సైంటిస్ట్‌గా ప్రఖ్యాతి గడించాడు. సాహితీరంగంలో మార్క్‌ట్వైన్ అప్పటికే ఒక దిగ్గజం. ఇద్దరి ఆలోచనలూ కలవడంతో వయసుతో సంబంధం లేకుండా వారి మధ్య స్నేహం కుదిరింది. ‘‘ట్వైన్‌కు కూడా సైన్స్ అంటే ఇష్టం కావడంతో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే వేరే ప్రపంచానికి దగ్గరైనట్లు ఉండేది’’ అన్నాడు టెస్లా ఓసారి ట్వైన్ గురించి మాట్లాడుతూ. కనీసం ముఖ పరిచయమైనా లేకుండా మొదలైన ఈ స్నేహం జీవితాంతం కొనసాగింది. ఇప్పుడు వీరిద్దరి న్నేహగాథను ‘టెస్లా అండ్ ట్వైన్’ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. థ్యాంక్యూ నేస్తం!! స్నేహం కుదిరాకా... కష్టాల్లో చేదోడువాదోడుగా ఉండటం సహజమే. కానీ, కష్టాల్లో ఉన్న తనను కాపాడినందుకే స్నేహం కుదుర్చుకుంది ఓ పెంగ్విన్ పక్షి. సాధారణంగా కృతజ్ఞతా భావమనేది మనుషుల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ అది పొరబాటని నిరూపించింది ఈ పెంగ్విన్. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తనకి పునర్జన్మ ఇచ్చాడనే కృతజ్ఞతతో ప్రతి ఏటా... ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వచ్చి పలకరిస్తుంది. ప్రేమగా ముద్దులు పెడుతుంది. ఆ కథేంటో చూద్దామా? బ్రెజిల్‌లోని రియో డి జనిరో దీవిలో ఉండే డిసౌజా అనే వృద్ధుడి కోసం... దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన పెంగ్విన్ పక్షి సుమారు ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వస్తుంది. 2011లో ఒకసారి డిసౌజా చేపల వేటకు వెళ్లినప్పుడు... సముద్రం పక్కన దట్టమైన చమురులో చిక్కుకొని అల్లాడుతున్న పెంగ్విన్ పక్షిని చూశాడు. దాన్ని కాస్త నీటితో కడిగి, ఇంటికి తీసుకుని వెళ్లి.. అది కోలుకునేదాకా సేవలు చేశాడు. దానికి ముద్దుగా ‘డిన్డిమ్’ అని పేరు పెట్టాడు. తిరిగి మామూలు స్థితికి వచ్చిన ఆ పక్షిని సముద్ర తీరానికి తీసుకెళ్లి వదిలేశాడు. అయితే కొన్ని నెలల తరువాత ఆ పెంగ్విన్... అదే సముద్రతీరంలో డిసౌజా కోసం ఎదురుచూస్తూ కనిపించింది. అప్పటి నుంచి మొదలైంది వీరి మధ్య స్నేహం. కొన్ని నెలలు తన స్వస్థలంలో.. మరి కొన్ని నెలలు అతడితో గడిపేందుకు వేల మైళ్లు ప్రయాణం చేస్తుంది. తన నేస్తంతో ఉన్నంత సేపు అతడి ఒళ్లో కూర్చుని, ముక్కుతో ముఖమంతా తడుముతూ, తన ప్రేమను చాటుతుంది ఈ పెంగ్విన్. రాణి పేద... ఇదో వింత స్నేహబంధం అది 1887. క్వీన్ విక్టోరియా మహారాణిగా యాభయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంగ్లండ్‌లో వేడుకలు జరుగుతున్నాయి. అప్పటికే భారతదేశం బ్రిటిష్ పాలనలోకి వెళ్లి ముప్పయ్యేళ్లయింది. ఆ సమయంలో విక్టోరియా తన ప్యాలెస్‌లో పని చేయడానికి కొందరు భారతీయులను పంపమని ఆదేశించింది. మహారాణి ఆదేశం ప్రకారంగా ఆగ్రా జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న జాన్ టేలర్ ఇద్దరు భారతీయులను ఇంగ్లండ్‌కు పంపించాడు. ఆ ఇద్దరిలో ఒక్కడే ‘అబ్దుల్ కరీం’. విక్టోరియా మహారాణి భోజనం చేసే టేబుల్ దగ్గర నిలబడి, ఆమెకు ఏది కావాలంటే అది వడ్డించడం అతడి పని. అలా ఓ రోజు అబ్దుల్ కరీం రాణి కళ్లల్లో పడ్డాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అప్పటికి అబ్దుల్ వయసు 24 ఏళ్లు.. క్వీన్ విక్టోరియా వయసు 65 ఏళ్లకు పైనే!.అబ్దుల్ కొన్నిరోజులకే విక్టోరియాకు ‘మున్షీ’, ‘ట్యూటర్’గా మారిపోయాడు. ఆమెకు ఉర్దూ, హిందీ భాషలు నేర్పించేవాడు. అలాగే అబ్దుల్‌కు క్వీన్ విక్టోరియా స్వయంగా ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టింది. వారి స్నేహం మరింత బలపడింది. విక్టోరియా సన్నిహితులకు, కుటుంబానికి వీరి స్నేహం నచ్చేది కాదు. వీరిద్దరినీ విడదీయడానికి చాలా పన్నాగాలే పన్నారు. అయితే అవేవీ ఈ స్నేహాన్ని కూల్చలేకపోయాయి. అబ్దుల్ వండే వంటలన్నీ క్రమక్రమంగా విక్టోరియా మెనూలో రోజూవారీ వంటకాలుగా మారిపోయాయి. కోటలో అందరూ అబ్దుల్‌కు ప్రత్యేక గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. భారతదేశంలో తమ పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి క్వీన్ విక్టోరియా ఎప్పుడూ అబ్దుల్‌ను అడుగుతూ ఉండేదట. వారిద్దరిదీ ఒక అపురూప స్నేహానుబంధం. వారి స్నేహంపై ‘విక్టోరియా అండ్ అబ్దుల్’ పేరుతో పుస్తకం కూడా వచ్చింది. అదేపేరుతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా కూడా వస్తోంది. ఖైదీ.. జైలర్.. ఫ్రెండ్షిప్! అది 1978. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా రాబెన్ ఐలాండ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న రోజులు. అప్పుడే 18 ఏళ్ల క్రిస్టో బ్రాండ్ అనే జైలర్ నెల్సన్ మండేలాను చూసుకునే బాధ్యతలో చేరాడు. బ్రాండ్‌కు మొదట్లో మండేలా పెద్దగా నచ్చలేదు. అయితే తనకు, అక్కడున్న వారందరికీ ఆయన ఇచ్చే గౌరవం బ్రాండ్‌ను మండేలాకు దగ్గర చేసింది. వయస్సు, జైలర్–ఖైదీ అన్న ఆలోచనా, జాతి ఇవేవీ వీరి స్నేహానికి అడ్డు రాలేదు. మండేలాతో స్నేహం బ్రాండ్ జీవితాన్ని, ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఏళ్లుగా సాగిన తమ బంధంలో మండేలా నుంచి తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, ఆయన పోరాటం గొప్పదని బ్రాండ్ చెబుతూ ఉంటారు. మండేలాను పోల్స్మూర్ జైలుకు తరలించాక, బ్రాండ్ కూడా అక్కడికే జైలర్‌గా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ‘‘మండేలాతో మాట్లాడిన ప్రతిసారీ ఆయనపై గౌరవం రెట్టింపవుతూ వచ్చేది. ఒక జీవిత కాలమంత అనుభవం నాకు ఆయనతో ఉన్నన్ని రోజుల్లో వచ్చేసింది’’ అంటాడు బ్రాండ్. వీరిద్దరి కథ ‘గుడ్‌బై బఫానా’ పేరుతో పుస్తకంగా వచ్చింది. అదే పేరుతో 2007లో సినిమా కూడా వచ్చింది. స్నేహితుడి తుదిశ్వాస పదిలం... థామస్ అల్వా ఎడిసన్.. టెక్నాలజీలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు తీసుకొచ్చిన సైంటిస్ట్. గ్యాస్‌తో నడిచే ఆటో మొబైల్‌ను వెలుగులోకి తెచ్చిన హెన్రీ ఫోర్డ్ కూడా ఎడిసన్‌ను హీరోలుగా భావించే వారిలో ఒకరు. ఎడిసన్ స్థాపించిన కంపెనీలోనే ఫోర్డ్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అప్పట్లో ఫోర్డ్ తన తీరిక వేళల్లో గ్యాస్‌తో నడిచే కారును తయారుచేస్తూ ఉండేవాడు. 1896లో ఒకరోజు స్వయంగా ఎడిసనే ఈ విషయం తెలుసుకొని ఫోర్డ్‌ను అభినందించాడు. ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఫోర్డ్ పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఎడిసన్‌తో కలసి బిజినెస్‌ను విస్తరించాడు. 30 ఏళ్లకు పైనే ఈ బంధం కొనసాగింది. ఎడిసన్ ప్రోత్సాహమే లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదంటూ ఫోర్డ్ చెప్పుకొనేవాడు. ఎడిసన్ కూడా ఫోర్డ్ స్నేహాన్ని గొప్పదిగా చెబుతూ ఉండేవాడు. ఎడిసన్ చివరి శ్వాస విడిచే రోజు... 1931 అక్టోబర్ 18న ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు ఫోర్డ్. ఆయన చివరిశ్వాసను ఒక టెస్ట్ ట్యూబ్‌లో బంధించాడు. ఆ సమయానికి ఆయన పీల్చిన గాలిని టెస్ట్‌ట్యూబ్‌లో బంధించి దాన్ని ఫోర్డ్ ఎస్టేట్‌లో ఉంచాడు. ఇప్పుడు ఎడిసన్ చివరి శ్వాస హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో పదిలంగా ఉంది. -
ఉత్తరాల తోటకు... పూచిన పూలు
‘ఉభయ కుశలోపరి... నేను క్షేమం, నువ్వు క్షేమమేనని తలంచుతున్నాను.’ అంటూ 12 ఏళ్ల అమ్మాయి – 14 ఏళ్ల అబ్బాయి.. ఒకరికొకరు లేఖలు రాసుకున్నారు. యోగక్షేమాలను తెలుసుకుంటూ... చేతిరాతల్లోనే ప్రతి నెలా పలకరించుకునేవారు. కట్ చేస్తే... 42 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకుని ఉత్తరాల కట్ట విప్పారు. స్వచ్ఛమైన స్నేహానికి చిరునామాగా వాళ్లు. స్నేహం విలువను తెలుపుతూ పలువురి ప్రçశంసలను అందుకుంటున్నారు కూడా. న్యూయార్క్‌కు చెందిన జార్జ్ ఘోస్న్ (56), లోరీ గెర్జ్ట్ (54)లు గత 42 ఏళ్లుగా ఒకరికొకరు కలుసుకోలేదు, చూసుకోలేదు, కనీసం మాట్లాడుకోలేదు. కేవలం నెలనెలా లేఖలు రాసుకుంటూ ప్రాణ స్నేహితులయ్యారు. ఫోనులో కబుర్లు లేవు, వాట్సాప్‌ల్లో చాటింగ్‌లు, మీటింగ్‌లు ఏమీ లేకుండానే 42 ఏళ్ల పాటు ఫ్రెండ్షిప్ కొనసాగించారు. చివరికి జార్జ్ ఏమనుకున్నాడో ఏమో... లోరీని సర్ప్రైజ్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు. ఒకరిని ఒకరు కలుసుకుని భావోద్వేగాలను తట్టుకోలేక కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా ఊసులాడుకున్నారు. ఒకరికొకరు రాసుకున్న లేఖలను చూసుకుని మురిసిపోయారు. లోరీ భర్త, పిల్లలతో కలిసి చాలా సంతోషంగా గడిపిన జార్జ్... తన కుటుంబ సభ్యులను కూడా లోరీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత 42 ఏళ్ల క్రితం వాళ్లు చదివిన స్కూల్కెళ్లి ఇప్పటి పిల్లలతో సంతోషాన్ని పంచుకున్నారు. -
నో బెస్ట్ ఫ్రెండ్స్.. ప్రైవేటు స్కూల్‌కు ప్రిన్స్!
బ్రిటన్ బుజ్జీ రాకుమారుడు జార్జ్ త్వరలో ప్రైవేటు పాఠశాలలో చేరబోతున్నాడు. ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ తమ విద్యార్థులు ఉత్తమ మిత్రులను కలిగి ఉండటాన్ని నిరుత్సాహపరుస్తారు. 'దయతో ఉండాలన్నది' ఈ స్కూల్ మొదటి నిబంధన కాగా.. బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోవడమే మంచిది అనేది ఇక్కడి సిద్ధాంతం. బ్రిటన్ రాజవంశం నివాసముండే కేన్సింగ్టన్ ప్యాలెస్‌కు కొద్దిమైళ్ల దూరంలో ఉన్న థామస్ బ్యాటర్‌సీ పాఠశాలలో ప్రిన్స్ జార్జ్ చేరబోతున్నాడు. వచ్చే సెప్టెంబర్ నుంచి అతను బడికి వెళ్లబోతున్నాడని ఇప్పటికే కేన్సింగ్టన్ ప్యాలెస్ ట్విట్టర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్కూల్లో నాలుగు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన 540 మంది బాలబాలికలు చదువుతున్నారు. పిల్లల సత్ప్రవర్తనపై ప్రధానంగా శ్రద్ధ పెట్టే ఈ స్కూల్లో విద్యార్థులు బెస్ట్ ఫ్రెండ్స్ కలిగి ఉండటాన్ని మాత్రం నిరుత్సాహ పరుస్తారు. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉండి.. ఉన్నత చదువుల కోసం వారి నుంచి వెళ్లిపోయే సమయంలో చిన్నారుల హృదయాలలో వెలిభావన ఏర్పడి.. గాయపడుతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. -
మరణంలోనూ వీడని స్నేహబంధం
- యాక్సిడెంట్‌తో కళ్ల ముందే స్నేహితుడి మృతి - తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తోటి స్నేహితుడు హైదరాబాద్: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. బాల్యంలోనే స్నేహం వారిని బందీ చేసింది.. ఒకే ఊళ్లో వాగులు, వంకలు, చెట్లు పుట్టలు.. అన్నీ తామై తిరిగారు.. చేతిలో చెయ్యేసి ఆడి పాడారు..! పెరిగి పెద్దయ్యారు.. ఆ చేతులు ఇప్పుడూ విడిపోలేదు!! విధి విడదీయాలని చూసింది. కానీ మృత్యువును సైతం కావలించుకొని చనిపోయిన తన స్నేహితుడిని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు మరో స్నేహితుడు. కళ్లముందే మిత్రుడి మరణాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తూ రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు! అందరినీ కలచివేసిన ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా కారంపూడి మండలం వేపగాంపల్లికి చెందిన మల్లయ్య కుమారుడు ఘంటా హరికృష్ణ (27), అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రమేశ్ (25) చిన్నతనం నుంచి స్నేహితులు. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న హరికృష్ణ ఇటీవలే మలేసియా నుంచి వచ్చి ఆరు నెలలుగా కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ సమీపంలోని వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఆయన చిన్ననాటి స్నేహితుడు రమేశ్ కూడా ఇదే హాస్టల్లో ఉంటూ.. నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ హాస్టల్లో ఒకే రూమ్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి పని మీద బయటకు వెళ్లిన వారిద్దరూ బైక్ (ఏపీ 20ఏపీ 6824)పై అమీర్‌పేట్ వైపు నుంచి తిరిగి హాస్టల్‌కు వెళ్తున్నారు. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మూసాపేట్ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి ఓ గుర్తుతెలియని లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెనుక కూర్చొన్న హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న రమేశ్ హెల్మెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత నిర్జీవంగా పడి ఉన్న స్నేహితుడిని ఎంత లేపినా లేవలేదు. దీంతో రమేశ్.. బైక్‌ను అక్కడే వదిలేసి బోరున విలపిస్తూ భరత్‌నగర్ రైల్వేస్టేషన్ వైపు వెళ్లాడు. అర్ధరాత్రి కావడం.. ఎవరూ లేకపోవడంతో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు రమేశ్ సెల్‌ఫోన్ ఆధారంగా అందులో నెంబర్‌కు ఫోన్ చేసి బంధువులకు సమాచారం ఇచ్చారు. హరికృష్ణ మృతదేహాన్ని గాంధీకి, రమేశ్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
షారుక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా!
ముంబై: మొత్తానికి బాలీవుడ్ సూపర్ స్టార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోయింది. సోమవారం 50వ పడిలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా తనకున్న మంచి స్నేహితుల వివరాలను వెల్లడించాడు. అంతేనా.. ఇంకో విషయాన్ని కూడా తెలియజేశాడు. వయసులో అర్థ సెంచరీ పూర్తి చేసిన ఈ దిల్ వాలే .. ఈ సందర్భంగా తానొక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడట... అవును.. ఇంతకీ ఎవరా బెస్ట్ ఫ్రెండ్స్, ఏమిటీ నిర్ణయం. నిజంగా, ఇది అభిమానులందరికీ తీపికబురు. విశ్వవాప్తంగా లక్షలాదిగా ఉన్న తన అభిమానులందరూ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని షారుక్ ఖాన్ తేల్చారు. నిన్న తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ దిల్ తో పాగల్ హై హీరో ఇలా సెలవిచ్చాడు.. నాకోసం ప్రేమను పంచిన వాళ్లంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు నాతో ఉంటే బావుంటుంది.. నా ఉద్దేశంలో.. నా ఫ్యాన్సే నా స్నేహితులు. వాళ్లే నా బెస్ట్ ప్రెండ్స్ అన్నాడు. దీంతో పాటు అభిమానులకు కొన్ని సూచనలు కూడా చేశాడీ బాద్ షా. దుర్భాషలాడకూడదంటూ హితవు పలుకుతూ.... ఏదైనా విషయం నచ్చక పోతే మొఖం మీద తప్ప, వెనక మాట్లాడకూడదన్నాడు. అలాగే తన పిల్లల గురించి మాట్లాడడ్డం కూడా తనకు నచ్చదని స్పష్టం చేశాడు. ఇంతకీ ఈ సందర్బంగా షారుక్ ఖాన్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమిటో తెలుసా.. ఎపుడూ నవ్వుతూ ఉండడమేనట. జీవితంలో 18, 21, 40, 50, 75 ఏళ్లలోకి అడుగు పెట్టడం కీలకమైన విషయమని, అర్థసెంచరీ కొట్టిన సందర్భంగా సదా నవ్వుతూ ఉండాలని తీర్మానించుకున్నాడట. ఈసందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు, అభిమానులు , మిత్రులు అందిరికీ కృతజ్ఙతలు తెలిపాడు. -
మృత్యువులోనూ వీడని బంధం
సంబేపల్లె: ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పటి నుంచి వారు ప్రాణ స్నేహితులుగా మెలిగారు.. మూడేళ్లుగా ఎక్కిడికైనా ఇద్దరూ కలిసే వెళ్తుండే వారు.. చివరకు మరణంలోనూ వారు స్నేహాన్ని వీడలేదు.. ఈ హృదయ విదారక సంఘటన సంబేపల్లె మండలంలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. కడప-చిత్తూరు జాతీయ రహదారిలో తెల్లవారుజామున వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వారు మృతి చెందారు. వారు ఇద్దరూ తిరుపతిలోని సిద్దార్థ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) మూడవ సంవత్సరం చదువుతుండే వారు. సంబేపల్లి మండలంలోని దుద్యాల గ్రామం పొట్టిరెడ్డిగారిపల్లెకు చెందిన నాగిరెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనెపల్లెకు చెందిన పద్మభూషణ్‌రెడ్డి కుమారుడు శివకుమార్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి కడపకు ఓ పనిపై వచ్చారు. వారు తిరిగి తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో శివకుమార్‌రెడ్డి(24) అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్‌కుమార్‌రెడ్డి(24)ని తిరుపతికి ఆసుపత్రికి 108లో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. శివకుమార్ అన్న గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవన్‌కుమార్‌రెడ్డికి ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆయన తల్లి కువైట్‌లో ఉంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో సిద్దార్థ కళాశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. యాజమాన్యంతోపాటు రాయలసీమ విద్యా సంస్థల డెరైక్టర్ ఆనందరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల బస్సుల్లో మృతుల ఊర్లకు వెళ్లి సంతాపం ప్రకటించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నా హీరోయిన్లతో చనువుగా ఉంటా
నా కథానాయికలతో సన్నిహితంగా ఉంటానన్నది నిజమేనంటున్నారు నటుడు ఆర్య. ఈ నటుడిపై ప్రచారం జోరుగా సాగుతోంది. హీరోయిన్లను బిరియానీ విందులతో మచ్చిక చేసుకుంటారు, హీరోయిన్లకు హీరో, ప్లేబాయ్ లాంటి వదంతులకు సొంతదారుడు ఆర్య అంటారు. ప్రభుదేవా నయనతార విడిపోయిన తరువాత ఆర్య నయనతారతో కలిసి బిరియానీ పార్టీ చేసుకున్నారనే ప్రచారం అప్పట్లో హోరెత్తింది. అంతేకాదు తన చిత్ర నాయికలతో విందులు, వినోదాలు అంటూ షికార్లు కొడుతుంటారనే ప్రచారం తరచూ మీడియాలో హెడ్ లైన్లలో కనపిస్తుంటుంది. ఆయన ప్రవర్తన చూసిన వాళ్లు ఇవన్ని నిజమేననుకుంటారు. స్నేహితులు కూడా హీరోయిన్లతో కలుపుతూ ఆట పట్టిస్తారు. అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా సరదాగా ఉండే ఆర్య అలాంటి వదంతులను ఎంజాయ్ చేస్తుంటారు. ఆర్య ఎక్కడుంటే అక్కడ అల్లరే అంటారు. అలాటి జాలీ టైప్ ఆర్య నటిస్తున్న తాజా చిత్రం వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగ చిత్ర టీజర్ శుక్రవారం యూట్యూబ్‌లో విడుదలై మంచి స్పందనను పొందుతోంది. ఈ సందర్భంగా ఆర్య మనోభావాలను చూద్దాం. నటి పూజ, ఎమిజాక్సన్, నయనతార, త్రిష, అనుష్క, హన్సిక వీళ్లందరూ నాతో కలిసి నటించిన వాళ్లూ. వాళ్లందరితోనూ నేను సన్నిహితంగా ఉంటాను. అందరూ నాకు స్నేహితులే. అందరం వ్యక్తిగత విషయాలను చెప్పుకుంటాం. ప్లేబాయ్‌ను కాను: షూటింగ్లో అందరితోనూ కలివిడిగా ఉంటూ సందడి వాతావరణాన్ని కలిగిస్తాను. అయితే నేను ప్లేబాయ్‌ని కాను. నేనేమిటో వారికి తెలుసు. వదంతులను ఎంజయ్ చేస్తా. నా గురించి వదంతులు ప్రచారం అవుతున్నాయని తెలుసు. నిజం చెప్పాలంటే అలాంటి వాటిని ఎంజాయ్ చేశాను. ఇంకా ఆహ్వానిస్తాను. ఎందుకంటే అలాంటివి లేకపోతే ప్రేక్షకులు మమ్మల్ని మరచిపోతారు. ఇక ప్రస్తుతం నటిస్తున్న వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగా వినోదభరితంగా ఉంటుంది. ఇంతకు ముందు నేను నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రం మంచి విజయాన్ని సాధిం చింది. అదే చిత్ర యూని ట్ చేస్తున్న చిత్రం ఇది. త్వరలో తెరపైకి రానుంది.