షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్, బాద్‌షా షారుక్ ఖాన్ ఫ్రెండ్‌షిప్ గురించి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహంగా ఉంటున్నారు. ఈ మధ్య ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించడం కనిపిస్తోంది. సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’ సినిమాలో మెజీషియన్ పాత్రలో షారుక్ కనిపిస్తే, ‘జీరో’ సినిమాలో ఓ పాటలో షారుక్‌తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. తాజాగా మరోసారి సల్మాన్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారట. ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్’కి సీక్వెల్‌గా సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం ‘దబాంగ్ 3’. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో షారుక్ ఖాన్ పాత్ర కనిపిస్తుందట. ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌తో ‘దబాంగ్ 3’ షూటింగ్ నడుస్తోంది.
అతిథి కాదు విలన్!
షారుక్ ఖాన్ కెరీర్ స్టార్టింగ్‌లో విలన్‌గా ఆకట్టుకున్నారు. నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్స్‌లో ఆయన నటించిన ‘బాజీగర్, డర్’ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్‌గా అట్లీ– విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ స్పోర్ట్స్ డ్రామాలో షారుక్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా వినిపిస్తున్నదేంటంటే ఈ సినిమాలో షారుక్ గెస్ట్ కాదట, విలన్‌గా నటిస్తారట. క్లైమాక్స్‌లో మాత్రమే కనిపించే ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉండబోతోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment