
ఒక్క తల్లి సంతానమైన మనలాగ ఉండగలరా..? ఒకరు కాదు మనమిద్దరంటె ఎవరైన నమ్మగలరా.. ఏ పుణ్యం చేశానో నే నీ స్నేహం పొందాను.. నీ చెలిమి రుణం తీరేనా.. ఇది ఓ సినిమాలోని పాట అయినా స్నేహం తియ్యదనాన్ని ఎంత కమ్మగా వివరించాడో కదా ఆ కవి..! ఫొటోలో ఉన్న కుక్క పేరు ఇంగో.. ఆ గుడ్లగూబ పేరు పొల్డి.. జాతులు వేరైనా వాటి మధ్య స్నేహం చిగురించింది. ఇవి రెండూ ఒకరిని విడిచి ఒకటి నిమిషమైనా ఉండలేనంత దృఢంగా మారిపోయింది వారి స్నేహం. టాంజా బండిట్ అనే ఫొటోగ్రాఫర్ వీటిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. జంతు ఫొటోగ్రాఫర్ అయిన బండిట్ ఇంగో.. పొల్డిల ఫొటోలను తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దీంతో వారి స్నేహానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.