Owl
-
గుడ్లగూబ పరుగులు చూశారా?
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవేంలేదు. తాజాగా గుడ్లగూబకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గుడ్లగూబ పరిగెత్తడాన్ని చూడవచ్చు. నేటి రోజుల్లో గుడ్లగూబను చూడటమే అంత్యంత అరుదు. ఎప్పుడైనా కనిపించినా అది చెట్టుపైనే కనిపిస్తుంది. అయితే ఒక గుడ్లగూబ నేలపై పరిగెత్తడాన్ని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇంటిలోపల గుడ్లగూబ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ గుడ్లగూబను చూసిన తర్వాత అది ఆ ఇంటిలోని వారి పెంపుడు జంతువు అని అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా చాలామంది జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడతారు. ఈ వీడియోను అమేజింగ్ నేజర్ అనే పేరుగల ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్ ‘ఇది అద్భుతమైన వీడియో’ అని రాయగా, మరొకరు ‘నేను మొదటిసారిగా గుడ్లగూబ నడవటాన్ని చూస్తున్నాను’ అని రాశారు. ఇది కూడా చదవండి: లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం? Have you ever seen a owl run ? pic.twitter.com/roSdhAUSyX — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 30, 2023 -
ఇటాలియన్ దీవిలో వింత గుడ్లగూబ
ఇటాలియన్ దీవి ‘ప్రిన్సిపి’లో ఒక కొత్తజాతికి చెందిన గుడ్లగూబను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆఫ్రికా పశ్చిమ తీరానికి ఆవల గల్ఫ్ ఆఫ్ గినీలో ఉన్న ఈ చిన్న దీవిలో తొలిసారిగా 2016లో ఈ జాతి గుడ్లగూబను గుర్తించారు. మరిన్ని పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు, ఈ జాతి గుడ్లగూబలు ‘ప్రిన్సిపి’ దీవిలో మాత్రమే ఉన్నట్లు తేల్చారు. అందువల్ల దీనికి ‘ప్రిన్సిపి స్కోప్స్ ఔల్’ అని పేరు పెట్టారు. ఈ గుడ్లగూబలు ఇతర జాతుల గుడ్లగూబల కంటే పరిమాణంలో కొంత చిన్నవిగా ఉంటాయి. మిగిలిన గుడ్లగూబలతో పోల్చితే వీటి కూత కూడా చాలా విలక్షణంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రిన్సిపి దీవికి చెందిన ఫారెస్ట్ రేంజర్ సెసిలియానో దొ బోమ్ జీసస్ అందించిన సమాచారంతో ఈ విలక్షణమైన గుడ్లగూబను గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం.. నెట్టింట ఫోటో వైరల్
ప్రపంచం అధూనీకత, టెక్నాలజీ, అభివృద్ధి అంటూ ముందుకు పోతోంది. ఓ వైపు బాగున్నా మరో వైపు మాత్రం అడవులను నరికేస్తూ, పర్యావరణ నాశనానికి కారణమవుతున్నాం. ఈ నేపథ్యంలో బయోడైవర్శిటీ పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ఇప్పటికే పలు రకాల పక్షులు, జంతువులు, ప్రాణుల అంతరిస్తూ వస్తున్నాయి. గతంలోని కొన్ని జాతుల పక్షులు, జంతువులు ప్రస్తుతం లేవు. ఇలాంటి పరిస్థితుల్లో.. తాజాగా ఓ అరుదైన పక్షి కనిపించి ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం దాన్ని ఫోటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..150 ఏళ్ల క్రితం కనిపించిన ఓ పెద్ద గుడ్లగూబ తాజాగా శాస్తవేత్తల కెమెరా కంటపడింది. అంటే ఆ జాతి పక్షి చివరి సారి 1872లో కనపడగా, ఆ తర్వాత ఇప్పుడే కనిపించింది. షెల్లీ ఈగల్ జాతికి చెందిన ఈ అరుదైన గుబ్లగూబ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటాయి. ప్రపంచంలోని గుడ్లగూబల కంటే వీటి ఆకారం పెద్దవి. ఇవి మనుషుల కంట పడి సుమారు 100 సంవత్సరాలు దాటడంతో అంతరించిపోయాయని అంతా అనుకున్నారు. అయితే.. అక్టోబర్ 16న లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ జోసెఫ్ టోబియాస్, సోమర్సెట్కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ విలియమ్స్ ఈ పక్షిని ఘనాలోని అటెవా అడవిలో చూశారు. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వెంటనే దాన్ని కెమరాతో క్లిక్ మనిపించారు. అయితే వారిద్దరూ ఈ పక్షిని కేవలం 15 సెకన్ల పాటు మాత్రమే చూడగలిగారు. ఆ పక్షి విలక్షణమైన నల్లని కళ్ళు, పసుపు రంగు బిల్ ఆకారంలో పెద్దదిగా ఉంది. ఈ అరుదైన పక్షి కోసం పశ్చిమ లోతట్టు ప్రాంతాలలో సంవత్సరాలుగా వెతుకుతున్నారు. తాజాగా తూర్పు ప్రాంతంలోని రిడ్జ్టాప్ అడవులలో దీనిని కనుగొనడం వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. First confirmed sighting of an extremely rare owl in Ghana's Atewa Forest in 150 years. Two British ecologists conducting research in the forest recently saw the Shelley's Eagle Owl (indigenous to Central & West Africa). The discovery could prompt the Atewa Forest to be protected pic.twitter.com/fQ6ININAuH— ghanaspora (@ghanaspora) October 23, 2021 చదవండి: Youtuber Pankaj Sharma: ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్ చేస్తే.. కోట్లు సంపాదిస్తున్నాడు..! -
గుడ్లగూబ తన జీవితకాలంలో ఎన్ని ఎలుకల్ని తింటుందో తెలుసా?
Owls Facts In Telugu: మనిషికి ఎప్పుడూ హాని చేయలేదు.. అసలు చేయలేవు కూడా. అయినా ఆ జీవుల్ని మనం అసహ్యించుకుంటాం. వాటిని చూస్తేనే అశుభంగా భావిస్తాం. మన సమీపంలో వాటి ఉనికినే తట్టుకోలేం.. అపనమ్మకాలతో వాటికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాం.. క్షుద్ర పూజల పేరుతో కొందరి అజ్ఞానానికి అవి బలవుతున్నా.. మనకు మాత్రం మేలే చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి.. ఎలుకల బారి నుంచి పంటల్ని రక్షిస్తున్నాయి.. తద్వారా మనకు ఆహార భద్రతనిస్తున్నాయి.. గుడ్లగూబలకు అటవీ, జనసంచారం లేని ప్రాంతాలు ఆవాసాలు. ప్రస్తుతం వాటి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా గుడ్లగూబలు రాత్రిపూట సంచరిస్తాయి.. అయితే కొన్ని జాతులు పగలు కూడా తిరుగుతాయి. వంద గడ్డిజాతి(బార్న్) గుడ్లగూబలు వాటి జీవిత కాలంలో తినే ఎలుకల వల్ల రెండు వేల మందికి ఆహార భద్రతను కల్పిస్తాయని అధ్యయనాల్లో తేలింది. అవి ఉన్న చోట ఎలుకల కోసం మందుల వాడకం తగ్గుతుంది. ఆ విధంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. రైతులకు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. పంటల దిగుబడీ పెరుగుతుంది. జీవితకాలం ఒకే జంటగా.. స్కాప్స్ వంటి చిన్న గుడ్లగూబలు 17 సెం.మీ. ఉంటే, ఇండియన్ ఈగిల్ వంటి గుడ్లగూబలు 60 సెం.మీ.వరకూ ఉంటాయి. గుడ్లగూబలకు పెద్ద కళ్లు ఉన్నాగానీ అవి వాటిని కదిలించలేవు. మెడను 270 డిగ్రీలకు తిప్పే అసాధారణ సామర్థ్యం వాటి సొంతం. దీని ద్వారానే అవి తమను తాము రక్షించుకుంటాయి. ఒక ఆడ, మగ గుడ్లగూబ జంట మనుషుల మాదిరిగానే జీవితకాలం కలిసుంటాయి. వాటి జీవితకాలం పదేళ్లయినా.. కొన్ని ఇంకా ఎక్కువ కాలమే బతుకుతాయి. అంతరించే దశలో పలు జాతులు పలు గుడ్లగూబ జాతులు ఆవాసాలను కోల్పోయి అంతరించే జాబితాలో ఉన్నాయి. మన దేశానికి చెందిన, టేకు అడవుల్లో నివాసముండే అడవి గుడ్లగూబ జాతి అంతరించిపోయిందని భావించారు. కానీ 1997లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వాటి ఉనికిని గుర్తించారు. ఇండియన్ ఈగిల్ గుడ్లగూబ కొండ ప్రాంతాల్లో జరిగే తవ్వకాల కారణంగా ఆవాసాలను కోల్పోతోంది. పట్టణ ప్రాంతాల్లో బార్న్ గుడ్లగూబలు ఎత్తయిన భవనాలు, అపార్ట్మెంట్ బ్లాకుల్లో గూళ్లు పెడతాయి. అపనమ్మకాలతో వాటి గూళ్లను నాశనం చేస్తున్నారు. కొన్ని గుడ్లగూబ జాతుల్ని వేటాడి అక్రమంగా రవాణా చేస్తున్నారు. గుడ్లగూబలకు 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో రక్షణ ఉంది. వాటిని వేటాడడం, వ్యాపారం చేయడం శిక్షార్హమైన నేరం. పర్యావరణానికి మేలు గుడ్లగూబల గురించి పిల్లలు, పెద్దలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అవి ఉంటే వాటి పరిసరాల్లో ఎలుకలుండవు. తద్వారా అనేక వ్యాధులను నివారించొచ్చు. సహజ ఎలుకల నియంత్రణ కోసం రైతులు తమ పొలాల్లో గుడ్లగూబలను ఆహ్వానిస్తే ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో వాటి గురించి ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చగలిగితే.. అందమైన పక్షులను కాపాడుకుని మన పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం. – బండి రాజశేఖర్, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి. పంట నేస్తం గుడ్లగూబ గురించి మరిన్ని విషయాలు.. మన దేశంలో 35 జాతులు. మన రాష్ట్రంలో 13 జాతులు. ఇండియన్ ఈగిల్ గుడ్లగూబ మన దేశంలో పెద్దది. నగరాలు, గ్రామాలు, అడవుల సమీపంలోని కొండలు దీనికి ఆవాసాలు. బార్న్ గుడ్లగూబ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే జాతి. నగరాల్లో ఎత్తయిన భవనాలపై గూళ్లు పెట్టుకుంటుంది. మచ్చల గుడ్లగూబ నగరాలు, గ్రామాలు, అడవులు, ఎడారుల్లో కనిపిస్తుంది. కీటకాలు, చిన్న చిన్న పక్షులు, ఎలుకల్ని తింటుంది. ఒక గుడ్లగూబ తన జీవితకాలంలో 11 వేల ఎలుకలను తింటుంది. ఆ ఎలుకలు 13 టన్నుల ఆహార పంటలను తినేస్తాయి. -
అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు!
న్యూయార్క్: న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ జూ పార్కులో అరుదైన జాతికి చెందిన మంచు గుడ్లగూబ సందడి చేస్తోంది. 130 ఏళ్ల క్రితం అమెరికాలో కనిపించిన ఈ జాతి గుడ్లగూబ మళ్లీ పార్కులో దర్శనమివ్వడంతో పక్షి ప్రేమికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని చుసేందుకు అక్కడకు క్యూ కడుతున్నారు. ఆ పక్షితో తీసుకున్న సెల్ఫీలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ గుడ్లగూబ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అరుదైన జాతి గుడ్లగూబను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘నమ్మలేకపోతున్నాం.. ఇది ఎంత అందంగా ఉంది’, ‘అరుదైన హిస్టారికల్ మంచు గుడ్లగూబను చూస్తుంటే అద్బుతంగా ఉంది’, ‘మళ్లీ దీనిని చూసే అవకాశం రావడం అదృష్టం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..) కాగా ఈ మంచు గుడ్లగూబలు సెంట్రల్ పార్కులో 1890లో అమెరికాలో ఎక్కువగా ఉండేవని, ఆ తర్వాత రానురాను అవి కనుమరుగయ్యాయని జూ నిర్వహకులు తెలిపారు. అమెరికా నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షిశాస్త్ర విభాగ కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు. అయితే ఇవి ఆర్కిటిక్ ప్రాంతంలోని టండ్రాల్లో నివసిస్తుంటాయని, శీతాకాలంలో మాత్రం దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక మంచు గుడ్లగూబను చూసేందుకు పర్యటకులంతా పొటెత్తుతున్నారు. దాంతో పర్యాటకులను చూసి ఆ గుడ్లగూబ భయాందోళనకు గురవుతుండంతో జూ అధికారులు వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఈ పక్షిని చూడాలంటే బైనాక్యులర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని పర్యాటకులకు సూచిస్తున్నారు. (చదవండి: ‘పులికి ఉన్న జ్ఞానం కూడా లేదు’) The SNOWY OWL of the Central Park North Meadow was not much bothered by the crows that gathered around it earlier and that have now returned. People are staying behind distant fences and being quiet and respectful. pic.twitter.com/BKjGPRiKCZ — Manhattan Bird Alert (@BirdCentralPark) January 27, 2021 -
గుడ్లగూబల విక్రయానికి యత్నం.. అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నల్లమల అడవి నుంచి గుడ్లగూబ పక్షులను తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 15 పక్షులను స్వాదీనం చేసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపిన మేరకు.. ఫలక్‌నుమా తీగలకుంట ప్రాంతంలో నివాసం ఉండే కమ్రాన్ అలీ ఫారూఖీ(22) ముర్గీచౌక్‌లో ఐదేళ్ల నుంచి పక్షులను విక్రయిస్తున్నాడు. అన్ని రకాల పక్షులపై అవగాహన పెంచుకున్న ఇతడు మంత్ర, తంత్ర శక్తులకు వినియోగించే పక్షులను కూడా అవసరమైన వారికి సమకూరుస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. తరచూ శ్రీశైలం నల్లమల అడవికి వెళ్లి పక్షులను పట్టుకొస్తుంటాడు. చదవండి: గుడ్లగూబ? గరుడ పక్షా? ఈ క్రమంలోనే దట్టమైన అడవిలోని నీటి గుంటల వద్ద కాపుగాసి 15 గుడ్లగూబలను పట్టుకొని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వీటిని అవసరమైన వారికి ఒక్కొక్కటి రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్ఐల బృందం ఎన్.శ్రీశైలం, మహ్మద్ తఖియుద్దీన్, కె.చంద్రమోహన్, వి.నరేందర్‌లు అటవీశాఖ అధికారులతో కలిసి ఫలక్‌నుమాలో అతన్ని అరెస్ట్ చేసి....15 పక్షులను కాపాడారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. -
గుడ్లగూబ? గరుడ పక్షా?..
వికారాబాద్ అర్బన్ :జిల్లాకేంద్రం వికారాబాద్‌లోని మారుతీనగర్‌లో బుధవారం ఓ అరుదైన పక్షి కనిపించింది. హనుమాన్ మందిరం వెనుకాల ఉన్న ఓ విద్యుత్ స్తంభంపై ఈ పక్షిని చూసిన స్థానికులు ఆసక్తిగా గమనించారు. పలువురు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పక్షిని పరిశీలించారు. ఆ పక్షి గుడ్లగూబ? గరుడ పక్షా? అని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని బర్డ్ వాచర్స్‌కు ఫొటోలు పంపి అసలు విషయం తెలుసుకున్నారు. బర్డ్ వాచర్స్ సమాచారం మేరకు అది గరుడపక్షి కాదని, ఓ రకమైన గుడ్లగూబని తెలిపారు. ఈ గుడ్లగూబ పాడుబడ్డ భవనాల్లోనే నివాసం ఉంటుందని, పగటి పూట ఎక్కువగా నిద్రలో ఉంటుందని చెప్పారు. -
బరువు తగ్గింది.. హాయిగా ఎగిరిపోయింది
-
బరువు తగ్గింది.. హాయిగా ఎగిరిపోయింది
లండన్ : మనుషులు అధిక బరువుతో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళితే కచ్చితమైన డైట్ పాటిస్తే బరువు తగ్గుతారంటూ చెప్పడం సహజంగా వింటుంటాం. అచ్చం అలాగే ఒక గుడ్లగూబ అధిక బరువుతో ఎగరలేక ఇబ్బంది పడుతుండడంతో దానిని పూర్వపు స్థితికి తీసుకువచ్చారు బ్రిటన్‌కు చెందిన కొందరు పక్షి సంరక్షణ అధికారులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం. ఇంకెందుకు ఆలస్యం వార్త మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది. బ్రిటన్‌కు చెందిన సఫోల్క్ వోల్ సాంచురి అధికారులు కొన్ని వారాల క్రితం అభయారణ్యంలో సంచరిస్తుండగా ఒక గుడ్లగూబ ఎగరలేక అవస్థలు పడుతోంది. దానిని పరిశీలించి చూడగా 245 గ్రాముల బరువు ఉన్నట్లు తేలింది. మిగతావాటి కంటే మూడు రెట్లు అధికంగా ఉండడంతో ఎగరడానికి ఇబ్బంది పడుతుందని గుర్తించారు. ఇంకేముంది బరువు తగ్గించాలని భావించిన అధికారులు గుడ్లగూబకు కేజ్ ఏర్పాటు చేసి కొన్ని వారాల పాటు డైటింగ్ చేయించి దాని బరువు తగ్గించి మళ్లీ అభయారణ్యంలో వదిలేశారు. అయితే ఇదంతా వారు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసుకున్నారు.'కొన్ని వారాల కింద మాకు గుడ్లగూబ దొరికినప్పుడు ఎగరడానికి చాలా ఇబ్బంది పడింది. అయితే దెబ్బ తగలడంతో ఎగరలేకపోతుందేమోనని భావించాం. కానీ దాని బరువు మిగతావాటి కంటే అధికంగా ఉండడంతోనే ఎగరలేకపోతుందని గుర్తించాం. కొన్ని వారాల పాటు దానిని మా సంరక్షణ కేంద్రంలో ఉంచి డైటింగ్ చేయించడంతో బరువు తగ్గి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఈరోజు దానిని కేజ్ నుంచి విడుదల చేయగానే ఒక్కసారిగా మాకు దొరకకుండా ఎగిరిపోయింది' అంటూ పోస్ట్ పెట్టారు. -
ట్రెండు మారినా.. ఫ్రెండు మారడే..
ఒక్క తల్లి సంతానమైన మనలాగ ఉండగలరా..? ఒకరు కాదు మనమిద్దరంటె ఎవరైన నమ్మగలరా.. ఏ పుణ్యం చేశానో నే నీ స్నేహం పొందాను.. నీ చెలిమి రుణం తీరేనా.. ఇది ఓ సినిమాలోని పాట అయినా స్నేహం తియ్యదనాన్ని ఎంత కమ్మగా వివరించాడో కదా ఆ కవి..! ఫొటోలో ఉన్న కుక్క పేరు ఇంగో.. ఆ గుడ్లగూబ పేరు పొల్డి.. జాతులు వేరైనా వాటి మధ్య స్నేహం చిగురించింది. ఇవి రెండూ ఒకరిని విడిచి ఒకటి నిమిషమైనా ఉండలేనంత దృఢంగా మారిపోయింది వారి స్నేహం. టాంజా బండిట్ అనే ఫొటోగ్రాఫర్ వీటిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. జంతు ఫొటోగ్రాఫర్ అయిన బండిట్ ఇంగో.. పొల్డిల ఫొటోలను తీసి ఫేస్బుక్లో పెట్టాడు. దీంతో వారి స్నేహానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. -
ఇంటికి కాపలా.. 'ఈ' గుడ్ల గూబ
ఇప్పుడు దొంగలనుంచి మీ ఇంటిని రక్షించే కొత్త గుడ్ల గూబ సెక్యూరిటీ కెమెరా మీకు అందుబాటులోకి రానుంది. ఈ కెమెరా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ఫుటేజ్ ను మీ స్మార్ట్ ఫోన్ కు పంపుతుంటుంది. అచ్చం గుడ్లగూబ కళ్ళలా కనిపించే ఇందులోని రెండు ఎల్ ఈ డీ స్క్రీన్లు వాచ్ నుంచి విషయాన్ని ఫోన్ కు పంపేందుకు ఉపయోగ పడతాయి. వైఫై నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు ఫుటేజ్ ను రికార్డు చేసి ఈ మెయిల్ పంపిస్తుంది. గుడ్లగూబలా కనిపించే ఈ కెమెరా 270 డిగ్రీల్లో చుట్టూ దాదాపు పరిసరాలన్నింటిపై నిఘా పెట్టి ఉంచగలదు. ఓ ఫ్రెంచ్ డిజైనర్ రూపొందించిన ఈ పక్షి రూపంలోని కెమెరా ఇంటరాక్టివ్ హోమ్ మానిటరింగ్ సిస్టమ్ కలిగి ఉండి, ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించే వీలుంది. ఇది కంటి కదలికలతో మొబైల్ ఫోన్ కు కనెక్ట్ అవుతుంటుందని దీని సృష్టికర్త.. వివెన్ ముల్లర్ చెప్తున్నారు. ఎటువంటి చిత్రాలు, ఐకాన్లు దీని స్క్రీన్లపై కనిపించవు. ఈ పరికరంలోని రెండు అద్దాలు ముక్కులాగా ఉండి, అంతర్నిర్మితంగా మోషన్ సెన్సార్ కలిగి ఉన్న గుడ్ల గూబ కళ్ళను బయటకు కనిపించకుండా చేస్తాయి. దీనిలోని ఎల్ ఈ డీ స్క్రీన్లు (కళ్ళు) మీకు ఏం చెప్పాలనుకుంటోందో తెలియజేస్తుంటాయి. దీని కళ్ళ రంగును, ఆకారాన్ని కంపెనీ వెబ్ సైట్ నుంచి గాని, యాప్ నుంచి గాని గుర్తించవచ్చు. ఇది కళ్ళు వాల్చి నిద్రపోతున్నట్లుగా కనిపిస్తే బ్యాటరీ డౌన్ అయినట్లుగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా యాప్ నుంచి ఫోటో తీస్తే... కళ్ళు ఎవరినో అనుసరిస్తున్నట్లుగానూ... వీడియో చూస్తుంటే.. మెల్లకన్ను లాగానూ దీని కదలికలు కనిపిస్తుంటాయి. ఈ గుడ్లగూబ పరికరం వాటర్ ప్రూఫ్ తో బయట ఉంచినప్పుడు సుమారు 14 డిగ్రీల ఫారన్ హీట్ నుంచి, 122 డిగ్రీల వరకు తట్టుకునేట్లు ఉంటుంది. తలపై చిన్నగా కొడితే యాక్టివేట్ అయ్యే ఈ పరికరంలో బ్యాటరీ వారానికోసారి ఛార్జి చేయాల్సి వస్తుంది. ఒకవేళ వైఫై లేకుండా దీన్ని వినియోగించాలనుకుంటే.. దీని నుదుటిపై చిన్నగా రెండుసార్లు కొడితే చాలు అలర్ట్ మోడ్ లోకి మారుతుంది. స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని సమయంలో ప్రతి విషయాన్నీయానిమేటెడ్ జిఫ్ గా రికార్డు చేసి ఈ మెయిల్ కు పంపుతుంది. మరో రూమ్ లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఈ పరికరం సులభ మార్గమని ముల్లర్ చెప్తున్నారు. ఈ ఆకట్టుకునే కొత్త గుడ్లగూబ నిఘా కెమెరా 2016 నవంబర్ నాటికి సుమారు ఎనిమిది వేల రూపాయలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మద్దతుదారులు చెప్తున్నారు. -
దోబూచులాటేలరా!
చెట్టు చాటున దాక్కుని దొంగా పోలీస్ ఆట ఆడుతున్నట్లు కనిపిస్తోంది కదూ.. నక్కి నక్కి దొంగ చూపులు చూస్తున్న ఈ గుడ్లగూబ. ఒంటరిగా ఉండాలనుకునే గుడ్లగూబలను ఎలాగైనా కెమెరాలో బంధించాలనుకున్నాడు జిరీ మిచల్ అనే ఫొటో గ్రాఫర్. ఆయన చెక్ రిపబ్లిక్‌లోని వైసోకా గ్రామంలో ఉన్న ఓ పార్క్‌లో నడుచుకుంటూ వెళుతుండగా ఇలా దోబూచులాడుతూ ఈ గుడ్లగూబ కనిపించిందట. ఇంకేం మనోడు వెంటనే కెమెరాకు పని చెప్పాడు. -
నిజం చెప్పు.. నువ్వు మంత్రగత్తెవేగా?
ఇక్కడేం జరుగుతోందో తెలుసా? ఈ గుడ్లగూబను పంజరంలో పెట్టి విచారిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇది ఓ మహిళ అట.. పైగా.. మంత్రగత్తె కూడానట.. మానవ రూపం వదిలి ఇలా పక్షి రూపం ధరించిందట.. మేం నిన్ను వదిలిపెట్టాలంటే.. నువ్వు నీ అసలు రూపాన్ని ధరించు అంటూ జనం గద్దిస్తుంటే.. అసలేం జరుగుతుందో తెలియని ఈ మూగప్రాణి.. భయంతో అల్లాడిపోయింది. మూఢనమ్మకాలకు పరాకాష్టగా నిలిచే ఈ ఘటన మెక్సికోలోని డ్యూరాంగో గ్రామంలో జరిగింది. ఈ గుడ్లగూబ ఓ గ్రామస్తుడి ఇంట్లోకి తొంగి చూసిందని.. శాపాలు పెట్టిందని ఆరోపిస్తూ గ్రామస్తులు దీన్ని పంజరంలో బంధించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదనే ఆగ్రహంతో చివరకు ఈ పక్షిని తగులబెట్టేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను గ్రామస్తుల్లో ఒకరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పైగా.. తాము చేసింది తప్పుకాదన్నట్లు ఆ గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడారు. విచారణ సందర్భంగా గుడ్లగూబ ఏడ్చిందని.. అంటే అది మంత్రగత్తేనని.. తన అసలు రూపం బయటపడిపోతుందనే అది అలా రోదించిందని వారు వాదిస్తున్నారు. మెక్సికోలోని చాలా గ్రామాల్లో మహిళల్లో కొందరు మంత్రగత్తెలుంటారని.. జంతువులు లేదా పక్షులుగా మారే శక్తులు వారికుంటాయని నమ్ముతారు.