వికారాబాద్ అర్బన్ :జిల్లాకేంద్రం వికారాబాద్‌లోని మారుతీనగర్‌లో బుధవారం ఓ అరుదైన పక్షి కనిపించింది. హనుమాన్ మందిరం వెనుకాల ఉన్న ఓ విద్యుత్ స్తంభంపై ఈ పక్షిని చూసిన స్థానికులు ఆసక్తిగా గమనించారు. పలువురు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పక్షిని పరిశీలించారు. ఆ పక్షి గుడ్లగూబ? గరుడ పక్షా? అని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని బర్డ్ వాచర్స్‌కు ఫొటోలు పంపి అసలు విషయం తెలుసుకున్నారు. బర్డ్ వాచర్స్ సమాచారం మేరకు అది గరుడపక్షి కాదని, ఓ రకమైన గుడ్లగూబని తెలిపారు. ఈ గుడ్లగూబ పాడుబడ్డ భవనాల్లోనే నివాసం ఉంటుందని, పగటి పూట ఎక్కువగా నిద్రలో ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment