నిజం చెప్పు.. నువ్వు మంత్రగత్తెవేగా? | tell the truth .. you spellbound? | Sakshi
Sakshi News home page

నిజం చెప్పు.. నువ్వు మంత్రగత్తెవేగా?

Published Fri, Aug 8 2014 3:34 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

నిజం చెప్పు.. నువ్వు మంత్రగత్తెవేగా? - Sakshi

నిజం చెప్పు.. నువ్వు మంత్రగత్తెవేగా?

ఇక్కడేం జరుగుతోందో తెలుసా? ఈ గుడ్లగూబను పంజరంలో పెట్టి విచారిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇది ఓ మహిళ అట.. పైగా.. మంత్రగత్తె కూడానట.. మానవ రూపం వదిలి ఇలా పక్షి రూపం ధరించిందట.. మేం నిన్ను వదిలిపెట్టాలంటే.. నువ్వు నీ అసలు రూపాన్ని ధరించు అంటూ జనం గద్దిస్తుంటే.. అసలేం జరుగుతుందో తెలియని ఈ మూగప్రాణి.. భయంతో అల్లాడిపోయింది. మూఢనమ్మకాలకు పరాకాష్టగా నిలిచే ఈ ఘటన మెక్సికోలోని డ్యూరాంగో గ్రామంలో జరిగింది. ఈ గుడ్లగూబ ఓ గ్రామస్తుడి ఇంట్లోకి తొంగి చూసిందని.. శాపాలు పెట్టిందని ఆరోపిస్తూ గ్రామస్తులు దీన్ని పంజరంలో బంధించారు.

తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదనే ఆగ్రహంతో చివరకు ఈ పక్షిని తగులబెట్టేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను గ్రామస్తుల్లో ఒకరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. పైగా.. తాము చేసింది తప్పుకాదన్నట్లు ఆ గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడారు. విచారణ సందర్భంగా గుడ్లగూబ ఏడ్చిందని.. అంటే అది మంత్రగత్తేనని.. తన అసలు రూపం బయటపడిపోతుందనే అది అలా రోదించిందని వారు వాదిస్తున్నారు. మెక్సికోలోని చాలా గ్రామాల్లో మహిళల్లో కొందరు మంత్రగత్తెలుంటారని.. జంతువులు లేదా పక్షులుగా మారే శక్తులు వారికుంటాయని నమ్ముతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement