గుడ్లగూబ పరుగులు చూశారా? | Have you ever Seen an Owl Running | Sakshi
Sakshi News home page

Owl Running: గుడ్లగూబ పరుగులు చూశారా?

Published Fri, Dec 1 2023 1:37 PM | Last Updated on Fri, Dec 1 2023 1:53 PM

Have you ever Seen an Owl Running - Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌ వీడియోలకు కొదవేంలేదు. తాజాగా గుడ్లగూబకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గుడ్లగూబ పరిగెత్తడాన్ని చూడవచ్చు. నేటి రోజుల్లో గుడ్లగూబను చూడటమే అంత్యంత అరుదు. ఎప్పుడైనా కనిపించినా అది చెట్టుపైనే కనిపిస్తుంది.

అయితే ఒక గుడ్లగూబ నేలపై పరిగెత్తడాన్ని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇంటిలోపల గుడ్లగూబ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ గుడ్లగూబను చూసిన తర్వాత అది ఆ ఇంటిలోని వారి పెంపుడు జంతువు అని అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన  చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా చాలామంది జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడతారు. 

ఈ వీడియోను అమేజింగ్‌ నేజర్‌ అనే పేరుగల ట్విట్టర్‌ యూజర్‌ షేర్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. ఒక యూజర్‌ ‘ఇది  అద్భుతమైన వీడియో’ అని రాయగా, మరొకరు ‘నేను మొదటిసారిగా గుడ్లగూబ నడవటాన్ని చూస్తున్నాను’ అని రాశారు. 
ఇది కూడా చదవండి: లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement