Views
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఒక్క రోజులోనే క్రేజీ రికార్డ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. విడుదలకు మరో రెండు నెలల టైమ్ ఉండడంతో వరుస మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అంతకుముందు పొంగల్ బరిలో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆ మూవీ పోటీ నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ రేసులో నిలిచింది. మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Crazy 55 Million+ Views ♥️Off the charts, right into the audience’s hearts😍#GameChangerTeaser 💥🔗 https://t.co/ihtvtgPel9In cinemas worldwide from 10th Jan.GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/dQmzVtVtFU— Sri Venkateswara Creations (@SVC_official) November 10, 2024 -
ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ మరో రికార్డు!
అయోధ్యలోని నూతన రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ ఈ రికార్డులలో అగ్రస్థానంలో నిలిచింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్‌గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది. రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకను నరేంద్ర మోదీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా తొమ్మిది మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అన్ని యూట్యూబ్ ఛానళ్ల లైవ్ స్ట్రీమ్ వీక్షణలలో ఇదే అత్యధిక రికార్డ్‌గా నిలిచింది. నరేంద్ర మోదీ ఛానెల్లో రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక ‘PM Modi LIVE | Ayodhya Ram Mandir LIVE | Shri Ram Lalla Pran Pratishtha’ and ‘Shri Ram Lalla Pran Pratishtha LIVE’ టైటిల్స్‌తో ప్రత్యక్ష ప్రసారమైంది. నరేంద్రమోదీ ఛానెల్లోని ఈ లైవ్‌కి ఇప్పటివరకు మొత్తం ఒక కోటి వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఇదే ఛానల్లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని 80 లక్షల మందికి పైగా జనం వీక్షించారు. ఈ రికార్డులలో మూడవ స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ 2023 మ్యాచ్, నాలుగవ స్థానంలో యాపిల్ లాంచ్ ఈవెంట్ నిలిచాయి. నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లు. ఇప్పటివరకూ ఈ ఛానల్లో మొత్తం 23,750 వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ వీడియోల మొత్తం వీక్షణలు 472 కోట్లు. యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లను దక్కించుకున్న ప్రపంచంలోని మొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. -
మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఛానల్ సబ్స్రైబర్లు రెండు కోట్లు దాటారు. ప్రపంచంలో ఈ ఘనత దక్కిన నేత నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో మోదీ ఈ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు దీనిని వినియోగిస్తూనే ఉన్నారు. ఇందులో పోస్టు చేసిన వీడియోలకు 450 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఛానల్ సబ్‌స్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో 64 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. వ్యూస్ అంశంలో మోదీ తర్వాత ఉక్సెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నారు. జెలెన్ స్కీ పోస్టు చేసిన వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది ఉన్నారు. ఇదీ చదవండి: అఫీషియల్: మణిపూర్ నుంచి ముంబై దాకా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయయాత్ర’ -
భారత్ పురోగతిపై యువత అభిప్రాయాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై యువత అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ‘‘భారతదేశం తన చరిత్రలో కీలక మలుపులో ఉంది’’ అని ఆయన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ పేర్కొన్నారు. యథాతథ విధానాలు వ్యాపార రంగం పురోగతికి దోహదపడవని అన్నారు. యువతసహా ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను పంపడానికి ఒక వెబ్ పేజీ ఒక నెలపాటు లైవ్‌లో ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. -
గుడ్లగూబ పరుగులు చూశారా?
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవేంలేదు. తాజాగా గుడ్లగూబకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గుడ్లగూబ పరిగెత్తడాన్ని చూడవచ్చు. నేటి రోజుల్లో గుడ్లగూబను చూడటమే అంత్యంత అరుదు. ఎప్పుడైనా కనిపించినా అది చెట్టుపైనే కనిపిస్తుంది. అయితే ఒక గుడ్లగూబ నేలపై పరిగెత్తడాన్ని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇంటిలోపల గుడ్లగూబ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ గుడ్లగూబను చూసిన తర్వాత అది ఆ ఇంటిలోని వారి పెంపుడు జంతువు అని అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా చాలామంది జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడతారు. ఈ వీడియోను అమేజింగ్ నేజర్ అనే పేరుగల ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్ ‘ఇది అద్భుతమైన వీడియో’ అని రాయగా, మరొకరు ‘నేను మొదటిసారిగా గుడ్లగూబ నడవటాన్ని చూస్తున్నాను’ అని రాశారు. ఇది కూడా చదవండి: లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం? Have you ever seen a owl run ? pic.twitter.com/roSdhAUSyX — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 30, 2023 -
ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని..
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో ముగ్గురు యువకులు బైక్‌పై మొహాలు కనబడకుండా న్యూస్ పేపర్లు చుట్టుకొని వేములవాడ వీధుల గుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరగడంతో.. పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు వారిని వెంబడించి పట్టుకొని ప్రశ్నించగా తాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామని, ప్రమోషన్ కోసం వీడియో షూట్ చేశామని తెలిపారు. ఆ మాటలు విన్న పట్టణ వాసులు ఒక్కసారిగా అవాక్కై.. ఒకింత చిరాకు పడ్డారు. ఇదేం పిచ్చి రా బాబోయ్ అంటూ తలలు పట్టుకున్నారు. చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
వేడి వేడి ఉల్లి పుష్పము
పకోడీలు, బజ్జీలు తెలుసు. కాని ఉల్లిపాయను తామరపువ్వులా ఒలిచి శనగపిండిలో కలిపి నూనెలో వేయించి ఉల్లి పుష్పంగా తయారు చేసి సర్వ్ చేస్తే 11 లక్షల వ్యూస్ లొట్టలేశాయి. వడోదర స్ట్రీట్‌ఫుడ్‌లో తాజా హల్చల్ ఇది. స్ట్రీట్‌ఫుడ్ ఎంత నోరూరించేదిగా ఉన్నా శుభ్రత పాటించరనే కంప్లయింట్‌తో కొందరు తినరు. కాని వడోదరలోని ఈ తాజా చిరుతిండి హల్చల్ చేయడమే కాక అందరి మన్ననా పొందింది. ‘చేస్తే ఇంత శుభ్రంగా చేయాలి’ అనే మెచ్చుకోలు అందుకుంది. వడోదర (గుజరాత్)లోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన స్టాల్ పెట్టి ఈ ‘ఉల్లి పుష్పం’ (ఉల్లి బజ్జీ) అమ్ముతున్నారు. ఇందుకు పెద్దసైజు ఉల్లిగడ్డలను వాడుతున్నారు. వాటిని పువ్వులా కట్ చేసే మిషన్‌ను తయారు చేయించుకున్నారు. శుభ్రంగా వొలిచిన ఉల్లిపాయను ఈ మిషన్ కింద పెడితే పువ్వులా రెక్కలు వచ్చేలా కట్ చేస్తుంది. దానిని శనగపిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతున్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అంతే కాదు చేస్తున్న పద్ధతి శుభ్రంగా ఉండటంతో సంకోచం లేకుండా తింటున్నారు. ఒక వ్లోగర్ ఈ ఉల్లిపువ్వు బజ్జీ తయారీని వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే క్షణాల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘కొత్త కొత్త ఆలోచనలే వ్యాపారాన్ని నిలబెడతాయి’ అంటున్నారు. అందరి దగ్గరా ఉల్లిపాయలు ఉంటాయి. అందరూ బజ్జీలు వేస్తారు. కాని ‘ఉల్లిపువ్వు బజ్జీ’ అనే ఐడియా వీరికే వచ్చింది. ఆ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్తగా ఆలోచించండి... పెద్ద విజయం సాధించండి... అని ఈ ఉల్లిపువ్వు కరకరలాడుతూ సందేశం ఇస్తోంది. -
'సలార్' vs 'జవాన్'.. ఇదెక్కడి గొడవరా బాబు!?
Prabhas Vs Shah Rukh Khan: షారుక్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ రిలీజై రోజు గడిచిపోయింది. ఎలా ఉందనేది పక్కనబెడితే యూట్యూబ్‌లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే 24 గంటల్లో వచ్చిన వ్యూస్ గురించి చెబుతూ నిర్మాతలు పోస్ట్ పెట్టారు. అన్నిచోట్ల కలిపి ఏకంగా 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. అదుగో అక్కడే అసలు గొడవ మొదలైంది. ఉదయం నుంచి ఇప్పటికీ ఆయా హీరోల అభిమానులు ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు. నంబర్లు సరిపోలే సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ vs షారుక్ ఫ్యాన్స్ అనే పరిస్థితి కనిపిస్తుంది. జూలై 6న ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదలైంది. ఈ వీడియోలో ప్రభాస్, 10 సెకన్లకు మించి కనిపించలేదు. అయితేనేం 24 గంటల్లో 83 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ నంబర్స్ యూట్యూబ్‌లో కనిపించాయి. 'జవాన్' ట్రైలర్‌కి 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చెప్పారు కానీ ఆ నంబర్ కనిపించలేదు. (ఇదీ చదవండి: 'జవాన్' ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!) గొప్పతనం గొడవ! 'జవాన్' నిర్మాతలు.. 24 గంటల్లో వచ్చిన వ్యూస్ గురించి గ్రాండ్ గా ప్రకటించుకోవడం వరకు బాగానే ఉంది. కానీ యూట్యూబ్ వ్యూస్‌లో చాలా డిఫరెన్స్ కనిపించింది. 55 మిలియన్ల వ్యూస్(హిందీ, తెలుగు, తమిళం కలిపి) మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, షారుక్ ఫ్యాన్స్.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఒకటే ట్వీట్స్ చేసుకుంటున్నారు. దీంతో ఇదెక్కడి దిక్కుమాలిన గొడవరా బాబు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. రెండూ సెప్టెంబరులోనే షారుక్ ఖాన్ 'జవాన్'.. సెప్టెంబరు 7న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. 'పఠాన్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో కలెక్షన్స్ పరంగా గట్టి అంచనాలున్నాయి. మరోవైపు సెప్టెంబరు 28న 'సలార్' చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. ప్రశాంత్ నీల్ దీనికి డైరెక్టర్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తన్నుకుంటున్నారు కానీ ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం రెండు హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాడు. The Dinosaur takes over @YouTubeIndia by storm ❤️🔥#SalaarTeaser hits a whooping 83 Million+ Views in 24 Hours! ▶️ https://t.co/l45lXHFzzD#SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/KsJbFuDJLV — Salaar (@SalaarTheSaga) July 7, 2023 The love for Jawan keeps growing! Thank you all ❤️ #JawanPrevue Out Now - https://t.co/CUWX1S7sQ4 #Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/gEz8hMgonA — Red Chillies Entertainment (@RedChilliesEnt) July 11, 2023 Top7 Most Viewed Indian Trailers [All Languages] In 24hrs: 1. #KGF2 - 106.5M 2. #Adipurush - 74M🔥 3. #RadheShyam - 57.5M❤️❤️ 4. #Jawan- 55M** 5. #RRRMovie- 51.1M 6. #TuJhoothiMainMakkaar- 50.9M 7. #Saaho - 49M 🥵💥 What are your expectations on #Salaar Trailer!?🔥🔥#Prabhas pic.twitter.com/syhJJrvDAS — Prabhas ERA™ (@Prabhas_ERA) July 11, 2023 #Jawan - 50 M Views in 24 Hours Across All Languages. (At 10 30 am)#Salaar - 83 M Views in 24 Hours. (At 5 12 am)#SRK𓃵 is a Super-Star, but #Prabhas is a madness.#SalaarCeaseFire #SalaarTeaser #JawanPrevue #JawanTrailer @hombalefilms @RedChilliesEnt @iamsrk @PrabhasRaju pic.twitter.com/vpeGqLf2WC — Akand Sitra (@AkandSitra) July 11, 2023 September Release Book My Show Interests #SALAAR With Just A Small Teaser 188.6K💥🌋 And Haqla #Jawan With Good Trailer Cut 110.6K 👎 Prabhas Ra Lucha 🦖🔥 Shahrukh Khan Gadni Egaresi Dengutam pic.twitter.com/wMWUnxXuH2 — Alex Jurrasic Park 🦖 (@PBRuless) July 11, 2023 Wikipedia page views of some Indian actors. #Jawan #Tiger3 #Leo #Salaar #Fighter pic.twitter.com/YPNKG1ajga — ᴜsᴇʀ ɪs ʜʏᴘᴇᴅ ғᴏʀ Leoᴸᶜᵁ (@JD_Jaffna) July 11, 2023 (ఇదీ చదవండి: ఫైట్ మాస్టర్ అరెస్ట్.. ఆ వీడియో వల్లే ఇదంతా) -
నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు!
ఆమె భర్త ఏ పనిచేస్తాడో? అసలు పనిచేస్తాడో లేదో కూడా తెలియదు. ఆమె మాత్రం బతుకుదెరువు కోసం ఇ–రిక్షా నడుపుతుంది. ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో పిల్లాడిని ఒళ్లో పడుకోబెట్టుకొని ఇ–రిక్షా నడుపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమె వీడియో క్లిప్ 2.8 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులను భావోద్వేగానికి గురి చేసింది. ‘ఈ వీడియో చూసి నా గుండె చెరువు అయింది’ ‘ఆమె చాలా రిస్క్ తీసుకుంటోంది. పిల్లాడిని బేబీ కేర్ సెంటర్లో చేరిస్తే మంచిది’ ‘దగ్గర్లో ఉన్న దాతలు ఎవరైనా ఆమెకు బేబీ క్యారియర్ ఇప్పిస్తే బాగుంటుంది’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు. -
‘పుష్ప -2’ టీజర్.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్ షేక్
‘పుష్ప -2’ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పులి సీన్ అయితే టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్ మిలియన్‌కు పైగా వ్యూస్ రాబట్టిం ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. హిందీలో అయితే ఏకంగా 35 మిలియన్లు రావడం మరో విశేషం. తెలుగులో 22 మిలియన్స్‌తో రెండోస్థానంలో ఉంది. అంతే కాకుండా ఈ టీజర్ 2.48 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. మొత్తానికి బన్నీ టీజర్‌తోనే రికార్డుల మోత మోగిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ పాజిల్, సునీల్, అనసూయ తదితరలు కీలక పాత్రలు పోషించారు. It is Icon Star @alluarjun's Blockbuster RULE 🔥🔥#Pushpa2TheRule Glimpse trending all over with 64M+ views and 2.48M+ likes 💥💥 - https://t.co/eNEiADQGP0@iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/TRipwCp5a2 — Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2023 -
ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!
మీరెప్పుడైనా నిద్రపోతున్నా.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? కానీ వీళ్లు మాత్రం అలాగే అనుకున్నారు. అలా అని ఊహల్లో తేలిపోలేదు. రేయిం భవళ్లు శ్రమించారు. గంటల నిడివి గల వీడియోల్ని తీశారు. ఇష్టా ఇష్టాల్ని వదులుకున్నారు. మేం యూట్యూబర్లం అని చెబితే తేలిగ్గా తీసి పారేసిన వాళ్ల ముందు.. శ్రీ శ్రీ చెప్పినట్లు కన్నీళ్ళు కారుస్తూ కూర్చోలేదు. చెమట చుక్కని చిందించారు. మనదేశ యూట్యూబ్ చరిత్రలో నిలిచిపోయేలా ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. ఇప్పుడు అలాంటి వారిలో ప్రముఖులైన దేశీయ యూట్యూబర్ల గురించి, వారి ఆదాయం గురించి తెలుసుకుందాం. గౌరవ్ చౌదరి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 30 ఏళ్ల గౌరవ్ చౌదరి వరల్డ్ లార్జెస్ట్ యూట్యూబర్‌గా చెలామణి అవుతున్నాడు. దుబాయ్ బిట్స్ ఫిలానీ క్యాంపస్‌లో ఎంటెక్ (మైక్రో ఎలక్ట్రానిక్) చదివాడు. దుబాయ్‌లో ఉంటూ ఆ దేశ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్నాడు. మరో పక్క 'టెక్నికల్ గూరూజీ' యూట్యూబ్ ఛానల్ పేరుతో టెక్నాలజీపై వీడియోలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు 22.1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫోర్బ్స్ ఇండియా అండర్-30 జాబితాలో గౌరవ్ చోటు సంపాదించుకున్న అతని నెలవారీ సంపాదన కోటి రూపాయిలకు పైగా ఉంటుంది. అతని ఆస్తుల విలువ అక్షరాల 50 మిలియన్ డాలర్లు . మన దేశ కరెన్సీలో (రూ.300కోట్లుకు పై మాటే) క్యారీ మినాటీ పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లు హర్యానాలోని ఫరిదాబాద్‌కు చెందిన 23ఏళ్ల క్యారీ మినాటీ రెండు ఛానెళ్లను నిర్వహిస్తున్నాడు. క్యారీ మినాటీ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్లో అదిరిపోయే కామెడీ స్కిట్లు చేస్తుంటే..క్యారీస్ లైవ్ పేరుతో గేమింగ్ ఛానెల్ నడుపుతున్నాడు.10ఏళ్ల వయస్సు నుంచే యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు. బాలీవుడ్ యాక్టర్ సన్నిడియోల్‌ను ఇమిటేట్ చేయడంలో దిట్ట. అందుకే చదువు మధ్యలోనే వదిలేశాడు. చదివింది 10వ తరగతే అయినా (ఇంటర్ ఎగ్జామ్స్ భయంతో మధ్యలోనే చదువు వదిలేశాడు) 2014 నుంచి వీడియోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అతని ఆదాయం నెలకు రూ.16లక్షలకు పై మాటే. ప్రస్తుతం క్యారీ మినాటీ యూట్యూబ్ ఛానెల్‌కు 35.9 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. క్యారీస్లైవ్కు 11.1మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లతో రాణిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని ఆస్తుల విలువ అక్షరాల 3.5 మిలియన్లు. అంతే కాదండోయ్ ఏప్రిల్ 2020 ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో ఆసియా నుంచి క్యారీ చోటు దక్కించుకున్నాడు. భువన్ బామ్ భువన్ బామ్. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన 28 ఏళ్ల భువన్ బామ్ బీవీ కి వినీష్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తున్నాడు. ఢిల్లీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఓవైపు వీడియోలు చేస్తూనే మరోవైపు మింత్రాతో పాటు ఇతర సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్‌గా పనిచేస్తున్నాడు. బిజినెస్ కనెక్ట్ ఇండియా-2021 ప్రకారం..అతని ఆస్తుల విలువ అక్షరాల 3మిలియన్లు. భారత్ కరెన్సీలో రూ.25 కోట్లుగా ఉంది. ఇక నెలవారీ సంపాదన రూ.కోటి పై మాటే. ఆశిష్ చంచలాని ఆశిష్ చంచలాని. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ల్ఫుయన్సర్. నేవి ముంబై దత్తా మేఘే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. అశిష్ చంచలానికి వినిస్ పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 28.3 మిలియన్ మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నెలకు 115,000 డాలర్ల నుంచి 180,000 డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. అమిత్ భదానా అమిత్ భదానా 27ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సౌత్ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్ నివాసి.ప్రస్తుతం అమిత్ 'అమిత్ భదానా' అనే యూట్యూబ్ ఛానెల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్‌ను అప్లోడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు 24 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా..అలా అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్, డిస్ప్లే అయ్యే యాడ్స్ కారణంగా ప్రతి వీడియోకి రూ.10 లక్షలు సంపాదిస్తాడని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక అతని ఆస్తులు అక్షరాల రూ.44కోట్లు. Amit Bhadana: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
భారత్–పాక్ మ్యాచ్ బ్లాక్‌బస్టర్ వ్యూస్.. టీ20 హిస్టరీలోనే అత్యధికం..
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ టీవీ ప్రేక్షకుల వీక్షణపరంగా రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను టెలివిజన్ ద్వారా 16 కోట్ల 70 లక్షల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ప్రకటించింది. టి20 క్రికెట్ చరిత్రలో ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించిందని... 2016 టి20 ప్రపంచకప్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకుల సంఖ్యను ఇది దాటిందని ఐసీసీ పేర్కొంది. చదవండి: IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ -
17 కోట్ల 70 లక్షల మంది చూశారు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా గత నెలలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను కోట్ల మంది తిలకించారు. జూన్‌లో జరిగిన ఫైనల్‌ను ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల 70 లక్షల మంది టీవీల్లో వీక్షించినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీలో జరిగిన అన్ని సిరీస్‌ల్లో కంటే ఫైనల్ పోరునే ఎక్కువ మంది చూసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇందులో సింహభాగం భారత ప్రేక్షకులే ఉన్నట్లు ఐసీసీ తెలిపింది. -
విజయ్ వ్యూహం
ప్రజల జీవితాల్లో అలజడి సృష్టించిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏసీపీ విజయ్‌వర్మ ఓ ప్లాన్ వేశాడు. విజయ్ వ్యూహం ఎలా ఉంటుందో ‘వైల్డ్ డాగ్’లో చూడొచ్చు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. వరుస బాంబు దాడులతో దేశంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులను తన టీమ్‌తో విజయ్ వర్మ ఎలా తుదముట్టించాడనే విషయాన్ని సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటికే 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ఎన్ .ఎం. పాషా, జగన్మోహన్ వంచా సహ నిర్మాతలు. -
రెచ్చిపోదాం
కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఏకే జంపన్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. వీవీ లక్ష్మి, హనీష్ బాబు ఉయ్యూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. సాయి కార్తీక్ స్వరాలను అందించారు. మా సినిమా లిరికల్ సాంగ్ ‘జాగో..’ను ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయగా 1 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇందుకు సాయి కార్తీక్ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే కారణం’’ అన్నారు. -
‘దిల్ బేచారా’ మరో రికార్డు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా దిల్ బేచారా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఏ భారతీయ చిత్రానికి రాని రేటింగ్స్ పొందిన ఈ మూవీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ మూవీ విడుదలైన 24 గంటల్లోనే 75 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. దీంతో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన ఓటీటీ చిత్రంగా నిలిచింది. ముఖేష్ చబ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే ఐఎండీబీలో 10కి 10 రేటింగ్స్ సొంతం చేసుకొని టాప్ రేటేడ్ ఇండియన్ ఫిల్మ్ గా నిలిచింది. కాగా 2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. (దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్) -
నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మించారు. అనూప్ రూబె¯Œ ్స సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాట 100 మిలియన్ల వ్యూస్ దాటినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మున్నా, ఎస్వీ బాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటతో సహా అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్, అమృతలపై చిత్రీకరించిన ‘నీలి నీలి ఆకాశం’ పాట పది కోట్ల వ్యూస్ దాటడం చాలా ఆనందంగా ఉంది. అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. కాగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని జీఏ2, యూవీ క్రియేష¯Œ ్స సంస్థలు విడుదల చేయనున్నాయి. -
90 లక్షలు!
దుబాయ్: ఇటీవల జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపిన టైటిల్‌పోరు వీక్షకుల సంఖ్యలో గత రికార్డులన్నీ బద్దలుకొట్టిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం మార్చి 8న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను భారత్‌లో ఏకంగా 90.2 లక్షల మంది వీక్షించినట్లు వెల్లడించింది. ఎంసీజీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా... భారత్ లో ఈ మ్యాచ్‌ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు వారి లెక్కల్లో తేలింది. ఈ టోర్నీ మొత్తాన్ని చూసేందుకు భారత అభిమానులు 540 కోట్ల నిమిషాల సమయాన్ని కేటాయించినట్లు తెలిపింది. దీన్ని ఒక్కో అభిమాని... ఒక్కో మ్యాచ్‌ను వీక్షించిన సమయం ఆధారంగా లెక్కించినట్లు ఐసీసీ పేర్కొంది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత డిజిటల్ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. మహిళల క్రికెట్‌కు సంబంధించి ఇదే మొదటిది కావడం విశేషం. ఈ మాధ్యమం ద్వారా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 మధ్య ఈ టోర్నీకి సంబంధించిన 110 కోట్ల వీడియోలు అభిమానులు చూశారు. ఐఎస్ఎల్కు పెరిగిన వీక్షకులు న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తన వీక్షకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. తాజా ఐఎస్ఎల్ (2019–20) సీజన్‌ను వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యను గత సీజన్‌తో పోలిస్తే 51 శాతం పెంచుకుందని టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 16.8 కోట్ల మంది తాజా సీజన్‌ను వీక్షించినట్లు తెలిపారు. ప్రధాన ప్రసారకర్తగా ఉన్న స్టార్ స్పోర్ట్స్, స్టార్ ఇండియా ఈ సీజన్‌ను 11 చానళ్ల ద్వారా 7 భాషల్లో దేశవ్యాప్తంగా ప్రసారం చేసింది. దీంతో పాటు హాట్‌స్టార్, జియో టీవీ డిజిటల్ వేదికపై ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అట్లెటికో డి కోల్‌కతా రికార్డు స్థాయిలో మూడోసారి ఐఎస్ఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో చెన్నైయిన్ ఎఫ్‌సీను కోల్‌కతా ఓడించింది. -
‘ఎన్టీఆర్ ఆశీస్సులు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కే’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ వేడిని మరింత రాజేసింది. ఈ ట్రైలర్‌కు భారీ రెస్సాన్స్రావటమే కాదు రికార్డ్ వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ అభిమానులతో పంచుకున్నారు. రిలీజ్ అయిన గంటన్నరలోనే మిలియన్ వ్యూస్ సాధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రెండు రోజుల్లో కోటి వ్యూస్ సాధించినట్టుగా వర్మ ప్రకటించాడు. వివిధ యూట్యూబ్ చానల్స్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నింటిలో కలిపి ఈ వ్యూస్ సాధించినట్టుగా వర్మ తెలిపాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. 1 CRORE VIEWS on https://t.co/Otvxvi35u2 As per digital team5.7 MYouTube .TVNXT185K Hotshot684K MM35KYoung Andhra 66KOnline India245K Filmy Focus26K TFN386KTelugu Cinema.1M FB.287K Along with many other uploads on random FB pages and channels. NTR BLESSED #LakshmisNTR — Ram Gopal Varma (@RGVzoomin) 16 February 2019 -
సైరా టీజర్.. టాలీవుడ్ టాప్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా మంగళవారం రిలీజ్ చేశారు. టీజర్ కు సూపర్బ్ సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సోషల్ మీడియాలో టీజర్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వ్యూస్ విషయంలోనూ సైరా సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో కలిపి ఈ టీజర్ 24 గంటల్లో 12 మిలియన్ల(కోటి ఇరవై లక్షల) వ్యూస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో ఇదే టాప్ అంటున్నారు సైరా టీం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సైరా నరసింహారెడ్డి సినిమాను 2019 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నష్టాలు అధిగమించేందుకు.. ఆర్టీసీ అడుగులు
రాజంపేట: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి బయట పడేందుకు అడుగులు వేస్తోంది... ఇందుకోసం వినూత్న ప్రయోగాలు చేపడుతోంది... ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల నుంచి అభిప్రాయాలు, కమిట్మెంట్ పత్రాలు తీసుకుంటోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కడప రీజియన్ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.72 కోట్లలో నష్టాల్లో ఉంది. జిల్లాలో కడప, రాజంపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, పులివెందుల డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలు కూడా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు కడప రీజనల్ మేనేజర్ చెంగల్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ‘ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికులదే ప్రధాన పాత్ర’ అనే ఉద్దేశంతో కార్మికుల అభిప్రాయం, వారి సహకారం తీసుకుని ముందుకు వెళ్తే నష్టాలను కొంత మేర అయినా తగ్గించవచ్చనే ఆలోచనతో కడప రీజియన్ ముందడుగు వేస్తోంది. అభిప్రాయ సేకరణ.. డిపోల వారీగా కార్మికుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలు పెట్టింది. ఉదాహరణకు రాజంపేట డిపోను తీసుకుంటే రూ.10.80 కోట్ల నష్టాల్లో ఉంది. కిలోమీటరుకు ఆదాయం రూ.27.11 ఉండగా, ఖర్చు రూ.35.78 అవుతోంది. అంటే కిలోమీటరుకు రూ.8.67 నష్టం వస్తోంది. ఈ విధమైన పరిస్థితులే ప్రతి డిపోలో ఉన్నాయి. కిలోమీటరుకు ఎంత సంపాదన వస్తోంది, ఏ మేరకు ఖర్చు వస్తోంది, నష్టాలు తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకోవాలి.. వంటి వివరాలను కార్మికుల నుంచి సేకరిస్తున్నారు. 2016–2017లో వచ్చిన ఈపీకే, 2017–2018లో తీసుకొచ్చిన ఈపీకే వివరాలను కార్మికుల నుంచి సేకరిస్తున్నారు. 2016 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు ఈపీకే సాధించిన వివరాలను ఆర్టీసీ యాజమాన్యానికి రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. కమిట్మెంట్ పత్రం.. కడప రీజియన్‌లో 8 డిపోలు ఉన్నాయి. 4 వేల మంది కార్మికులు ఉన్నారు. 936 సర్వీసులు నడుస్తున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు సర్వీసు వారీగా ఈపీకే తెచ్చుటకు నిబద్ధతతో పని చేస్తామంటూ కమిట్మెంట్ పత్రాన్ని అందజేస్తున్నారు. సర్వీసు అభివృద్ధికి సలహాలు, సూచనలు కూడా ఈ పత్రం ద్వారా ఆర్టీసీకి తెలియజేయాల్సి ఉంటుంది. తాము పని చేస్తున్న డిపో అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని, ఆదాయం పెంచేందుకు, ఖర్చు తగ్గించేందుకు సూచనలను ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్నారు. కేఎంపీఎల్ పెంచేందుకు అవసరమైన చర్యలపై ఆర్టీసీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్ని యాజమాన్యానికి డ్రైవర్లు కమిట్మెంట్ పత్రం ద్వారా తెలియజేయాలి. ఈ పత్రంలో పేరు, హోదా, స్టాప్ నంబరు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఈ పత్రంలో వచ్చిన సూచనలు, సలహాలను ఏ వి«ధంగా, ఏ స్ధాయిలో అమలు చేయాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. నిర్భయంగా పొందుపరచాలి ఆర్టీసీ అభివృద్ధి కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణ, కమిట్మెంట్ పత్రంలో కార్మికులు తమ మనోగతాన్ని నిర్భయంగా పొందుపరచాలి. దీనివల్ల ఆర్టీసీ యాజమాన్యం సరిదిద్దుకొని నష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలవుతుంది. ఆర్ఎం చెంగలరెడ్డి ఆదేశాల మేరకు ఈ విధానం చేపడుతున్నాం. –ఎంవీ కృష్ణారెడ్డి, మేనేజర్, రాజంపేట డిపో సమష్టి కృషి అవసరం ఆర్టీసీ లాభాల బాటకు సమష్టి కృషి అవసరం. ఆర్టీసీ నష్టాలో నడుస్తుంటే కార్మికులకు కూడా నష్టమే. సంస్థ బాగుంటే అందరం బాగుంటాం. కమిట్మెంట్ పత్రంలో కార్మికులు తెలియజేసే సూచనలు, మనోగతం సంస్థ అభివృద్ధికి దోహద పడతాయి. –జీవీ నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి, ఈయూ, కడప కార్మికులు భాగస్వాములు కావాలి నష్టాల్లో రోజురోజుకు కూరుకుపోతున్న ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కార్మికులు భాగస్వాములు కావాలి. అభిప్రాయ సేకరణ, కమిట్మెంట్ పత్రాలు తీసుకుంటున్న ఆర్టీసీకి కార్మికులు తమ మనోగతం వివరించేందుకు ముందుకు వస్తున్నారు. మంచి ఫలితాలు రావాలనే ఆశిస్తున్నాం. –సుబ్బారెడ్డి, సెక్రటరీ, వైఎస్సార్ ఆర్టీసీ ఎంయూ, రాజంపేట -
ఫేస్ బుక్ లో ఆకట్టుకుంటున్న శునకం
యజమానిపై అమితమైన ప్రేమను చూపించే పెంపుడు జంతువుల్లో శునకాలదే మొదటిస్థానం అని చెప్పొచ్చు. విశ్వాసానికి మారుపేరుగా కూడ కుక్కలనే చెప్తారు. అంటువంటి ఓ పెంపుడు శునకం తన యజమానిపై అభిమానాన్ని చాటుకుంటోంది. తన యజమాని కుటుంబ సభ్యులపై ఈగవాలనివ్వకుండా చేస్తోంది. కుటుంబంలో చిన్నకొడుకుపై ప్రత్యేక ప్రేమను చూపిస్తూ.. ఇప్పుడు.. మిలియన్లకొద్దీ ఫేస్ బుక్ వ్యూయర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. విశ్వాసానికి నిదర్శనంగా చెప్పే శునకాలు యజమానిపై ఉండే ప్రేమను ఎన్నోసార్లు నిరూపించుకుంటుంటాయి. ఒక్క చిన్న బిస్కెట్ ముక్క పెడితే చాలు కనీసం వీధికుక్కలు కూడ వారిని మరచిపోకుండా గుర్తుపెట్టుకొని, కనిపించినప్పుడల్లా అభిమానాన్ని అనేక విధాలుగా వ్యక్తపరుస్తుంటాయి. అటుంటి ప్రేమకు మారుపేరైన ఓ శునకం.. తన యజమానిపై చూపిస్తున్న అభిమానం ఇప్పుడు ఫేస్ బుక్ లో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. మంచంపై పడుకున్న యజమాని చిన్నకొడుకును ఎవరు ముట్టుకున్నా తన ప్రతాపం చూపిస్తూ..మిలియన్లకొద్దీ వినియోగదారులను ఆకర్షిస్తోంది. శుక్రవారం పోస్టు చేసిన వీడియో ఒక్క రోజులోనే సుమారు రెండున్నర కోట్ల వ్యూ లతో ప్రత్యేకతను సంతరించుకుంది. -
'దేశవ్యాప్త చర్చకు, ఇక్కడి పరిస్థితులకు పొంతలేదు'
విజయవాడ: అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం లేకుండా రాజధాని నిర్మాణం చేపట్టడం సరి కాదని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిటైర్ ప్రొఫెసర్ అమితాబ్ కుందు, జేఎన్ యూ సీనియర్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్యలు అభిప్రాయ పడ్డారు. రైతుల కోరిక మేరకు రాజధాని గ్రామాలలో వీరు పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో తమ పర్యటన వివరాలను పంచుకున్నారు. సామాజికంగా, భౌగోళికంగా అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం చేయకపోవటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమరావతి పై జరుగుతున్న చర్చ కు, ఇక్కడి పరిస్థితులకు మద్య పొంతన లేదని అన్నారు. పర్యావరణంకు జరుగుతున్న నష్టం పై ఎన్ జి టి లో విచారణ జరుగుతున్న సమయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీలు వేయటం అర్ధరహిత మని అన్నారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం సేకరించడం సరి కాదన్నారు. భవిష్యత్ లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల న్యాయ పరమైన చిక్కులే కాక పర్యావరణ ఇబ్బందులు కూడా ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు. -
నిన్న జుకర్ బర్గ్, నేడు సుందర్ పిచాయ్
నిన్న ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్... తాజాగా గూగుల్ సీఈవో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ముస్లింలకు బాసటగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనార్టీ వర్గాలకు తాము మద్దతుగా ఉంటామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గూగుల్ సీఈవో పై విధంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు సరికాదని, అసహనంపై వస్తున్న వార్తలు బాధాకరమని సుందర్ పిచాయ్ 'మీడియం'లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్...తాను భారత్ నుంచి అమెరికా వచ్చిన రోజులను గుర్తు చేస్తున్నారు.22 ఏళ్ల క్రితం భారత్ నుంచి యూఎస్ వచ్చానని, తనను అవకాశాల భూమి అమెరికా అక్కున చేర్చుకుందని తెలిపారు. ఇక్కడకు వచ్చిన తనలాంటి వారికి కేవలం అవకాశాలు మాత్రమే కాకుండా విశాలమైన హృదయంతో, సహనంతో అమెరికా తనలో ఒక భాగం చేసుకుందని తెలిపారు. అమెరికాను కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్గా పిచాయ్ పేర్కొన్నారు. ఏదైనా ఒక దేశం లేదా సంస్థ అభివృద్ధి పథంలో పయనించాలంటే అక్కడ భిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు, సంస్కృతులు ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. -
మాకు మైకు ఇవ్వడం లేదు
స్పీకర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: సభలో తమకు అవకాశం రావడం లేదని, తాము మాట్లాడుతుంటే పదే పదే అధికార పక్షానికి చెందిన మంత్రులు అడ్డుపడుతున్నారని, వారికే మైకు ఇస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ‘ఒక సభ్యుడు ఏదన్నా అంశంపై మాట్లాడుతున్నపుడు, అది పూర్తికా కుండానే మాటిమాటికి అడ్డుపడుతూ ఇబ్బంది పెడుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తమకు మైకు ఇవ్వకుండా మంత్రులు లేచినవెంటనే వారికి మైకు ఇస్తున్నారని, తమ మైక్ కట్ చేస్తున్నారని, అందరు సభ్యులనూ సమాన దృష్టితో చూడాలని ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరినట్లు తెలిసింది. విపక్ష సభ్యుల చర్చను కానీ, వారి ఆవేదనను కానీ, ప్రభుత్వ తీరుపై వ్యక్తం చేసే అభిప్రాయాలు గానీ ప్రజలకు తెలియకుండా ప్రత్యక్ష ప్రసారాలను సెన్సార్ చేసి ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిసింది. కాగా, బీజేపీ పక్ష నేత కె.లక్ష్మణ్, టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులు జానారెడ్డి చాంబర్‌కు వచ్చి ఆయనను కలసి వెళ్లారు. ప్రతిపక్షాలన్నీ కలిసి కట్టుగా వ్యవహరించాలని వీరు సీఎల్పీ నేతను కోరినట్లు సమాచారం.