Prabhas Salaar Teaser Vs Shah Rukh Khan Jawan Trailer Youtube Views Record, Deets Inside - Sakshi
Sakshi News home page

Salaar Teaser Vs Jawan Trailer: ఆ విషయం కోసం తన్నుకుంటున్నారు!

Published Tue, Jul 11 2023 4:42 PM | Last Updated on Tue, Jul 11 2023 5:00 PM

Salaar Teaser Vs Jawan Trailer Views Record - Sakshi

Prabhas Vs Shah Rukh Khan: షారుక్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ రిలీజై రోజు గడిచిపోయింది. ఎలా ఉందనేది పక్కనబెడితే యూట్యూబ్‌లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే 24 గంటల్లో వచ్చిన వ్యూస్ గురించి చెబుతూ నిర్మాతలు పోస్ట్ పెట్టారు. అన్నిచోట్ల కలిపి ఏకంగా 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. అదుగో అక్కడే అసలు గొడవ మొదలైంది. ఉదయం నుంచి ఇప్పటికీ ఆయా హీరోల అభిమానులు ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు.

నంబర్లు సరిపోలే
సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ vs షారుక్ ఫ్యాన్స్ అనే పరిస్థితి కనిపిస్తుంది. జూలై 6న ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదలైంది. ఈ వీడియోలో ప్రభాస్, 10 సెకన్లకు మించి కనిపించలేదు. అయితేనేం 24 గంటల్లో 83 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ నంబర్స్ యూట్యూబ్‌లో కనిపించాయి. 'జవాన్' ట్రైలర్‌కి 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చెప్పారు కానీ ఆ నంబర్ కనిపించలేదు.  

(ఇదీ చదవండి: 'జవాన్' ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!)

గొప‍్పతనం గొడవ!
'జవాన్' నిర్మాతలు.. 24 గంటల్లో వచ్చిన వ్యూస్ గురించి గ్రాండ్ గా ప్రకటించుకోవడం వరకు బాగానే ఉంది. కానీ యూట్యూబ్‪‌ వ్యూస్‌లో చాలా డిఫరెన్స్ కనిపించింది. 55 మిలియన్ల వ్యూస్(హిందీ, తెలుగు, తమిళం కలిపి) మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, షారుక్ ఫ్యాన్స్.. మా హీరో గొప‍్ప అంటే మా హీరో గొప్ప అని ఒకటే ట్వీట్స్ చేసుకుంటున్నారు. దీంతో ఇదెక్కడి దిక్కుమాలిన గొడవరా బాబు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. 

రెండూ సెప్టెంబరులోనే
షారుక్ ఖాన్ 'జవాన్'.. సెప్టెంబరు 7న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. 'పఠాన్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో కలెక్షన్స్ పరంగా గట్టి అంచనాలున్నాయి. మరోవైపు సెప్టెంబరు 28న 'సలార్' చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. ప్రశాంత్ నీల్ దీనికి డైరెక్టర్ కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవల్లో ఉ‍న్నాయి. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తన్నుకుంటున్నారు కానీ ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం రెండు హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాడు.

(ఇదీ చదవండి: ఫైట్ మాస్టర్ అరెస్ట్.. ఆ వీడియో వల్లే ఇదంతా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement