
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా మంగళవారం రిలీజ్ చేశారు.
టీజర్ కు సూపర్బ్ సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సోషల్ మీడియాలో టీజర్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వ్యూస్ విషయంలోనూ సైరా సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో కలిపి ఈ టీజర్ 24 గంటల్లో 12 మిలియన్ల(కోటి ఇరవై లక్షల) వ్యూస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో ఇదే టాప్ అంటున్నారు సైరా టీం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సైరా నరసింహారెడ్డి సినిమాను 2019 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.