
‘పుష్ప -2’ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పులి సీన్ అయితే టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్ మిలియన్‌కు పైగా వ్యూస్ రాబట్టిం ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
ఇక ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. హిందీలో అయితే ఏకంగా 35 మిలియన్లు రావడం మరో విశేషం. తెలుగులో 22 మిలియన్స్‌తో రెండోస్థానంలో ఉంది. అంతే కాకుండా ఈ టీజర్ 2.48 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. మొత్తానికి బన్నీ టీజర్‌తోనే రికార్డుల మోత మోగిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ పాజిల్, సునీల్, అనసూయ తదితరలు కీలక పాత్రలు పోషించారు.
It is Icon Star @alluarjun's Blockbuster RULE 🔥🔥#Pushpa2TheRule Glimpse trending all over with 64M+ views and 2.48M+ likes 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2023
- https://t.co/eNEiADQGP0@iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/TRipwCp5a2