తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. మరో క్రేజీ రికార్డ్ సొంతం! | Allu Arjun's 'Pushpa 2' Teaser Hits Crazy Record In Youtube Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 Teaser: పుష్ప-2 టీజర్ సరికొత్త రికార్డ్.. ఆ విషయంలో మొదటి చిత్రంగా!

Published Sun, Apr 14 2024 10:56 AM | Last Updated on Sun, Apr 14 2024 11:10 AM

Allu arjun Pushpa 2 Teaser Hits Crazy Record In Youtube Goes Viral - Sakshi

ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. పుష్ప-2 టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఏప్రిల్‌ 8న విడుదలైన పుష్ప-2 యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైమ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్‌.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగిన టీజర్‌గా నిలిచింది. ఇ‍ప్పటివరకు పుష్ప-2 టీజర్‌కు 110 మిలియన్లకు పైగా వ్యూస్‌, 1.55 మిలియన్ల లైక్స్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా  ద్వారా పంచుకుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement