Pushpa 2 Teaser: పుష్పరాజ్‌ మాస్‌ జాతర చూస్తారా? | Icon Star Allu Arjun Pushpa 2 The Rule Movie Official Teaser Out Now, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Teaser Video: పుష్పగాడి రేంజ్‌ మారింది! ఈసారి గంగమ్మ జాతరే!

Published Mon, Apr 8 2024 11:07 AM | Last Updated on Mon, Apr 8 2024 11:57 AM

Allu Arjun Pushpa 2 Teaser Out Now, See Here - Sakshi

పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ.., నీ యవ్వ తగ్గేదేలే.. ఈ డైలాగులకు రికార్డులు తగలబడిపోయాయి. అల్లు అర్జున్‌ చిత్తూరు యాసలో మాట్లాడుతుంటే జనాలకు భలే గమ్మత్తుగా అనిపించింది. అభిమానులకైతే సినిమా చూసిన తర్వాత ఎక్కిన మత్తు అంత ఈజీగా దిగలేదు. ఇప్పుడు మరోతూరి అందర్నీ పిచ్చెక్కించేందుకు రెడీ అయిపోయాడు పుష్ప. నేడు (ఏప్రిల్‌ 8) అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా పుష్ప:ది రూల్‌ సినిమా టీజర్‌ను చెప్పిన టయానికి టంచనుగా రిలీజ్‌ చేశారు.

అమ్మోరు గెటప్‌లో బన్నీ
పుష్పగాడు సిండికేట్‌ అయ్యాక తన రేంజే పెరిగింది. శ్రీవల్లి ఒంటినిండా నగలతో మెరిసిపోయినట్లు పోస్టర్స్‌లో చూపించారు. టీజర్‌లో మాత్రం హీరో అమ్మోరు గెటప్‌లో కనిపించారు. ఊచకోత తర్వాత చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు. డైలాగ్‌ మాత్రం లేదు. టీజర్‌ నిడివి కేవలం ఒక్క నిమిషమే ఉంది. అయినా సరే ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్‌ అయిపోతున్నారు. పుష్పరాజ్‌ను చూస్తుంటే పాత రికార్డులు పాతరేసి.. గంగమ్మ జాతర జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనబడ్తా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.

ఆగస్టు 15న రిలీజ్‌
ఈపారికి టీజర్‌తో కడుపు నింపేసుకుంటామంటున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. బాక్సాఫీస్‌ను రూల్‌ చేసేందుకు పుష్ప ఆగస్టు 15న రాబోతున్నాడు.

చదవండి: అల్లు అర్జున్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement