Allu Arjun's 'Pushpa 2' Teaser Trending in Youtube With 20 Million Views - Sakshi
Sakshi News home page

Pushpa 2 Teaser: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘పుష్ప 2’ టీజర్‌.. హిందీలోనే ఎక్కువ వ్యూస్‌..

Published Sat, Apr 8 2023 10:18 AM | Last Updated on Sat, Apr 8 2023 10:35 AM

Allu Arjun Pushpa 2 Teaser Trending in Youtube With 20 Million Views - Sakshi

‘పుష్ప 2’ టీజర్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదలైన టీజర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్‌ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పులి సీన్‌ అయితే టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్‌ మిలియన్‌కు పైగా వ్యూస్‌ రాబట్టిం ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇక ఇప్పటి వరకు తెలుగులో 18 మిలియన్ల వ్యూస్‌ రాబట్టడం విశేషం. హిందీలో అయితే ఏకంగా 20 మిలియన్లు రావడం మరో విశేషం. మొత్తానికి బన్నీ టీజర్‌తోనే రికార్డుల మోత షురు చేశాడు. కాగా పుష్ప 2 అల్లు అర్జున్‌ సరికొత్త లుక్‌లో అలరించపోతున్నాడని అర్థమైంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్‌ పాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement