
ఆమె భర్త ఏ పనిచేస్తాడో? అసలు పనిచేస్తాడో లేదో కూడా తెలియదు. ఆమె మాత్రం బతుకుదెరువు కోసం ఇ–రిక్షా నడుపుతుంది. ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో పిల్లాడిని ఒళ్లో పడుకోబెట్టుకొని ఇ–రిక్షా నడుపుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమె వీడియో క్లిప్ 2.8 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులను భావోద్వేగానికి గురి చేసింది. ‘ఈ వీడియో చూసి నా గుండె చెరువు అయింది’ ‘ఆమె చాలా రిస్క్ తీసుకుంటోంది. పిల్లాడిని బేబీ కేర్ సెంటర్‌లో చేరిస్తే మంచిది’ ‘దగ్గర్లో ఉన్న దాతలు ఎవరైనా ఆమెకు బేబీ క్యారియర్ ఇప్పిస్తే బాగుంటుంది’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment